91

☪☪☪       *బిస్మిల్లాహ్ హిర్రహ్మా నిర్రహీమ్*        ☪☪☪

🕋🕋   *అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు*   🕋🕋
🕋🕋     *అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను*      🕋🕋

●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●

🛐🛐🛐              *ఇస్లాం చరిత్ర* *- 91*              🛐🛐🛐

🇸🇦🇸🇦🇸🇦 *ముహమ్మద్ (సల్లం) జీవితచరిత్ర - 06* 🇸🇦🇸🇦🇸🇦 
◆◇◆◇◆◇◆◇◆◇◆◇◆◇◆◇◆◇◆◇◆◇◆◇◆◇◆◇◆◇◆◇◆◇◆

 *అబ్దుల్లాహ్ వివాహం : -* 

అబ్దుల్ ముత్తలిబ్, తన చిన్న కొడుకు అబ్దుల్లాహ్ కు సంబంధం కోసం అన్వేషణ ప్రారంభించారు. చివరికి బనీజహ్రా నాయకుని ఇంటిపై అబ్దుల్ ముత్తలిబ్ దృష్టిపడింది. వెంటనే అతనికి కబురు పంపారు.

అబ్దుల్ ముత్తలిబ్, అబ్దుల్లాహ్ వివాహానికి హజ్రత్ "ఆమినా" ను ఎన్నుకున్నారు. ఈమె వహబ్ బిన్ అబ్దె మునాఫ్ బిన్ జహ్రా బిన్ కిలాబ్ కుమార్తె. వంశం, హొదాల రీత్యా ఖురైష్ కు చెందిన అత్యుత్తమ స్త్రీలో లెక్కించబడే మహిళ. ఈమె తండ్రి వంశం మరియు గౌరవం రెంటిలోనూ "బనూ జహ్రా" తెగ సర్దారు.

నడికారు, ఆమినా తండ్రి వహబ్ ల మధ్య సంభాషణ : -

నడికారు : - అబ్దుల్ ముత్తలిబ్ తన కుమారుడు అబ్దుల్లాహ్ కి ఆమినా ను ఇచ్చి వివాహం జరిపించాలని కబురు పంపించారు కదా! అందుకు మీ ప్రత్యుత్తరం ఏమిటి?

వహబ్ : - వారితో వియ్యం అందుకోవడం మాకు సమ్మతమే! కానీ, మా పెద్దలు ఇప్పుడు అందుబాటులో లేరు. వారు వచ్చాక, ఈ సంబంధం గురించి చర్చిద్దామని ఎదురుచూస్తున్నాం.

నడికారు : - శుభకార్యం విషయంలో ఆలస్యం చేయడం మంచిది కాదు. అబ్దుల్ ముత్తలిబ్ కొడుకు అబ్దుల్లాహ్ కోసం మక్కాలో అమ్మాయిలకు కొదవ లేదు. అబ్దుల్లాహ్ లాంటి అబ్బాయి అరేబియాలో కాగడా పెట్టి వెతికిన కనిపించడు. పైగా అతను గొప్పింటి బిడ్డ.అతని తండ్రి అబ్దుల్ ముత్తలిబ్ మొత్తం ఖురైష్ జాతికే అగ్ర నాయకుడు. అందుచేత ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే మన ఆమినా ను అబ్దుల్లాహ్ కు ఇచ్చి పెళ్ళి చేసెయ్యాలి.

ఈ సలహా అమీనా తండ్రికి నచ్చింది. ఆయన తక్షణమే ఈ సంబంధం తమకు సమ్మతమేనని అబ్దుల్ ముత్తలిబ్ కు సమాధానం పంపాడు.

ఈ విధంగా అబ్దుల్లాహ్, ఆమినా ల పెళ్ళి సంబంధం ఖాయమయింది. అబ్దుల్లాహ్ కు ఆమినాయే అన్ని విధాల ఈడైన జోడు. ఆమినా అందంలో అపరంజి బొమ్మ. శీలంలో సుగుణాల రాసి. మానమర్యాదల్లో మహిళా లోకానికే మణిపూస. ఈ ప్రత్యేకతల కారణంగా ఆమినా కుటుంబసభ్యులు ఆమెను ఎంతగానో అభిమానించేవారు. ఆమెకు అమితమైన గౌరవం కూడా ఇస్తుండేవారు. ఇప్పుడు అబ్దుల్లాహ్ లాంటి యువకునితో సంబంధం ఖాయమైనందున వారు ఆమినా అదృష్టానికి పరమ సంతోషంతో పొంగిపోయారు.

అబ్దుల్లాహ్, ఆమినా ల పెళ్ళి ముహూర్తం సమీపించింది. అబ్దుల్ ముత్తలిబ్ బంధుమిత్ర సపరివారంగా మక్కా నుండి పెళ్ళికూతురు ఇంటికి తరలి వచ్చారు. మేళ తాళాలు మొదలయ్యాయి. బాలికలు పాటలు పాడి, సభికులకు వీనుల విందు చేశారు. అరబ్ సంప్రదాయం ప్రకారం వివాహం అతి నిరాడంబరంగా జరిగిపోయింది.

