45

🤚🏻✋🏻 🕌   *బిస్మిల్లాహ్ హిర్రహ్మా నిర్రహీమ్*   🕌 🤚🏻✋🏻

🛐🕋🛐🕋 *అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను* ☪🕋☪🕋

°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°

       🕌🕋🕌🕋 *ఇస్లాం చరిత్ర* 🕋🕌🕋🕌

                               *భాగము - 45* 

____________________________________________

*సులైమాన్ అలైహిస్సలామ్ రాజరికం* 

మహారాజు దావూద్ (అలైహి) మరణాంతరం సులైమాన్ (అలైహి) రాజుగా పాలనా పగ్గాలు చేపట్టారు. తన రాజ్యం లాంటి మరో రాజ్యం లేనంత చక్కగా పాలించే అనుగ్రహం ప్రసాదించాలని సులైమాన్ (అలైహి) అల్లాహ్ ను ప్రార్థించారు.

"ప్రభు! నా తర్వాత మరెవ్వరికీ శోభించనటువంటి గొప్ప సామ్రాజ్యం నాకు ప్రసాదించు. నిస్సందేహంగా నీవే దాతవు, అనుగ్రహమూర్తివి." అని వేడుకున్నాడు.

అల్లాహ్ సులైమాన్ (అలైహి) కోరికను మన్నించాడు. సులైమాన్ (అలైహి) మహా వివేకవంతుడు మాత్రమే కాదు, అల్లాహ్ ఆయనకు అనేక వరాలు ప్రసాదించాడు. సులైమాన్ (అలైహి) కోసం అల్లాహ్ గాలిని అదుపులో ఉంచారు. అల్లాహ్, గాలులను సులైమాన్ (అలైహి) అదుపులో ఉంచారు. అందువల్ల సులైమాన్ (అలైహి) ఉదయం ఒక నెలరోజుల్లో నడిచే దూరాన్ని, సాయంత్రం ఒక నెలరోజుల్లో నడిచే దూరాన్ని నడిచేవారు. ఆ గాలి సులైమాన్ (అలైహి) ఆజ్ఞతో సులైమాన్ (అలైహి) కోరుకున్న వైపుకు మెల్లగా వీస్తుంది.

అల్లాహ్ ప్రసాదించిన వరం వల్ల సులైమాన్ (అలైహి) పశువులు, పక్షులతో మాట్లాడగలిగేవారు మరియు సమస్త ప్రాణుల మాటలను వినగలిగేవారు. భూగర్భంలో ఉన్న ఖనిజాలను త్రవ్వి బయటకు తీసి వాటితో ఉపకరణాలు, ఆయుధాలు తయారు చేసే విద్యను మనుషులకు, జిన్నాతులకు నేర్పాలని అల్లాహ్ సులైమాన్ (అలైహి) ను ఆదేశించారు. అల్లాహ్ ఆయనకు ఒక రాగి గనిని కూడా ప్రసాదించాడు. (కరిగిన రాగి ప్రవహించే నది) ఆ కాలంలో రాగి బహు అరుదైనదైన లోహంగా ఉండేది.

సులైమాన్ (అలైహి) కోసం మానవులు, జిన్నాతులు, జంతువులు, పక్షులు సమకూర్చబడ్డాయి. అల్లాహ్, భూతాలను మరియు జిన్నాతులను సులైమాన్ (అలైహి) ఆధీనంలో ఉంచారు. అవి తమ ప్రభువు ఆజ్ఞతో సులైమాన్ (అలైహి) ముందు కట్టుబానిసలలాగా పనిచేసేవి. వాటిలో ఏవీ కూడా అల్లాహ్ ఆజ్ఞ ను నిరాకరించేవి కావు.

ఆ జిన్నాతులు సులైమాన్ (అలైహి) కోసం, అతను కోరిన వస్తువు తయారుచేసేవి. ఆకాశహర్మ్యాలు, రకరకాల బొమ్మలు, కొనేరుల్లాంటి విశాలమైన కంచాలు, ఒక చోట స్థిరంగా ఉండే పెద్ద పెద్ద వంటపాత్రలు తయారుచేసేవి.

సులైమాన్ (అలైహి) కోసం మానవులు, జిన్నాతులు, జంతువులు, పక్షుల సైన్యాలను సమావేశపరచారు.

