17

🕋🕋🕋🕋 బిస్మిల్లాహ్ హిర్రహ్మా నిర్రహీమ్ 🕋🕋🕋🕋

🛐🛐🛐🛐 అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన *అల్లాహ్* పేరుతో ప్రారంభిస్తున్నాను 🛐🛐🛐🛐

------------------------------------------------

       ☪☪☪☪ *ఇస్లాం చరిత్ర* ☪☪☪☪

    భాగము - 17          Date : 27/11/2017

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

*యూసుఫ్ (అలైహి) దగ్గరికి తన సోదరుల రాక* 

యూసుఫ్ (అలైహి) స్వదేశం కన్ఆన్ లో కూడా కరువు అలుముకుంది, ఈజిప్టు దేశంలో ధాన్యం నిలువలు అమ్ముతున్నారన్న వార్త విన్న యాఖూబ్ అలైహిస్సలామ్ (యూసుఫ్ తండ్రి), తన మిగితా కొడుకుల్ని ఈజిప్టు దేశానికి వెళ్ళి ధాన్యాన్ని కొనుక్కరమ్మని ఆదేశించారు.

యాఖూబ్ (అలైహి) తన కుమారులను ఈజిప్టు పంపించారు. బెన్యామీన్ ను తప్ప ఆయన కుమారులు అందరూ ధాన్యం కొనుక్కొని వెళ్ళడానికి ఈజిప్టు వచ్చారు. ధాన్యం కోసం సుదూర ప్రాంతం నుంచి వచ్చిన అనేక మంది సోదరుల గురించి యూసుఫ్ (అలైహి) విన్నారు. వారు ఈజిప్టు భాష కూడా మాట్లాడలేకపోతున్నారని ఆయన వద్దకు సమాచారం వచ్చింది. తమకు కావలసిన ధాన్యం కొనుగోలు కోసం వారు, ఆ రాజ్యపు సర్వాధికారి అయిన యూసుఫ్ (అలైహి) ముందు హాజరైయ్యారు. అపుడు యూసుఫ్ (అలైహి) వెంటనే తన సోదరులను గుర్తించారు. కాని వారు యూసుఫ్ (అలైహి) ని గుర్తించలేకపోయారు. అసలు వారు యూసుఫ్ (అలైహి) ని ఎలా గుర్తిస్తారు? వారి దృష్టిలో యూసుఫ్ (అలైహి) లేరు. ఏళ్ళ క్రితం చీకటి బావిలో విసరివేయబడ్డారు. 

యూసుఫ్ (అలైహి) వారిని సాదరంగా ఆహ్వానించారు. వారికి కావలసిన ధాన్యాన్ని తగిన ధరకు కొనుగోలు చేసి తిరుగుపయణమయ్యారు. తర్వాత యూసుఫ్ (అలైహి) వారిని సాగనంపుతూ ----

యూసుఫ్ (అలైహి) : - మీరు ఎక్కడి నుంచి వచ్చారు ?

సోదరులు : - తాము గౌరవనీయుడైన ప్రవక్త (యాఖూబ్ అలైహిస్సలామ్) సంతానమని, తాము పదకొండు మంది సోదరులం. మాలో అందరికన్నా చిన్నవాడు (బెన్యామీన్) ఇంటి వద్ద మా ముసలి తండ్రికి సేవచేయడానికి ఉండిపోయాడు."

తండ్రి గుర్తుకురాగానే యూసుఫ్ (అలైహి) కళ్ళు నీటితో నిండిపోయాయి. తన మనసు తండ్రి కోసం పరితపించింది.

యూసుఫ్ (అలైహి) : - మిమ్మల్ని నమ్మవచ్చా ?

సోదరులు : -(కాస్త అసహనంగా) మేము అబద్దాలు ఎందుకు చెబుతాము.

యూసుఫ్ (అలైహి) : - మీరు చెప్పేది నిజం అయితే ఇంటి దగ్గర వదిలిపెట్టిన మీ సోదరున్ని తీసుకరండి. నేను మీకు రెట్టింపు ధాన్యం ఇస్తాను. చూశారు కదా ! నేను ఎంత న్యాయంగా ధాన్యం కొలిచిచ్చానో, ఎలాంటి ఆథిత్యం ఇచ్చానో? మీరు కనుక మీ సోదరున్ని తీసుకరాకపోతే, నా దగ్గర నుంచి మీకు ఎలాంటి ధాన్యం లభించదు, అది కాక నా దరిదాపులకు కూడా మీరు రాలేరు.

