87

☪☪☪   *బిస్మిల్లాహ్ హిర్రహ్మా నిర్రహీమ్*    ☪☪☪

🕋🕋   *అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు*   🕋🕋
🕋🕋 *అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను*  🕋🕋

●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●

🛐🛐🛐          *ఇస్లాం చరిత్ర* *- 87*          🛐🛐🛐

🇸🇦🇸🇦🇸🇦 *ముహమ్మద్ (సల్లం) జీవితచరిత్ర - 02* 🇸🇦🇸🇦🇸🇦 
◆◇◆◇◆◇◆◇◆◇◆◇◆◇◆◇◆◇◆◇◆◇◆◇◆◇◆◇◆◇◆◇◆◇◆

*హాషిమ్ సోదరుడు ముత్తలిబ్ : -* 

హాషిమ్ బిన్ అబ్దె మునాఫ్ చనిపోయిన తర్వాత, ఆయన సోదరుడు "ముత్తలిబ్" కు "సికాయా" మరియు "రిఫాదా" హొదాలు దక్కాయి. "ముత్తలిబ్" కూడా ఖురైష్ జాతిలోని ఓ గౌరవోన్నతులు గల వ్యక్తి. ఆయన మాటకు ఎదురు ఉండేది కాదు. ఆయన దాతృత్వం మూలంగా ఖురైషీయులు "ముత్తలిబ్" ను "ఫయ్యాజ్" (దాత) అనే బిరుదుతో పిలిచేవారు.

*హాషిమ్ కుమారుడు "షైబా" కోసం మదీనా వెళ్ళిన ముత్తలిబ్ : -* 

అయితే పది సంవత్సరాల తరువాత, తన సోదరుడు హాషిమ్ ఒక కొడుకు పుట్టాడని, అతను మదీనాలో తన తల్లి సంరక్షణలో పెరుగుతున్నాడని ముత్తలిబ్ కు తెలుసింది. ఆ తరువాత ముత్తలిబ్, తన అన్నయ్య కొడుకును తీసుకురావడానికి మదీనాకు బయలుదేరాడు.

*మదీనాకు చేరుకున్న ముత్తలిబ్ : -* 
ఆ పిదప ముత్తలిబ్ మదీనాలోని తన వదిన గారి ఇంటికి చేరుకున్నాడు. అక్కడ తన అన్నయ్య కొడుకు "షైబా" ను చూసిన వెంటనే గుండెలకు హత్తుకున్నాడు. కుశల ప్రశ్నలు అయిన తరువాత, "షైబా" ను మక్కాకు తీసుకవెళ్లాలని, "షైబా" తల్లి "సల్మా" ను కోరాడు....,

ముత్తలిబ్ : - వదినా! మక్కాలో మా అన్నయ్య హాషిమ్, హజ్ యాత్రికులకు నీళ్లు త్రాపే, వారికి ఆతిథ్యం ఇచ్చే హొదాలు లభించిన ఉన్నతమైన వ్యక్తి. ఇప్పుడు ఆయన చనిపోయిన తర్వాత, ఆయన లేని లోటు మక్కాలో కొట్టవచ్చినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. అందువల్ల నేను ఇప్పుడు, ఆయన వారసుడు "షైబా" ను మక్కాకు తీసుకవెళదామని వచ్చాను. కుటుంబగౌరవం, వంశమర్యాదల రీత్యా మేము ఖురైష్ తెగలో అగ్రశ్రేణికి చెందిన వారమన్న సంగతి మీకు తెలుసు. "షైబా" మక్కాలో మాతో పాటు ఎంతో గౌరవప్రదంగా ఉంటాడు. దయచేసి "షైబా" ను నాతో పాటు మక్కాకు పంపండి.

సల్మా : - కాని, హాషిమ్ చనిపోయిన తర్వాత ఇప్పుడు షైబాయే నాకు పంచప్రాణాలు. "షైబా" ను వదలి నేను ఒక్కరోజు కూడా బ్రతకలేను. అలా అని నేను వీడిని వీడి పెద్దలకు, వంశమర్యాదలకు దూరంగా కూడా ఉంచాలనుకోవడం లేదు. కాని నా ఒక్కగానొక్క కొడుకును నేను ఎలా పంపను? (అని అన్నది పెల్లుబుకుతున్న మాతృహృదయంతో)

ముత్తలిబ్ : - వదినా! భయపడకు. ఇందులో విచారించాల్సిన పని లేదు. నా అన్న కొడుకు "షైబా" ను నేను నా కన్న కొడుకులా చూసుకుంటాను. వీడు పెరిగి పెద్దయ్యాక కాబా నిర్వహణ బాధ్యతని అప్పజెప్పాలనుకుంటున్నాను. కాబట్టి "షైబా"ని తప్పక పంపించితీరాలి.