ఒకరోజు సులైమాన్ (అలైహి) తన సైన్యాన్ని సమావేశపరిచారు. అదొక విచిత్ర సైన్యం. అందులో మనుషులు, పశువులు, జిన్నాతులు, పక్షులు ఉన్నాయి. అవన్నీ సులైమాన్ (అలైహి) క్రమశిక్షణలో ఉండేవి. తన విచిత్ర సైన్యాన్ని తీసుకొని సులైమాన్ (అలైహి) అష్కేలాన్ రాజ్యానికి బయలుదేరి వెళ్ళారు.

అలా వెళ్తూ వెళ్తూ ఆ సైన్యమంతా చీమల లోయలోకి ప్రవేశించింది. ఆ లోయలో ఒక చీమ సులేమాన్ సైన్యం రావడానికి చూసింది. చీమ మిగిలిన హెచ్చరిస్తూ....,

చీమ : - పారిపోండి. పుట్టలో తలదాచుకోండి. లేకపోతే మనల్ని చూడకుండా సులైమాన్ సైనికులు మనల్ని తొక్కి నలిపేస్తారు. (అని అరిచింది) 

పశుపక్షులతో మాట్లాడటం, వాటి మాటలు వినటం అల్లాహ్ ద్వారా వరం పొందిన సులైమాన్ (అలైహి) కు ఆ చీమ అరుపు అతని చెవులకు సోకింది. అప్పుడు సులైమాన్ (అలైహి) నవ్వుకున్నారు. ఆ తర్వాత అల్లాహ్ పట్ల కృతజ్ఞతా భావంతో...., "ప్రభు! నీవు నాకు, నా తల్లిదండ్రులకు చేసిన మేలుకు నేను ఎల్లప్పుడూ నీకు కృతజ్ఞుడినై ఉంటూ, నీకు నచ్చిన సత్కార్యాలు ఆచరించేలా నన్ను అదుపులో పెట్టు. దయతో నన్ను నీ పుణ్యదాసుల జాబితాలో చేర్చు." అని వేడుకున్నాడు.

సులైమాన్ (అలైహి), ఒక ప్రవక్తగా తాను కావాలని, అల్లాహ్ సృష్టి దేనికి హాని తలపెట్టనన్న విషయాన్ని ఆ చీమ గుర్తించినందుకు సంతోషించారు. చీమలు కాపాడినందుకు ఆయన అల్లాహ్ కు కృతజ్ఞతలు తెలిపారు.

*హుపో పక్షి : - - : నీటివనరులు* 

జెరుసలేమ్ లో ఒక పెద్ద శిల పై సులైమాన్ (అలైహి) ఒక అందమైన మస్జిద్ ను నిర్మించారు. ప్రజలు అల్లాహ్ ను ఆరాధించడానికి వచ్చేలా ఈ మస్జిద్ ను కట్టారు. నేడు దీనిని "మస్జిదుల్ అక్సా" లేదా "మస్జిదుల్ ఖుద్స్" లేదా "డోమ్ ఆఫ్ రాక్" అని పిలుస్తున్నారు. ఇక్కడి నుంచి సులైమాన్ (అలైహి) వెంట పెద్ద సంఖ్యలో అనుచరులు మక్కా లోని పవిత్ర గృహం కాబా యాత్రకు బయలుదేరారు. వారందరూ తమ హజ్ యాత్రను పూర్తిచేసుకుని అక్కడ నుంచి యమన్ చేరుకొని సనా పట్టణానికి వచ్చారు.

ఆ పట్టణంలోని అధికారులు చాలా తెలివిగా పట్టణాల్లో నీటి పారుదల సదుపాయాలు ఏర్పాటు చేసిన పద్ధతిని చూసి సులైమాన్ (అలైహి) చాలా ప్రభావితులయ్యారు. తన రాజ్యంలో కూడా ఇలాంటి నీటి పారుదల సదుపాయం ఏర్పాటు చేసుకోవాలని భావించారు. కానీ తన రాజ్యంలో అందుకు అవసరమైన నీటి వనరులు లేవు. అందుకు సులైమాన్ (అలైహి) వెంటనే హుపో పక్షి కోసం కబురు పంపారు. ఆ పక్షి భూగర్భంలో ఉన్న జల వనరులను పసిగట్టగలదు. సులైమాన్ (అలైహి) ఆ పక్షి కోసం నాలుగు చెరగులా సందేశాలు పంపారు. కానీ ఆ పక్షి ఎక్కడా లేదు. సులైమాన్ (అలైహి) కోపంగా, "ఆ పక్షి కనుక సరైన కారణం లేకుండా గైర్హాజరైతే దానిని కఠినంగా శిక్షిస్తాను." అని అన్నారు.

