29

🤚🏻✋🏻🤚🏻✋🏻 *బిస్మిల్లాహ్ హిర్రహ్మా నిర్రహీమ్* 🤚🏻✋🏻🤚🏻✋🏻

🛐🕋🛐🕋 *అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను* ☪🕋☪🕋

°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°

       🕌🕋🕌🕋 *ఇస్లాం చరిత్ర* 🕋🕌🕋🕌

                               *భాగము - 29* 

____________________________________________

*దుర్మార్గులు అయిన ఈజిప్టు వాసుల గురించి అల్లాహ్ తో మూసా (అలైహి) వేడుకోలు.* 

"ఓ ప్రభు! నీవు ఫిరౌన్ కు, అతని అధికారులకు ఐహిక జీవితంలో ఐశ్వర్యం, సకలసాధనసంపత్తులు ఇచ్చావు. ప్రభు! ప్రజల్ని నీ మార్గంలోకి రాకుండా నిరోధించడానికా ఇచ్చింది? ప్రభు! వారి సిరిసంపదలు నాశనం చెయ్యి. దుర్భర శిక్ష చూడనంతవరకు సత్యాన్ని విశ్వసించనీయకుండా వారి హృదయ కవాటాలు మూసి వెయ్యి.

అల్లాహ్ : - మీ ఇద్దరి వేడుకోలు స్వీకరించబడింది. ధర్మంలో స్థిరంగా ఉండండి. మూఢుల మార్గం అనుసరించకండి.

ఫిరౌనీయులలో సత్యం పట్ల స్పృహ రావడానికి అల్లాహ్ కొన్ని సంవత్సరాల పాటు ఈజిప్టు ప్రజల పై ప్రకృతి విపత్తులు కురిపించాడు. అయినా కూడా వారిలో మార్పు రాలేదు. మంచి రోజులు వచ్చినపుడు తామందుకు అర్హులమని అంటారు. దుర్దినాలు దాపురించినపుడు మూసా (అలైహి) ను, అతని అనుచరులను దుశ్శకునాలుగా పరిగణిస్తారు.

[వారి దుశ్శకునం అల్లాహ్ చేతిలో ఉంది. కానీ వారిలో చాలా మంది ఆ సంగతి గ్రహించడం లేదు.]

బనీఇస్రాయీల్ ప్రజలపై దౌర్జన్యాలకు పాల్పడినందుకు, అల్లాహ్ పట్ల అవిశ్వాసానికి పాల్పడినందుకు ఈ ప్రపంచంలోనే శిక్ష అనుభవించవలసి ఉంటుందని ఫిరౌన్ ను హెచ్చరించవల్సిందిగా అల్లాహ్ మూసా (అలైహి) ను ఆదేశించారు.

తను విధించే శిక్షకు ముందుగా ఫిరౌనీయులు సత్యం గ్రహిస్తారని, అల్లాహ్ ముందస్తు సూచనగా నైలు నది ఒడ్డున ఉన్న వారి భూములలో ఉన్న పంటలకు అవసరమైన నీటిని ఉపయోగించుకునే నీటి కాలువలు ప్రవహించకుండా ఆజ్ఞాపించారు. ప్రతి ఏటా భూములను తడుపుతూ ఉండే నీటి కాలువలలో నీరు రానందున ఆ సంవత్సరం పంటలు ఎండిపోయాయి. ఈజిప్టు దేశంలో తీవ్రమైన కరువు నెలకొంది. అయినా కూడా ఫిరౌన్ తన అహంకారాన్ని వదలలేదు.

ఇది చూసిన ఈజిప్టు ప్రజలు మూసా (అలైహి) తో, "నీవు మాపై మంత్రతంత్రాలు ప్రయోగిస్తూ, మా ముందు ఎన్ని చమత్కారాలు చేసిన మేము నిన్ను ఎన్నటికీ విశ్వసించము." అని తెగేసి చెప్పారు.

