33

🤚🏻✋🏻🤚🏻✋🏻 *బిస్మిల్లాహ్ హిర్రహ్మా నిర్రహీమ్* 🤚🏻✋🏻🤚🏻✋🏻

🛐🕋🛐🕋 *అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను* ☪🕋☪🕋

°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°

       🕌🕋🕌🕋 *ఇస్లాం చరిత్ర* 🕋🕌🕋🕌

                               *భాగము - 33* 

____________________________________________

*బహుదైవరాధకుల నుండి యూదులకు సంక్రమించిన గోభక్తి జాడ్యం ఓ పట్టాన వారిని వదల్లేదు. అందువల్ల వారి చేతులతోనే అల్లాహ్ ఒక గోవుని వధింపజేయాలని భావించారు.* 

బనీఇస్రాయీల్ ప్రజల్లో ఒక పుణ్యాత్ముడు నివసించేవాడు. అతను చాలా బీదవాడు. అయినప్పటికీ తన సంపాదన విషయంలో చాలా జాగ్రత్తగా ఉండేవాడు. నీతిగా, నిజాయితీగా సంపాదించేవాడు. అతను చేసిన ప్రతి పని అల్లాహ్ ప్రసన్నత పొందడానికి చేశాడు. ఎన్నడూ స్వార్థం కోసం, తన అభీష్టాల ప్రకారం నడుచుకోలేదు.

ఆ వ్యక్తి చనిపోతున్నపుడు అతని చివరి పలుకులు, "అల్లాహ్! నా భార్యను, పసివాడైనా నా కుమారుడిని, నా ఆస్తి అయిన ఆవుదూడని నీ సంరక్షణలో వదులుతున్నాను." ఈ మాటలు పలికిన ఆ వ్యక్తి విచిత్రంగా తన భార్యతో ,"ఈ ఆవుదూడను తీసుకువెళ్ళి అడవిలో వదిలేసి రమ్మన్నాడు."

ఇలా అతను చెప్పడానికి కారణం, ఇస్రాయీల్ ప్రజల నడవడిక గురించి తెలిసిన ఆ వ్యక్తి వారిని నమ్మదలచుకోలేదు. వారు స్వార్థం, అత్యాశ నిండిన జనం అన్న విషయం అతనికి బాగా తెలుసు.

ఆ వెంటనే ఆ వ్యక్తి చనిపోయాడు. తన భర్త ఆజ్ఞ ప్రకారం ఆ ఆవుదూడను అడవిలో వదిలేసి వచ్చింది ఆ భార్య.

ఆ తర్వాత కొన్ని సంవత్సరాలు గడిచిపోయాయి. ఆ పిల్లవాడు పెరిగి పెద్దయ్యాడు. అపుడు అతని తల్లి తన కుమారుడితో,

తల్లి : - బాబు! మీ నాన్నగారు చనిపోయేటపుడు ఒక ఆవుదూడను అడవిలో వదిలి వేయమని చెప్పారు. అల్లాహ్ పై భారమేసి ఆ ఆవును అడవిలో వదిలేశాను. ఇపుడు ఆ ఆవుదూడ పుష్టిగా ఎదిగి ఉంటుంది.

కుమారుడు (కాస్త ఆశ్చర్యంగా) : - ఆ ఆవుదూడ ఇపుడు ఎక్కడ ఉంది?

తల్లి : - మీ నాన్నగారి అడుగుజాడల్లో నడవడానికి ప్రయత్నించు. అల్లాహ్ ను విశ్వసిస్తున్నాని చెప్పు. అల్లాహ్ మీద భారం వేసి అడవిలోకి వెళ్లి వెతుకు.

ఆ కుమారుడు ఒక తాడు ని తీసుకొని అడవిలోకి బయలుదేరాడు. అడవికి చేరుకున్న తర్వాత అల్లాహ్ సన్నిధిలో సాష్టాంగపడి, "అల్లాహ్! ఇబ్రాహీమ్, యాఖూబ్ ల ప్రభువా, నా తండ్రి అప్పగించిన దానిని నాకు తిరిగి అప్పగించు." అని ప్రార్థించాడు. ఆ వెంటనే ఒక ఆవు తన వైపు వస్తున్నట్టు అతనికి కనపడింది. ఆ ఆవు అతని వద్దకు వచ్చి మచ్చికైన ఆవు మాదిరిగా నిలబడింది. ఆ ఆవు మెడ కు ఒక తాడు కట్టి అతను తను ఇంటికి తీసుకవచ్చాడు. ఆ ఆవు కూడా ఆ కుర్రాడిని తప్ప మరెవ్వరిని దగ్గరకు రానిచ్చేది కాదు.

