113

☪☪☪       *బిస్మిల్లాహ్ హిర్రహ్మా నిర్రహీమ్*        ☪☪☪

🕋🕋   *అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు*   🕋🕋
🕋🕋     *అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను*      🕋🕋

●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●

🛐🛐🛐             *ఇస్లాం చరిత్ర* *- 113*             🛐🛐🛐

🇸🇦🇸🇦🇸🇦 *ముహమ్మద్ (సల్లం) జీవితచరిత్ర - 28* 🇸🇦🇸🇦🇸🇦 
◆◇◆◇◆◇◆◇◆◇◆◇◆◇◆◇◆◇◆◇◆◇◆◇◆◇◆◇◆◇◆◇◆◇◆

 *"మన మిథ్యా దైవాలకు కీడు జరగబోతోంది" అని మాంత్రికుడు "అబ్రష్", మక్కా ప్రజలతో చెబుతున్న సందర్భం : -* 

అబూ లహబ్ : - మాంత్రిక మహాశయా! మన దేవతలకు అపచారం తలపెట్టేవాడు బహుషా బనీహాషిం తెగలో ఉన్నాడని మీ ఉద్దేశ్యం కాబోలు. నిజంగా అతను మా తెగలో గనక ఉంటే, అందరి కన్నా ముందు నా ఖడ్గమే అతడ్ని చీరేస్తుంది.

అబ్రష్ : - అది నా అభిప్రాయం కాదు. మన దేవతలకు అపచారం తలపెట్టేవాడు బనీహాషిం తెగలో ఉన్నాడని ఈ కపాలమే నాకు తెలియజేసింది. కావాలంటే అతని పేరు కూడా చూడండి. 

అని అంటూ "అబ్రష్" చుట్టూ తిరిగి పుర్రెను అందరికీ చూపించాడు. 

పుర్రె మీద నల్లగా మాడిన రంగులో, స్పష్టమైన అక్షరాల్లో “ముహమ్మద్ (సల్లం)” అనే పేరు ప్రత్యక్షమయి ఉంది. అది చూసి అందరూ ఆశ్చర్యచకితులైపోయారు. కాని కపాలం మీద ప్రత్యక్షమైన ఈ విచిత్ర రాత చూసిన (ముహమ్మద్ (సల్లం) పెదనాన్న) "అబూ తాలిబ్" క్షణం పాటు ఖంగుతిన్నారు. ఆయన ముఖం వివర్ణమైపోయింది. భ్రుకుటి ముడివడింది.

అబూ తాలిబ్ : - అబ్రష్! నువ్వు నా తమ్ముడి కొడుకు మీద నిందమోపి ఏదైనా గొడవ లేవదీయాలనుకుంటున్నావా? అలా ఎన్నటికీ చేయకు. నేను దాన్ని ఎంతమాత్రం సహించను. (అన్నారు కఠినంగా)

అబ్రష్ : - ప్రభూ! నేను మన పవిత్ర దేవత "హుబల్" సాక్షిగా చెబుతున్నాను. నా అంతటా నేనేది చెప్పడం లేదు. నాకున్న జ్యోతిష్ జ్ఞానం, ఈ పుర్రె ద్వారా నాకు తెలుస్తున్న విషయాలనే నేను చెప్తున్నాను. (అన్నాడు కాస్తంత భయపడుతూ)

అబూ తాలిబ్ : - నువ్వొట్టి అబద్దాలమారివి. మా కుటుంబం పట్ల నీకేదో ద్వేషం ఉంది. మా మీద ఎందుకో కక్ష పెంచుకున్నావు. ఆ కక్షను నువ్విలా జ్యోతిష్యం చాటున తీర్చుకోజూస్తున్నావు.

అబ్రష్ : - మహా ప్రభో! మన్నించండి. తమరిలాంటి గౌరవనీయమయిన ఉన్నత కుటుంబంపై నింద మోపే దుస్సాహసానికి పాల్పడగలడా ఈ అల్పుడు? పాల్పడి బతికి బయటపడ గలడా? ప్రభూ! నేను మీ ఉప్పు తిని మీ చెప్పు కింద అణగిమణగి ఉండే అల్పజీవిని. అలాంటి నేను మీ కుటుంబం మీద కక్ష గట్టడమా! దేవ దేవ! అటువంటి పాడు ఆలోచన నా మనస్సులోకే రాదు. దయచేసి కాస్త ఓపిక పట్టండి. ఈ కపాలం ఏం చెబుతుందో మీరే చూద్దురు కాని. (అన్నాడు దీనంగా)

ఆ తరువాత అబ్రష్ ఎదో మంత్రం పఠిస్తూ కపాలం మీద మణికట్టు ఎముకను అయిదు సార్లు తిప్పాడు. తరువాత కపాలాన్ని నేల మీద ఉంచాడు. అది వెంటనే గిరగిర తిరగడం మొదలెట్టింది. కాస్సేపటికి దాని మీదున్న వృత్తాకారం పరిధి క్రమంగా కుంచించుకు పోతూ ఒక చిన్న బిందువుగా మారింది. ఆ తరువాత కపాలం తిరగడం ఆగిపోయింది. జనం ఈ వింతను సంభమాశ్చర్యాలతో చూస్తున్నారు.

