79

🛐 🕋 ☪ *బిస్మిల్లాహ్ హిర్రహ్మా నిర్రహీమ్* ☪ 🕋 🛐

🕋🤚🏻✋🏻🕌 *అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను* 🕌🤚🏻✋🏻🕋

◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆

       🕌☪🕋🛐 *ఇస్లాం చరిత్ర* 🛐🕋☪🕌

                                *భాగము - 79* 

◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆

*హజ్రత్ ఈసా అలైహిస్సలామ్ గారి కథలో గ్రహించవలసిన పాఠాలు : -* 

□ తీర్పుదినాన మానవులను మళ్ళీ బ్రతికించడం జరుగుతుందన్న విషయానికి ఒక నిదర్శనంగా ప్రవక్త ఈసా అలైహిస్సలామ్ ను తండ్రి లేకుండా సృష్టించడం జరిగింది. ఈసా (అలైహి) పుట్టుకకు ముందు యూదుల ఒక గ్రూపు మరణాంతరం మళ్ళీ బ్రతికించడం జరగదని వాదించేది. ఈ గ్రూపును సెడ్యూసీస్ అనేవారు. ల్యూక్, అధ్యాయం 20, వాక్యం 27 ప్రకారం...., "అప్పుడు కొందరు సెడ్యూసీలు - మృత్యువుతో జీవితం ముగిసిపోతుందని విశ్వసించేవారు - మరణాంతరం మళ్ళీ బ్రతికించడం లేదన్నారు

□ గత కాలాలకు చెందిన ప్రవక్తలపై అవతరించిన క్రింది గ్రంథాలతో పాటు ఇంజీల్ గురించి కూడా దివ్య ఖుర్ఆన్ లో ప్రస్తావనలు ఉన్నాయి. ప్రస్తుత బైబిల్ వీటి నుంచి ఏర్పడిందే! బైబిల్ లో పాత నిబంధన, కొత్త నిబంధనలు ఉన్నాయి. యూద మతానికి సంబంధించిన పాత నిబంధనను మాత్రమే యూదులు అంగీకరిస్తారు. ప్రవక్త ఈసా (అలైహి) యూద ప్రవక్తలలో చివరి వారయినప్పటికి కొత్త నిబంధనను వాళ్ళు అంగీకరించరు.

1.తౌరాత్ (పాత నిబంధన.... మూసా ప్రవక్త (అలైహి) పై అవతరించిన గ్రంథం
2.జబూర్ (డేవీడ్ పాటలు, పాత నిబంధనలో వున్నవి)
3.ఇంజీల్ (గ్రీకులో ఇవాంజీల్, ఇంగ్లీషులో గోస్పెల్) ప్రవక్త క్రీస్తుపై అవతరించింది. దీనిని క్రైస్తవులు క్రొత్త నిబంధనగా పేర్కొంటారు.

□ ప్రస్తుతము మనకు అందుబాటులో ఉన్న ఈ గ్రంథాలలో దివ్య ఖుర్ఆన్ ప్రస్తావనలు వేటిని సూచిస్తున్నాయో చెప్పలేము. అయితే ఈ గ్రంథాల భాగాలు మాత్రమే దొరుకుతున్నాయి. ఈ గ్రంథాలు సంపూర్ణముగా, మార్పులు లేకుండా ఉన్నాయని చెప్పే పరిస్థితి లేదు. ఇందులో అనేక వైరుధ్యాలు మనకు కనబడుతాయి. కానీ దివ్య ఖుర్ఆన్ నేటికి 1400 సంవత్సరాలుగా ఎలాంటి మార్పులు లేకుండా యథాతథంగా భద్రంగా ఉంది.

□ కొత్త నిబంధనకు సంబంధించి ఇద్దరు మార్క్, లూకాలు నిజానికి ప్రవక్త క్రీస్తును ఆయన జీవిత కాలములో అనుసరించిన పన్నెండు మంది శిష్యుల లోని వారు కాదు. (గోస్పెల్ ఆఫ్ బార్నబాస్ తో సహా) క్రీస్తు శిష్యులలో కొందరి రచనలను తదుపరి కాలాల క్రైస్తవులు సందేహాస్పదమైన రాతలుగా తిరస్కరించారు.

