97


☪☪☪       *బిస్మిల్లాహ్ హిర్రహ్మా నిర్రహీమ్*        ☪☪☪

🕋🕋   *అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు*   🕋🕋
🕋🕋     *అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను*      🕋🕋

●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●

🛐🛐🛐              *ఇస్లాం చరిత్ర* *- 97*              🛐🛐🛐

🇸🇦🇸🇦🇸🇦 *ముహమ్మద్ (సల్లం) జీవితచరిత్ర - 12* 🇸🇦🇸🇦🇸🇦 
◆◇◆◇◆◇◆◇◆◇◆◇◆◇◆◇◆◇◆◇◆◇◆◇◆◇◆◇◆◇◆◇◆◇◆

 *తన కన్నతల్లి ఒడికి చేరిన బాల ముహమ్మద్ (సల్లం) : -* 

బాల ముహమ్మద్ (సల్లం) కు రెండేళ్ల ప్రాయం వచ్చింది. పిల్లల ఆటపాటల్లో, హలీమా దంపతుల పోషణలో రెండు సంవత్సరాలు గడిచిపోయాయి. పిల్లవానికి పాలు పట్టడం పూర్తిగా మానేశారు. రెండు సంవత్సరాలు పూర్తి అయ్యేలోపల ముహమ్మద్ (సల్లం) ఇతర పిల్లల కంటే శారీరకంగా, దృఢంగా, అంగసౌష్టవంతో పెరిగిపోయాడు.

ఒప్పందం ప్రకారం రెండు సంవత్సరాల తరువాత హలీమా దంపతులు, బాల ముహమ్మద్ (సల్లం) ని తన తల్లి ఆమినా వద్దకు తీసుకెళ్ళారు. అయితే వారు అనుభవిస్తున్న శుభాలను దృష్టిలో ఉంచుకొని, ముహమ్మద్ (సల్లం) తమ వద్దే ఉండాలనే అభిలాష ఆ దంపతులతో పుట్టుకు వచ్చింది. అందుచేత హలీమా దంపతులు ఈ విషయమై, అతని తల్లి ఆమినాతో మాట్లాడారు.

"అమ్మా! ఈ పిల్లవాణ్ణి ఇంకొంత ఆరోగ్యంవంతుడు, మరింత శారీరక దారుఢ్యం వచ్చే వరకు మా దగ్గరనే ఎందుకుంచరూ? మక్కాలోని వ్యాధుల గురించి మాకు భయంగా ఉంది." అని వారు ఆమినాతో వేడుకున్నారు. అప్పటికే మక్కా పట్టణంలో అంతుచిక్కని వ్యాధి వ్యాపించి చాలా మంది ప్రజలు చనిపోతున్నారు. ప్రజలందరిలో భయాందోళనలు అలుముకున్నాయి. అలాంటి భయానక స్థితిలో ఆమినా తన కొడుకు ముహమ్మద్ (సల్లం) ను మక్కాలో ఉంచడం శ్రేయస్కరం కాదని భావించి, పిల్లవాడిని మళ్ళీ ఆయా హలీమా దగ్గరకు ఇష్టపడి పంపించేశారు.

హలీమా ఇంట్లో తిరిగి శుభాల పరంపర ప్రారంభమయింది. హలీమా కూతురు "షైమా", కొడుకు "అబ్దుల్లాహ్" తో పాటు బాల ముహమ్మద్ (సల్లం), అందరూ కలసి అల్లరి చేస్తూ ఆడుకుంటుంటే హలీమా, ఆమె భర్త హారిస్ సంతోషంతో పొంగిపోయేవారు. ఈ పసిపిల్లల ఆట పాటల కోలాహలంతో, ఇళ్ళు ఎల్లప్పుడూ సందడి సందడిగా ఉండేది.