సల్మా : - అలా అయితే షైబాను ఒక్కసారి అడిగి చూడండి. వాడు మీతో వస్తానంటే నాకు అభ్యంతరం లేదు.

ముత్తలిబ్ : - షైబా! మీ అమ్మ చెప్పిన మాట విన్నావు కదా. మరి నీ అభిప్రాయం ఏమిటీ?

షైబా : - మా అమ్మ అనుమతి ఇచ్చేంత వరకు నేను మదీనా వదలి ఎక్కడికీ రాలేను. (అని అన్నాడు తన తల్లి సల్మా వైపు చూస్తూ)

ఈ మాటలు పలికిన, తన వినయవంతుడైన కొడుకుని చూసి ఆ తల్లి ఎంతోగానో మురిసిపోయింది. ఆ వెంటనే "సల్మా", తన కొడుకు "షైబా" మక్కా వెళ్ళడానికి అనుమతించింది. ఆ తర్వాత ముత్తలిబ్, మదీనాలో మూడు రోజులు ఆతిథ్యం పుచ్చుకొని నాలుగవ రోజు "షైబా" ను తీసుకొని మక్కాకు బయలుదేరాడు.

*మక్కాకు మొదలైన ప్రయాణం : -* 

ఒంటె మీద "ముత్తలిబ్" ముందు కూర్చున్నాడు. "షైబా" అతని వెనుక కూర్చున్నాడు. ఈ విధంగా వీరిద్దరూ మక్కాకు చేరుకున్నారు. 

ఆ స్థితిలో ముత్తలిబ్ ను, షైబా ను చూసిన మక్కా ప్రజలు...., “ఈ అబ్బాయి ముత్తలిబ్ బానిస అయిఉంటాడు. ఎక్కడి నుంచి తీసుకోస్తున్నాడు” అని భావించారు. భావించడమే కాదు...., “అదిగో ముత్తలిబ్! ఎక్కడ్నుంచో బానిసను తెచ్చుకుంటున్నాడు, చూడండి. ముత్తలిబ్ బానిస (అబ్దుల్ ముత్తలిబ్)” అని చెప్పుకున్నారు కూడా. ఈ మాటలు విన్న ముత్తలిబ్....,

ముత్తలిబ్ : - ఖురైషీయులార! మీరు అనుకుంటున్నట్టు ఈ అబ్బాయి నా బానిస కాదు, నా అన్న హాషిమ్ కొడుకు. మదీనా నుండి పిలుచుకవస్తున్నాను. (అని అన్నాడు మక్కా ప్రజల అపోహను పటాపంచలు చేస్తూ....)

కాని మక్కా ప్రజల నోట అప్రయత్నంగా వెలువడిన, "అబ్దుల్ ముత్తలిబ్" అనే ఈ కొత్తపేరే "షైబా" కు స్థిరపడి అసలు పేరు మరుగునపడిపోయింది. "అబ్దుల్ ముత్తలిబ్" పేరుతోనే అతడిని ప్రజలు పిలవడం ప్రారంభించారు. 
అబ్దుల్ ముత్తలిబ్(షైబా), తన పినతండ్రి ముత్తలిబ్ సంరక్షణలో ఏ లోటు లేకుండా పెరగసాగాడు. చూస్తుండగానే పది సంవత్సరాల కాలం గడచిపోయింది. అయితే అబ్దుల్ ముత్తలిబ్ యవ్వన దశలో ఉన్నప్పుడు, తన పినతండ్రి ముత్తలిబ్ వ్యాపార నిమిత్తం యమన్ కు పోయి హఠాత్తుగా అనారోగ్యానికి గురయ్యాడు. దాంతో యమన్ లో రూమన్ అనే చోట అంతిమశ్వాస వదిలాడు. ముత్తలిబ్ చనిపోయిన తర్వాత అబ్దుల్ ముత్తలిబ్ కు, తన పినతండ్రి హొదాలన్నీ దక్కాయి. ఖురైష్ తెగకు అగ్రనాయకుడై కాబా నిర్వహణ బాధ్యత స్వీకరించాడు. అబ్దుల్ ముత్తలిబ్ తన జాతి లో ఇదివరకు వారి తాత,తండ్రులు గడించలేని గౌరవోన్నతులను పొందాడు. యావత్తు ఖురైష్ జాతి అబ్దుల్ ముత్తలిబ్ ను ప్రాణంకన్నా మిన్నగా, అమిత గౌరవంగా చూసుకుంది.

