67

🛐 🕋 ☪ *బిస్మిల్లాహ్ హిర్రహ్మా నిర్రహీమ్* ☪ 🕋 🛐

🕋🤚🏻✋🏻🕌 *అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను* 🕌🤚🏻✋🏻🕋

◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆

       🕌☪🕋🛐 *ఇస్లాం చరిత్ర* 🛐🕋☪🕌

                                *భాగము - 67* 

◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆

*యహ్యా అలైహిస్సలామ్*

"నాకు ఒక కుమారున్ని ప్రసాదించమని" అల్లాహ్ తో జకరియా (అలైహి) వేడుకున్న తరువాత, "యహ్యా" ని కుమారునిగా జకరియా (అలైహి) కు అల్లాహ్ ప్రసాదిస్తారని జకరియా (అలైహి) కు దైవదూతల ద్వారా ఈ శుభవార్త అందింది.

ఆ తర్వాత కొంత కాలానికే యహ్యా (అలైహి) జన్మించారు. ఆయనకు అల్లాహ్ అపారమైన వివేకాన్ని, విజ్ఞానాన్ని ప్రసాదించారు. యహ్యా (అలైహి) దైవప్రవక్తగా మారవలసి ఉంది. యహ్యా (అలైహి) అల్లాహ్ ని నిబద్ధతతో ప్రార్థించేవారు. ఆయన తరచూ ఉపవాసాలు ఉండేవారు. తౌరాత్ కు సంబంధించిన ఎలాంటి ప్రశ్నలకైనా ఆయన సమాధానం ఇచ్చేవారు. ఆయన పేరు ప్రఖ్యాతులు దేశమంతటా వ్యాపించాయి. ఆయన సత్యాన్ని నిలబెట్టడానికి వచ్చిన వ్యక్తి. అసత్యాన్ని అంతం చేయడానికి వచ్చినవారు. అల్లాహ్ కు తప్ప మరెవ్వరికీ ఆయన భయపడేవారు కాదు.

*పలస్తీనా పాలకుడి నిషిద్ధ పెళ్లి* 

పలస్తీనా రాజ్యాన్ని "హెరాల్డ్ అంటీపాస్" అనే పాలకుడు పాలించేవాడు. ఆయన, తన సోదరుని కుమార్తెను పెళ్లిచేసుకోవాలని పథకాలు వేయసాగాడు. ఆమె పేరు "హెరోడియాస్". ఈ పెళ్లిని "హెరోడియాస్" తల్లి కూడా ప్రోత్సహించింది. కొన్ని జియోన్ (యూద ఆరాధనాలయాలు) లు కూడా ఈ పెళ్ళిని సమర్థించాయి. పాలకుడు "హెరాల్డ్ అంటీపాస్" ని మంచి చేసుకోవాలని ఉద్దేశ్యంతో, లేదా అతడి పట్ల భయంతో ఆ జియోన్ లు అలా చేశాయి.

"హెరాల్డ్ అంటీపాస్" నిషిద్ధపెళ్ళికి గల పథకాల గురించి తెలిసిన యహ్యా (అలైహి) తక్షణం దీనిని ఖండిస్తూ, అలాంటి పెళ్ళి, నిషిద్ధబంధుత్వాల పెళ్ళి (ఇన్ సెస్ట్) గా ప్రకటించారు. ఎలాంటి పరిస్థితుల్లోనూ ఈ పెళ్ళికి ఆమోదం తెలిపేది లేదన్నారు. తౌరాత్ చట్టాలకు ఈ వివాహం విరుద్ధమైనదనీ, ఇది చట్టాన్ని అతిక్రమించడం అవుతుందని చెప్పారు.

*"హెరాల్డ్ అంటీపాస్" ని ప్రలోభానికి గురిచేసిన....,* 

యహ్యా (అలైహి) ప్రకటన విన్న పెళ్ళి కుమార్తె "హెరోడియాస్" మండిపడింది. తనకు చిన్నాన్న వరుస అయిన "హెరాల్డ్ అంటీపాస్" ని పెళ్ళి చేసుకొని రాజ్యాన్ని ఏలాలన్నది ఆమె ఆకాంక్ష. తన లక్ష్యాన్ని సాధించుకోవడం కోసం ఆమె ఒక పథకం వేసింది. ఆకర్షణంగా సింగారించుకుని, "హెరాల్డ్ అంటీపాస్" ని రెచ్చగొట్టేలా అతని ముందు ఆడిపాడింది. కామంతో కళ్ళు మూసుకుపోయిన "హెరాల్డ్ అంటీపాస్" ఆమెను కౌగిలించుకుని....,

హెరాల్డ్ అంటీపాస్ : - హెరోడియాస్! నీ నాట్యంతో నన్ను మెప్పించావు. నీకు ఏం కావాలో కోరుకో! నువ్వు కోరిన వరం ఏదైనా ఇస్తాను.

