114

🕌🕌🕌       *బిస్మిల్లాహ్ హిర్రహ్మా నిర్రహీమ్*        🕌🕌🕌

🛐🛐   *అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు*   🛐🛐
🤚🏻✋🏻     *అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను*      🤚🏻✋🏻

 *~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~* 

🕋🕋🕋             *ఇస్లాం చరిత్ర* *- 114*             🕋🕋🕋

☪🇸🇦☪ *ముహమ్మద్ (సల్లం) జీవితచరిత్ర - 29* ☪🇸🇦☪

 *■×=×=×=×=×=×=×=×=×=×=×=×=×=×=×=×=×=×=×■*

 _(కథానుగుణంగా ఈ రోజు భాగము పెద్దగా ప్రచురించడం జరిగినది. సోదరులు గమనించగలరు.)_ 

             *దైవదౌత్యపు ఛత్ర ఛాయల్లో ముహమ్మద్ (సల్లం)* 

 *వర్తకుడిగా ముహమ్మద్ (సల్లం) : -* 

భౌతిక ప్రపంచానికి సంబంధించిన వస్తువులను కొనడం, అమ్మడం ఆయన (సల్లం)కు అసంతృప్తిని కలిగించేది. విసుగునూ కలిగించేది. ఆయన (సల్లం)కు ఖచ్చితంగా తెలుసు, ఈ భూమి మీద తనది వర్తకుడి పాత్ర కాదని. 

వర్తకుడి జీవితం సంకుచితమైనది, నిస్సారమైనది అని ముహమ్మద్ (సల్లం) తెలుసుకున్నారు. ఆయన (సల్లం) ఆత్మ వేరే దేని కొరకో పరితపిస్తోంది. జీవితానికి సంబంధించిన, మృత్యువుకు సంబంధించిన రహస్యాలను తెలుసుకోవాలని తీవ్రంగా ఉబలాటపడుతున్నది. అంతేకాదు, అల్లాహ్ పట్ల, తన పట్ల మానవుడి భాద్యత గురించి ఆలోచిస్తున్నది. తనకు కావలసిన సమాధానాలు ప్రస్తుతం ఉన్న స్థితిలో కాబా గృహంలో దొరకవని ఆయన (సల్లం)కు అర్థమైంది. ఎందుకంటే ఆ ప్రదేశమంతా విగ్రహారాధనతో, మూఢ నమ్మకాలతో నిండిపోయినది. తన ఇంటి దగ్గర కాని, తను చేసే పని కాని ఆయన (సల్లం)ను సంతృప్తి పరచలేకపోయాయి.

ఆ సమయంలో ముహమ్మద్ (సల్లం) అల్లాహ్ ను ఇలా ప్రార్థించారు ; “నేను ఈ అంధకారంలో నుంచి బయటపడే విధంగా నాకు మార్గాన్ని చూపు. నేను సన్మార్గంలో పయనించే విధంగా దారి చూపు”

వ్యాపార నిమిత్తం వెళ్ళిన యాత్రల నుంచి తిరిగి వచ్చిన తరువాత ముహమ్మద్ (సల్లం) తన భార్యను అడిగి, కొద్ది రోజులు గొర్రెలకాపరిగా ఉన్నారు. ఆ సమయాల్లో తను ఎంతో స్వతంత్రంగా నక్షత్రాలను చూస్తూ తన చిన్ననాటి రోజుల వలె గడిపేవారు. సౌమ్యమైన గొర్రెల ప్రకృతి సహచర్యంలో, నిశ్శబ్దంగా పారే నీటి దగ్గర, రాత్రి అందాన్ని ఆస్వాదిస్తూ గడిపేవారు.

అప్పుడు ఆయన (సల్లం) ఆలోచనల్లో చాలా ప్రశాంతత వచ్చేది. తరచుగా ఉపవాసాలు ఉండేవారు. ఖదీజా అయోమయంగా....,

ఖదీజా : - ఏమిటి? పనిదినాన కూడా ఉపవాసమేనా? ఎందుకు మిమ్మల్ని మీరు కష్టపెట్టుకుంటారు?