సోదరులు : - సరే ! మా ప్రయత్నం మేము చేస్తాము, మా నాన్న గారు అతడిని పంపడానికి ఒప్పుకుంటే మేము తప్పకుండా తీసుకవస్తాము. (ఖురాన్ 12:59,60,61).

తర్వాత యూసుఫ్ (అలైహి) తన సేవకుల్ని పిలిచి సోదరుల గురించి "వారు ధాన్యం తీసుకొని మనకిచ్చిన ధనాన్ని, వారికి తెలియకుండా వారి సామగ్రి ఉన్న గోతం (సంచి) లొనే పెట్టేయండి." అని సూచించారు. యూసుఫ్ (అలైహి) ఇలా చేయడానికి కారణం, తమ సోదరులు ఇంటికి వెళ్ళి, ధాన్యం తీసుకునేటప్పుడు వెనక్కిచ్చేసిన ధనాన్ని గుర్తుపడతారని, దాంతో వాళ్ళు మళ్ళీ ఇక్కడికి (ఈజిప్టు) రావచ్చని యూసుఫ్ (అలైహి) ఆశించాడు. (ఖురాన్ 12:62).

ఇంటికి తిరిగి వెళ్ళిన ఆ సోదరులు తమ తండ్రి యాఖూబ్ (అలైహి) తో ఈజిప్టు లో జరిగింది యావత్తు వివరించారు. "నాన్న! ఇక ముందు వారు మనకు ధాన్యం ఇవ్వమని చెప్పేశారు. బెన్యామీన్ ను తీసుకుని ఈజిప్టు వెలితేనే ధాన్యం ఇస్తారట!, అందుచేత మీరు బెన్యామీన్ ను మా వెంట పంపితే మేము ధాన్యం తీసుకవస్తాం, బెన్యామీన్ ను భద్రంగా చూసుకుంటాము" అని తమ తండ్రి తో చెప్పారు. యాఖూబ్ (అలైహి) దుఃఖం తో "నేను మీ వెంట బెన్యామీన్ ను పంపేది లేదు,  మిమ్మల్ని నమ్మి యూసుఫ్ (అలైహి) ను మీ వెంట పంపితే మీరు ఏం చేశారు" అని దుఃఖించారు. "అల్లాహ్ మాత్రమే మంచి రక్షకుడు, ఆయన అందరికన్నా ఎంతో కరుణామయుడు" అని కూడా అన్నారు. (ఖురాన్ 12:63,64).

ఆ తరువాత వారు తమ సామగ్రి గోతాలు (సంచులు) విప్పిచూశారు. అందులో ఉన్న ధనం చూసి, తమ ధనాన్ని తిరిగి ఇచ్చివేసినట్లు కనుగొన్నారు. దాన్ని చూడగానే వారు ఎంతో సంబరపడుతూ "నాన్న! ఇదిగో చూడండి! మా మూల ధన౦ కూడా మాకు తిరిగిచ్చేశారు. ఇంతకంటే మనకేం రావాలి! ఈ సారి మేము మళ్ళీపోయి మన కుటుంబానికి సరిపడ ధాన్యం తెస్తాం. మా తమ్ముడిని కూడా జాగ్రత్తగా చూసుకుంటాం. ఈజిప్టు వాసులు బెన్యామీన్ ను ఎలాంటి హాని కలిగించడడానికి ఇదే సాక్ష్యం. బెన్యామీన్ ను తీసుకెళ్లడం వల్ల లాభమే ఉంటుంది. అదనంగా మేము మరొక ఒ౦టె మోసే అంత ధాన్యాన్ని కూడా తెచ్చుకోగలం. అదనంగా అంత ధాన్యం మనకు సులభంగా లభిస్తుంది" అని అన్నారు.(ఖురాన్ 12: 65).

“మీరు తప్పకుండా సురక్షితంగా నా దగ్గరకు తిరిగి తీసుకొస్తామని అల్లాహ్ మీద ప్రమాణం చేయనంతవరకు నేను బెన్యామీన్ ను మీ వెంట పంపను. దురదృష్టవశాత్తు మీరు ఎక్కడైనా చిక్కుకుంటే, అది వేరే విషయం" అన్నాడు యాఖూబ్ (అలైహి). దాంతో వారంతా అల్లాహ్ మీద ప్రమాణం చేసి వాగ్దానం చేశారు. అపుడు యాఖూబ్ (అలైహి) "గుర్తుంచుకోండి! మన౦ చెప్పుకున్న ఈ విషయానికి అల్లాహ్ సాక్షి" అన్నాడు. (ఖురాన్-12:66).