ఆ కుర్రవాడు కూడా తన తండ్రిలాగా పుణ్యాత్ముడు, సన్మార్గాన్ని అవలంబించేవాడు. కట్టెలు కొట్టి, వాటిని అమ్మి జీవనాధారం పొందేవాడు. తను సంపాదించే సొమ్ములో మూడు సమాన భాగాలుగా చేసేవాడు. ఒక భాగం తన తల్లికి ఇచ్చేవాడు. మరొక భాగం తన సొంతం కోసం ఉపయోగించుకునే వాడు. మిగిలిన భాగం దానధర్మాలకు ఉపయోగించేవాడు. అలాగే రాత్రి సమయాన్ని కూడా మూడు భాగాలుగా విభజించుకునేవాడు. రాత్రి ప్రథమ భాగంలో తన తల్లికి సహాయపడటానికి, సేవ చేయడానికి ఉపయోగించుకునేవాడు. తర్వాతి భాగంలో అల్లాహ్ ఆరాధనలో గడిపేవాడు. మిగిలిన భాగాన్ని నిద్రకు కేటాయించేవాడు.

*ఇలాంటి కాలంలో, యూదుల చేతులతోనే ఒక ఆవుని వధింపజేయాలని అల్లాహ్ భావించారు. ఆ సందర్భం ఇపుడు వచ్చింది.* 

యూదులలో వారసులులేని ఒక ధనిక సంపన్నుడు ఉండేవాడు. అతని సోదరుని కుమారుడు ఆ సంపన్నుడి ఆస్తిని, ధనాన్ని కాజేయలని ఉద్దేశ్యంతో, కొంత మంది బంధువుల సహాయంతో ఆ సంపన్నుడిని చంపేస్తారు. అలా చంపేసిన తర్వాత ఆ శవాన్ని ఇతరుల ఇంటి ముందు పడవేస్తారు. తెల్లవారిన తర్వాత ఆ శవాన్ని చూసిన యూదులు "ఈ హత్య మీరు చేశారని కాదు మీరు చేశారని పొట్లాడుకుంటూ " పరస్పరం ఆరోపణలు చేసుకోసాగారు.

చివరకు ఈ వ్యవహారం మూసా (అలైహి) దగ్గరకు వచ్చింది. మరణించిన ఆ సంపన్నుని బందువుల్లో ఈ హత్యతో ప్రమేయం లేనివారు మూసా (అలైహి) దగ్గరకు వెళ్ళారు. హంతకులను కనుగొనడానికి సహాయపడమని కోరారు. మూసా (అలైహి) వారికి సలహా ఇస్తూ....

మూసా (అలైహి) : - ఒక ఆవును కోసి దాని నాలుకను ఆ శవం పై ఉంచితే, అతను బ్రతికి తనను హత్య చేసిన వారెవరో చెబుతాడు.

మూసా (అలైహి) పరిహాసమాడుతున్నారని యూదులు ఆయనను నిందించారు.

మూసా (అలైహి) : - అల్లాహ్ శరణు! నేను అవివేకంగా ఎప్పటికీ వ్యవహరించను.

యూదులు : - సరే వదిలేయండి. అయితే ఇప్పుడు ఎలాంటి ఆవును కోయాలి.

మూసా (అలైహి) : - మరీ లేగదూడ కారాదు, అలా అని పూర్తిగా ఎదిగిన ఆవు కుడా కారాదు. మధ్యస్తంగా ఉన్న దానిని కోయాలి.

కానీ యూదులు, మూసా (అలైహి) సలహాను పాటించే బదులు, ఆవు ఎలా ఉండాలి అని మరిన్ని వివరాలు అడగటం ప్రారంభించారు.

యూదులు : - ఆ ఆవు రంగు ఎలా ఉండాలి?

మూసా (అలైహి) : - పసుపు రంగు కలిగినది అయి ఉండాలి.

యూదులు : - ఆ ఆవు ఎలా ఉండాలో మరిన్ని వివరాలు చెప్పండి?

మూసా (అలైహి) : - ఆ ఆవు దుక్కి దున్నినది కారాదు, కాడి లాగినది కారాదు. నీళ్లు తోడటానికి ఉపయోగించినది కారాదు. ఎలాంటి మచ్చలు ఉండరాదు.

