70

🛐 🕋 ☪     *బిస్మిల్లాహ్ హిర్రహ్మా నిర్రహీమ్*     ☪ 🕋 🛐

🕋🤚🏻✋🏻🕌 *అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను* 🕌🤚🏻✋🏻🕋

◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆

          🕌☪🕋🛐 *ఇస్లాం చరిత్ర* 🛐🕋☪🕌

                                   *భాగము - 70* 

◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆

 *“(వెంటనే) ఆ పిల్లవాడు ఇలా మాట్లాడటం మొదలుపెట్టాడు: ‘నేను అల్లాహ్ దాసుడ్ని. ఆయన నాకు దివ్యగ్రంథం ప్రసాదించాడు. ప్రవక్తగా నియమించాడు. నేను ఎక్కడున్నా నన్ను శుభప్రదమైనవాణ్ణిగా చేశాడు. నేను బ్రతికున్నంతకాలం నమాజ్, జకాత్‌ విధులు పాటిస్తుండాలని ఆదేశించాడు. నాతల్లి పట్ల నేను విధేయతకలవాడ్నిగా చేశాడు. ఆయన నన్ను దుర్మార్గుడిగా, దౌర్భాగ్యుడిగా చేయలేదు. నేను పుట్టినప్పుడు, చనిపోయేటప్పుడు, తిరిగి బ్రతికించి లేపబడేటప్పుడు నాపై శాంతి అవతరించు గాక!” (ఖుర్‌ఆన్ 19:30-33)* 

అని ఆ పసిబిడ్డ ఈసా (అలైహి) ఈ విధంగా పలికాడు.

ఆ బిడ్డ విశిష్టమైనదని ఆ ప్రజలు గ్రహించారు. అల్లాహ్ తాను అనుకున్నది జరగడానికి కేవలం "అయిపో" అంటే చాలు. అల్లాహ్ తలచినది జరిగిపోతుందని తెలుసుకున్నారు. కానీ ఇదంతా ఒక కనికట్టు విద్యగా భావించిన వారు కూడా కొందరున్నారు. అయితే, పసిబిడ్డ మాట్లాడిన ఈ పరిణామం తర్వాత మర్యం (అలైహి) నజరేత్ పట్టణంలో ఎలాంటి వేధింపులు లేకుండా నివసించడం సాధ్యపడింది.

 *ప్రవక్త పదవికి సంబంధించి మరిన్ని నిదర్శనాలు* 

ప్రవక్త ఈసా (అలైహి) పెరిగి పెద్దయిన కొద్దీ, ఆయన ప్రవక్త పదవికి సంబంధించిన మరిన్ని నిదర్శనాలు బహిర్గతం కాసాగాయి. ఆయన తన స్నేహితులతో మాట్లాడుతూ, వారి కొరకు వారు ఇంట ఎలాంటి భోజనం సిద్ధంగా ఉన్నదో చెప్పేవారు. వారు ఎక్కడ ఏది దాచి ఉంచారో కూడా చెప్పేసేవారు. ఈసా (అలైహి) పాఠాలు నేర్చుకుంటున్నప్పుడు చాలా శ్రద్ధగా వినేవారు. తనకు నేర్పబడినదంతా కంఠస్థం చేసేసేవారు. ఆయన తన ఉపాధ్యాయులను ప్రశ్నించి ప్రతిదీ తెలుసుకునేవారు.

పన్నెండు సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు ఈసా (అలైహి), తన తల్లి మర్యం (అలైహి) తో కలిసి జెరుసలేం వెళ్లారు. ఆయన అక్కడ ఆరాధనాలయంలో తిరుగుతూ, రబ్బీలు (యూద మతబోధకులు) చేస్తున్న బోధనలను అక్కడ జన సమూహంతో పాటు కలిసి విన్నారు. అక్కడ ఉన్నవారందరూ పెద్దలే. పెద్ద వారి మధ్య కూర్చుని మత విషయాలు వినడానికి ఈసా (అలైహి) ఏమాత్రం సంకోచించలేదు. మత బోధకులు ఉపన్యాసాలు శ్రద్ధగా విన్న తర్వాత ఆయన ఆసక్తిగా ఎన్నో ప్రశ్నలు అడిగి, ఆ బోధకుల నుంచి జవాబులు తీసుకున్నారు.