ముహమ్మద్ (సల్లం) : - నిజంగా నాకు ఉపవాసమే హాయి. పనిలా కాకుండా అది నాకు ఆటలా ఉంటుంది. నాకెంతో తేలికగా, ఉత్సాహంగా అనిపిస్తుంది. (అనేవారు)

              *జిబ్రీల్ (అలైహి) రాక* 

 *హిరా కొండ గుహలో : -* 

మహాప్రవక్త ముహమ్మద్ (సల్లం) వయస్సు దాదాపు నలభై సంవత్సరాలు పూర్తి కావస్తోంది. ఈ నడుమ, అప్పటి వరకు తన జాతి నడవడిక ఆయన్ను జాతి నుండి చాలా దూరానికి తీసుకుపోయింది. ఆయన (సల్లం)కు ఏకాంతవాసమే ప్రియమనిపించడం వలన, నీరు, పేలపు పిండి వెంట తీసుకుని మక్కాకు రెండు మైళ్ళ దూరంలో ఉన్న "హిరా" కొండలోని ఓ గుహలోనికి వెళ్ళి ధ్యానముద్రలో లీనమైపోయేవారు.

ఇది ఓ చిన్న గుహ. దాని పొడవు నాల్గు గజాలు, వెడల్పు ఒకటి ముప్పాతిక గజాలు. క్రింది వైపునకు లోతుగా లేదు. ఇది ఓ ఇరుకైన బాటకు ప్రక్కన, పై బండరాళ్ళు రెండూ పరస్పరం కలుసుకోవడం మూలంగా ఏర్పడిన ఓ గుడిసెలా ఉంది.

దైవప్రవక్త (సల్లం) ఇక్కడికి వచ్చినప్పుడల్లా హజ్రత్ ఖదీజా (రజి) కూడా ఆయన (సల్లం) వెంట వెళ్ళి దగ్గరలోనే ఓ చోట ఉండేవారు. దైవప్రవక్త (సల్లం) రమజాన్ నెల పూర్తిగా ఈ గుహలోనే ఉండేవారు. అక్కడికి వచ్చిపోయ్యే నిరుపేదలకు భోజనం పెడుతూ మిగిలిన కాలం "అల్లాహ్" ఆరాధనలో నిమగ్నమైపోయారు. విశ్వసృష్టి సూచనలను చూస్తూ వాటి వెనుక ఉన్న రహస్యాన్ని గూర్చి ఆలోచించేవారు. ఆయన (సల్లం)కు తన జాతి ఆచరించే బహుదైవారాధనా నమ్మకాలపై, అర్థంలేని విశ్వాసాలపై ఎలాంటి నమ్మకం ఏర్పడలేదు. అయితే ఆయన (సల్లం), పూర్తి నమ్మకంగా, నిస్సంకోచంగా అవలంబించడానికి ఆయన ముందు, ఖచ్చితమైన, నిర్ణీతమైన ఎలాంటి మార్గం కానీ, అతికి - మితానికి అతీతంగా ఉండే ఎలాంటి విధానంగానీ ఏదీ లేదు.

ప్రవక్త (సల్లం)గారి ఈ ఏకాంత జీవితం, నిజానికి అల్లాహ్ ప్రణాళిక యొక్క ఓ భాగమే. ఇలా అల్లాహ్ ఆయన (సల్లం)ను రాబోయే మహోన్నత కార్యం కోసం సిద్ధం చేస్తున్నాడు. యదార్థం ఏమిటంటే, ఏ వ్యక్తి అయినా, మానవ జీవితపు యదార్థాలను ప్రభావితం చేసి, వాటిని ఓ రుజుమార్గం వైపునకు మళ్ళించవలసివస్తే, అతను లౌకిక ఆర్భాటాలు, జీవిత ఝాంజాటాలు, ప్రాపంచిక వ్యామోహాలకు కొంతకాలం దూరంగా ఉంటూ ఏకాంతంలో గడపవలసి ఉంటుంది.

అచ్చం ఈ సూత్రానికి అనుగుణంగా, అల్లాహ్, ముహమ్మద్ (సల్లం)కు మహోన్నత కార్యసాధనా బాధ్యతను అప్పగించి, తద్వారా ప్రపంచ సంస్కరణకు, చరిత్ర గతిని తిప్పడానికి ఎంచుకోదలిచాడు. దైవదౌత్య బాధ్యత ఆయన (సల్లం)పై వేయడానికి మూడు సంవత్సరాలకు ముందే ఆ ఏకాంతవాసాన్ని ఆయన (సల్లం)పై విధించడం జరిగింది. మహాప్రవక్త (సల్లం), ఈ ఏకాంతవాసంలో ఓ నెల్లాళ్ళు విశ్వ వ్యవస్థ గురించి ఆలోచిస్తూ, దాని వెనుక దాగివున్న రహస్యం గురించి ఆలోచించేవారు. దైవాదేశం వస్తే ఆ రహస్యాన్ని బయటపెట్టడానికి ఎల్లవేళలా సిద్ధంగా ఉండేవారు.