□ జె.సి.ఫెంటాన్, యార్క్ షైర్ లోని వెంత్ వర్త్ కు మాజీ మతాధికారి, తర్వాత ఆయన లీచ్ ఫీల్డ్ థియోలాజికల్ కాలేజీకి వెళ్లారు. ఆయన రాసిన పుస్తకం “సెయింట్ మాథ్యూస్” 1963 లో ప్రచురితమయ్యింది. పెంగ్విన్ సంస్థ ఈ పుస్తకాన్ని ప్రచురించింది. అందులో ఆయన ఇలా రాసారు : శిలువ వేసిన తర్వాత నుంచి గోస్పెల్స్ రాయబడిన సమయం వరకు గడచిన కాలములో కొంత మంది ప్రారంభ కాలాలకు చెందిన క్రైస్తవులు క్రీస్తు శిలువ వేయబడలేదని, క్రీస్తుకు బదులు మరొకరు శిలువ వేయబడ్డారని విశ్వసించారు. క్రీస్తు శిలువ పై మరణించలేదని విశ్వసించే క్రైస్తవ వర్గం కూడా వుంది. వారి అభిప్రాయం ప్రకారం, క్రీస్తు శిలువ నుంచి సజీవముగా బ్రతికి క్రిందికి వచ్చారు. 19వ శతాబ్దం ప్రారంభములో కొందరు క్రీస్తు శిలువ పై నీరసపడ్డారు అని, తర్వాత రాతి సమాధి నుంచి బయటకు వచ్చారని కొత్త సిద్ధాంతాలు ప్రతిపాదించారు.

□ ప్రవక్త క్రీస్తు ప్రత్యక్ష శిష్యులలో ఒకరు రాసిన “గోస్పెల్ ఆఫ్ బార్నబాస్” ను కొత్త నిబంధన నుంచి తొలగించటం అన్నది క్రీస్తు తర్వాత చాల శతాబ్దాలకు జరిగింది. ఈ గోస్పెల్ ఒరిజినల్ కాపీ వియన్నాలో ఇంపీరియల్ లైబ్రరీలో భద్రపరచబడి ఉంది. లాన్స్ డేల్, లారా రాగ్ లు అనువదించిన ప్రతి ఇది. ఆక్స్ ఫర్డ్ ప్రెస్ దీనిని 1907లో ప్రచురించింది. ఈ పుస్తకము 481వ పేజీలో ఈ విషయం స్పష్టంగా రాయబడింది. జుడా రూపురేఖలు ఆ సమయములో పూర్తిగా ప్రవక్త క్రీస్తును పోలి ఉన్నందు వల్ల జూడాను క్రీస్తుకు బదులు శిలువ వేయడం జరిగింది అని బార్నబాస్ అన్నారు. ఈ మాటలు క్రీస్తు శిలువ వేయబడడాన్ని ఖండిస్తున్నాయి.

□ ప్రాచీన కాలానికి చెందిన ‘డెడ్ సీ స్క్రోల్స్’ ను ఒక అరబ్బు పశువుల కాపరి ఒక గుహలో కనుగొన్నాడు. వీటిని కూడా ప్రజలకు అందుబాటులో లేకుండా దాదాపు నలబై సంవత్సరాల పాటు రహస్యముగా ఉంచడం జరిగింది. వీటిని పాలస్తీనాకు చెందిన యూదులు రాశారని తెలుస్తుంది. ప్రవక్త క్రీస్తు జీవిత కాలానికి రెండు శతాబ్దాల ముందు నుంచి ప్రవక్త క్రీస్తు జీవితకాలము వరకు వ్రాయబడిన పత్రాలివి. బైబిలుకు సంబంధించిన అతి పురాతనమైన వ్రాతప్రతులివే.

□ హిబ్రూ యూనియన్ కాలేజీకి చెందిన ప్రొఫెసర్ బెన్ జిమ్ వాకోల్డర్, మార్టిన్ అబెక్ లు ఈ వ్రాతప్రతులను రహస్యముగా ఉంచడాన్ని సవాలు చేసి వాటిని బయటకు తీయడానికి కృషి చేసారు. ఈ వ్రాత ప్రతుల ద్వారా మనకు మార్పులు చేర్పులకు గురికాని పత్రాలు దొరకవచ్చు.