ఈసా (అలైహి) తన అభిప్రాయాలు నిర్మొహమాటంగా తెలిపారు. ధైర్యంగా ప్రశ్నలు అడిగి, తన అభిప్రాయాలు తెలుపుతున్న బాలున్ని చూసి రబ్బీలు కాస్త కలవరపడ్డారు. ఈసా (అలైహి) అడిగిన ప్రశ్నలకు ఆ రబ్బీల వద్ద జవాబులు లేవు. వారు ఏం చెప్పాలో తెలియని పరిస్థితికి గురయ్యారు. ఆయన ప్రశ్నలు అడక్కుండా అడ్డుకోవడానికి, ఆయన నోరు విప్పకుండా చేయడానికి వారు ప్రయత్నించారు. ప్రవక్త ఈసా (అలైహి) వారి ఎత్తుగడలు సాగనివ్వలేదు. తన అభిప్రాయాలను నిర్మొహమాటంగా తెలియజేశారు. ఈ వాగ్వివాదంలో ఆయన ఎంతగా నిమగ్నమైపోయారంటే, ఆయనకు తాను ఇంటికి తిరిగి వెళ్ళవలసి ఉందన్న విషయం కూడా గుర్తుకు రాలేదు.

ఈలోగా ఆయన తల్లి మర్యం (అలైహి), ఈసా (అలైహి) కోసం వెతికి, ఆయన స్నేహితులతో కలిసి ఇంటికి వెళ్లిపోయి ఉంటారని భావించి, తమ ప్రాంతానికి తిరుగుముఖమయ్యారు. కానీ ఇంటికి వచ్చి చూస్తే ఆయన లేరు.

మర్యం (అలైహి) తిరిగి జెరుసలేం వచ్చి, ఈసా (అలైహి) కోసం వెతకడం ప్రారంభించారు. కాని ఎక్కడా ఆయన కనపడలేదు. చివరకు ఆరాధనాలయంలో మత బోధకుల మధ్య, వారితో మాట్లాడుతూ ఈసా (అలైహి) కనపడ్డారు. ఆయన చాలా మామూలుగా, మత చర్చలు ఎప్పటినుంచో చేస్తున్న వ్యక్తి మాదిరిగా ఎలాంటి బిడియం లేకుండా వారి మధ్య కూర్చోని మాట్లాడుతూ కనపడ్డారు. మర్యం (అలైహి) ఆయన్ను చూసి నిశ్చింతగా ఊపిరి పీల్చుకుని, తనను హైరానాకు గురిచేసినందుకు ఈసా (అలైహి) ను మందలించారు. ఆయన జవాబిస్తూ...., "మత పెద్దలతో చర్చల్లో మునిగి, నేను సమయాన్ని మర్చిపోయాను." అని అన్నారు.

 *జిబ్రాయిల్ రాక* 

ప్రవక్త ఈసా (అలైహి) ముప్పై సంవత్సరాల వయసుకు చేరుకున్న తర్వాత దైవదూత జిబ్రయీల్ (అలైహి), ఈసా (అలైహి) వద్దకు వచ్చి ఇంజీల్ గ్రంథాన్ని ఇచ్చారు. దైవగ్రంథమైన ఇంజీల్, అంతకు ముందు అరుదెంచిన ప్రవక్తల గ్రంథాలను, అంతకుముందు అవతరించిన దైవసందేశాలను అన్నింటినీ ధృవీకరించిన గ్రంథం.

కాని అప్పటికి యూదులు తమ ప్రవక్త మూసా (అలైహి) తీసుకువచ్చిన తౌరాత్ గ్రంథానికి చాలా దూరమైపోయారు. వారు కేవలం సంపదను కూడబెట్టడంలో మునిగిపోయారు. ఆరాధనాలయాల నిర్మాణం పేరిట ప్రజల నుంచి భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేసేవారు, కాని ఆ సొమ్ము యావత్తు తమ స్వార్థం కోసం ఉపయోగించుకునేవారు.

అయితే పునరుజ్జీవనాన్ని (మరణానంతరం మళ్ళీ బ్రతికించబడడాన్ని), తీర్పు దినాన్ని విశ్వసించే ఒకే ఒక వర్గం కూడా వారిలో ఉండేది. అలాగే, బహిరంగంగా మాత్రం చాలా ధర్మపరాయణుల్లా, దైవభీతి కలవారిగా నటిస్తూ, తమ వ్యక్తిగత జీవితాల్లో అన్ని విధాల చెడుల్లో కూరుకుపోయిన వర్గం కూడా ఉండేది.

హజ్రత్ ఈసా (అలైహి) తన సందేశ ప్రచార ఉద్యమాన్ని ప్రారంభించారు. అల్లాహ్ మార్గానికి ప్రజలను ఆహ్వానించడం మొదలుపెట్టారు. యూదులు కూరుకుపోయిన చెడుల గురించి వివరిస్తూ వారిని మందలించేవారు.

