54

🛐 🕋 ☪ *బిస్మిల్లాహ్ హిర్రహ్మా నిర్రహీమ్* ☪ 🕋 🛐

🕋🤚🏻✋🏻🕌 *అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను* 🕌🤚🏻✋🏻🕋

◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆

       🕌☪🕋🛐 *ఇస్లాం చరిత్ర* 🛐🕋☪🕌

                                *భాగము - 54* 

◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆

ఇబ్లీస్, తన రెండవ కుట్రలో భాగంగా అయ్యూబ్ (అలైహి) సంతానం నివసిస్తున్న ఇంటిని కూల్చేశాడు. ఆ సమయంలో ఇంటిలో ఉన్న అయ్యూబ్ (అలైహి) పిల్లలంతా మరణించారు. ఆ తర్వాత అయ్యూబ్ (అలైహి) వద్దకు పెద్ద సానుభూతిపరునిలాగా, మునుపటివలె వృద్ధుడి రూపంలో నటిస్తూ వెళ్ళాడు. అపుడు ఇబ్లీస్, అయ్యూబ్ (అలైహి) ని ఓదారుస్తున్నట్లు నటిస్తూ....,

ఇబ్లీస్ : - అయ్యూబ్! మీ పిల్లలు మరణించిన సంగతి నేను విన్నాను. ఆ మరణ పరిస్థితులు చాలా విచాకరమైనవి. నిజంగా నువ్వు ప్రార్థిస్తున్న అల్లాహ్ కు నీ సంతానాన్ని కాపాడే శక్తి ఉంటే తప్పకుండా కాపాడేవాడు. నీ ప్రార్థనలకు అల్లాహ్ సరయిన ప్రతిఫలం ఇవ్వడం లేదు. కాబట్టి అల్లాహ్ పై నీకు ఉన్న విశ్వాసాన్ని ఇప్పటికైనా మానుకో!

ఈ మాటలు చెప్పి, అయ్యూబ్ (అలైహి) ఏమంటారో అని ఆతృతగా ఎదురుచూడసాగాడు తిరస్కారి ఇబ్లీస్. ఇక ఇప్పుడు అయ్యూబ్ (అలైహి) నిజంగా అల్లాహ్ ను మరియు అల్లాహ్ పై ఉన్న విశ్వాసాన్ని తిరస్కరిస్తూ మాట్లాడుతారని, అల్లాహ్ పై అపనిందలు మోపుతారని ఇబ్లీస్ ఆశపడ్డాడు. ఈ విధంగా తన పథకం విజయవంతంగా అమలు అవుతున్నందుకు ఇబ్లీస్ మనసులో సంతోషించసాగాడు. అయ్యూబ్ (అలైహి) ఇచ్చిన జవాబు ఇబ్లీస్ ని మరింత నిరాశకు గురిచేసింది. అపుడు అయ్యూబ్ (అలైహి), వృద్ధుడి రూపంలో వచ్చిన ఇబ్లీస్ కు జవాబిస్తూ....,

అయ్యూబ్ (అలైహి) : - వృద్ధజ్ఞాని! ఇచ్చేవాడు అల్లాహ్ యే.. ఆయన తాను ఇచ్చినది కొన్ని సార్లు తీసుకుంటాడు. అల్లాహ్ కొన్ని సార్లు ప్రసన్నుడు అవుతాడు, కొన్ని సార్లు ఆగ్రహిస్తాడు. అంతా మన ఆచరణలను బట్టి ఉంటుంది. నాకు మంచి జరిగిన, చెడు జరిగిన, ఇంకా ఏం జరిగినా నేను మాత్రం అల్లాహ్ పట్ల నా విశ్వాసం విషయంలో స్థిరంగా ఉంటాను. సృష్టికర్త అయిన అల్లాహ్ కు ఎల్లప్పుడూ కృతజ్ఞుడనై ఉంటాను. (అని చెప్పి అయ్యూబ్ (అలైహి) అల్లాహ్ సన్నిధిలో సాష్టాంగపడ్డారు.)