ఆ తర్వాత అల్లాహ్, వారి పై భయానకమైన పెను తుఫాన్ లు, వరదలు వచ్చేలా చేశారు. ఆ వరదల వల్ల అనేక ఊళ్ళు, పంటపొలాలు నాశనమయ్యాయి. తీవ్రమైన వినాశనాలు సృష్టించాయి. ఆ పిదప అల్లాహ్ గొప్ప మిడతల దండును పంపాడు. మిగిలిన కొద్ది పంటలను కూడా ఆ మిడతలు తినేసాయి. ఆ వెంటనే పేలు, ధాన్యపు పురుగుల్ని కూడా పంపించారు. అవి వారి ఇళ్లలో దూరి, ధాన్యాన్ని తినేసి తీవ్ర ఇబ్బందులకు గురి చేశాయి. ఆ తర్వాత గుంపులు గుంపులుగా కప్పలు ఈజిప్టు ప్రజలపైకి వచ్చి పడ్డాయి. వారికి భయంకరమైన వ్యాధులు సోకాయి. చివరగా వారిపై నెత్తుటి వర్షం కురిపించారు. ఫలితంగా వారి శరీరాల నుంచి రక్తం ఓడసాగాయి.

ఈ పరిణామం ఈజిప్టు ప్రజలను భయభీతులకు గురిచేసింది. బెంబేలెత్తిపోయి, వారు మూసా (అలైహి) దగ్గరకు పరిగెత్తుకు వచ్చారు. "మూసా! చూస్తున్నావ్ కదా మా ఈ కష్టాలు. నీ ప్రభువు కు నీతో ఒప్పందం ఉంది కాబట్టి, నీకు నీ ప్రభువు నుంచి లభించిన ప్రవక్త పదవి సహాయంతో ఈ ఆపదల నుంచి మమ్మల్ని గట్టెక్కించమని, మా బాధలు అన్ని తొలగిపోవాలని అల్లాహ్ తో ప్రార్థించు. ఈ బాధలు అన్ని తొలిగేలా చేస్తే మేము నీ మాట విని బనీఇస్రాయీల్ ప్రజలను మా బానిసత్వం నుంచి విడుదల చేస్తాము. వారు నీ వెంట వెళ్ళడానికి ఒప్పుకుంటాము." అని అన్నారు.

బనీఇస్రాయీల్ ప్రజల కష్టాలు, బానిసత్వంలో నశించిపోయిన వారి జీవితాలు, వారిని ఎలానైనా బానిసత్వం నుంచి విడిపించాలని తన కోరిక ఇన్నాళ్లకు నెరవేరబోతోంది అని మూసా (అలైహి) వెంటనే అల్లాహ్ తో "ఈజిప్టు ప్రజల పరిస్థితులు చక్కబడాలి" అని వేడుకున్నారు.

మూసా (అలైహి) వేడుకోలు ఆలకించిన అల్లాహ్ ఈజిప్టు ప్రజల బాధలను తొలగించారు. నైలు నది ఎప్పటి మాదిరిగా నిండుగా ప్రవహించసాగింది. వారి పంటలు మళ్ళీ చక్కగా పండసాగాయి. కానీ ఈజిప్టు ప్రజలు తమ కష్టాలన్నీ తొలగిపోయి పరిస్థితులు చక్కబడిన తర్వాత బనీఇస్రాయీల్ ప్రజలను బానిసత్వ విముక్తి కలిగిస్తామని ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేక పోయారు.

*సత్యాన్ని విశ్వసించని ఈజిప్టు వాసులు* 

◇ మూసా (అలైహి) ప్రకటన ప్రకారం, ఈజిప్టు ప్రజలపై భయానకమైన పెను తుఫాన్ లు, వరదలు వచ్చాయి. ఆ వరదల వల్ల అనేక ఊళ్ళు, పంటపొలాలు నాశనమయ్యాయి. తీవ్రమైన వినాశనాలు సృష్టించాయి. ఈజిప్టు వాసులు మూసా (అలైహి) తో బ్రతిమలాడటం వల్ల, మూసా (అలైహి) అల్లాహ్ తో వేడుకున్నారు. మూసా (అలైహి) చేసిన వేడుకోలు వల్ల ఆ ఉపద్రవం తొలగిపోయింది.

