80

🛐 🕋 ☪ *బిస్మిల్లాహ్ హిర్రహ్మా నిర్రహీమ్* ☪ 🕋 🛐

🕋🤚🏻✋🏻🕌 *అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను* 🕌🤚🏻✋🏻🕋

◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆

       🕌☪🕋🛐 *ఇస్లాం చరిత్ర* 🛐🕋☪🕌

                                *భాగము - 80* 

◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆

*అగడ్త బాధితులు* 

*‘గుంట’మనుషులు నాశనమయ్యారు. ఆగుంటలో ఇంధనంతో బాగా మండించిన అగ్ని ఉంది. వారా ఆగ్నిగుండం చుట్టూకుర్చుని, తాము విశ్వాసులపట్ల ఎలా ప్రవర్తిస్తున్నది చూస్తున్నారు. వారా విశ్వాసులపై అంతకసి పెంచుకోవడానికి కారణం వారు సర్వశక్తిమంతుడు, స్వతఃప్రశంసనీయుడైన అల్లాహ్ ని విశ్వసించడం తప్ప మరేమీకాదు. (85:4-8)* 

రాజులు పెద్దపెద్ద గుంటలు త్రవ్వించి అగ్నిరాజేయించి, ఆ అగ్నిగుండాలలో తమ మతవిశ్వాసాలను స్వీకరించానివారిని విసిరి బాధించడం గురించి ప్రపంచంలో అనేక సంఘటనలు జరిగినట్లు తెలుస్తుంది. వాటిలో రెండిటిని ఇక్కడ ఉదాహరిస్తున్నాను :

    హజ్రత్ సుహైబ్ (రజి) ప్రకారం దైవప్రవక్త (స) ఇలా చెప్పారు : ఒక రాజు ఆస్థానంలో ఒక తాంత్రికుడు ఉండేవాడు. అతను వృద్ధాప్యంలో రాజుతో “నా దగ్గర ఈ తాంత్రికవిద్య నేర్చుకోడానికి ఒక అబ్బాయిని నియమించండి” అని అన్నాడు. రాజు ఒక పిల్లవాడ్ని నియమించాడు. ఆ అబ్బాయి విద్య నేర్చుకోవడానికి తామ్త్రికుని దగ్గరకు రోజూ వస్తూపోతూ దారిలో ఒక సాధువు (క్రైస్తవ మతగురువు)ను కూడా కలుసుకుంటు ఉండేవాడు. ఆ సాధువు మాటలతో ప్రభావితుడై అతని ధర్మం విశ్వసిస్తాడు. అంతేగాక, అతనిచ్చిన శిక్షణతో ఆ పిల్లవాడు మహిమాన్వితుడు కూడా అవుతాడు. దాంతో అతను అందులకు చూపు, కుష్టురోగులకు స్వస్థత కలిగించేవాడు.

ఈ బాలుడు తన మతం వదలి, ఏక దైవవిశ్వాసం అవలబించాడని రాజుకు తెలుస్తుంది. అప్పుడతను మొదట ఆ సాధువును చంపుతాడు. తర్వాత ఆ బాలుడ్ని చంపడానికి ప్రయత్నిస్తాడు. కాని ఎన్ని రకాలుగా ప్రయత్నించినా ఆ బాలుడు చావదు. చివరికి ఆ అబ్బాయే రాజుకు సలహా ఇస్తూ “నీవు నన్ను చంపాలనుకుంటే జనం ముందు ఈ బాలుడి ప్రభువు పేరుతో చంపుతున్నానని చెప్పి నాపైకి బాణంవదులు. దాంతో నెను చనిపోతాను” అన్నాడు. రాజు అలా చేయగానే బాలుడు చనిపోతాడు. కాని ఆ మహిమ చూసిన ప్రజలు “మీమీ పిల్లవాడి ప్రభువును విశ్వసిస్తున్నాం” అని చాటారు. రాజు మనుషులు రాజుతో “మీరు దేన్నుండి తప్పించుకోదలిచారో అదే జరిగిందిప్పుడు. ప్రజలు మీ మతాన్ని వదలి ఈపిల్లవాడి మతాన్ని విశ్వసించారు” అన్నారు. రాజు దాంతో ఉగ్రుడైపోయాడు. అతను రహదారి పక్కన (పెద్దపెద్ద) గుంటలు త్రవ్వించి, అందులో అగ్ని రాజేయించాడు. క్రొత్తధర్మాన్ని వదలడానికి అంగీకరించని ప్రతివ్యక్తినీ ఆ అగ్ని గుండాల్లోకి విసిరి వేయించేవాడు. (ముస్లిం, నసాయి, తిర్మిజి, తిబ్రాని)