ఇదంతా చూసిన ఇబ్లీస్ ఇంకా చాలా నిరాశకు గురయ్యాడు. ఇబ్లీస్ చేసిన ఈ రెండవ కుట్ర కూడా విఫలమవ్వడంతో, తను సహనం కోల్పోకుండా అయ్యూబ్ (అలైహి) పై తన మూడవ కుట్రను అమలు చేయడానికి సిద్ధమయ్యాడు. అందుకు అయ్యూబ్ (అలైహి) పై మరింత పెత్తనం కోసం మళ్ళీ అల్లాహ్ వద్దకు వెళ్లి....,

ఇబ్లీస్ : - అల్లాహ్! అయ్యూబ్ (అలైహి) సంపద అంతా పోయింది. అతని సంతానం అందరూ మరణించారు. కానీ అయ్యూబ్ (అలైహి) శారీరకంగా చాలా ఆరోగ్యంగా ఉన్నాడు. అతను మంచి ఆరోగ్యంతో ఉన్నంత కాలం మిమ్మల్ని ఆరాధిస్తూనే ఉంటాడు. ఆ విధంగా అయ్యూబ్ (అలైహి) శారీరకంగా బలంగా ఉన్నాడు కాబట్టి ఆయన తన సంపదను, సంతానాన్ని మళ్ళీ పొందాలని ప్రయత్నిస్తాడు. కాబట్టి నాకు అయ్యూబ్ (అలైహి) శరీరం పై అధికారాన్ని ఇవ్వండి. నేను అతని శరీరాన్ని అనేకమైన వ్యాధులకు గురి చేసి బలహీనం చేసివేస్తాను. అపుడు మీరే చూస్తారు, అయ్యూబ్ (అలైహి) మీ పై ఏ విధంగా తిరస్కారానికి పాల్పడుతాడో!

అయ్యూబ్ (అలైహి) విశ్వాసం ఇబ్లీస్ కు ఒక గుణపాఠం కావాలని అల్లాహ్ నిర్ణయించుకున్నారు. అయ్యూబ్ (అలైహి) నిజమైన భక్తివిశ్వాసాలు కలిగిన వారని ఇబ్లీస్ కు స్పష్టంగా తెలియజేయాలని భావించారు. అందువల్ల ఇబ్లీస్ అడిగిన మూడవ కోరికను కూడా మన్నించారు. అపుడు అల్లాహ్, ఇబ్లీస్ తో....,

అల్లాహ్ : - ఇబ్లీస్! నువ్వు, నీ సహచరులు కలిసి అయ్యూబ్ (అలైహి) లో, నా పై ఉన్న విశ్వాసాన్ని దెబ్బతీయాలని ఎన్ని రకాలుగా ప్రయత్నాలు చేసినా మీ ప్రయత్నాలు అన్ని వృధా ప్రయత్నాలుగానే మిగిలిపోతాయి. సరే! నువ్వు అడిగిన విధంగా ఒక షరతుకు లోబడి నీ కోరికను మన్నిస్తాను. అది ఏంటంటే, అయ్యూబ్ (అలైహి) శరీరం పై నీకు అధికారం ఇస్తాను. కానీ అతని ఆత్మ, అతని మనోమస్తిష్కాల పై మాత్రం ఇవ్వను. ఎందుకంటే, అతని ఆత్మ, అతని మనోమస్తిష్కాలలో నాకు సంబంధించిన జ్ఞానం, నా ధర్మం ఉంటాయి.

*మూడవ కుట్ర : -* 

అల్లాహ్ పెట్టిన ఈ షరతును అంగీకరించి, తనకు లభించిన ఈ కొత్త అధికారంతో, అయ్యూబ్ (అలైహి) ని భయంకర వ్యాధులకు గురిచేయాలని, ఈ విధంగా తన మూడవ కుట్రను అమలు చేయడానికి ఇబ్లీస్ సిద్ధమయ్యాడు.

అల్లాహ్ ఇచ్చిన అధికారంతో ఇబ్లీస్, అయ్యూబ్ (అలైహి) శరీరాన్ని అనేక వ్యాధులకు గురయ్యేలా చేశాడు. అయ్యూబ్ (అలైహి) భయంకరమైన జబ్బుల బారిన పడ్డారు. ఆయన శరీరం ఆ వ్యాధి ధాటిని తట్టుకోలేక బలహీనపడసాగింది. చివరకు అయ్యూబ్ (అలైహి) శరీరం కేవలం ఎముకల గూడుగా, అస్థిపంజరానికి చర్మం తొడిగిన మాదిరిగా తయారయ్యింది.