“ఆ తర్వాత యాఖూబ్ (అలైహి) ఇలా ఉపదేశించాడు "బిడ్డలారా! ఈజిప్టు రాజధానిలో ఒకద్వారం గుండా కాకుండా విభిన్న ద్వారాల గుండా ప్రవేశించండి. అయితే విధి నిర్ణయం ఎలా ఉందోగాని దాని నుంచి నేను మిమ్మల్ని కాపాడలేను. యావత్ విశ్వం లో అల్లాహ్ ఆజ్ఞ తప్ప మరెవరి ఆజ్ఞా పనిచేయదు. అల్లాహ్ నే నేను నమ్ముకున్నాను. నమ్ముకోవలసిన వారు అల్లాహ్ నే నమ్ముకోవాలి.” (ఖురాన్ 12:67).

తండ్రి ఉపదేశం ప్రకారమే వారు ఈజిప్టు వెళ్ళి విభిన్న ద్వారాల గుండా నగరంలోకి ప్రవేశించారు. అయితే ముందు జాగ్రత్త కోసం అతను సూచించిన యుక్తి విధినిర్ణయం ముందు ఎందుకూ పనికి రాకుండా పోయింది. కాకపోతే యాఖూబ్ (అలైహి) తన హృదయం లో మెదలుతున్న సంక్షోభం దూరం చేసుకోవడానికి తన వంతు ప్రయత్న౦ చేశాడు. ఏమైనా అతను గొప్ప జ్ఞానసంపన్నుడు. మేము అతనికి విశేషజ్ఞానం ప్రసాదించాం. కాని చాలా మంది ఈ యదార్థం గ్రహించరు. (ఖురాన్ 12:68).

*సోదరుల పునరాగమనం* 

యూసుఫ్ (అలైహి) వారిని సాధరంగా ఆహ్వానించారు. తన స్వంత సోదరుడు బెన్యామీన్ ను గుండెలకు హత్తుకోవాలన్న కోరిక ను యూసుఫ్(అలైహి) అతి కష్టం మీద అణచుకున్నారు. వారందరికీ యూసుఫ్ (అలైహి) ఆ రాత్రి ఒక వి౦దు ఇచ్చారు. భోజనాల వద్ద ఆ సోదరులందరూ జంటలు జంటలుగా కూర్చున్నారు. యూసుఫ్‌ (అలైహి) తాను అమితంగా ప్రేమించే సోదరుడు బెన్యామీన్ ప్రక్కన కూర్చునే విధంగా ఏర్పాట్లు చేయించారు. బెన్యామీన్ ఈ ఏర్పాటు చూసి దుఃఖిస్తూ తన సోదరుడు యూసుఫ్ (అలైహి) ఉన్నట్లయితే తన ప్రక్కన కూర్చోని ఉండేవాడిని చెప్పారు.

*బెన్యామీన్ తో "నేనే నీ తప్పిపోయిన సోదరుణ్ణి" అని చెప్పిన యూసుఫ్ (అలైహి)* 

భోజనాలు ముగిశాక ఆ రాత్రి యూసుఫ్ (అలైహి) బెన్యామీన్ ను ఒంటరిగా కలుసుకున్నారు.

యూసుఫ్ (అలైహి) : - బెన్యామీన్! నన్ను నీ సొదరునిగా పరిగణిస్తావా?

బెన్యామీన్ : -మీరు చాలా మంచి అధికారి. కాని నా సోదరుడు యూసుఫ్ (అలైహి) స్తానం మీరు పూరించలేరు.

యూసుఫ్ (అలైహి) (కన్నీళ్ళతో) : - బెన్యామీన్ నేనే తప్పిపోయిన నీ సోదరుడిని, అనేక సంవత్సరాల యెడబాటు, తర్వాత విధి మనల్ని మళ్ళీ కలిపింది, ఇదంతా అల్లాహ్ అనుగ్రహం.

అయితే ప్రస్తుతానికి ఈ విషయాన్ని రహస్యం గా తామిద్దరి మధ్యనే ఉండనీయాలని చెప్పారు. సోదరులిరువురు సంతోషంతో సంబరాలతో ఒకరిని ఒకరు కౌగిలించుకున్నారు. "ఇపుడు నీవు మన సోదరుల చేష్టల గురించి బాధపడనవసరం లేదు" అని ధైర్యం చెప్పారు. (ఖురాన్ 12:69).

