62

🛐 🕋 ☪ *బిస్మిల్లాహ్ హిర్రహ్మా నిర్రహీమ్* ☪ 🕋 🛐

🕋🤚🏻✋🏻🕌 *అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను* 🕌🤚🏻✋🏻🕋

◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆

       🕌☪🕋🛐 *ఇస్లాం చరిత్ర* 🛐🕋☪🕌

                                *భాగము - 62* 

◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆

*తోట యజమానులు* 

మేము పూర్వం ఓతోట యజమానులకు పరీక్ష పెట్టినట్లు (ఇప్పుడు మక్కా) వారికి పరీక్షపెట్టాం. ఆ తోటయజమానులు ప్రమాణం చేసి తాము (రేపు) ఉదయాన్నే తోటకెళ్ళి తప్పక పండ్లు కోస్తామని అన్నారు. వారు "అల్లాహ్ తలిస్తే (పండ్లు కోస్తాం)" అనలేదు. ఆరాత్రి వారు గాఢనిద్రలో ఉన్నప్పుడు నీప్రభుపు నుండి వారి తోట పైకి విపత్తు వచ్చిపడి, దాన్ని పంటకోయబడిస పొలంలా ధ్వ౦స౦ చేసింది. (ఖుర్‌ఆన్‌ 68:17-20)

తెల్లవారగానే వారు ఉత్సాహంతో ఒకర్నొకరు కేకవేసి పిలుచుకుంటూ "పండ్లు కోయాలనుకుంటే పెందలాడే తోటకు బయలుదేరండి" అన్నారు. ఇలా వార౦దరూ బయలు దేరారు. (దారిలో) మాట్లాడుకుంటూ "ఈరోజు మన తోటలోకి పేదవాళ్ళెవరూ రాకుండా చూసుకోవాలి" అన్నారు. వారు ఎవరికీ చిల్లిగవ్వ కూడా ఇవ్వరాదని నిర్ణయించుకొని, తొందర తొందరగా వెళ్ళారు పెద్ద మొనగాళ్ళులా. (ఖుర్‌ఆన్‌ 68:21-25)

అయితే తోట వద్దకు చేరుకొని (నిర్ఘాంతపోయి) చూస్తూ "ఏమిటీ మనం దారి తప్పి వచ్చామా...? కాదుకాదు, మన దురదృష్టమే మన కొ౦పము౦చి౦ది" అన్నారు. వారందరిలో కాస్త మంచివాడు "మీరు అల్లాహ్ ను ఎందుకు స్మరించరని నేను చెప్పలేదా?" అన్నాడు. అప్పుడు వారు "(నిజం) మనప్రభుపు ఎంతోపవిత్రుడు. మనమే దుర్మార్గులం" అన్నారు. ఆతర్వాత వారు ఒకర్నొకరు ని౦ది౦చుకున్నారు. చివరికి ఇలా అన్నారు: "అయ్యో! ఎంత దుర్గతి పట్టింది మనకు! నిజంగా మనం చాలా దుర్మార్గులై పోయాం. (ఇప్పుడైనా) మన౦ పశ్చాత్తాపంచెంది మన ప్రభుపుని క్షమాపణ కోరుకుందాము. బహుశా మనప్రభువు (మనల్ని కనికరించి) ఇంతకంటే మంచితోట ప్రసాదించవచ్చు."
(ఖుర్‌ఆన్ 68:26-32)

ఇలా ఉ౦టు౦ది (ఇహలోక) శిక్ష. పరలోక శిక్ష ఇంతకంటే తీవ్రంగా ఉ౦టు౦ది. వీరీ సత్యం తెలుసుకుంటే ఎ౦త బాగుండు! భయభక్తులుకలవారి కోసం వారిప్రభువు దగ్గర భోగభాగ్యాలతో కూడిన స్వర్గవనాలున్నాయి. మేము విధేయులైనవారిని, అపరాధులను ఒకే దృష్టితో ఎందుకు చూస్తాం? (ఖుర్‌ఆన్ 68:33-35)

*వివరణ* 

ఒక రోజు ప్రాతః కాలం, నలుదిశలా ప్రశాంత వాతావరణం అలుముకుని ఉంది. రాతినేల పై చేతికర్రతో కొడుతూ ఎవరో నడుస్తున్న శబ్దం వినిపిస్తోంది. మధ్య మధ్యలో ఆ వ్యక్తి ఆయాసంతో దీర్ఘ విడువడం కూడా చెవులకు సోకుతుంది. ఆ వ్యక్తి ఒక ముసలివాడు. ఆయన తన తోట వద్దకు వెళుతున్నాడు.