ఆ భయంకరమైన వ్యాధి బారినపడి అయ్యూబ్ (అలైహి) చాలా వికారంగా తయారయ్యారు. ఆ వ్యాధి ప్రభావానికి అయ్యూబ్ (అలైహి) యొక్క శరీరం పై రంధ్రాలు ఏర్పడి, ఆయన శరీర అవయవాల పై అసహ్యకరమైన పురుగులు కప్పబడి ఉన్నాయి. అయ్యూబ్ (అలైహి) చూడటానికి చాలా వికారంగాను మరియు ముఖం, చేతుల పై పూతలాగా పురుగులు నివసించసాగాయి. చివరకు అయ్యూబ్ (అలైహి) శరీరం అంతా పుళ్ళు (పుండ్లు), పురుగులతో నిండిపోయింది. అయ్యూబ్ (అలైహి) తన శరీరం పై నుంచి పడిపోయిన ఆ పురుగులను ఎంచుకుంటూ, వాటిని సృష్టించినందుకు అల్లాహ్ ను ప్రశంసించాడు.

ఆ వ్యాధి ధాటికి, అనేక శారీరక బాధలతో అయ్యూబ్ (అలైహి) అలమటించడం ప్రారంభించారు.

ఆ వ్యాధికి భయపడి తన దగ్గరి బంధువులు, తన మిత్రులు కూడా అయ్యూబ్ (అలైహి) కు ఎక్కువ కాలం సేవ చేయలేక వదిలేసి వెళ్లిపోయారు. కానీ, అయ్యూబ్ (అలైహి) యొక్క నమ్మకమైన భార్య రహీమా (అలైహి) మినహా, అందరూ ఆయనను విడిచి వెళ్లిపోయారు. ఇపుడు ఆయనను అమితంగా ప్రేమించే ఆయన భార్య రహీమా (అలైహి) మాత్రమే ఆయనతో మిగిలారు. కానీ తన వాళ్ళు తనను విడిచిపెట్టి వెళ్లిపోవడం వంటి ఈ బాధలన్నింటినీ అయ్యూబ్ (అలైహి) సహనంతో భరించారు. ఎల్లప్పుడూ అల్లాహ్ పట్ల తన విశ్వాసంలో పటిష్టంగా నిలబడ్డారు. ఈ కష్టాలు, బాధలను సహనంతో భరించడమే కాదు, ఏ విధంగానూ ఆయన అల్లాహ్ కు ఫిర్యాదు చేయలేదు.

భయంకరమైన వ్యాధికి గురయ్యి, ఆ బాధకు అయ్యూబ్ (అలైహి)  అలమటిస్తూ, ఆర్తనాదాలు పెడుతుంటే ఒకానొక సందర్భంలో ఆయన భార్య రహీమా (అలైహి), తన భర్త మరణం కోసం అల్లాహ్ తో దుఆ చేశారు.

ఇంత నరకయాతన పడుతున్నా కూడా అయ్యూబ్ (అలైహి) అల్లాహ్ పై ఉన్న తన విశ్వాసాన్ని, నమ్మకాన్ని మరియు సహనాన్ని ఎప్పుడు కూడా కోల్పోలేదు. ఆయన చేసినదంతా అల్లాహ్ కారుణ్యం మరియు అల్లాహ్ అనుగ్రహం కోసం ఎదురుచూడడం మాత్రమే! ఈ విధంగా అల్లాహ్ దాసులు కష్టాల్లో ఉన్నపుడు సహాయం కోసం ఇతరుల వైపు చూడరు. అల్లాహ్ కారుణ్యం పట్ల ఎల్లప్పుడూ ఆశావాదులుగా ఉంటారు.

*భర్తను కంటిపాపలా చూసుకున్న రహీమా (అలైహి)* 

అయ్యూబ్ (అలైహి) కష్టాల్లో ఉన్నప్పుడు, ఆయన భార్య వెంట ఉన్నారు. ప్రేమాభిమానాలతో ఆయనను చూసుకున్నారు. అనేక సంవత్సరాలుగా అయ్యూబ్ (అలైహి) అనుభవించిన సుధీర్ఘ కష్టాల ప్రయాణంలో ఆమె ఆయనకు తోడుగా వెంట నడిచింది.

