8

🕋🕋🕋🕋 బిస్మిల్లాహ్ హిర్రహ్మా నిర్రహీమ్ 🕋🕋🕋🕋

🛐🛐🛐🛐 అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన *అల్లాహ్* పేరుతో ప్రారంభిస్తున్నాను 🛐🛐🛐🛐

------------------------------------------------

       ☪☪☪☪ *ఇస్లాం చరిత్ర* ☪☪☪☪

    భాగము - 8          Date : 18/11/2017

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

*లూత్ అలైహిస్సలామ్* : -

“మేము లూత్ ని ప్రవక్తగా నియమించి అతని జాతి (లూత్ జాతి) వద్దకు పంపాము. అతను తన జాతిప్రజలతో అన్న మాటలు గుర్తుకు తెచ్చుకొని, "మీరెలాంటి అశ్లీలచేష్టలకు పాల్పడుతున్నారు! మీకు పూర్వం ప్రపంచంలో ఎవరూ చేయనటువంటే సిగ్గుమాలిన పని చేస్తున్నారే! మీరు కోర్కెల్ని తీర్చుకోవడానికి స్త్రీ లను వదలి పురుషుల వెంటపడ్డారా ? మీరు అసలు హద్దు మీరిపోయారు." ( ఖురాన్ 7:80,81).

"దారిదోపిడీలు కూడా చేస్తున్నారు. నిండుసభల్లో సిగ్గువిడిచి ఈ పాడుపని చేస్తున్నారే !" అని అన్నాడు లూత్ అలైహిస్సలామ్. దానికి తన జాతి వారు "నీవు చెప్పేది నిజమైతే మాపైకి దైవశిక్ష తీసుకురా" అన్నారు. అంతకు మించి వారి దగ్గర ఎలాంటి సమాధానం లేదు.” ( ఖురాన్ 29:29 ).

“లూత్‌ ! నీవీ మాటలు మానుకోకపోతే నిన్ను మా పట్నం ను౦చి వెళ్ళగొడతాం" అంటూ వారు బెదిరించారు. దానికి లూత్‌ "మీచేష్టలు నాకు రోత పుట్టిస్తున్నాయి...ప్రభూ ! నన్ను , నా కుటుంబసభ్యుల్ని వీరి దుర్నడత, దుర్మార్గాల బారి నుండి కాపాడు" అన్నాడు. (ఖురాన్-26:167-169 ).

“అతని జాతిప్రజలు గెంటివేయండి వీరిని మన ఊళ్ళో నుంచి. పేద్ద పవిత్రులట !" అన్నారు, అంతకుమించి ఎలాంటి జవాబు ఇవ్వలేకపోయారు.” ( ఖురాన్-7:82 ).

*దైవ దూతల రాక* : -

అపుడు అల్లాహ్ ఆజ్ఞ ప్రకారం దైవ దూతలు లూత్ అలైహిస్సలామ్ దగ్గరకు పంపబడ్డారు. “మా (అల్లాహ్) దూతలు లూత్‌ దగ్గరికి చేరుకున్నారు. ఆ దైవ దూతల ను చూసి లూత్ చాలా ఆందోళన పడసాగాడు. అతని హృదయం కుచించుకపోయింది. "ఈరోజు పెద్ద ఆపదే వచ్చి పడింది." అన్నాడతను. ( ఖురాన్-11:77 ).

“కాదు, మేము వీరు అనుమానిస్తున్న విషయాన్ని తీసుకొచ్చాము. అపుడు దైవ దూతలు, లూత్ అలైహిస్సలామ్ తో "మేము నీతో నిజమే చెబుతున్నాము. మేము నీ దగ్గరకు సత్యం తీసుకొచ్చాము. కనుక నీవు ఇప్పుడు కొంత రాత్రి గడిచిన తరువాత నీ కుటుంబసభ్యుల్ని తీసుకొని ఇక్కడి నుంచి బయలుదేరి వేరేచోటికి వెళ్ళు. నీవు వారి వెనకాల నడువు జాగ్రత్త! మీలో ఏ ఒక్కరూ వెనక్కి తిరిగి చూడకూడదు. మిమ్మల్ని ఎటు వెళ్ళమని ఆజ్ఞాపిస్తే అటువైపే నేరుగా నడవాలి" అన్నారు దైవదూతలు. ఇలా తెల్లవారేటప్పటికి ఆ పట్టణం లో ఉ౦డే వారిని సమూలం గా తుడిచిపెడ్తామన్న మా నిర్ణయాన్ని అతనికి ముందే తెలియజేశాము.” (ఖురాన్15:63-66 ).

