60

🛐 🕋 ☪ *బిస్మిల్లాహ్ హిర్రహ్మా నిర్రహీమ్* ☪ 🕋 🛐

🕋🤚🏻✋🏻🕌 *అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను* 🕌🤚🏻✋🏻🕋

◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆

       🕌☪🕋🛐 *ఇస్లాం చరిత్ర* 🛐🕋☪🕌

                                *భాగము - 60* 

◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆

*చెల్లా చెదురైన బనీఇస్రాయీల్ ప్రజలు* 

ఒక దశలో బనీఇస్రాయీల్ ప్రజలకు చెడులే జీవన విధానంగా మారిపోయాయి. వారు సుఖవిలాసాల కోసం ప్రాకులాడే ప్రజలుగా మారిపోయారు. అల్లాహ్ పట్ల తమ విధి బాధ్యతలను మర్చిపోయారు. మూసా (అలైహి) మరణం తర్వాత శాంతి భద్రతలన్నవి అక్కడ కనుమారుగయ్యాయి. వారి హృదయాల్లో దయ, కారుణ్యం అన్నవి మాయమయ్యాయి. ఆ తర్వాత వచ్చిన ప్రవక్తలను వారు తిరస్కరిస్తూ వచ్చారు. ప్రవక్తలను అబద్ధాలకోరుగా ఆరోపించేవారు.

ఈ కాలంలో అల్లాహ్ వారిని కరుణించి, వారిని హెచ్చరించే ప్రవక్తను వారి వద్దకు పంపించారు. ఒక మార్గదర్శిని వారి వద్దకు పంపారు. ఆ ప్రవక్త పేరు జెరిమియా అలైహిస్సలామ్ (అరబీ పేరు అర్మియా.) ఆయన ఒక గౌరవనీయమైన కుటుంబంలో జన్మించారు. జెరిమియా (అలైహి), బనీఇస్రాయీల్ ప్రజలకు హితబోధ చేసేవారు. సెన్నాచెరిబ్ వారిని నాశనం చేయడానికి ప్రయత్నించిన కాలాన్ని గుర్తుచేశారు. వారిని రక్షించవలసిందిగా ప్రవక్త షైజా (ఇసాయ) అల్లాహ్ ని ప్రార్థించిన వైనాన్ని జ్ఞాపకం చేశారు. ఫలితంగా అల్లాహ్ సెన్నాచెరిబ్ సైన్యాన్ని వ్యాధికి గురి చేసి నాశనం చేశారు. కానీ బనీఇస్రాయీల్ ప్రజలు షైజా (అలైహి) పట్ల కృతజ్ఞత చూపలేదు.

ఆయనను అవమానించారు. ఆయన గొంతు కోసి హతమార్చారు. ఈ పద్ధతులను మార్చుకోకపోతే వారిపై అల్లాహ్ శిక్ష వచ్చి పడుతుందని ప్రవక్త జెరిమియా (అలైహి) హెచ్చరించారు. అల్లాహ్ వారిపై భయంకరమైన సైన్యాన్ని పంపుతారని, ఆ సైన్యం బీభత్సాన్ని సృష్టించి వారిని నాశనం చేస్తుందని జాగ్రత్త పడండి అని అన్నారు.

కానీ అహంకారంతో బనీఇస్రాయీల్ ప్రజలు ఆయన్ను తిరస్కరించారు. తమను అల్లాహ్ ఎంచుకున్నాడని, తాము అల్లాహ్ సృష్టిలో ఎంపికైన జాతికి చెందినవారమని, తమ జాతికి ఈ పవిత్రమైన అల్లాహ్ వాక్యాలను ప్రసాదించడం జరిగిందని, అందువల్ల అగ్నిని పూజించే, విగ్రహాల ముందు సాగిలపడే అవిశ్వాసుల చేతిలో తాము ఓడిపోయే పరిస్థితి అల్లాహ్ ఎన్నటికీ కలుగజేయడని వాదించారు.

బనీఇస్రాయీల్ ప్రజలు అహంకారంతో తప్పులకు పాల్పడినపుడు అల్లాహ్ ఆగ్రహం వారిని విడిచిపెట్టలేదన్న వాస్తవాన్ని కూడా ప్రవక్త జెరిమియా (అలైహి) గుర్తు చేశారు. కాని వారికి ఆయన సలహా నచ్చలేదు. ఆయన సలహాను మన్నించే బదులు వారు ఆయనను సంకెళ్ళతో బంధించి జైలులో పడవేశారు.

ఒక రోజు ఆకాశమంతా దట్టమైన మేఘాలు అలముకున్నాయి. సూర్యుని కిరణాలు ఒక్కటి కూడా నేలకు చేరకుండా మబ్బులు క్రమ్ముకున్నాయి. పూర్తి రాజ్యం చీకట్లో జారిపోయింది. మబ్బులు తొలిగేసరికి ఒక పెద్ద సైన్యానికి నాయకత్వం వహిస్తున్న సైన్యాధిపతి గుర్రంపై వస్తున్నాడు. అతడు నెబుచాద్నిజ్జార్ (అరబీ పేరు బుఖ్ తనస్సర్). అతడు బాబిలోనియాకు చెందినవాడు. బనీఇస్రాయీల్ ప్రజలను శిక్షించడానికి వచ్చాడు. బనీఇస్రాయీల్ ప్రజలు ప్రమత్తతలో ఉన్నారు. అతడిని ఎదుర్కొనడానికి సిద్ధంగా లేరు. అతడి సైన్యం వారిపై నిర్దాక్షిణ్యంగా విరుచుకుపడింది. కనపడిన ప్రతీది నాశనం చేసింది. చేతికి దొరికిన వారిని హతమార్చింది. వారి పట్టణాలు శిథిలమయ్యాయి. బనీఇస్రాయీల్ ప్రజలు బానిసలయ్యారు. విజేతలు వారిని వివిధ ప్రాంతాల్లో అమ్మేశారు.