ఆ తోటలో అనేక పండ్ల చెట్లు ఉన్నాయి. చెట్లన్నీ విరగకాసాయి. తోట మధ్యలో ఒక సెలయేరు ప్రవహిస్తోంది. అనేక పూల వాసనతో అక్కడ గాలి మధురంగా గుబాళిస్తోంది. ప్రాతః కాలం మసకమసక వెలుతురు నెమ్మదిగా ప్రకాశమానం అవుతోంది. పక్షులు ప్రపంచాన్ని నిద్రలేపడానికి కిలకిలరావాలు ప్రారంభించాయి. కానీ ఈ ప్రకృతి సౌందర్యం ఆ ముసలి వ్యక్తి ధ్యాసను మరల్చలేదు. విశ్వప్రభువు అల్లాహ్ అనుగ్రహాలను అన్వేషించే విషయంలో ఆయన ఏమాత్రం నిర్లక్ష్యం చేయదలచుకోలేదు. ఆయన సమయం కాగానే అల్లాహ్ ను స్మరిస్తూ నమాజు చేసి అల్లాహ్ అనుగ్రహాలకు కృతజ్ఞతలు చెల్లించాడు.

తన తోటలోకి ఆయన అందరినీ అనుమతించేవాడు. అక్కడి ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదించే అవకాశం కల్పించేవాడు. అయితే ఎవరూ తన తోటి నాశనం చేయకుండా జాగ్రత్తగా ఉండేవాడు. తోటలో పండ్లను దించేటప్పుడు బీదలను పిలిచి వారికి ఉదారంగా తన ఫలసాయం నుంచి పంచి పెట్టేవాడు. అంతేకాదు, తోటలో దించకుండా మిగిలిపోయిన పండ్లను దించుకునే అనుమతి బీదలకు ఇచ్చేవాడు.

*స్వార్థపరులైన కుమారులు* 

ఆ ముసలి వ్యక్తికి ముగ్గురు కుమారులు. అందులో ఇద్దరు తమ తండ్రికి పూర్తి విరుద్ధమైన స్వభావం కలిగిన వారు. తమ తండ్రి ఉదారంగా చేసే దానధర్మాలు వారికి సహించేవి కావు. వారిలో ఒకడు తన తండ్రితో....,

ఒక కుమారుడు : - మీరు బీదలకు అంతా పంచి పెట్టి మాకు రావలసిన వాటా తగ్గిపోయేలా చేస్తున్నారు.

రెండవ కుమారుడు : - మీ దానధర్మాలు చివరకు మనల్ని కూడా బిచ్చగాళ్ళు అయ్యేలా చేస్తాయి.

ఇది విన్న మూడవ కుమారుడు జవాబు చెప్పబోయాడు. కాని తండ్రి అతడిని వారించాడు. ఆ ముసలి వ్యక్తి తన కుమారులను విచారంగా చూస్తూ....,

ముసలి వ్యక్తి : - పిల్లలారా! నేను దానధర్మాలు చేయడం వల్ల మనం బీదవాళ్ళమైపోతామని మీరు అనుకోవడం చాలా పొరపాటు. ఇది స్వార్థపూరితమైన ఆలోచన. మీరు కోరుతున్న ఈ సంపద నిజానికి మీది కాదు, నాది కాదు. ఈ సంపద అల్లాహ్ ది. నేను కేవలం ఈ సంపదకు పర్యవేక్షకుడిని మాత్రమే. ఈ సంపదను కేవలం నా స్వంతానికి మాత్రమే ఖర్చు చేసుకుని అనుమతి నాకు లేదు. అల్లాహ్ సృష్టించిన మిగిలిన వారికి కూడా దీనిలో భాగం ఉంది. ముఖ్యంగా బీదలకు, బాటసారులకు, అవసరార్థులకు ఇందులో భాగం ఉంది. పక్షులు, క్రిమి కీటకాలకు కూడా ఇందులో భాగంగా ఉంది. ఎందుకంటే, అవి కూడా అల్లాహ్ సృష్టిలోనీవే. ఆ తర్వాత మిగిలినదే మనది. ఆ విధంగానే మనిషి తన సంపదను పరిశుద్ధం చేసుకోగలడు. సౌభాగ్యాన్ని, సంపదలో వృద్ధిని పొందగలడు. నేను ఈ విధానాన్ని నా యవ్వనం నుంచి అనుసరిస్తూ వస్తున్నాను. మరణించే వరకు ఈ పద్ధతికే కట్టుబడి ఉంటాను.

ఇప్పుడు నేను ముసలివాడిని అయిపోయాను. నా శరీరం వ్యాధులతో క్రుంగిపోయింది. నా చావు ఇక ఎంతో దూరంలో లేదు. కాబట్టి ఇదంతా మీరు స్వంతం చేసుకునే రోజు పెద్ద దూరంలో లేదు. అప్పుడు మీ ముందు రెండు దారులు ఉంటాయి. మీరు కూడా నా మాదిరిగా మీ సంపదను అల్లాహ్ మార్గంలో ఖర్చు చేస్తే అల్లాహ్ మిమ్మల్ని అనుగ్రహిస్తారు. కానీ మీరు స్వార్థపరులై సంపదను అల్లాహ్ మార్గంలో ఖర్చు చేయకపోతే మీరు అల్లాహ్ అనుగ్రహాలను కోల్పోవడమే కాదు, చివరకు ఉత్త చేతులతో మిగులుతారు. కాబట్టి కుమారులారా! అల్లాహ్ మనల్ని ఇలానే ఉండాలని ఆదేశిస్తున్నారు.