◇ మూసా (అలైహి) ప్రకటనతో ఆ పిదప భయంకరమైన మిడతల దండు వచ్చింది. మిగిలిన కొద్దిపాటి పంటలను కూడా ఆ మిడతలు తినేసాయి. మళ్ళీ మూసా (అలైహి) చేసిన వేడుకోలు వల్ల ఆ విపత్తూ దూరం అయింది.

◇ మూసా (అలైహి) ప్రకటనతో దేశమంతటా పేలు, ధాన్యపు పురుగులు ప్రబలిపోయాయి. అవి వారి ఇళ్లలో దూరి, ధాన్యాన్ని తినేసి తీవ్ర ఇబ్బందులకు గురి చేశాయి. జనం తీవ్ర ఆందోళన చెందారు. గోదాముల్లోని ధాన్యం నాశనమయ్యింది. ఈ ఆపద కూడా మూసా (అలైహి) వేడుకోలు వల్లనే తొలగిపోయింది.

◇ ఆ తర్వాత మూసా (అలైహి) హెచ్చరిక తో దేశం నలువైపులా గుంపులు గుంపులుగా కప్పల బెడద వచ్చి పడింది. వారికి భయంకరమైన వ్యాధులు సోకాయి. ఈ బెడద కూడా మూసా (అలైహి)వేడుకోలు వల్లే తొలగిపోయింది.

◇ మూసా (అలైహి) ప్రకటనతో చివరగా నెత్తుటి వర్షం వచ్చి పడింది. నదులు, చెరువులు, బావులు, కుంటల్లోని నీరు అంతా రక్తమయం అయిపోయింది. చేపలు చచ్చిపోయాయి. వారం రోజులదాక జనం మంచి నీటి కోసం కటకటలాడిపోయారు. చివరకి ఈ విపత్తు కూడా మూసా (అలైహి) వేడుకోలు వల్లనే దూరం అయింది.

కళ్ళ ముందు అల్లాహ్ యొక్క ప్రకోపాన్ని చూసిన తర్వాత కూడా ఆ అవిశ్వాసులు సత్యాన్ని గ్రహించలేదు. మూసా (అలైహి) వేడుకోలు వల్ల ఆగిపోయిన ప్రకృతి విపత్తులను చూసి కూడా మారలేదు. కానీ ఆ అవిశ్వాసులు తిరస్కారం, తలబిరుసుతనాలనే ప్రదర్శించారు. వారు పరమ దుర్మార్గులు. ఏదైనా ఆపద వస్తే చాలు మూసా (అలైహి) వద్దకు పరిగెత్తుకు వెళ్లి "మా ఈ సమస్యల నుంచి అల్లాహ్ తో వేడుకొని మమ్మల్ని గట్టెక్కించమను. అలా చేస్తే బనీఇస్రాయీల్ ప్రజలను నీ వెంట పంపుతాము." అని బ్రతిమాలుతారు. ఆ తర్వాత ఈజిప్టు ప్రజల పై విరుచుకపడిన విపత్తును మూసా (అలైహి) వేడుకోలు వల్ల అల్లాహ్ కొంతకాలం తొలగించగానే ఇచ్చిన మాటను తప్పేవారు.

*మూసా (అలైహి) పనితనం* 

మూసా (అలైహి) అల్లాహ్ తరుపున సత్యంతో కూడిన అనేక మహిమలు ఈజిప్టు ప్రజల ముందుకు తీసుకువచ్చాడు. దాంతో చాలా మంది బనీఇస్రాయీల్ ప్రజలు మూసా (అలైహి) కు అనుచరులైపోయారు. కానీ దుర్మార్గులైనటువంటి ఆ ఫిరౌనీయులకు మాత్రం కనువిప్పు కలగలేదు. ఆ ఈజిప్టు ప్రజలు, సత్యాన్ని విశ్వసించి మూసా (అలైహి) తో కలిసిపోయిన వారి మగపిల్లలను హతమార్చి, వారి ఆడపిల్లలను మాత్రం సజీవంగా వదిలిపెట్టాలని అనుకున్నారు.