బుఖ్ తనస్సర్ మరణించిన తరువాత అనేక సంవత్సరాలు బాబిలోనియా రాజ్య సింహాసనాన్ని దయాహృదయం కలిగిన రాజు అధిష్టించాడు. బనీఇస్రాయీల్ ప్రజల దయనీయ స్థితిని గమనించిన రాజు వారి గురించి విచారించాడు. బనీఇస్రాయీల్ ప్రజలు యాఖూబ్ (అలైహి), దావూద్ (అలైహి) సంతతికి చెందినవారని తెలుసుకున్నాడు. వారు సిరియా భూభాగంలో నివసించేవారని, సిరియా భూభాగం సస్యశ్యామలమైనదిని, సహజ వనరుల సంపదతో తులతూగే ప్రదేశమని, కానీ బుఖ్ తనస్సర్ వారి పట్టణాలను నాశనం చేసి వారిలో చాలా మందిని హతమార్చి వారిని బానిసలుగా మార్చాడని తెలుసుకున్నాడు. రాజుకు వారి స్థితి చూసి జాలి కలిగింది. వారంతా ఇక బానిసత్వం నుంచి విముక్తి పొందారని, వారు స్వేచ్ఛగా తమ భూభాగానికి వెళ్లవచ్చని ప్రకటించాడు.

బనీఇస్రాయీల్ ప్రజలు ఆనందంతో తమ స్వస్థలాలకు చేరుకున్నారు. అపార కరుణామయుడైన అల్లాహ్ వారిపై తన కృపా కటాక్షాలను మరోసారి వర్షించాడు. వారి సంతతి వృద్ధి చెందింది. వారి పంటలు పుష్కలంగా పండాయి. వారి పశు సంపద పెరిగింది. అల్లాహ్ పట్ల కృతజ్ఞతలు చూపే బదులు వారు మళ్లీ రుజుమార్గాన్ని వదిలి పక్కదారులు పెట్టారు. గత అనుభవాల నుంచి వారు పాఠాలు నేర్చుకోలేదు. చెడులు వారి ప్రవృత్తిగా మారిపోయాయా అనిపించింది. ఈ కాలంలోనే గొప్ప ప్రవక్తలు జకరియా, యహ్ యా (బాపిస్ట్ జాన్) వారి వద్దకు వచ్చారు. ఇస్రాయీల్ ప్రజలు ఈ ప్రవక్తల హితబోధనులను వినే బదులు వారికి వ్యతిరేకంగా కుట్రలు పన్ని వారిని హతమార్చారు.

మరోసారి అల్లాహ్ శాపం వారిపై పడింది. ఈసారి గొప్ప సేనాధిపతి టైటస్ నాయకత్వంలో రోమన్లు వారిని ప్రాంతాన్ని ఆక్రమించుకున్నారు. ఈ యుద్ధంలో వారి ఇళ్లు వాకిళ్లు సర్వనాశనమయ్యాయి. మరోసారి వారు బానిసలయ్యారు. స్వంతదేశం లేని జాతిగా మారారు. ప్రపంచంలోని నలుమూలలా చెల్లాచెదురయ్యారు. పరాభవాలకు, అవమానాలకు గురయ్యారు.

_◆=◆ జాతి, వర్గం, వర్ణం, మతం, వంశం, గత చరిత్రలోని ఔన్నత్యం, సంపద, అధికారం, జ్ఞానం, నైపుణ్యం, సౌందర్యం, సంస్కృతి వగైరా ఏ విషయానికి సంబంధించిన ఆధిక్యత అయినా గాని లేక కేవలం నోటి మాటగా అల్లాహ్ ను విశ్వసించడంగానీ వీటిలో దేనిని అల్లాహ్ శాశ్వత అనుగ్రహాలను పొందడానికి సిఫారసుగా భావించరాదు. మనిషి ఆచరణాత్మకంగా చేసే పనులు, మనిషి అవలంబించే ఋజుమార్గం ఆధారంగానే అల్లాహ్ నిర్ణయాలు తీసుకుంటారు. ఆచరణలో తప్పుదారిపడితే అల్లాహ్ శిక్ష మనిషి పై పడుతుంది. ఈ శిక్ష అనేక రూపాలుగా ఉండవచ్చు._ 

Insha Allah రేపటి భాగము - 61 లో, బనీఇస్రాయీల్ లోని యహుదా - అతని సోదరుడు గురించి తెలుసుకుందాము.

☆☆ ®@£€€q  +97433572282 ☆☆

Note : - ఈ msg లను ముందుకు పంపిస్తూ, మన ఇస్లాం చరిత్ర గురించి మన ముస్లిం సోదరులకు, సోదరీమణులకు తెలియజేస్తారని ఆశిస్తున్నాము.

No comments:

Post a Comment