2

                    బిస్మిల్లాహ్ హిర్రహ్మా నిర్రహీమ్  


🛐🛐🛐🛐 అనంత కరుణామయుడు అపారా కృపాశీలుడు అయిన *అల్లాహ్*  పేరుతో ప్రారంభిస్తున్నాను 🛐🛐🛐🛐


---------------------------------------------------


                              *ఇస్లాం చరిత్ర*  


                                భాగము - 2                  


                                     


~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~


 *షైతాన్ చేసిన మోసం వల్ల ఆది దంపతులైన ఆదం అలైహస్సలాం మరియు హవ్వా అలైహిస్సలామ్ లు దివి నుండి భువి పైకి వచ్చిన తర్వాత ;* 


 *ఆదం పిల్లల వివాహాలు* 


ఆదం అలైహిస్సలామ్ , హవ్వా అలైహిస్సలామ్ కు పిల్లలు పుట్టిన తర్వాత, వారి పిల్లలు తమలో తామే వివాహం చేసుకొని ఉంటారు. మరి ఖురాన్ లో సోదర సోదరీమణులు వివాహం నిషేధించబడినది (హారామ్ చేయబడినది).


భూమి పై ఎలాగైనా మానవ జాతి ని విస్తరించాలన్న ఉద్యేశ్యం తో ఉన్న ఆదం (అలైహి), *అల్లాహ్* అజ్ఞతొనే తన కుమార్తెల పెళ్ళిళ్ళను తన కుమారులతో జరిపించెను. ఆదం మరియు హవ్వా కు ప్రతి కాన్పులో కవలలు పుట్టేవారు. ఆ కవల పిల్లల్లో తప్పని సరిగా ఒక ఆడపిల్ల మరియు ఒక మగ పిల్లవాడు పుట్టేవారు. కాబట్టి ఒక కవలల జంటలో పుట్టిన ఆడపిల్లను వేరొక కవలల జంటలో పుట్టిన మగపిల్లవాడితో ఆయన పెళ్ళి జరిపించేవారు.


దీని గురించి ఇబ్నె మస్ఊద్, ఇతర సహాబాల (రదియల్లాహు అన్హుమ్) నుండి ముర్రాహ్ మరియు ఇబ్నె అబ్బాస్ రదియల్లాహు అన్హుమ్ ను౦డి అబు సాలెహ్‌ మరియు అబు మాలిక్ ల ద్వారా " సుద్ది " అనే పండితుడు ఇలా తెలిపారు. ఆదం అలైహిస్సలామ్ కు ఒక ఆడపిల్ల మరియు ఒక మగపిల్లవాడి తొ కూడిన కవలల జంటలుగా మాత్రమే పిల్లలు పుట్టేవారు. అంటే ప్రతి కాన్పులో కవలలే పుట్టెవారు. ఆ కవలలొ ఒక ఆడపిల్ల మరియు ఒక మగపిల్లవాడు తప్పకుండా పుట్టేవారు. కాబట్టి ఆదం, ఒక కవలల జంటలోని అమ్మాయి ని మరొక కవలల జంట లోని అబ్బాయి తో, మరియు అదే కవల జంట లోని అబ్బాయి తో మరొక కవలల జంట లోని  అమ్మాయితో వివాహం జరిపించారు. అంటే మొదటి కవల జంటలోని అమ్మాయి కి అబ్బాయి కి, వేరొక కవల జంట లోని అబ్బాయి కి అమ్మాయి కి పెళ్ళి జరిపించేవారు.


సోదర సోదరీమణుల మధ్య వివాహం జరుపుకోవడం అనేది ఆదం అలైహిస్సలామ్ షరీఅహ్ ( జీవిన విధానంలో ) లో తప్పనిసరి పరిస్థితులలో అనుమతింపబడగా , తర్వాతి తరాలకు సోదర సోదరీమణుల మధ్య వివాహం అనేది నిషేదించబడినది.ప్రఖ్యాత ఖురాన్ వ్యాఖ్యానకర్త హఫీద్ ఇబ్నె కథీర్ దీనిని ఇలా స్పష్టపరిచారు.