అబ్రష్ : - చూశారా పుర్రె మీద ఈ వృత్తం ఎలా బిందువుగా మారిందో? ఇది మన దేవతల్ని అవమానపరిచే వ్యక్తి పేరు తెలుపుతుంది. అది కూడా చూడండి.

కపాలం మళ్ళీ తిరగడం మొదలెట్టింది. బిందువు క్రమేణా విస్తరిస్తూ అక్షర రూపం దాల్చింది. ఆ తరువాత కపాలం తిరగటం ఆగిపోయింది. దానిమీద పెద్ద అక్షరాల్లో స్పష్టంగా “ముహమ్మద్” అనే పదం ప్రత్యక్షమయి ఉంది తళతళ మెరుస్తూ.

అబ్రష్ : - చూడండి, మీ దేవతలకు అపచారం తలపెట్టేవాని పేరును బాగా చూసుకోండి. ఇది తంత్రము కాదు, కనికట్టు కాదూ. పేరు స్పష్టంగా కనిపిస్తోంది.

కపాలం మీద ప్రత్యక్షమైన పేరును జనం చాలా దగ్గరకు పోయి చూశారు. అదే పేరు. అందులో ఇక ఏమాత్రం సందేహం లేదు. అది చూశాక అబూ తాలిబ్ కూడా ఇక ఏమీ మాట్లాడలేకపోయారు.

అబ్రష్ : - పేరును మీరంతా చూశారు కదా! ఇక వినండి. మీరు గనక మీ దేవతలను ప్రసన్నం చేసుకుంటే జరుగబోయే ఈ కీడు తప్పుతుంది.

అబూ లహబ్ : - అయితే దేవతలను ఏ విధంగా ప్రసన్నం చేసుకోవాలి?

అబ్రష్ : - ఆ సంగతి కూడా కపాలమే చెబుతుంది, చూడండి.

అని అంటూ అబ్రష్ కపాలం మీద మణికట్టు ఎముకతో మూడుసార్లు తిప్పాడు. కపాలం మళ్ళీ తిరగటం మొదలుపెట్టింది. దానిమీదున్న అక్షరాలు క్రమంగా కుంచించుకుపోతూ చివరికి అక్కడ ఓ చిన్న బిందువు ఏర్పడింది. ఆ బిందువు తిరిగి మెల్లగా విస్తరిస్తూ పోయింది. కాస్సేపటికి కపాలం తిరగటం ఆగిపోయింది. అప్పుడు దానిమీద “బలి” అనే పదం ప్రత్యక్షమై ఉంది. జనం సంభ్రమాశ్చర్యాలతో దానివైపు చూడసాగారు. 

అబ్రష్ : - చూశారు కదా! ఇక బలిచ్చి మీ దేవతలను ప్రసన్నం చేసుకోండి.

“ఏం బలివ్వాలి?” అని ఒకతను అడిగాడు.

అబ్రష్ : - ఆ సంగతి కూడా ఈ కపాలమే చెబుతుంది, చూడండి.

అని అంటూ అబ్రష్ మంత్రం పఠిస్తూ దానిమీద మూడు సార్లు ఎముకతో తిప్పాడు. కపాలం మళ్ళీ తిరగటం ప్రారంభించింది. తిరిగి తిరిగి ఆగిపోయింది. అప్పుడు దానిమీద బలి అనే అక్షరాలు పోయి ఓ చిన్న బిందువు ఏర్పడింది. కపాలం మళ్ళీ తిరిగి తిరిగి కాస్సేపటికి ఆగిపోయింది. అప్పుడు దానిమీద “అందమైన పదేళ్ళ బాలిక” అనే అక్షర సముదాయం ప్రత్యక్షమయి ఉంది. జనం దగ్గరగా వచ్చి ఆశ్చర్యకితులై చూడసాగారు. కొందరు అబ్రష్ గొప్పతనాన్ని చెప్పుకోసాగారు.

అబ్రష్ : - మీ ప్రశ్నకు సమాధానం లభించింది కదా! మీ కళ్ళతోనే దాన్ని చూసుకున్నారు. ఇక ఈ కపాలం తన పని ముగిస్తోంది.