దీర్ఘకాల అనారోగ్యానికి గురైన అయ్యూబ్ (అలైహి) కు సేవచేయడంలో తన భార్య రహీమా (అలైహి) అనేక కష్టాలను ఎదుర్కొంది. ఒక రోజు, తన భర్తకు ఆహారం ఇవ్వడానికి ఆమెకు ఎవ్వరూ దొరకలేదు. ఏం చేయాలో పాలుపోని స్థితిలో ఏదో ఒకటి చేయాలని భావించింది. అపుడు రహీమా (అలైహి) తన జుట్టును కత్తిరించి, ఒక ధనవంతుడి భార్యకు అమ్మివేసింది. అలా వచ్చిన డబ్బుతో రహీమా (అలైహి), తన భర్త అయ్యూబ్ (అలైహి) కు కావలసిన ఆహారాన్ని కొన్నది. ఆ తర్వాత ఆమె ఆ ఆహారాన్ని తన భర్త అయ్యూబ్ (అలైహి) కు ఇచ్చినప్పుడు....,

అయ్యూబ్ (అలైహి) : - రహీమా! ఈ ఆహారాన్ని కొనడానికి నీకు డబ్బులు ఎక్కడ నుంచి వచ్చాయి?

రహీమా (అలైహి) : - మీ ప్రశ్నలకు నా దగ్గర సమాధానాలు లేవు. నన్ను ఏమి అడగకుండా ముందు మీరు తినండి.

అయ్యూబ్ (అలైహి) : - ఏదేమైనా! డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసుకోకుండా తినే ప్రసక్తే లేదు.

రహీమా (అలైహి) : - మీకు ఆహారం కోసం, నా జుట్టును కత్తిరించి ఒక ధనవంతుని భార్యకు అమ్మివేశాను. అలా వచ్చిన ఆ డబ్బుతో మీకు కావలసిన ఆహారాన్ని కొన్నాను.

అపుడు అయ్యూబ్ (అలైహి) తన భార్య రహీమా (అలైహి) పై కోపం తెచ్చుకున్నాడు. ప్రవక్త అయ్యూబ్ (అలైహి) నియమాలలో ఇలా చేయడం నిషేధించబడింది. ఒక స్త్రీ తన జుట్టును కత్తిరించి అమ్మివేయడం పెద్ద పాపంగాను మరియు ఒక స్త్రీ తన జుట్టును కత్తిరించి, ఆ జుట్టును వాడుకొనేవారికి విక్రయించడం అయ్యూబ్ (అలైహి) నియమాలలో నిషేధించబడింది. ఆ జుట్టును విక్రయించిన వారు, దానిని కొన్న వారు  పాపాత్ములుగా ఆ నియమాలలో పరిగణింపబడింది.

ఈ విధంగా అనేక సంవత్సరాలుగా అయ్యూబ్ (అలైహి) అనుభవించిన సుధీర్ఘ కష్టాల ప్రయాణంలో ఆమె ఆయనకు తోడుగా వెంట నడిచింది.

*ఇబ్లీస్ నిరాశ : -* 

ఆయన శరీరానికి గురిచేసిన అనేక వ్యాధులను, అనేక బాధలను తట్టుకొని, తన విశ్వాసాన్ని మరియు సహనాన్ని, అయ్యూబ్ (అలైహి) కోల్పోకుండా స్థిరంగా ఉండడం చూసి ఇబ్లీస్ మరింత కలతకు గురయ్యాడు. ఇబ్లీస్ ఇక ఆ తర్వాత ఏం చేయాలో పాలుపోక, తన సహాయకులందరిని పిలిచి....,

ఇబ్లీస్ : - నా సహచరులారా! అయ్యూబ్ (అలైహి) పై మనం చేసిన ఈ కుట్రలు అన్ని విఫలయత్నమయ్యాయి. ఆయన సంపదను నాశనం చేశాము. ఆయన సంతానాన్ని దూరం చేశాము. చివరకు ఆయన శరీరాన్ని అనేక వ్యాధులకు గురిచేసి, బంధుమిత్రులను దూరం చేసి, చిత్రవధ అనుభవించేలా చేశాము. అయినా కూడా అయ్యూబ్ (అలైహి) కు అల్లాహ్ పై ఉన్న విశ్వాసాన్ని తగ్గించలేకపోయాము. ఇపుడు నేను మీ అందరిని సలహాలు కోరుతున్నాను. అయ్యూబ్ (అలైహి) విషయంలో తర్వాత ఏం చేయాలో మీరే చెప్పండి?