*ఆదం సంతానంలో ఆంతఃకలహం : మహమ్మద్ ! వీరికి ఆదం కొడుకులిద్దరి గాధ విన్పించు .* 



ఖాబీల్ మరియు హాబీల్ ( ఆదం అలైహిస్సలామ్ కుమారులు ) ఒక పశువుని బలిచ్చారు . వారిలో ఖాబీల్ బలి మాత్రమే స్వీకరించబడింది , హాబీల్ బలి స్వీకరించబడలేదు . దాంతో హాబీల్ నేను నిన్ను చంపేస్తాను అన్నాడు . దానికి ఖాబీల్ ఇలా అన్నాడు “ అల్లాహ్ భయభక్తులు కలవారి మొక్కుబడినే స్వీకరిస్తాడు . నీవు నన్ను చంపడానికి చెయ్యి ఎత్తితే నేను మాత్రం నిన్ను చంపడానికి చెయ్యి ఎత్తను , నేను స్వర్గ లోక ప్రభువైన అల్లాహ్ కు భయపడుతున్నాను , నా పాపం , నీ పాపం అంతా నువ్వే మూటకట్టుకొని నరకంలోకి పోయి పడు ,  అదే దుర్మార్గులు తగిన ప్రతిఫలం , నేను కోరేది కూడా అదే ( ఖురాన్ 5:27-29 ).


 చివివరికి హాబీల్ ,  అతని దుష్ట మనసు అతని సోదరుడ్ని వధించడానికి ప్రేరేపించింది . ఈవిధంగా అతను నష్టపోయిన వారిలో చేరిపోయాడు. ఆ తర్వాత అల్లాహ్  ఓ కాకిని పంపారు , కాకి అతనికి అతని సోదరుడి శవాన్నిఎలా పూడ్చిపెట్టాలో చూపడానికి నేలను త్రవ్వడం ప్రారంభించింది. ఇది చూసి అతను " అయ్యయ్యో నా సోదరుడి శవాన్నిఎలా పూడ్చిపెట్టాలో  తెలియదే , ఆ కాకి కి ఉన్నంత జ్ఞానం కూడా నాకు లేకపోయిందే " అని బాధ పడ్డాడు. ఆ తరువాత అతను తాను చేసిన పనికి ఎంతో పశ్చాత్తాపంతో కుమిలిపోయాడు . ( ఖురాన్ 5:30-31 ) .


షైతాన్ చేసిన మోసం వల్ల ఆదిదంపతులైన ఆదం అలైహిస్సలామ్ , హవ్వా అలాహిస్సలాం దివి నుండి భువికి దిగవలసి వచ్చింది . ఆనాటి నుంచి నేటి వరకూ పుట్టిన మానవులంతా వారిద్దరి సంతతే . మానవులు పుట్టక ముందే వారి యొక్క ఆత్మల చేత దేవుడిలా ప్రమాణం చేయించాడు . నీ ప్రభువు ఆదం సంతతిల వీపు నుండి వారి భావితరాల్ని తీసి ప్రమాణం చేయించిన సందర్భం . అపుడు మేము ( అల్లాహ్ ) వారిని ( మానవులను ) సాక్షులుగా పెడుతూ " నేను మీ ప్రభువు ని కానా " అని అన్నాము . దానికి వారు ( మానవులు ) " మీరే మా వ్రభువు . అందుకు మేమే సాక్షులం " అన్నారు .

అపుడు అల్లాహ్ " మేమిలా చేయడానికి కారణం , ప్రళయదినాన మీరు మాకీ విషయం ( అల్లాహ్ మీ ప్రభువు అన్న విషయం ) తెలియదని  చెప్పవచ్చు " అని అన్నారు , లేదా బహు దైవారాధన మాకు పూర్వం మా తాత ముత్తాతలు ప్రారంభించారు , మేము ఆ తర్వాత వారి సంతతి నుండీ పుట్టాము , అలాంటపుడు దుర్జనులు చేసిన ఈ తప్పుకు మమ్మల్ని పట్టుకుంటారా ? " అని చెప్పవచ్చు . వారు సన్మార్గం వైపు మరలుతారన్న ఉద్దేశ్యంతో మేమిలా మా సూక్తులు విడమరచి తెలుపుతున్నాం . ( ఖుర్‌ఆన్ 7:172-174 ) .


 ఈ సత్యాన్ని మానవులకు గుర్తుచేసి వారిని పరిష్కరించడానికి ఆది మానవుడు ఆదం ( అలైహిస్సలామ్ ) నుండి ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం ) వరకు 1,24,000 మంది దైవప్రవక్తలు వచ్చి పోయారు . అయినా మానవుల్లో అత్యధికమంది సృష్టికర్త నిర్దేశించిన రుజుమార్గం , సనాతన ధర్మం అయిన ఇస్లాం పరిధిలోకి రాలేకపాతున్నారు . ఆదిమానవుడు  ప్రస్తుత మానవ రూపంలో ఉన్నా ప్రారంభంలో చాలా పొడగరి అని తెలుస్తోంది . " ఆదం సృష్టించినపుడు ఆయన అరవై బారలు (180 అడుగులు) ఎత్తు ఉండేవారు . తరువాత క్రమంగా తగ్గిపోతూ ఇప్పటి (ఆరడుగల) ఎత్తుకు వచ్చారు " అని దైవస్రవక్త (స) తెలిపారు (బుఖారి).