/-/-/-/-/-/-/-/-/-/-/-/-/-/-/-/-/-/-/-/-/

*ఇస్లాంను అధ్యయనం చేసి ప్రపంచంలో ఇస్లాం ఒక్కటే సత్యధర్మం అని, ఖుర్ఆన్ మరియు హాదీసుల ద్వారానే ఈసా అలైహిస్సలామ్ గురించిన వాస్తవాలు తెలుసుకోగలమని చెబుతున్న ఈ మేధావులు పదుగురికి ఆదర్శమూర్తులు.* 

*డాక్టర్ : జెరాల్డ్ ఎఫ్.డిర్క్స్ (Dr : Jerald F.Dirks)* 

ఈయన మెథడిస్ట్ చర్చీ సమాఖ్య మాజీ మంత్రి (డీకాన్). "డివైనిటీ" లో ఈయన హార్వర్డ్ విశ్వవిద్యాలయం నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశారు. డెన్వర్ యూనివర్సిటీ సైకాలజీలో డాక్టరేట్ ను పొందారు. "క్రాస్ అండ్ క్రీసెంట్" గ్రంథాన్ని రచించారు.

*కెన్నెత్ ఎల్.జెన్ కిన్స్ (Kenneth L.jenkins)* 

ప్రస్తుత నామం అబ్దుల్లాహ్ అల్ ఫారూఖ్. ఈయన పెంటికోస్టల్ చర్చీ ప్రముఖులు. మాజీ మంత్రివర్యులు.

*డాక్టర్ : వ్యాచెస్లావ్ పోలోజిన్ ( Dr.Vyacheslav Polosin)* 

ఈయన రష్యన్ ఆర్థోడాక్స్ మాజీ ప్రచారకులు.

*ఆన్స్ లెమ్ టార్మీడా (Anselm Turmeda)* 

14వ శతాబ్ది క్రైస్తవ మేధావి, క్రైస్తవ ప్రచారకులు.

*ఖాదీజా "సుయ్" వాట్సన్ (Khadeeja "Suy" Watson)* 

ఈవిడగారు మాజీ పాస్టర్, మిషనరీ, ప్రొఫెసర్. డివైనిటీలో పోస్ట్ గ్రాడ్యుయేట్.

*ఇబ్రాహీమ్ ఖలీల్ (Ibrahim Khaleel)* 

ఈజిప్ట్ దేశ మాజీ కాప్టిక్ ప్రచారకులు.

*రాఫేల్ (Rafael)* 

జొహవా విట్ నెస్ మాజీ మంత్రివర్యులు.

*జార్జి ఆంథోని (George Anthony)* 

మాజీ క్యాథలిక్ ప్రచారకులు.

*డాక్టర్ : గ్యారీ మిల్లర్ (Dr. Gary Miller)* 

ప్రస్తుతం అబ్దుల్ అహద్ ఉమర్. మాజీ మిషనరీ.

*యూసుఫ్ ఎస్టేట్స్ (Yusuf Estates)* 
*అబ్దుర్రహీమ్ గ్రీన్ (Abdurraheem Green)* 
*జోషువా ఇవాన్స్ (Joshua Ivan's)*

    .....ఇలా ఎందరో,
         .....ఇంకెందరో,
మహానుభావుల జీవిత విశేషాలు, ఆడియోలు, విడియోలు, సందేహాలు, సమాధానాలు, వ్యాసాలు, పుస్తకాలు కలిగిన, క్రైస్తవ మత నిజనిజాలను నిక్కచ్చిగా వెల్లడించే మరిన్ని సమాచార ప్రధాన వెబ్ సైట్ ల వివరాలు ఇవిగో....,

http://www.turntoislam.com/

http://www.islamalways.com/

http://www.islamtomorrow.com/

http://www.answering-christianity.Com/

http://www.islam.thetruecall.com/

http://www.tubeislam.com/

http://www.welcome-back.org

http://www.usislam.org/converts/

http://www.missionislam.com/

http://www.truereligion.org

Insha Allah రేపటి భాగము - 80 లో అగడ్త బాధితుల గురించి తెలుసుకుందాము.

☆☆ ®@£€€q  +97433572282 ☆☆ 
             (rafeeq)

☆☆  Salman    +919700067779 ☆☆

Note : - ఈ msg లను ముందుకు పంపిస్తూ, మన ఇస్లాం చరిత్ర గురించి మన ముస్లిం సోదరులకు, సోదరీమణులకు తెలియజేస్తారని ఆశిస్తున్నాము.

No comments:

Post a Comment