*ఫిరౌన్ మరియు ఒక విశ్వాసి ల వాగ్వాదాన* 

ఓ రోజు ఫిరౌన్ మూసా (అలైహి) గురించి తన సభాసదులతో....

ఫిరౌన్ (కోపంగా) : - నన్ను వదలండి, నేను మూసా (అలైహి) ను చంపితీరతా. అతను తన ప్రభువును మొరపెట్టుకొనివ్వండి చూద్దాం. మూసా (అలైహి) ధోరణి చూస్తుంటే మన మతాన్ని, మన జీవన వ్యవస్థని మార్చేస్తాడని నాకు అనుమానంగా ఉంది. (లేదా) మూసా (అలైహి) దేశంలో ఆరాచకాన్ని అయిన సృష్టించవచ్చు.

దానికి మూసా (అలైహి) ఈ బెదిరింపులకు ఖాతరు చేయకుండా "తీర్పు దినాన్ని నమ్మని ప్రతి గర్విష్ఠి నుండి నేను నా ప్రభువు మరియు మీ ప్రభువైన అల్లాహ్ శరణు కోరుకుంటున్నాను." అని ఫిరౌన్ కు ఈ సందేశం పంపించాడు.

ఆ సందర్భంలో రాజు ఫిరౌన్ మరియు అతని అనుచరులు, సలహాదారులు కలిసి ఉన్న ఒక సమావేశంలో రాజ కుటుంబానికే చెందిన ఒక విశ్వాసి తన విశ్వాసాన్ని బహిర్గతం చేయకుండా ఇలా అన్నాడు.

విశ్వాసి : - "నా ప్రభువు అల్లాహ్" అని అన్నంత మాత్రాన మీరు ఒక మనిషిని చంపుతారా?

ఫిరౌన్ : - మీ అందరికి నేనే ప్రభువు ను, నేను తప్ప వేరొక ప్రభువు ఎవరూ లేదు. మూసా (అలైహి) ను ఖచ్చితంగా చంపి తీరాల్సిందే.

విశ్వాసి : - మూసా (అలైహి), తాను చెబుతున్నది సత్యమని అల్లాహ్ వద్ద నుంచి మీ వద్దకు సాక్ష్యాధారాలు తెచ్చాడు. ఒక వేళ మూసా (అలైహి) చెప్పేది అబద్ధమైతే ఆ పాపం మూసా (అలైహి)కే చుట్టుకుంటుంది. అలా కాకుండా మూసా (అలైహి) చెప్పేది మరియు చూపించేది నిజమే అయితే, మూసా (అలైహి) హెచ్చరిస్తున్న భయంకరమైన దుష్పరిణామాలలో కొన్ని అయిన మీపై వచ్చి పడటం ఖాయం. అబద్దాలకోరుకి, హద్దు మీరి ప్రవర్తించేవాడికి అల్లాహ్ ఎన్నటికీ సన్మార్గబుద్ధిని ప్రసాదించడు.

ఫిరౌన్ (కోపంతో) : - ఇక చాలు ఆపు. 

విశ్వాసి : - నా జాతి ప్రజలారా! మీరు మీ మనసు నిమగ్నం చేసి ఒక్కసారి ఆలోచించండి. ఈ రోజు మీకు సామ్రాజ్య వైభవం ఉంది. దేశంలో మీ ఆధిక్యత, అధికారాలే చలామణి అవుతున్నాయి. కానీ ఏ క్షణం లోనైనా హఠాత్తుగా మనపై దైవ శిక్ష విరుచుకపడితే మనకు ఎవరు సహాయం చేస్తారు.

ఆ విశ్వాసి మాటలు పట్టించుకోకుండా ఫిరౌన్ : - నేను మాత్రం నాకు సమంజసమని తోచిన సలహా మీకు ఇస్తున్నాను. నేను మిమ్మల్ని సరైన దారిలోనే నడిపిస్తున్నాను.