యూదులు ఈ లక్షణాలుగల ఆవు కోసం వేతకడానికి బయలుదేరారు. చాలా ప్రాంతాల్లో ఇలాంటి ఆవు కోసం వెతికారు, కానీ ఎక్కడ దొరకలేదు.

ఆ అనాధ యువకుడు, తన తండ్రి చనిపోతూ ఆవుదూడను అడవిలో వదిలేయమని చెప్పి, కొన్ని రోజుల తర్వాత పుష్టిగా ఎదిగిన ఆవును అడవి నుంచి ఆ యువకుడు తన ఇంటికి తెచ్చుకొని జాగ్రత్తగా చూసుకోసాగాడు.

యూదులు తమకు కావలసిన ఆవు కోసం వెతుకుతూ ఆ యువకుడి దగ్గరకు చేరుకున్నారు. తమకు కావలసిన లక్షణాలు అన్ని ఆ ఆవులో ఉన్నాయా, లేవా అని ఆరాతీశారు.

ఆవులో యూదులకు కావలసిన మొదటి లక్షణం, లేగదూడ కాకూడదు, ఎదిగిన ఆవు కాకూడదు, మధ్యస్తంగా ఉండాలి. ఈ లక్షణం ఆ యువకుడి దగ్గర ఉన్న ఆవులో ఉంది.

రెండవ లక్షణం, పసుపు రంగులో ఉండాలి. యువకుని దగ్గర ఉన్న ఆవు లేత పసుపు రంగులో ఉంది.

మూడవ లక్షణం, ఆ ఆవు దుక్కి దున్నినది కారాదు, కాడి లాగినది కారాదు, నీల్లు తోడటానికి ఉపయోగించినది కారాదు. యువకుని దగ్గర ఉన్న ఆవుని దూడగా ఉన్న సమయంలో అడవిలో వదిలేశారు గనుక దుక్కి దున్నలేదు, కాడి లాగలేదు, నీళ్లు తోడటానికి ఉపయోగించలేదు.

చివరికి యూదులకు కావలసిన ఆవు, ఆ యువకుని దగ్గర దొరికింది. "ఎలాగైనా ఈ ఆవుని మనతో తీసుకవేళ్ళాలి" అని అనుకున్నారు.

యూదులు : - బాబు! నీ దగ్గర ఉన్న ఈ ఆవు ని ఎంతకు అమ్ముతావు?

యువకుడు : - నేను నా తల్లి కి అడిగి చెబుతాను.

ఆ తర్వాత యూదులు అందరూ కలుసుకొని, ఆ యువకుని ఇంటికి వెళ్లి తన తల్లి తో మాట్లాడారు.

యూదులు : - మాతా! మీ దగ్గర ఉన్న ఆవు మాకు నచ్చింది. మేము దాన్ని కొనుక్కోవాలని అనుకుంటున్నాము. ఆ ఆవుకు బదులుగా మూడు బంగారు నాణేలు ఇస్తాము. ఆ ఆవుని మాకు అమ్ముతారా?

కానీ ఆ తల్లి ఈ ప్రతిపాదనను తిరస్కరించింది. యూదులు ఆ ఆవు ధరను పెంచుతూ పోయారు. అయినా కూడా ఆ తల్లి అంగీకరించలేదు.

యూదులు : - బాబు! నీ తల్లిని నువ్వైనా ఒప్పించు.

యువకుడు : - నా తల్లి ఒప్పుకోకపోతే ఆవుని అమ్మేది లేదు. మీరు ఆవు ఎత్తు బంగారం ఇచ్చినా అమ్మను.

ఈ మాటలు విన్న ఆ తల్లి చిరునవ్వుతో : - అంత సొమ్ము ఇవ్వండి. ఆవు ఎత్తు అంత బంగారం ఇచ్చి ఆవుని తీసుకెళ్లండి.

చివరకు యూదులకు కావాల్సిన లక్షణాలు అన్ని ఆవులో ఉన్నాయి, అలాంటి ఆవు ఉన్నది అదొక్కటే కాబట్టి గత్యంతరం లేక ఆవు ఎత్తు అంత బంగారం ఇచ్చి ఆవును కొనుక్కెళ్లారు.