హెరోడియాస్ : - (హెరాల్డ్ అంటీపాస్!) నాకు యహ్యా (అలైహి) తల కావాలి. అతను యావత్తు రాజ్యంలో మీ గౌరవాన్ని, నా గౌరవాన్ని మంటగలిపాడు. నా ఈ కోరిక తీర్చితే నేను చాలా సంతోషిస్తాను. నన్ను నేను మీకు అర్పించుకుంటాను.

"హెరోడియాస్" మాయలో పడిపోయిన "హెరాల్డ్ అంటీపాస్", ఆమె కోరికను మన్నించాడు. యహ్యా (అలైహి) ను హతమార్చి ఆయన తలను హెరోడియాస్ వద్దకు తీసుకురావడం జరిగింది. యహ్యా (అలైహి) తలను చూసి ఆ క్రూరమైన మహిళ ఆనందంతో చిందులు వేసింది. కానీ అల్లాహ్ ప్రియప్రవక్త యహ్యా (అలైహి) ను హతమార్చినందుకు, ఆమెకే కాదు మొత్తం బనీఇస్రాయీల్ ప్రజలందరూ తీవ్రమైన శిక్షను చవిచూడవలసి వచ్చింది. శత్రుసైన్యాలు ఆ రాజ్యాన్ని సర్వనాశనం చేశాయి.

*జకరియా అలైహిస్సలామ్ గురించి* 

హజ్రత్ ఈసా (అలైహి) మరియు యహ్యా (అలైహి) కు పూర్వం ఉండిన దైవప్రవక్త జకరియా (అలైహి). ప్రవక్త హారూన్ (అలైహి) సంతతికి చెందిన ఇరవైనాలుగు కుటుంబాలు "బైతిల్ మఖ్దిస్ (జెరూసలేం)" కు వంతుల వారిగా సేవచేసేవారు. ఆ ఇరవైనాలుగు   కుటుంబాల్లో అబ్యా కుటుంబం ఒకటి. ఆ అబ్యా కుటుంబానికి నాయకుడైన జకరియా (అలైహి) తన వంతు వచ్చినప్పుడల్లా ఈ సేవలో నిమగ్నులయ్యేవారు. హజ్రత్ ఈసా (అలైహి) మాతృమూర్తి హజ్రత్ మర్యం (అలైహి) ఈయన సంరక్షణలోనే ఇవ్వబడ్డారు.

అయితే నైతిక, సామాజిక సంస్కరణల కోసం జకరియా (అలైహి) చేసిన హితోపదేశాల్ని యూదులు సహించలేక జకరియా (అలైహి) ను అన్యాయంగా చంపివేశారు.

స్వయంగా యూద మతగ్రంథం "తల్మూద్" ప్రకారం...., "బఖ్త్ నస్సర్‌" అనే రాజు "బైతిల్ మఖ్దిస్ (జెరూసలేం)" పై విజయం సాధించిన తర్వాత యూదుల ఆరాధనాలయం (అఖ్సా) లో ప్రవేశించి పరిశీలిస్తున్నారు. అపుడు ఆ రాజుకు వద్ధ్యశిల సమీపంలో ఒకచోట గోడమీద, ఒక వ్యక్తికి బాణం తగిలిన గుర్తు కనిపించింది. అపుడు ఆ రాజు యూదులతో....,

బఖ్త్ నస్సర్‌ : - (యూదులరా!) ఈ గోడమీద బాణం తగిలిన వ్యక్తి ఎవరు? అసలు  ఇదేమిటి?

యూదులు : - (మహారాజ!) ఆయన ప్రవక్త జకరియా (అలైహి). ఇక్కడ మేము జకరియా (అలైహి) ను సంహరించాము. జకరియా (అలైహి), మాలోని చెడుల్ని చూసి మమ్మల్ని విమర్శిస్తూ ఉండేవారు. చివరికి మేము ఈ విమర్శలను, నిందలను సహించలేక ఆయనను చంపేశాము.

ఇలా ప్రవక్త జకరియా అలైహిస్సలామ్ మరణించడం జరిగింది.

Insha Allah రేపటి భాగము - 68 లో, ప్రవక్త హజ్రత్ ఈసా అలైహిస్సలామ్ గారి మాతృమూర్తి హజ్రత్ మర్యం అలైహిస్సలామ్ గురించి తెలుసుకుందాము.

☆☆ ®@£€€q  +97433572282 ☆☆

Note : - ఈ msg లను ముందుకు పంపిస్తూ, మన ఇస్లాం చరిత్ర గురించి మన ముస్లిం సోదరులకు, సోదరీమణులకు తెలియజేస్తారని ఆశిస్తున్నాము.

No comments:

Post a Comment