విశ్వాసి : - సోదరులారా! గత జాతుల వారికి పట్టిన గతి మీకు కూడా దాపురిస్తుందేమో అని నేను భయపడుతున్నాను. గతంలో నూహ్ జాతికి, లూత్ జాతికి, ఆద్ జాతికి, సమూద్ జాతికి ఆ తర్వాత అనేక జాతులకు దుర్దినాలు దాపురించాయి. అల్లాహ్ తన దాసులకు అన్యాయం చేయాలనుకోడు.

ఈ సలహాను స్వీకరించే బదులుగా అక్కడ ఉన్న ఈజిప్టు ప్రజలందరూ ఆ విశ్వాసి ని అవమానించారు.

విశ్వాసి : - ప్రజలారా! నేను సాఫల్యం వైపునకు పిలుస్తున్నాను. కానీ మీరు అగ్ని వైపుకు ఆహ్వానిస్తున్నారు. నా ప్రభువును నేను విశ్వసించడం మీకు ఇష్టం లేదు. మీరు అల్లాహ్ కి భాగస్వాములు కల్పించమని కోరుతున్నారు. నేను మిమ్మల్ని సర్వశక్తిమంతుడైన, అపార కృపాశీలుడైన అల్లాహ్ వైపునకు పిలుస్తున్నాను. అల్లాహ్ వైపునకే మనం మరలి పోవలసి ఉంది. అల్లాహ్ నే తన దాసులను కాపాడేవాడు.

ఫిరౌన్ (మరింత తల బిరుసుతో మాట్లాడుతూ) : - మహామంత్రి హామాన్! నాకోసం ఎత్తైన గోపురం ఒకటి ఆకాశంలోకి కట్టించు. నేను ఆ గోపురం ఎక్కి ఆకాశమార్గాలకు చేరుకొని అక్కడ మూసా (అలైహి) ఆరాధించే అల్లాహ్ ఉన్నాడో లేడో తొంగిచూస్తా. నాకైతే మూసా (అలైహి) పచ్చి అబద్ధాలకోరులా కనిపిస్తున్నాడు.

ఫిరౌన్ మరియు అతని అనుచరులు ఆ విశ్వాసి మాటలు విని, అతని పై మండిపడ్డారు. ఆ వ్యక్తిని త్రీవ్రంగా బెదిరించారు. కానీ ఆ విశ్వాసి తన అభిప్రాయాలు మార్చుకోవడానికి ఒప్పుకోలేదు. ఆ ఈజిప్టు వాసులందరూ ఆ విశ్వాసిని ప్రలోభపెట్టడానికి ప్రయత్నించారు. కానీ ఆ విశ్వాసి నిక్కచ్చిగా, "మీరు మీ వినాశనాన్ని కొని తెచ్చుకుంటున్నారు." అన్నాడు. ఫిరౌన్ ఆ వ్యక్తిని "నేను నిన్ను చాలా క్రూరంగా చంపేస్తా" అని అన్నాడు. అల్లాహ్ ఆ విశ్వాసిని దుర్మార్గుల మారి నుండి రక్షించాడు. బనీఇస్రాయీల్ ప్రజలను బానిసత్వం నుంచి విడుదల చేయాలని మూసా (అలైహి) పట్టుపడ్డారు.

ఆ తరువాత ఆ బనీఇస్రాయీల్ ప్రజలు తగిన సమయం కోసం ఎదురుచూస్తూ మూసా (అలైహి) సాయంతో అల్లాహ్ ఆజ్ఞ ప్రకారం ఆ దుర్మార్గుల బారి నుంచి తప్పించుకున్నారు. Insha Allah రేపటి భాగము - 30 లో ఇందులోని వివరణను తెలుసుకుందాము.

Note : - ఈ msg లను ముందుకు పంపిస్తూ, మన ఇస్లాం చరిత్రను మన ముస్లిం సోదరులకు తెలియచేస్తారని ఆశిస్తున్నాము.

☆☆ ®@£€€q       +97433572282 ☆☆

No comments:

Post a Comment