రెండవ సంఘటనను చరిత్రకారులు ఇబ్నేహిషాం, ఇబ్నేఖుల్దూన్ ఇలా తెలిపారు : యమన్ రాజు తుబ్బాన్అసద్ ఓసారి యస్రిబ్(మదీనా) కు వెళ్ళి అక్కడి యూదులతో ప్రభావితుడయి యూదమతం స్వీకరిస్తాడు. ఆ తరువాత అతను తిరిగొచ్చి యమన్ లో ఆ అమతాన్ని పెద్దఎత్తున ప్రచారం చేయిన్నాడు. అతను మరణానంతరం అతని కొడుకు జూనువాస్ అధికారపీఠం ఎక్కుతాడు. జూనువాస్ అధికారంలోకి రాగానే హద్దుమీరిన మత దురహంకారంతో క్రైస్తవమత కేంద్రమైన నజ్రాన్ పై దాడిచేస్తాడు. అక్కడి క్రైస్తవులను యూదమతం స్వీకరించమని ఒత్తిడి చేస్తాడు. దానికి వారు నిరాకరించడంతో దుర్భర హింసాకాండ జరుపుతాడు.

దీనికోసం జూనువాస్ పెద్ద పెద్ద అగడ్తలు త్రవ్వించి, అగ్ని రాజేయించి, ఆ అగ్ని గుండాలలో విసిరివేయించాడు. స్త్రీలు, పురుషులు, పిల్లలు, అన్న విచక్షణ లేకుండా యూదమతం నిరాకరించిన ప్రతి వ్యక్తినీ అగ్నిగుండాలలో విసరి వేయించాడు. ఈ విధంగా అతను నలభైవేల మందిని చంపివేయించినట్లు తెలుస్తోంది. ఈ దుర్ఘటన క్రీ.శ. 523 అక్టోబర్లో జరిగింది. 
ఈ సామూహిక హత్యాకాండ నుండి జూసాల్భాన్ అనే వ్యక్తి ఎలాగో తప్పించుకొని రొమ్ నగరానికి పారిపోతాడు. రొమ్ చక్రవర్తికి ఈ హింసాకాండను గురించి వివరంగా తెలియజేస్తాడు. రొమ్ చక్రవర్తి ఒక నౌకాదళాన్ని అబిసీనియా రాజు దగ్గరకు పంపి, యమన్ పై దాడిచేయమని ఆజ్ఞాపిస్తాడు. అబిసీనియా నుండి అర్యాత్ నాయకత్వంలో తెబ్బయివేల సైన్యం బయలుదేరి యమన్ పై విరుచుకు పడుతుంది. ఈ యుద్ధంలో యమన్ సైన్యం చిత్తుగా ఓడిపోతుంది. జూనువాస్ హతమార్చబడతాడు. ఇలా యమన్ లో యూదులపాలన అంతమయి క్రైస్తవ పాలన ఏర్పడుతుంది.

●●●●●    సమాప్తం        ●●●●●

*ఇంతటితో, అంతిమ దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి చరిత్ర మినహా మిగిలిన ఇస్లాం చరిత్ర అంతా పూర్తి అయినది. Insha Allah రేపటి భాగము - 81 నుండి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి జీవిత చరిత్రను తెలుసుకుందాము.* 

☆☆ ®@£€€q  +97433572282 ☆☆ 
             (rafeeq)

☆☆  Salman    +919700067779 ☆☆

Note : - ఈ msg లను ముందుకు పంపిస్తూ, మన ఇస్లాం చరిత్ర గురించి మన ముస్లిం సోదరులకు, సోదరీమణులకు తెలియజేస్తారని ఆశిస్తున్నాము.

No comments:

Post a Comment