 ప్రారంభంలో మానవుని వయసు కూడా వేల సంవత్సరాలలో ఉండేదని కొన్ని ఆధారాల ద్వారా తెలుస్తోంది . నూహ్ ప్రవక్త (అలైహి) గురించి “ అతను వారి మధ్య యాభై తక్కువ  వేయి సరివత్సరాలు (950) గడిపాడు ” అని ఖుర్ఆన్ (29:14) లో ఉంది . నూహ్ (అలైహి) దైవప్రవక్త అయిన నాటి నుండి తుఫాన్ సంఘటన సంభవించే వరకు తన జాతి ప్రజల మధ్య 950 సంవత్సరాలు గడిపారని , దీన్నిబట్టి నూహ్ (ఆలైహి) వయసు వేయి సంవత్సరాలకు పైనే ఉండవచ్చని ధర్మ వేత్తలు వ్యాఖ్యానించారు .


ఇబ్నెజౌజీ (రహ్మ లై) ఉల్లేఖనం ప్రకారం ఈసాప్రవక్త అలైహిస్సలాం ( ఈయననే క్రిస్టియన్ లు యేసు ప్రభువు అంటారు ) తన అనుచరుల కోరికపై అల్లాహ్ ని ప్రార్థించగా ఒక అస్థిపంజరం మట్టి లో నుంచి పైకి లేచి ఇలా అంటుంది  “ఒకప్పుడు నేనీ ప్రాంత చక్రవర్తిని . వెయ్యి సంవత్సరాలు జీవించాను , వేయి మంది సంతానం ను కన్నాను , వేయి పట్టణాలు జయించాను , వేయి సైన్యాలను ఓడించాను , వేయి మంది రాజుల్ని చంపాను . చివరికి ఈ విజేత మృత్యు కుహరంలోకి వెళ్ళాడు....” అని చెప్పింది .


వహబ్ బిన్ మునబ్బా (రహ్మలై) ఉల్దేఖనం ప్రకారం ఈసా ప్రవక్త (అలైహి) తన అనుచరుల కోరికపై నూహ్‌ప్రవక్త (అలైహి) కుమారుడు సామ్ సమాధి దగ్గర నిలబడి “ అల్లాహ్ ఆజ్ఞతో సజీవి అయి లే " అన్నారు . సామ్ లేచి ఈసా (అలైహి) ప్రశ్నకు సమాధానమిస్తూ “ నేను నాలుగు వేల సంవత్సరాలు జీవించాను ....” అన్నాడు . ఇలా అతి ప్రాచీన యుగంలో మానవులు వేలాది సంవత్సరాలు జీవించినట్లు తెలుస్తోంది .


పై  హదీసులన్నిటిని బట్టి సృష్టి ప్రారంభంలో ఉన్న మానవులు అత్యధిక , దీర్ఘఆయుష్కులని , దీర్ఘకాయులని స్పష్టంగా తెలుస్తోంది . అదే విధ౦గా ఇతర జీవరాసులు, వృక్షజాతులు వగైరా కూడా ఉందవచ్ఛునేమో! వాస్తవం అల్లాహ్ కే తెలియాలి . ఆనాటి నుంచి మానవుని ఎత్తు , వయసు క్రమంగా తగ్గిపోతూ నేడు సగటున ఆరడుగులకు , 90 మరియు 100 సంవత్సరాలకు దిగిపోయాయి .

 ఖుర్ఆన్ కథనం ప్రకారం  ప్రతి యుగంలో , ప్రతి జాతిలో దైవ ప్రవక్తలు ప్రభవించారు . అత్యధికంగా దైవ ప్రవక్తలు భౌగోళికంగా ప్రపంచానికి కేంద్రస్థాయి ప్రాంతాలైన  ఈజిప్టు

ఇరాక్ , పాలస్తీనా, అరేబియా దేశాలలో ప్రభవించారు . దైవ ప్రవక్తల లో కొందరి పై దివి నుండి దైవ గ్రంధాలు అవతరించాయి. దావూద్ అలాహిస్సలాం కాలంలో జుబూర్ , మూస అలైహిస్సలామ్ కాలంలో తౌరాత్ , ఈసా అలైహిస్సలామ్ ( యేసు ) కాలంలో ఇంజీల్ ( బైబిల్ ) అవతరించాయి.