ఆ తరువాత కపాలం మళ్ళీ తిరగసాగింది. అలా తిరిగి తిరిగి కాస్సేపటికి ఆగిపోయింది. దాంతో దాని మీద ఉన్న అక్షరాలు కూడా అదృశ్యమయిపోయాయి. వెంటనే అబ్రష్ దాన్ని చేత్తో పైకెత్తి ముద్దెట్టుకున్నాడు ముసి ముసి నవ్వులతో. ఆ తరువాత కపాలాన్ని సంచిలో వేసుకుని జనం వైపు ఓ సారి విజయగర్వంతో చూశాడు.

 _(ఈ విషయం ఇంతటితో ముగిసినది.)_

 *దైవదౌత్యపు ఛాయాల్లో ముహమ్మద్ (సల్లం) : -* 

మహనీయ ముహమ్మద్ (సల్లం) ఏ సత్యం కోసం ఏండ్ల తరబడి నిరీక్షిస్తున్నారో ఆ సత్యం సమీపించింది. నలభై సంవత్సరాలు నిండిన ఆయన జీవితంలో అదొక మైలు రాయి. చీకటి మబ్బులు మెల్లమెల్లగా విడిపోతున్నాయి.

అందమైన ఈ ప్రపంచం మూన్నాళ్ళ ముచ్చటని, ఇక్కడి భోగభాగ్యాలు క్షణభంగురాలని ఆయన అప్పుడప్పుడు కంటున్న కలలు సూచిస్తున్నాయి. సకల చరచరాలను, యావత్తు ప్రాణికోటిని సృష్టించిన అసామాన్య శక్తిస్వరూపుడు మాత్రమే మానవులకు ఆరాధ్య దైవమని ఆయన అంతరంగంలో అనుక్షణం మెదులుతున్న ఆలోచనలు నిజరూపం ధరించే సమయం ఆసన్నమయింది.

💐 *Insha Allah రేపటి భాగములో దైవప్రవక్తగా ముహమ్మద్ (సల్లం), జిబ్రీల్ అలైహిస్సలామ్ గారి రాక గురించి తెలుసుకుందాము.* 💐

 *దైవ సందేశం ప్రచార ఘట్టాలు : -* 

దైవప్రవక్త (సల్లం) గారి దైవదౌత్య జీవితాన్ని రెండు భాగాలుగా విభజించవచ్చు. ప్రతి భాగం, పరస్పరం ఒకదానికంటే మరొకటి ప్రస్ఫుటంగా,  ఉన్నతంగా కనపడుతుంది. ఆ రెండు భాగాలు ఇవి....,

1. మక్కా జీవితం - దాదాపు పదమూడు సంవత్సరాలు.

2. మదీనా జీవితం - పది సంవత్సరాలు.

      ఇందులో ప్రతి భాగం అనేక దశలు కలిగి ఉంది. ఈ దశలు వాటి ప్రత్యేకతలు రీత్యా పరస్పరం ఒకదానికంటే మరొకటి వేరుగా, ఉన్నతంగా కనపడతాయి. ఈ విషయం ఆయన (సల్లం) గారి దైవదౌత్య జీవితానికి సంబంధించిన రెండు భాగాల్లో సంభవించే వివిధ సంఘటనలు, పరిస్థితులను లోతుగా అధ్యయనం చేస్తే గానీ అర్థం కాదు.

 *మక్కా జీవితపు మూడు దశలు : -* 

1. మూడు సంవత్సరాలు కొనసాగిన రహస్య దైవసందేశ ప్రచార దశ.

2. మక్కావాసుల నడుమ బాహాటంగా చేసిన సందేశ ప్రచార దశ. ఇది దైవ దౌత్యపు నాల్గవ సంవత్సరం ప్రారంభం మొదలు పదవ ఏట చివరి వరకు. 

3. మక్కా నగరం వెలుపల ఇస్లాం ధర్మప్రచార సాఫల్యం, వికాసాల దశ - దైవదౌత్యపు పదవ ఏట చివరి కాలం నుండి మదీనాకు హిజ్రత్ వరకు.

మదీనా జీవితంలోని దశల వివరాలు ముందు రాబోతున్నాయి.

🖊🖊     ®@£€€q +97433572282      🖊🖊
                    (rafeeq)

🖊🖊      Salman       +919700067779 🖊🖊

*Note : - ఈ msg లను ముందుకు పంపిస్తూ, మన ఇస్లాం చరిత్ర గురించి మన ముస్లిం సోదరులకు, సోదరీమణులకు తెలియజేస్తారని ఆశిస్తున్నాము.*

No comments:

Post a Comment