కానీ, ఇబ్లీస్ సలహాదారులు ఎవరూ కూడా ఇబ్లీస్ కు సలహా ఇవ్వలేదు. అపుడు ఇబ్లీస్ సలహాదారులు ఇబ్లీస్ నే ఎత్తిపొడుస్తూ....,

ఇబ్లీస్ సలహాదారులు : - ఇబ్లీస్! నీ జిత్తులమారితనం అయ్యూబ్ (అలైహి) ముందు విఫలమయ్యిందేంటి? మానవులకు పితామహుడైన ఆదమ్ (అలైహి) మరియు అతని ధర్మపత్ని హవ్వా (అలైహి) ను ప్రలోభపెట్టడంలో, ఆది దంపతులైన వారిద్దరినీ స్వర్గం నుంచి బయటకు గెంటివేసేలా చేయడంలో నువ్వు సఫలమయ్యావు కదా! మరి అయ్యూబ్ (అలైహి) ని ప్రలోభపెట్టే విషయంలో విఫలమయ్యావేంటి? (అని నిలదీశారు)

ఇక ఆ తర్వాత ఇబ్లీస్ తన సలహాదారుల్ని వదిలేసి, అయ్యూబ్ (అలైహి) పై తన నాలుగవ కుట్రను అమలుపరచేందుకు సిద్ధమయ్యాడు. ఇబ్లీస్ ఈ కుట్రలో భాగంగా అయ్యూబ్ (అలైహి) భార్య రహీమా (అలైహి) ను ప్రలోభపెట్టాలనుకున్నాడు.

తర్వాతి పథకం ప్రకారం ఇబ్లీస్ అయ్యూబ్ (అలైహి) భార్య రహీమా (అలైహి) వద్దకు వెళ్ళాడు. ఒక మనిషి రూపంలో ఆమె వద్దకు వెళ్లి, సానుభూతి చూపుతున్నట్లు నటిస్తూ అనేక రకాలుగా ప్రలోభాలకు గురిచేశాడు. చివరకు మనిషి రూపంలో వచ్చిన ఇబ్లీస్ మాయదారి మాటలను నమ్మి రహీమా (అలైహి) ప్రలోభానికి గురయ్యింది.

ఆ వెంటనే రహీమా (అలైహి), వారి కష్టాలను తలుచుకొని రోదిస్తూ తన భర్త అయ్యూబ్ (అలైహి) వద్దకు వెళ్లి, "ఈ కష్టాలు, బాధలు ఇంకా ఎంత కాలం? ఇప్పటికైనా మన కష్టాల నుంచి గట్టెక్కించమని అల్లాహ్ తో వేడుకోవచ్చు కదా?" అని గద్గ స్వరంతో నిలదీసింది.

"ఇబ్లీస్ ప్రలోభానికి లోనయ్యావు, నా నుంచి దూరం వెళ్లిపో" అని అయ్యూబ్ (అలైహి) తన భార్య రహీమా (అలైహి) ను దూరం చేసుకుంటారు.

అసలు ఇబ్లీస్, రహీమా (అలైహి) ను ఏ విధంగా, ఎన్ని రకాలుగా ప్రలోభానికి గురి చేశాడు?
అయ్యూబ్ (అలైహి), తన భార్య రహీమా (అలైహి) ను దూరం చేసుకోవడానికి గల బలమైన కారణాలు ఏవి?
రహీమా (అలైహి) తన భర్త అయ్యూబ్ (అలైహి) వద్దకు వెళ్లి ఏమని నిలదీసింది?

ఈ విషయాలలోని వివరణను Insha Allah రేపటి భాగము - 55 లో తెలుసుకుందాము.

Note : - ఈ msg లను ముందుకు పంపిస్తూ, మన ఇస్లాం చరిత్ర గురించి మన ముస్లిం సోదరులకు, సోదరీమణులకు తెలియజేస్తారని ఆశిస్తున్నాము.

☆☆ ®@£€€q  +97433572282 ☆☆

No comments:

Post a Comment