ఆ తర్వాత మూసా (అలైహి) చెప్పిన పరీక్షలు యూదులు నిర్వహించారు. ఆ హత్య ఎవరు చేశారో తెలిసిపోయింది, వారిని శిక్షించడం కూడా జరిగిపోయింది.

ఈ విధంగా అల్లాహ్, గోభక్తి యూదులకు ఎక్కువైంది కాబట్టి వారి చేతనే ఒక ఆవుని వధింపజేశారు.

అయితే అంతటి గొప్ప మహిమ చూసిన ఇస్రాయీల్ ప్రజల్లో ఎలాంటి మార్పు రాలేదు. పైగా వారి హృదయాలు పాషాణాల్లా కఠినమైపోయాయి. కాదు అంతకంటే కఠినమైపోయాయి.

మూసా (అలైహి), తన జాతి ప్రజలను తీసుకొని తూర్ కొండ దగ్గరకు వెళ్ళినపుడు, బనీఇస్రాయీల్ ప్రజల చేత ప్రమాణం చేయించారు. "అల్లాహ్ మీకు ఇచ్చిన తౌరాత్ గ్రంథాన్ని ధృడంగా పట్టుకోండి. అందులోని ఆజ్ఞల్ని, హితవుల్ని గుర్తుంచుకోండి. అలా చేస్తే మీయు భయభక్తుల జీవితం గడుపుతారు. దీన్ని మీరు అంగీకరించారు. ఆ తర్వాత మీరు ఆ ప్రమాణాన్ని ఉల్లంఘించారు. దాన్ని కూడా అల్లాహ్ ఉపేక్షించారు. మీ పై అల్లాహ్ కరుణకటాక్షాలే లేనట్లయితే మీరు ఎపుడో నాశనమైపోయేవారు."

ఇంకా మూసా (అలైహి), తన జాతి ప్రజలకు ఆదేశిస్తూ....

"ప్రజలారా! మీరు కాస్త సముద్రతీరం వద్ద ఉన్న ఆ పట్టణం గురించి తెలుసుకోండి. ఆ పట్టణ ప్రజలు శనివార నియమాన్ని ఉల్లంఘిస్తుండేవారు.

[శనివార నియమంటే, శనివారం నాడు ఎలాంటి ప్రాపంచిక పనులు చేపట్టకుండా, చివరకి వంటపని కూడా చేయకుండా రోజంతా సెలవు తీసుకుని అల్లాహ్ ఆరాధనలో గడపాలని ఆ పట్టణ ప్రజలకు అల్లాహ్ ఒక నియమం విధించారు. ఈ నియమాన్ని ఉల్లంఘిస్తే అల్లాహ్ ఆగ్రహానికి గురవుతారని హెచ్చరించారు.]

శనివార నియమాన్ని ఆ ప్రజలు ఎందుకు ఉల్లంఘిస్తుండేవారంటే, శనివారం రోజే సముద్రంలోని చేపలు సముద్ర ఉపరితలం పైకి వచ్చి వారి ముందుకు వస్తుండేవి. ఆ చేపలు శనివారం రోజు తప్ప మరే దినాలలో కూడా పైకి వచ్చేవి కావు. అందుచేత ఆ ప్రజలు ఒక రోజు ముందుగా సముద్రతీరాన గుంతలు తవ్వి నీటితో నింపేవారు. శనివారం నాడు ఆ గుంటల్లోకి చేపలు వచ్చాక వాటిని పట్టుకునేవారు. ఈ విధంగా వారు శనివార నియమాన్ని ఉల్లంఘించి అల్లాహ్ ఆగ్రహానికి గురయ్యారు. ఆ ప్రజల దుశ్చర్యలను బట్టబయలు చేయడానికే అల్లాహ్ వారికి అలా పరీక్ష పెట్టారు. తర్వాత ఆ పట్టణ ప్రజల్ని "కోతులుగా మారి తుచ్ఛమైన బ్రతుకు బ్రతకండి." అని అల్లాహ్ శపించారు.

Insha Allah రేపటి భాగము - 34 లో బనీఇస్రాయీల్ ప్రజలు అల్లాహ్ యొక్క ఆగ్రహానికి ఎలా గురయ్యారు అని తెలుసుకుందాము.

Note : - ఈ msg లను ముందుకు పంపిస్తూ, మన ఇస్లాం చరిత్రను మన ముస్లిం సోదరులకు తెలియజేస్తారని ఆశిస్తున్నాము.

☆☆ ®@£€€q  +97433572282  ☆☆

No comments:

Post a Comment