 *జిబ్రీల్ (అలైహి) దివ్యావిష్కృతి (వహీ)ని గొనివచ్చిన వేళ : -* 

ముహమ్మద్ (సల్లం) గారి వయస్సు నలభై సంవత్సరాలకు చేరుకుంది. ఈ వయస్సే పరిపుష్టమైన వయస్సు. ప్రవక్తలందరి ప్రాభవం ఈ వయస్సులోనే జరిగిందని చెప్పడం జరుగుతుంది. దైవదౌత్య సూచనలు ఒక్కొక్కటిగా వ్యక్తమవుతూ ప్రకాశించసాగాయి. ఈ సూచనలన్నీ స్వప్నాల రూపంలో కనబడేవి. చూసిన స్వప్నాలన్నీ సాకారం కావడం ఆయన (సల్లం) గమనిస్తూ ఉండేవారు. ఈ పరిస్థితి ఆరు నెలల వరకు కొనసాగింది. ఇది ప్రవక్త పదవికి సంబంధించిన నలభై ఆరవ భాగం. పూర్తి దైవదౌత్య కాలం ఇరవై మూడు సంవత్సరాలు. ఆ తరువాత "హిరా" కొండ గుహలో ఏకాంతవాసపు మూడవ సంవత్సరం ప్రవేశించినప్పుడు, "అల్లాహ్" భూవాసులపై కారుణ్యం కురిపించి ఆయన (సల్లం)ను ప్రవక్తగా నియమించదలిచాడు. జిబ్రీల్ (అలైహి) దివ్య ఖుర్ఆన్ వాక్యాలను కొన్నింటిని ఆయన (సల్లం) వద్దకు తెచ్చారు. ★

 *దైవప్రవక్తగా ముహమ్మద్ (సల్లం) : - ↓* 

దైవప్రవక్త (సల్లం)పై దైవవాణి అవతరణ, నిద్రలో శుభస్వప్నాల రూపంలో ప్రారంభం అయింది. ఆయన (సల్లం) చూసిన ప్రతి స్వప్నం నిజమయ్యేది. ఆ తరువాత ఆయన (సల్లం)కు ఏకాంతం రుచించింది. కాబట్టి ఆయన (సల్లం) "హిరా" కొండ గుహలో ఏకాంతంగా, ఎన్నో రాత్రులు ఇంటికి రాకుండా ఆరాధనలో నిమగ్నులై ఉండేవారు. ఈ ఆరాధన కోసం ఆయన (సల్లం), తన వెంట భోజనం కూడా తీసుకువెళ్ళేవారు. (భోజనం) అయిపోగా, హజ్రత్ ఖదీజా (రజి) ఆయన (సల్లం) వద్దకు వెళ్ళి మిగతా అన్ని రోజుల కోసం భోజనం సమకూర్చి వచ్చేవారు. 

"హిరా" కొండ గుహలో సమస్త విషయాల నుండి దృష్టి మళ్ళించి పూర్తిగా దైవచింతనలో లీనమైపోయిన మహనీయ ముహమ్మద్ (సల్లం) హృదయంలో ఋజుమార్గం రోజురోజుకు కాంతిమంతం కాసాగింది. చివరికి ఆయన (సల్లం) వద్దకు “సత్యం” వచ్చేసింది.

రమజాన్ నెలలోని ఒక ప్రత్యేకమైన రాత్రి ముహమ్మద్ (సల్లం) "హిరా" కొండ వద్దకు వెళ్ళారు. అలవాటుగా కూర్చునే ప్రదేశంలో కూర్చున్నారు. ఒక దినమంతా ఉపవాసం ఉన్నారు. ఒక రాత్రంతా ప్రార్థనలు చేశారు.