చివరకు హుపో పక్షి సులైమాన్ (అలైహి) వద్దకు వచ్చింది. మహారాజా నా ఆలస్యాన్ని క్షమించండి. నా ఆలస్యానికి గల కారణానం ఏమనగా....,

హుపో పక్షి : - మహారాజా! మీకు తెలియని ఒక విషయాన్ని నేను కనిపెట్టి వచ్చాను. అది ఏమనగా నేను సబా రాణి నుంచి ఒక నమ్మకమైన సమాచారం తీసుకుని వచ్చాను.

[ఈ మాటలు విన్న సులైమాన్ (అలైహి) ఆగ్రహం మాయమై, ఆయనలో కుతూహలం చోటుచేసుకుంది.]

హుపో పక్షి : - నేను అక్కడ ఒక స్త్రీ ని చూశాను. ఆమె పేరు బిల్కిస్. ఆమె ఆ జాతికి పాలనగా చేస్తోంది. సబా రాజ్యాన్ని బిల్కిస్ అనే రాణి పాలిస్తోంది. ఆమెకు అన్ని రకాల సంపదలు, సకల సౌకర్యాలు, సౌభాగ్యాలు పుష్కలంగా ప్రసాదించబడ్డాయి. సబా రాణి సింహాసనం చాలా అద్భుతంగా ఉంది. కానీ ఇంత సంపద ఉన్నప్పటికీ, ఆమె హృదయంలో మరియు ఆ రాజ్య ప్రజల హృదయాల్లో షైతాన్ తిష్ఠవేసుకుని ఉన్నాడు. ప్రజలు బిల్కిస్ పట్ల చాలా విశ్వాసంగా ఉన్నారు. ఆ ప్రజలంతా విశ్వప్రభువైన అల్లాహ్ కు బదులు సూర్యుడిని పూజించడం చూసి నేను నిర్ఘాంతపోయాను.

సులైమాన్ (అలైహి) : - సరే! నీవు నిజం చెప్పావో లేక అబద్దాలమారివో మేము ఇపుడే కనుక్కుంటాం. నువ్వు చెప్పిన మాటలను నిర్ధారించుకోవడానికి నేను ఆ సబా రాణికి ఒక లేఖ పంపుతాను. ఆ లేఖను రాణి దగ్గరకు నువ్వే తీసుకెళ్లాలి. రాణికి లేఖ చేరవేసిన తర్వాత అక్కడే వారికి తెలియకుండా పక్కకు వెళ్లి రహస్యంగా ఉండి రాణి ప్రతిస్పందన ఏమిటో, ఆమె ఏం చేస్తుందో చూడు.

తర్వాత హుపో పక్షి సులైమాన్ (అలైహి) ఆజ్ఞ ప్రకారం, అతను ఇచ్చిన ఆ లేఖను తీసుకెళ్లి సబా రాణి ముందు పడవేసి ఎగిరిపోయింది. ఆ పక్షి అక్కడి నుంచి వెళ్లిపోకుండా ఓ మూలన దాక్కుని చూడసాగింది.

సబా రాణి బిల్కిస్ ఆ లేఖను ఆశ్చర్యంగా తీసుకొని చదవసాగింది.

తరువాత జరిగిన విషయమై Insha Allah రేపటి భాగము - 46 లో తెలుసుకుందాము.

[హుపో పక్షి అనగా, అది ఒక వడ్రంగి పిట్ట]

Note : - ఈ msg లను ముందుకు పంపిస్తూ, మన ఇస్లాం చరిత్ర గురించి మన ముస్లిం సోదరులకు తెలియజేస్తారని ఆశిస్తున్నాము.

☆☆   ®@£€€q +97433572282☆☆

No comments:

Post a Comment