*ధాన్యం కొనుగోలు చేసి తమ స్వదేశానికి తిరుగుపయణమైన బృందం* 

వచ్చిన పని పూర్తయ్యాక, ఆ సోదరులు తమ ఇండ్లకు బయలుదేరారు. ఆ తర్వాత యూసుఫ్ (అలైహి) వారి కోసం ధాన్యం, తదితర సామగ్రి ఏర్పాట్లు చేయించాడు. ఆ సమయంలో ఒకతను రాజు గారి బంగారుపాత్రను యూసుఫ్ (అలైహి) తమ్ముడు బెన్యామీన్ సామాను ఉన్న సంచిలోకి జారవిడిచాడు. తర్వాత అందరూ తమ ఒంటెలపై, గుర్రాలపై ఎక్కి బయలుదేరేందుకు సిద్ధం అయ్యారు. సరిగ్గా ఆ సమయంలో అరిచేవాడొకడు రాజభటుడు హఠాత్తుగా వచ్చి "బాటసారులారా! ఆగండి మీరు దొంగలు" అని అరిచాడు. వారు వెనక్కి తిరిగి "మీ వస్తువు ఏదైనా పోయిందా?" అని అడిగారు. "రాజు గారి బంగారుపాత్ర ఒకటి మాకు కనిపించడం లేదు" అన్నారు రాజోద్యోగులు. "ఆ బంగారుపాత్రను తెచ్చిచ్చేవానికి ఒక ఒంటె మోసే అంత బహుమానం ఇస్తాం, అలా ఇప్పించే బాధ్యత నాది" అని అన్నాడు ప్రధాన రాజోద్యోగి. (ఖురాన్ 12:70,71,72).

“దైవసాక్షి! మేము ఈ దేశంలో అలజడి సృష్టించడానికి రాలేదు. మేము దొంగతనాలు చేసే వాళ్ళంకాము. ఈ సంగతి మీకు కూడా బాగాతెలుసు" అన్నారు వారు అన్నదమ్ములు. "సరే, మీ మాట అబద్ధమని తేలితే దొంగకు శిక్షేమిటి?" అని రాజోద్యోగులు అడిగారు. "పోయిన వస్తువు ఎవరి సామగ్రిలో దొరుకుతుందో అతడ్ని శిక్షగా మీదగ్గర బానిసగా పెట్టుకోండి. అలాంటి దుర్మార్గులకు మా రాజ్యం లో విధించే శిక్ష ఇదే" అన్నారు వారు. (ఖురాన్ 12:73-75).

అపుడు యూసుఫ్ (అలైహి) తన తమ్ముడి సామగ్రి కాకుండా మిగిలిన వారి సామగ్రి ని తనిఖీ చేయించాడు. కానీ వాటిలో ఆ బంగారు పాత్ర దొరకలేదు. తర్వాత బెన్యామీన్ సంచుల్లో ఉన్న సామగ్రి ని కిందకి బోర్లించడం జరిగింది. అందులో పోయిన రాజుగారి బంగారు పాత్ర బయటపడింది. దీనిని చూసిన అందరూ ఆశ్చర్యపోయారు.

తరువాత జరిగిన విషయమై Insha Allah రేపటి భాగము - 18 లో తెలుసుకుందాము.

*ముస్లిం సోదరులకు ఒక చిన్న విజ్ఞప్తి  :-* 

ప్రియమైన ముస్లిం సోదరులారా!  ఇప్పటికి కూడా మనలో చాలా మంది ముస్లిం సోదరులకు అసలు ఇస్లాం అంటే ఏంటి ? , దీన్ అంటే ఏంటి ? , మన నబీ ఎవరు ? , అసలు మనం ఎందుకోసం పుట్టాము ?  ------ ఇలాంటి అనేకమైన విషయాలు తెలియదు .మనకు ఈ జీవితాన్ని ఇచ్చినది అల్లాహ్ , అలాంటి అల్లాహ్ కోసం 24 గంటల్లో ఒక్క 5 నిమిషాల సమయం కేటాయించి ఈ msg ను చదవలేమా , కేవలం 5 నిమిషాలు కేటాయించి ఇస్లాం చరిత్ర తెలుసుకుంటారని ఆశిస్తున్నాము. నాకు ఈ msg లు ఒక ముస్లిం సోదరుడు పంపించాడు , నేను మీకు పంపిస్తున్నాను ; అలాగే మీరు కూడా ఈ msg లను ముందుకు పంపించండి , ఇదేదో 10 మందికి send చేస్తే మంచి జరుగుతుంది , send చేయకపోతే చేడు జరుగుతుంది అనుకునే msg లు కావు . కాబట్టి మన ముస్లిం లలో దీన్ ను నింపవల్సిన బాధ్యత అల్లాహ్ మన పై ఉంచాడు అని తెలుసుకుంటూ , ఇస్లాం ఉనికి ని చాటి చెప్తారని ఆశిస్తున్నాము .

No comments:

Post a Comment