చిమ్మ చీకటిలో వేకువజాముకు కొద్ది ముందు ఆయన (సల్లం) ఒక పిలుపును విన్నారు. ఆ పిలుపు పెద్దగా పెరుగుతూ పోయింది. అన్ని దిక్కుల నుంచి వస్తున్నట్లుంది. ఆ కొండ గుహలన్నీ మార్మోగుతున్నట్లుంది. అన్నీటికి అతీతంగా ఉన్నట్లుంది. ఆయన (సల్లం) చుట్టూ పరిశీలించారు. అంతలో, హఠాత్తుగా ఓ అద్భుత దృశ్యం. ఎంతో అందమైన ముఖవర్ఛస్సుతో కూడిన అసాధారణమైన మానవాకారంలో, ముహమ్మద్ (సల్లం) ముందు దైవదూత ప్రత్యక్షమయ్యాడు. అతని చేతిలో అందమైన పట్టువస్త్రం ఉన్నది. దాని మీద కుట్టినట్లుగా ఏదో రాసి ఉంది.

ఆ దైవదూత వచ్చీ రాగానే ముహమ్మద్ (సల్లం)తో...., *"చదువు"* అని అన్నాడు.

దైవప్రవక్త (సల్లం) ఈ హఠాత్పరిణామానికి కంగారు పడుతూ, *"నాకు చదువు రాదు"* అని పలికారు.

అప్పుడు ఆ దైవదూత, ముహమ్మద్ (సల్లం)ను పట్టి గట్టిగా అదిమాడు. ఆ సమయంలో ముహమ్మద్ (సల్లం)కు, తన శక్తి అంతా పిండేసినట్లయింది. దైవదూత, ముహమ్మద్ (సల్లం)ను వదిలేసి మళ్ళీ *"చదువు"* అని అన్నాడు.

దైవప్రవక్త (సల్లం) భయపడుతూ, *"నాకు చదువు రాదు"* అని అన్నారు.

అతను (దైవదూత) తిరిగి ముహమ్మద్ (సల్లం)ను పట్టి అదిమి వదిలిపెట్టాడు. ఆ తరువాత *"చదువు"* అని అన్నాడు.

 *"నాకు చదువు రాదు"* అని ముహమ్మద్ (సల్లం) తిరిగి అన్నారు. (ఇంకో కౌగిలింత జరుగుతుందేమోనని భయంతో)

(ఆ దైవదూత) ముహమ్మద్ (సల్లం)ను మూడోసారి మళ్ళీ పట్టి అదిమి, ఇలా అన్నారు. ↓

 *ఇఖ్రఅ్ బిస్మి రబ్బికల్లజీ ఖలఖ్.* 

 *ఖలఖల్ ఇన్సాన మిన్ అలఖ్.* 

 *ఇఖ్రఅ్ వరబ్బుకల్ అక్రమ్.* 

 *అల్లజీ అల్లమ బిల్ ఖలమ్.* 

 *అల్లమల్ ఇన్సాన మాలమ్ యాలమ్.* 

 _(↑ పై దివ్య ఖుర్ఆన్ వాక్యాల తెలుగు తర్జుమా ↓)_ 

 *(ముహమ్మద్!) చదువు, సృష్టించిన నీ ప్రభువు పేరుతో.* 

 *ఆయన మనిషిని పేరుకుపోయిన నెత్తుటి ముద్దతో సృష్టించాడు.* 

 *నువ్వు చదువుతూ పో. నీ ప్రభువు దయాశీలి.* 

 *ఆయన కలం ద్వారా (జ్ఞాన) బోధ చేశాడు.* 

 *మనిషికి, అతడు ఎరుగని దానిని నేర్పాడు.* *(ఖుర్ఆన్ 96:1-5)* 

ముహమ్మద్ (సల్లం) ఆ వాక్యాలను (దైవదూత కి) అలాగే చదివి వినిపించారు.

ఆ దైవదూత, అతని చేతిలో రాసి ఉన్న వస్త్రం అదృశ్యమయ్యాయి. దైవదూత వెళ్లిన తర్వాత, పై వాక్యాలను ముహమ్మద్ (సల్లం) పదే పదే మననం చేసుకున్నారు. ఆ వాక్యాలు ఉచ్చరించటం వచ్చేంతవరకు ఆయన (సల్లం) వాటిని గుర్తు చేసుకున్నారు.