ఖురాన్ లో ప్రస్తావించబడని మత గ్రంథాలు కూడా ప్రారంభ కాలంలో దైవప్రోక్తగ్రంథాలే అయిఉండవచ్చు ,  కాదని ఖండిచడానికి ఆస్కారమేదీ కనిపించదు .

యావన్మంది దైవప్రవక్తలు ప్రజలకు బోధించిన సారాంశం ఒక్కటే. సృష్టి కర్త , స్వామి , సర్వేశ్వరుడు , ప్రభువు , పోషకుడు , పర్యవేక్షకుడు , ఆపద్బాంధవుడు , ఆది మధ్యాంత రహితుడైన అల్లాహ్ మాత్రమే ఆరాధనకు ( ఇబాదత్ ) అర్హుడు . ఆయన తప్ప మరో ఆరాధ్యుడు లేడు , సమస్త జీవనరంగాల్లో ఆయన ఆజ్జల్నే శిరసావహించాలి , ఆయన దైవత్వంలో , గుణగణాల్లో , శక్తి సామర్త్యాల్లో ఇతరుల్ని భాగ స్వామ్యులుగా చేయకూడదు . ఈ ప్రపంచం ఓ ప్రయాణామజిలి , పరీక్తా వేదిక , తాత్కలికా ఆశ్రమం . మరణానంతరం ప్రతి మనిషీ తన కర్మలకు దైవ న్యాయ స్థానంలో లెక్క చెప్పవలసి ఉంటుంది . కర్మ విచారణ తర్వాత స్వర్గం లేదా నరకం రూపంలో అతనికి శాశ్వత ప్రతిఫలం లభిస్తుంది .

మానవులకు రుజుమార్గం తెలియజేయడానికి వచ్చిన 1,24,000 మంది దైవ ప్రవక్త లలొ 25 మంది ప్రవక్తలను గురిరిచి మాత్రమే ఖురాన్‌ లో ప్రస్తావించడం జరిగింది . ఆ 25 మంది లో కూడా కొందరు ప్రవక్తలను గురించి చాలా సంక్షిప్తంగా , మరికొందరు ప్రవక్తలను గురించి కాస్త వివరంగా తెలియజేయడం జరిగింది . ఆది మానవుడు ఆదం (అలైహి)ను తొట్టతొలి దైవ ప్రవక్తగా  పేర్కొనడం జరిగింది . ఆ తర్వాత నూహ్ , ఇబ్రహీం , లూత్ , యూసుఫ్ , హూద్ , షుఐబ్‌ , సాలిహ్‌ , మూసా , దావూద్ , సులైమాన్ , యహ్యా , ఈసా (ఆలై) ప్రవక్తలను గురించి కొంచెం వివరంగా ప్రస్తావించవించడం జరిగింది.


In Sha Allah రేపటి నుండి మనం ఈ ప్రవక్త ల గురించి , వారి దైవసందేశాలను గురించి తెలుసుకుందాం.


నూహ్ అలాహిస్సలాం గురించి రేపటి భాగము - 3 లో .


 *ముస్లిం సోదరులకు ఒక చిన్న విజ్ఞప్తి  :-* 


ప్రియమైన ముస్లిం సోదరులారా!  ఇప్పటికి కూడా మనలో చాలా మంది ముస్లిం సోదరులకు అసలు ఇస్లాం అంటే ఏంటి ? , దీన్ అంటే ఏంటి ? , మన నబీ ఎవరు ? , అసలు మనం ఎందుకోసం పుట్టాము ?  ------ ఇలాంటి అనేకమైన విషయాలు తెలియదు .మనకు ఈ జీవితాన్ని ఇచ్చినది అల్లాహ్ , అలాంటి అల్లాహ్ కోసం 24 గంటల్లో ఒక్క 5 నిమిషాల సమయం కేటాయించి ఈ msg ను చదవలేమా , కేవలం 5 నిమిషాలు కేటాయించి ఇస్లాం చరిత్ర తెలుసుకుంటారని ఆశిస్తున్నాము. నాకు ఈ msg లు ఒక ముస్లిం సోదరుడు పంపించాడు , నేను మీకు పంపిస్తున్నాను ; అలాగే మీరు కూడా ఈ msg లను ముందుకు పంపించండి.Keep Sharing.

No comments:

Post a Comment