*ముత్తలిబ్ మరణించగానే అబ్దుల్ ముత్తలిబ్ ఇంటి ప్రాంగణాన్ని ఆక్రమించుకున్న నౌఫల్ : -* 

అబ్దుల్ ముత్తలిబ్ ఇంకా పాతిక సంవత్సరాలైన నిండని నవయువకుడు. అంతగా పేరు పలుకుబడులులేని పసివాడు. అందువల్ల అతని పెదనాన్న నౌఫల్ ఓరోజు అబ్దుల్ ముత్తలిబ్ ఇంటిని, ప్రాంగణాన్ని బలవంతంగా ఆక్రమించుకున్నాడు. అబ్దుల్ ముత్తలిబ్, తన పెదనాన్న నౌఫల్ కు వ్యతిరేకంగా ఖురైష్ తెగకు చెందిన కొందరు పెద్దల సహాయం అర్ధించాడు. అపుడు ఆ ఖురైష్ పెద్దలు...., "మేము నీకు, నీ పెదనాన్నకు మధ్య తలదూర్చం" అని నిక్కచ్చిగా చెప్పేశారు. ఈ విధంగా ఖురైష్ నాయకులు ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవడానికి వేనుకంజ వేశారు.

అప్పుడు అబ్దుల్ ముత్తలిబ్ తన అసహాయ స్థితిని తెలుపుకుంటూ, మదీనాలో ఉన్న తన మేనమామలకు కొన్ని పద్య పంక్తుల్ని రాసి పంపించాడు. అబ్దుల్ ముత్తలిబ్ మేనమామలు "బనీ నజ్జార్" తెగకు చెందినవారు.

అబ్దుల్ ముత్తలిబ్ రాసిన ఈ పద్య పంక్తుల్లో, మేనమామలను వచ్చి తనను ఆదుకొమ్మని వేడుకున్నాడు. ఈ పద్య పంక్తులను విన్న తర్వాత, ఆ మేనమామలలో ఆగ్రహజ్వాలలు రేకెత్తించాయి. వారిలో అబూ సఅద్ బిన్ అద్దీ అనే మేనమామ ఆ పద్య పంక్తులకు ప్రతిస్పందించి, యాభై మంది అశ్వరూఢులతో మక్కా పట్టణానికి బయలుదేరాడు.

వారంతా మక్కా సమీపానికి చేరుకొని "అబ్ తహ్" అనే ప్రదేశంలో విడిది చేశారు. ఈ విషయం తెలుసుకున్న అబ్దుల్ ముత్తలిబ్, తన మేనమామను అక్కడే కలుసుకున్నారు. సహాయం కోసం ఎదురుచూస్తున్న అబ్దుల్ ముత్తలిబ్, సాయుధబలగంతో వచ్చిన తన మేనమామను చూసి సంతోషించాడు. అపుడు అబ్దుల్ ముత్తలిబ్ తన మేనమామతో....,

అబ్దుల్ ముత్తలిబ్ : - మామగారూ! ముందు ఇంటికి రండి. కొద్ది సేపు అక్కడ విశ్రాంతి తీసుకున్న తరువాత ఏం చేయాలన్నది ఆలోచిద్దాం.

అబూ సఅద్ : - కాదు, దైవసాక్షి! నేను సరాసరి నీ పెదనాన్న నౌఫల్ దగ్గరికి వెళ్ళి తాడో పేడో తేల్చుకునేదాకా మరేపని చేపట్టను. (అని ప్రతిజ్ఞ చేశాడు.)

ఆ తర్వాత అబూ సఅద్ అక్కడి నుండి బయలుదేరి నౌఫల్ ఉన్న చోటికి చేరుకున్నాడు. అప్పుడు నౌఫల్, "హతీమ్" (కాబా గృహాన్ని ఆనుకొని ఉన్న ప్రదేశం) లో ఖురైష్ పెద్దలతో మంతలాడుతూ కూర్చున్నాడు. వెంటనే అబూ సఅద్, నౌఫల్ దగ్గరికెళ్ళి తన వరలో నుంచి కత్తి దూసి...., "ఈ పవిత్ర దైవ గృహం సాక్షి! కాబా ప్రభువు సాక్షి! నీవు నా మేనల్లుడి భూమిని తిరిగి ఇచ్చేయకపోతే, ఈ ఖడ్గం నీ తలను ఎగరగొట్టి నిన్ను ముక్కలు ముక్కలుగా చేస్తుంది." అని బెదిరించాడు.