“అంతలో పట్టణవాసులు సంతోషం లో గంతులేస్తూ వచ్చారు. లూత్‌ కంగారు పడుతూ "సోదరులారా ! వీరు (దైవదూతలు) నా అతిథులు. నన్ను నవ్వులపాలు చేయకండి, అల్లాహ్ కి భయపడండి, నా పరువు మంట కలపకండి" అని బ్రతిమాలాడు. ( ఖురాన్ 15: 67-69 ).

వారు మొదటి నుంచి అశ్లీలచేష్టలకు అలవాటు పడ్డారు. లూత్ వారికి నచ్చచెప్తూ "సోదరులారా ! ఈపని మీకు తగదు. కావాలంటే నా ఈ కుమార్తెలున్నారు చూడండి. వీరు మీ కోసం పరిశుద్ధులు. అల్లాహ్ కి భయపడండి. నా ఈ అతిథుల విషయం లో నన్ను అవమానపర్చకండి. ఏమిటీ ! మీలో మంచివాడు ఒక్కడూ లేడా?( ఖురాన్ 11:78 ).

దానికి వారు “నీకు తెలుసుకదా, నీ కుమార్తెలతో మాకు పనిలేదని. మాకు కావలసిందేమిటో కూడా నీకు తెలుసు"అన్నారు. అపుడు లూత్ "అయ్యయ్యో ! నాకు మిమ్మల్ని అదుపులో ఉంచే శక్తి ఉంటే బాగుండు ! లేదా ఆశ్రయం పొందడానికి ఏదైనా దృఢమైన కోట దొరికినా బాగుండు" అన్నాడు. ( ఖురాన్ 11:79,80 ).

దానికి వారు “లూత్‌ ! నువ్వు ఈ మాటలు గనక మానుకోకపోతే మేము నిన్ను మా పట్నం నుంచి వెల్లగొడతాం" అని బెదిరించారు. అపుడు లూత్ "మీ చేష్టలు నాకు రోత పుట్టిస్తున్నాయి...ప్రభూ ! నన్ను, నా కుటుంబసభ్యుల్ని వీరి దుర్నడత, దుర్మార్గాల బారి నుండి కాపాడు" అన్నాడు. ( ఖురాన్-26:167-169 ).

అపుడు దైవదూతలు ఇలా అన్నారు. "లూత్‌ ! మేము నీ ప్రభువు పంపిన దూతలము. వీరు నిన్నేమీ చేయలేరు. కొంత రాత్రి గడిచిన తరువాత నీ కుటుంబాన్ని తీసుకొని ఇక్కడి నుంచి బయలుదేరి వేరే చోటికి వెళ్లు జాగ్రత్త! మీలో ఏఒక్కరూ వెనక్కి తిరిగి చూడకూడదు. అయితే నీ భార్య మాత్రం నీ వెంట రాకూడదు. వారి మీద సంభవించేదే నీ భార్య మీద కూడా సంభవిస్తుంది. వారి వినాశకాలం నిర్ణయమైపోయింది, రేపు ఉదయమే వారి వినాశనం మొదలవుతుంది. ఇక ఎంతో సమయం లేదు. (ఖురాన్-11:81).

తరువాత జరిగిన విషయమై Insha Allah రేపటి భాగము - 9 లో తెలుసుకుందాము.

ముస్లిం సోదరులకు ఒక చిన్న విజ్ఞప్తి  :- ప్రియమైన ముస్లిం సోదరులారా! ఇప్పటికి కూడా మనలో చాలా మంది ముస్లిం సోదరులకు అసలు ఇస్లాం అంటే ఏంటి ? , దీన్ అంటే ఏంటి ? , మన నబీ ఎవరు ? , అసలు మనం ఎందుకోసం పుట్టాము ?  ------ ఇలాంటి అనేకమైన విషయాలు తెలియదు .మనకు ఈ జీవితాన్ని ఇచ్చినది అల్లాహ్ , అలాంటి అల్లాహ్ కోసం 24 గంటల్లో ఒక్క 5 నిమిషాల సమయం కేటాయించి ఈ msg ను చదవలేమా , కేవలం 5 నిమిషాలు కేటాయించి ఇస్లాం చరిత్ర తెలుసుకుంటారని ఆశిస్తున్నాము. నాకు ఈ msg లు ఒక ముస్లిం సోదరుడు పంపించాడు , నేను మీకు పంపిస్తున్నాను ; అలాగే మీరు కూడా ఈ msg లను ముందుకు పంపించండి , ఇదేదో 10 మందికి send చేస్తే మంచి జరుగుతుంది , send చేయకపోతే చేడు జరుగుతుంది అనుకునే msg లు కావు . కాబట్టి మన ముస్లిం లలో దీన్ ను నింపవల్సిన బాధ్యత అల్లాహ్ మన పై ఉంచాడు అని తెలుసుకుంటూ , ఇస్లాం ఉనికి ని చాటి చెప్తారని ఆశిస్తున్నాము .

No comments:

Post a Comment