హలీమా, తన దగ్గర ఉన్న పశువులలోని ఒక మేక పాలను చిన్నారి ముహమ్మద్ (సల్లం) కు పట్టేది. మేక పాలను పితికి తాపకుండా, మేక పొదుగు నుంచి సరాసరి చిన్నారి (సల్లం) కు తాపించేసేది. కానీ, ఇందులో విచిత్రం ఏంటంటే! పిల్లవాడు ఒక్క పొదుగును మాత్రమే నోట్లో పెట్టుకుని పాలు తాగేవాడు. రెండో పొదుగుని కనీసం ముట్టనైనా ముట్టుకునేవాడు కాదు. ఎందుకంటే! రెండు పొదుగులలోని పాలన్ని తానే తాగితే, తన పాలసంబంధిత సోదరి "షైమా" కు మరి ఎలా? అందుకే రెండో పొదుగు తాకకుండా తన సోదరి కోసం వదిలేవాడు.

ఊహ తెలియని వయసులోనే ఇంత న్యాయబద్దంగా ఉండే చిన్నారి ముహమ్మద్ (సల్లం) ని చూసి ఆ దంపతులు మురిసిపోయేవారు.

 *షక్కె సద్ర్ సంఘటన (వక్షస్థలాన్ని చీల్చే సంఘటన) : -* 

దైవప్రవక్త (సల్లం) పాలు త్రాగే గడువు పూర్తి ఆయన తర్వాత కూడా "బనూ సఅద్" తెగలోనే ఉండిపోయారు. ఆయన జన్మించిన నాల్గవ లేదా ఐదవ ఏట "షక్కె సద్ర్" సంఘటన జరిగింది. ★

 _('★' సాధారణ సీరత్ (జీవిత చరిత్ర) రచయితల అభిప్రాయం కూడా ఇదే. అయితే ఇబ్నె ఇస్ హాక్ ఉల్లేఖనం ప్రకారం, షక్కె సద్ర్ సంఘటన మూడు సంవత్సరాల ప్రాయంలోనే జరిగిందని తెలుస్తోంది. చూడండి, ఇబ్నె హష్షామ్- 1/164/165)_ 

 *హజ్రత్ జిబ్రీల్ అలైహిస్సలామ్ రాక : -* 

ఒకరోజు బాల ముహమ్మద్ (సల్లం), తన పాలసంబంధిత సోదరుడు అబ్దుల్లాహ్ తో కలిసి ఊరి బయట కొంచెం దూరంగా ఆడుకుంటున్నారు. మరికొందరు పిల్లలు కూడా వారితో పాటు ఆటల్లో పాల్గొన్నారు. ఆ సమయంలో హజ్రత్ జిబ్రీల్ (అలైహి), ముహమ్మద్ (సల్లం) దగ్గరకు వచ్చారు.

దైవప్రవక్త (సల్లం) వద్దకు హజ్రత్ జిబ్రీల్ (అలైహి) వచ్చినప్పుడు ఆయన పిల్లలతో ఆడుకుంటున్నారు. హజ్రత్ జిబ్రీల్ (అలైహి), ఆయనను క్రింద పడవేశారు. ముహమ్మద్ (సల్లం) వక్షస్థలాన్ని చీల్చి గుండెకాయను బయటకు లాగారు. ఆ తరువాత గుండె నుండి ఓ భాగాన్ని తీసి "ఇది నీలోని షైతాన్ స్థావరం" అని చెప్పారు. ఆ తరువాత ఓ పళ్ళెంలో ఉంచి జమ్ జమ్ నీటితో (గుండెకాయను) శుభ్రపరిచారు. (తర్వాత) దాన్ని సరిచేసి దాని స్థానంలో పెట్టి వెళ్ళిపోయారు.

ఈ భయంకర దృశ్యం చూసి చిన్నారి అబ్దుల్లాహ్ తో పాటు మిగతా పిల్లలంతా భయంతో పరుగు లంకించుకున్నారు. చిన్నారి అబ్దుల్లాహ్, తన తల్లి హలీమా వద్దకు పరుగున వెళ్ళి విషయం తెలియజేస్తూ...., "అమ్మా! మన ముహమ్మద్ (సల్లం) హత్యకు గురయ్యాడు" అని చెప్పాడు.