పరిస్థితిని గమనించిన నౌఫల్...., "ఆగు, నేను ఆ స్థలాన్ని ఇప్పుడే అబ్దుల్ ముత్తలిబ్ కు ఇచ్చేస్తాను." అని అన్నాడు కాస్తంత తొట్ర పడుతూ.

అబూ సఅద్ : - ఖురైష్ పెద్దలారా! మీరే దీనికి సాక్షులు. (అని ఖురైష్ పెద్దలను ఉద్దేశించి అన్నాడు.)

ఆ తరువాత అబూ సఅద్, అబ్దుల్ ముత్తలిబ్ వెంట అతనింటికి వెళ్ళాడు. అబ్దుల్ ముత్తలిబ్ తన మేనమామ కు కృతజ్ఞతలు చెప్పి, అతనికి, అతని సహచరులకు ఆతిథ్యం ఇచ్చాడు. అబూ సఅద్ అక్కడే మూడు రోజుల వరకు ఉండి "ఉమ్రా" చేసిన తరువాత మదీనాకు వెళ్లిపోయాడు.

→ ఈ సంఘటన జరిగిన తరువాత, నౌఫల్, "బనీ హాషిమ్" తెగకు వ్యతిరేకంగా "బనీ అబ్దుష్షమ్స్" తెగతో పరస్పరం సహాయసహకారాలు అందించే ఒప్పందం చేసుకున్నాడు. అబ్దుల్ ముత్తలిబ్ కు "బనీ నజ్జార్" తెగ చేసిన సహాయాన్ని గమనించిన "బనూ ఖుజాఅ" తెగ, "బనూ నజ్జార్" తెగతో...., "అబ్దుల్ ముత్తలిబ్! నీకు సంతానం ఎలాగో అలాగే ఆయన మాకు సంతానమే. కాబట్టి మేము దానికి సహాయసహకారాలు అందించడం మా హక్కు." అని అన్నారు. "బనూ ఖుజాఅ" తెగ ఇలా అనడానికి ఓ కారణం ఉంది. అదేమిటంటే, "అబ్దె మునాఫ్" తల్లి కూడా "బనూ ఖుజాఅ" తెగకు చెందిన స్త్రీ కావడం. _(ఈ "అబ్దె మునాఫ్" ఎవరనగా, హాషిమ్ తండ్రి)_ 

కాబట్టి "బనూ ఖుజాఅ" దారున్నద్వాకు వెళ్ళి "బనీ అబ్దుష్షమ్స్" తెగకు మరియు నౌఫల్ కు వ్యతిరేకంగా "బనీ హాషిమ్" తెగను సమర్ధిస్తామని ప్రతిజ్ఞ చేశారు. ఈ ప్రతిజ్ఞే మునుముందు, ఇస్లామీయ పరిపాలనలో మక్కా విజయానికి దోహదపడింది. ఇందులోని మరిన్ని వివరాలు సందర్భాన్నిబట్టి రాబోతున్నాయి. ←

_(→ ←, ఈ గుర్తులు మధ్యలో ఉన్న విషయాన్ని బాగా అర్థం చేసుకోవలసినదిగా విజ్ఞప్తి)_ 

*అబ్దుల్ ముత్తలిబ్ విషయంలో, బైతుల్లాకు (కాబా గృహానికి) సంబంధించి రెండు ప్రధాన సంఘటనలు జరిగాయి.* 

*మొదటిది : - జమ్ జమ్ బావి త్రవ్వకం.* 

*రెండవది : - ఫీల్ సంఘటన. (ఏనుగులు సంఘటన)* 

Insha Allah రేపటి భాగములో జమ్ జమ్ బావి త్రవ్వకం గురించి తెలుసుకుందాము.

🖊🖊     ®@£€€q +97433572282  🖊🖊
                 (rafeeq)

🖊🖊  Salman      +919700067779 🖊🖊

*Note : - ఈ msg లను ముందుకు పంపిస్తూ, మన ఇస్లాం చరిత్ర గురించి మన ముస్లిం సోదరులకు, సోదరీమణులకు తెలియజేస్తారని ఆశిస్తున్నాము.*

No comments:

Post a Comment