దైవదూత అదృశ్యమైన తర్వాత, ముహమ్మద్ (సల్లం) ఒంటరిగా మిగిలారు. కాని, ఆయన (సల్లం) మస్తిష్కంలో మాత్రం ఆ వాక్యాలు నిక్షిప్తమైపోయాయి. అంతేకాదు, దైవదూత ఆలింగనం చేసిన ఒక అసాధారణమైన అనుభూతి కూడా ఆయన శరీరంలో ఉండిపోయింది. అకస్మాత్తుగా ముహమ్మద్ (సల్లం) పూర్తిగా స్పృహలోకి వచ్చారు. వెంటనే ఒక ఆకస్మికమైన భయానికి కూడా లోనయ్యారు. ఆయన (సల్లం) గుండె దడదడ లాడుతోంది. చిన్నగా కంపిస్తున్న శరీరంతో, ఒక విధమైన భయంతో లేచి నిలబడ్డారు. గుహ నుంచి బయటికి నడిచారు.

గుహ నుండి బయటకు రాగానే, తనకు కలిసినది ఆత్మ ఏమో అని ముహమ్మద్ (సల్లం) భ్రమపడి, తొందర తొందరగా గుట్టలు, మిట్టలు దాటుకుంటూ ఇంటిదారి పట్టారు.

 *ఇంటికి చేరుకున్న దైవప్రవక్త (సల్లం) : -* 

భీతావహులైన ముహమ్మద్ (సల్లం), ఇంటికి చేరుకున్నారు. ఆ సమయంలో, ఆయన (సల్లం) గారి ధర్మపత్ని హజ్రత్ ఖదీజా (రజి) బిన్తె ఖౌలీద్ ఇంట్లోనే ఉన్నారు. దైవప్రవక్త (సల్లం), కంగారుగా రావడాన్ని ఆమె గమనించారు.

ఆ వెంటనే దైవప్రవక్త (సల్లం) పడక పైకి చేరుకొని, గజగజ వణికిపోతూ తన భార్యతో...., "నా పై దుప్పటి కప్పు, నా పై దుప్పటి కప్పు" అని చెప్పారు.

దైవప్రవక్త (సల్లం) పరిస్థితి చూసి, ఖదీజా (రజి) చాలా కంగారు పడ్డారు. ఆ వెంటనే దుప్పటిని తెచ్చి దైవప్రవక్త (సల్లం) పై కప్పారు.

ఆ సమయంలో దైవప్రవక్త (సల్లం) గారి పరిస్థితికి గల కారణాలను అడగటానికి ఖదీజా (రజి) సాహసించలేకపోయారు.

కొంత సేపు తర్వాత దైవప్రవక్త (సల్లం) పరిస్థితి కుదుటపడింది. భయం దూరమయ్యింది. ముహమ్మద్ (సల్లం) దుప్పటి తొలగించి లేచి కూర్చున్నారు.

అప్పడు హజ్రత్ ఖదీజా (రజి)కు కొంచెం ధైర్యం వచ్చింది. ఆమె, దైవప్రవక్త (సల్లం) తో, "ఏం జరిగింది? ఎందుకంత కంగారు పడుతున్నారు? ఇప్పటిదాకా ఎక్కడున్నారు మీరు?? ఒంట్లో నలతగా ఉందా??" అని ప్రశ్నించసాగారు.

 *తరువాత జరిగినది Insha Allah రేపటి భాగములో తెలుసుకుందాము.* 

 _(★→_*_గుర్తు యొక్క ఉల్లేఖనం గురించి_వివరణ : -_* _బైహఖీ ఉల్లేఖనం ప్రకారం, ఈ స్వాప్నిక కాలం పూర్తి ఆరు నెలలని, స్వప్నాల రూపంలో ప్రవక్త పదవి నలభై ఏళ్ల ప్రాయంలోనే ప్రారంభం అయిన తరువాత రబీ ఉల్ అవ్వల్ మాసంలో (ఇది ఆయన (సల్లం) జన్మించిన మాసమే) జరిగిందని హాఫిజ్ ఇబ్నె హజర్ అంటారు. అయితే, మేల్కొన్న స్థితిలో దివ్యావిష్కృతి మాత్రం రమజాన్ నెలలోనే అవతరించింది. ఫత్హుల్ బారి - 1/27. దైవవాణి అవతరించిన నెల, రోజు మరియు తేదీ.)_ 


✍🏻✍🏻     *®@£€€q* *+97433572282*      ✍🏻✍🏻
                    *(rafeeq)* 

✍🏻✍🏻      *Salman*       *+919700067779* ✍🏻✍🏻

*Note : - ఈ msg లను ముందుకు పంపిస్తూ, మన ఇస్లాం చరిత్ర గురించి మన ముస్లిం సోదరులకు, సోదరీమణులకు తెలియజేస్తారని ఆశిస్తున్నాము.*

No comments:

Post a Comment