పెళ్ళైన మూడు రోజుల తరువాత నూతన వధూవరులకు వీడ్కోలు చెప్పారు. ఆమినా అత్తవారింట్లో అడుగు పెట్టింది. అత్తవారి తరపు బంధువులు కొత్త కోడలికి ప్రేమ పూర్వకమైన స్వాగతం చెప్పారు.

నూతన దంపతులు, తమ క్రొత్త జీవితానికి శ్రీకారం చుట్టారు. వారి వైవాహిక జీవితం చాలా అన్యోన్యంగా సాగింది. కొద్ది రోజుల తర్వాత అబ్దుల్లాహ్, ఆమినాల దాంపత్య జీవితానికి ఫలితంగా ఆమినా గర్భం దాల్చింది.

ఇలాంటి సందర్భంలో అబ్దుల్లాహ్,వ్యాపారం నిమిత్తం వ్యాపార బృందంతో కలిసి సిరియా దేశానికి పోవల్సివచ్చింది.

వర్తక బిడారాలు సిద్దమయ్యాయి. ప్రయాణానికి కావలసిన ఏర్పాట్లు అన్ని పూర్తయ్యాయి.

 *వీడ్కోలు సమయం : - - : కడచూపు* 

అబ్దుల్లాహ్ సిరియాకు వెళ్ళవలసిన సమయం రానే వచ్చింది. వ్యాపార నిమిత్తం పరదేశం వెళ్తున్న అబ్దుల్లాహ్ కు వీడ్కోలు చెప్పడానికి చాలా మంది బంధుమిత్రులు వచ్చారు.

వెళ్ళేముందు, అబ్దుల్ ముత్తలిబ్ తన కొడుకు అబ్దుల్లాహ్ ను గాఢంగా కౌగిలించుకున్నారు. క్షేమంగా తిరిగి రప్పించమని దైవాన్ని వేడుకున్నారు. అబ్దుల్లాహ్ ఒంటె ఎక్కారు. అన్నయ్య అబ్బాస్ ఒంటె పగ్గం పట్టుకున్నాడు. తమ్ముడు హమ్ జా కూడా ఆయన్ని అనుసరించాడు.

తనను వదిలేసి వెళ్తున్న, తన భర్త అబ్దుల్లాహ్ ను చూస్తూ ఆమినా నిలబడి మౌనంగా చూస్తుండిపోయారు. పెళ్ళి జరిగి ముచ్చటగా మూడు నెలలు అయినా కాలేదు. అంతలోనే ఈ ఎడబాటు! ఆమినా నయనాలు అప్రయత్నంగా అశ్రుపూరితాలయ్యాయి. ఏదో చెప్పాలనుకున్నా చుట్టుముట్టిన సిగ్గుదొంతరలు ఆమె పెదవుల్ని బంధించి వేశాయి. అనిర్వచనీయమైన ఆవేదన ఏదో ఆమినా హృదయాన్ని కలచివేయసాగింది. ఆమె మనసు కొట్టుమిట్టాడుతోంది.

ఇంతలో వర్తక బిడారం బయలుదేరింది. 

అబ్దుల్లాహ్ వెళ్లిపోతున్నాడు. ఆమినా సమస్త జగత్తే వెళ్ళిపోతోంది. కన్నీటిధారలు కట్టలు తెంచుకొని చెక్కిళ్ళపైకి జాలువారాయి. 

అబ్దుల్లాహ్ కూడా తన అర్థాంగి వైపు మూగబాధతో చూసి ముందుకు కదిలారు.

 _(ఈ చూపే ఆ నూతన వధూవరులను కడచూపు అయ్యింది.)_ 

తోటి వర్తకులతో పాటు అబ్దుల్లాహ్, మక్కా వీధుల గుండా ఒంటెల మీద తమ ప్రయాణం కొనసాగించారు.

ఆమినా అరుగు పైకెక్కి ఒంటెల వరుసలు కనుమరుగయ్యేదాకా చూసి, ఆ తరువాత బరువెక్కిన హృదయంతో భారంగా అడుగులు వేస్తూ క్రిందికి దిగి యథాప్రకారం తన రోజువారి కార్యకలాపాల్లో లీనమైపోయారు.

 _అలా వెళ్ళిన అబ్దుల్లాహ్, ఆ ప్రయాణంలో తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోయాడు. అబ్దుల్లాహ్ మరణం గురించి సందర్భాన్ని బట్టి మునుముందు తెలుసుకుందాం._ 

Insha Allah  రేపటి భాగములో ఫీల్ సంఘటన (అబ్రహా రాజు) గురించి తెలుసుకుందాము.

🖊🖊     ®@£€€q +97433572282      🖊🖊
                    (rafeeq)

🖊🖊      Salman       +919700067779 🖊🖊

*Note : - ఈ msg లను ముందుకు పంపిస్తూ, మన ఇస్లాం చరిత్ర గురించి మన ముస్లిం సోదరులకు, సోదరీమణులకు తెలియజేస్తారని ఆశిస్తున్నాము.*

No comments:

Post a Comment