ఈ మాటలు విన్న హలీమా దంపతులు బెదిరిపోయారు. ఆ భార్యాభర్తలు ఇద్దరూ కంగారుపడుతూ ఊరి వెలుపల పిల్లలు ఆడుకుంటున్న ప్రదేశానికి వెళ్లి చూడగా, బాల ముహమ్మద్ (సల్లం) క్షేమంగానే ఉన్నారు.

తర్వాత చిన్నారి ముహమ్మద్ (సల్లం) ను, అసలేం జరిగిందన్న విషయం గురించి హలీమా దంపతులు ఆరతీయగా, చిన్నారి ముహమ్మద్ (సల్లం) జరిగిన విషయం వారికి వివరించారు.

 _(మరికొన్ని ఉల్లేఖనాల ప్రకారం...., "మనుషుల రూపంలో ఇద్దరు దైవదూతలు వచ్చి, కత్తితో ముహమ్మద్ (సల్లం) రొమ్ము చీల్చి గుండెను బయటకు తీసి, నీటితో గుండెను శుభ్రంగా కడిగి, దాని యధాస్థానంలో పెట్టి కుట్టేసినట్లు, ఇలా చేయడం వల్ల చిన్నారి ముహమ్మద్ (సల్లం) కు చీమ కుట్టినంత నొప్పి కూడా కలగన్నట్లు" కొన్ని ఉల్లేఖనాల్లో ఉంది.)_ 

ఈ సంఘటన జరిగిన పిదప హలీమా ప్రమాదాన్ని శంకించారు. ఇంకొక ఆపద రాకుండా, ఆలస్యం కాకుండా అతని తల్లి దగ్గరకి చేర్చాలని అనుకున్నారు. "ఈ సారి చిన్నారి ముహమ్మద్ (సల్లం) పోతే ఇక రానేరాడు." అనే ఈ ఆలోచన కలగగానే హలీమాకు ఏడుపు ముంచుకొచ్చింది. కాని తప్పదు. మరుసటిరోజు భారమైన హృదయంతో తన భర్తతో కలిసి మక్కాకు వెళ్ళి, ముహమ్మద్ (సల్లం) ను, తన మాతృమూర్తి ఆమినాకు అప్పజెప్పి వచ్చేశారు. (ఆ పిదప) ఆరు సంవత్సరాల వరకు ముహమ్మద్ (సల్లం) మాతృ మమతానురగాల్లోనే పెరిగి పెద్దయ్యారు.

అయితే హజ్రత్ ఆమినాకు, యస్రిబ్ (మదీనా) లో ఖననం అయివున్న తన భర్త అబ్దుల్లాహ్ సమాధిని చూసి రావాలనే కోరిక కలిగింది. తన కుమారుడు ముహమ్మద్ (సల్లం), తన సేవకురాలు ఉమ్మె అయిమన్ ను వెంట పెట్టుకుని సంరక్షకుడైన అబ్దుల్ ముత్తలిబ్ వెంట దాదాపు ఐదు వందల కిలోమీటర్ల దూరాన ఉన్న మదీనాకు బయలుదేరారు. అక్కడ ఓ నెల రోజులు ఉండి వెనుదిరిగారు. కానీ ప్రయాణ ప్రారంభంలోనే కొంత దూరం వచ్చిన తర్వాత (ఆమినా) వ్యాధిగ్రస్తులైపోయారు. ఈ వ్యాధి బాగా ముదిరిపోయి మక్కా మరియు మదీనాకు నడుమ గల ఓ ప్రదేశం "అబ్వా" చేరగానే ఆమె (ఆమినా) మరణించారు.

 _ఆమినా మరణంలోని మరింత వివరణను Insha Allah రేపటి భాగములో తెలుసుకుందాము._ 

🖊🖊     ®@£€€q +97433572282      🖊🖊
                    (rafeeq)

🖊🖊      Salman       +919700067779 🖊🖊

*Note : - ఈ msg లను ముందుకు పంపిస్తూ, మన ఇస్లాం చరిత్ర గురించి మన ముస్లిం సోదరులకు, సోదరీమణులకు తెలియజేస్తారని ఆశిస్తున్నాము.*

No comments:

Post a Comment