ఈ సంభాషణ జరిగిన కొంత కాలానికి ఆ ముసలి వ్యక్తి మరణించాడు. తర్వాత తోటలో పండ్లను దించే సమయం వచ్చినప్పుడు, బీదలు ఎప్పటి మాదిరిగా అక్కడకు వచ్చి తమకు కూడా ఇవ్వడం జరుగుతుందని ఎదురుచూడసాగారు. కాని ఇప్పుడు ఆ తోటకు యజమానులు కుమారులు. వారు బీదలకు తోటలో లభించే పండ్లలో ఏదీ ఇవ్వరాదని, బాటసారులు తోట లోపలికి ప్రవేశించే అనుమతి ఇవ్వరాదని నిర్ణయించుకున్నారు.

కానీ మూడవ కుమారుడు తండ్రిని పోలినవాడు. అతను తన సోదరులతో....,

మూడవ కుమారుడు : - మీరు చెప్పే మాటలు దుర్మార్గంతో కూడుకున్నవి. దుర్మార్గం చెడును కొనితెస్తుంది. బీదలను కాదనడం ద్వారా మనం ప్రయోజనాలు పొందలేం. పైగా మనం స్వయంగా ఇబ్బందులకు గురికావచ్చు. కాబట్టి అల్లాహ్ ప్రసాదించిన ఈ సంపద మన తండ్రి వద్ద ఉన్నప్పుడు ఆయన ఎలా ఇచ్చేవారో అలాగే ఇవ్వడం మంచిది.

కానీ సోదరులు ఈ మాటలకు ఆగ్రహించి...., "నీకు సంబంధంలేని వ్యవహారాల్లో మాకు సలహాలు ఇవ్వవద్దు. నాన్న బ్రతికి ఉన్నప్పుడు చాలా సలహాలు తీసుకున్నాం." అన్నారు.

కానీ మూడవ కుమారుడు తన పట్టు వదల్లేదు.

మూడవ కుమారుడు : - మనం అల్లాహ్ ను ప్రార్థించి అల్లాహ్ మార్గదర్శనాన్ని కోరుకుందాం. ప్రార్థన మనిషిని చెడు నుంచి కాపాడుతుంది.

కానీ సోదరులు అతని మాటలను ఏ మాత్రం లక్ష్యపెట్టలేదు.

మరుసటిరోజు తెల్లవారుజామున లేచి తోటలోని పండ్లను దించి తామే పంచుకోవాలని వారు నిర్ణయించుకున్నారు. అలాగే మరుసటి రోజు తెల్లవారు జామున తోటకు వెళ్లారు. కానీ అక్కడ కనబడిన దృశ్యం చూసి నిర్ఘాంతపోయారు. వారి తోట పరిస్థితే మారిపోయింది. అంతా నాశనమైపోయింది. అసలు గుర్తుపట్టడానికి కూడా వీలులేకుండా మారిపోయింది.

ఈ వార్త మూడవ కుమారునికి తెలిసి....,

మూడవ కుమారుడు : - మీ దుర్మార్గపు ఆలోచనల వల్ల ఏమయ్యిందో చూడండి. (అని వ్యాఖ్యానించాడు.)

ఇద్దరు సోదరులు తమ తప్పు తెలుసుకొని అల్లాహ్ ను క్షమాభిక్ష కోరారు. "మా ప్రభువు పరిశుద్ధుడు.... నిజంగానే మేము పాపాత్ములం.... మన ప్రభువు దీనికి బదులు దీని కన్నా మెరుగైన తోటను మనకు ప్రసాదించడం అసంభవమేమీ కాదు." అన్నారు.

అల్లాహ్ మనకు సంపదను ఒక బాధ్యతగా అప్పగిస్తాడు. దానితో మనం ఏం చేస్తామో పరీక్షిస్తాడు. ఆ సంపదలో బీదలకు, అవసరార్థులకు, బాటసారులకు ఇవ్వడానికి నిరాకరిస్తే అల్లాహ్, ఆ సంపదను తీసుకుని అనేక విధాలుగా శిక్షిస్తాడు. మనం చేసిన తప్పుకు చిత్తశుద్ధితో పశ్చాత్తాప పడితే, అల్లాహ్ తాను తీసుకున్న దానికన్నా మెరుగైనది ప్రసాదిస్తారు.

Insha Allah రేపటి భాగము - 63 లో గుహవాసుల కథ గురించి తెలుసుకుందాము.

☆☆ ®@£€€q  +97433572282 ☆☆

Note : - ఈ msg లను ముందుకు పంపిస్తూ, మన ఇస్లాం చరిత్ర గురించి మన ముస్లిం సోదరులకు, సోదరీమణులకు తెలియజేస్తారని ఆశిస్తున్నాము.

No comments:

Post a Comment