యూద మత పెద్దల ద్వంద ప్రమాణాలను విమర్శించేవారు. వారి నైతిక పతనం పట్ల వారిని హెచ్చరించేవారు. కాని యూద మత పెద్దలు ప్రవక్త ఈసా (అలైహి) హితబోధను పెడచెవినపెట్టారు. పైగా ఆయనకు శత్రువులైపోయారు. తమ విలాసవంతమైన జీవితాలకు ప్రమాదం ముంచుకు వచ్చిందని భయపడ్డారు. సత్యాన్ని అణిచివేయడానికి అన్ని విధాలా ఎత్తుగడలకు పాల్పడ్డారు. అలాంటి ఎత్తుగడల్లో ఒకటేమిటంటే...., యూద మతపెద్దలు ఈసా (అలైహి) తో....,

యూద మతపెద్దలు : - ఈసా! అల్లాహ్ నీకు ప్రవక్త పదవి ఇచ్చి మా దగ్గరకు పంపించారని అంటున్నావు. అయితే ప్రవక్త పదవికి సంబంధించిన నిదర్శనాలు మాకు చూపు.

(దివ్యఖురాన్ వివరణ)

 *“అల్లాహ్ ఈసాను తన ప్రవక్తగా నియమించి ఇస్రాయీల్ సంతతి దగ్గరకు పంపిస్తాడు. (అతను వారితో ఇలా అ౦టాడు:) ‘నేను మీ ప్రభువు నుండి మీకోసం కొన్ని సూచనలు (నిదర్శనాలు) తెచ్చాను. ఇప్పుడు మీ ముందు మట్టితో పక్షి ఆకారంగల బొమ్మ చేసి అందులో గాలి ఊదుతాను. అది అల్లాహ్ ఆజ్ఞతో సజీవపక్షిగా మారుతుంది. నేను అల్లాహ్ ఆజ్ఞతో పుట్టుగుడ్డిని, కుష్ఠురోగిని నయంచేస్తాను; మృతుల్ని కూడా బ్రతికిస్తాను. మీరు ఏమేమి తింటారో, మీఇండ్లలో ఏమేమి నిలువచేసి ఉంచుతారో అంతా మీకు తెలియజేస్తాను. మీరు విశ్వసించేవారైతే వీటిలో మీకోసం గొప్ప నిదర్శనాలున్నాయి.” (ఖుర్‌ఆన్‌ 3:49)* 

 *“నాకు పూర్వం అవతరించిన తౌరాత్ గ్రంథాన్ని ధృవపరుస్తున్నాను. గతంలో మీకు నిషేధించబడిన కొన్ని వస్తువుల్ని ధర్మసమ్మతం చేయడానిక్కూడా వచ్చాను. నేను మీ దగ్గరికి మీ ప్రభువుకు సంబంధించిన స్పష్టమైన నిదర్శనాలు తెచ్చాను. కనుక అల్లాహ్ కు భయపడింది. నన్ను అనుసరించండి. అల్లాహ్ నాకూ ప్రభువే, మీకూ ప్రభువే. అందువల్ల ఆయన్ని మాత్రమే ఆరాధించండి. ఇదే సరైన మార్గం.” (ఖుర్‌ఆన్ 3:50,51).* 

 *“ఈసా స్పష్టమైన నిదర్శనాలతో వచ్చి (ప్రజలకు) ఇలా బోధించాడు: ‘నేను మీ దగ్గరకు వివేకం తెచ్చాను. మీరు విభేదించుకుంటున్న కొన్ని విషయాల్లోని నిజానిజాలు ఏమిటో మీముందు వెల్లడించడానికే మీ దగ్గరికొచ్చాను. కనుక మీరు అల్లాహ్ కి భయపడండి. నాకు విధేయత చూపండి. నిజానికి అల్లాహ్ యే నా ప్రభువు, మీ ప్రభువు కూడా. ఆయన్నే మీరు ఆరాధించండి. ఇదే సన్మార్గం. (ఖుర్‌ఆన్‌ 43:63,64)* 

 *ప్రవక్త ఈసా (అలైహి) ప్రదర్శించిన మహత్యాలు* 

హజ్రత్ ఈసా (అలైహి) కు అల్లాహ్, మహత్యాలు ప్రదర్శించే శక్తిని ప్రసాదించారు. ఆయన మట్టితో ఒక పక్షి తయారు చేసి దానిలోకి ఊదారు. అల్లాహ్ అభీష్టంతో ఆ మట్టిపక్షి ప్రాణం పోసుకుంది. ఆయన గ్రుడ్డివారికి చూపు వచ్చేలా చేశారు. చెవిటివారికి వినికిడి శక్తి వచ్చేలా చేశారు. కుష్ఠువ్యాధి గ్రస్తులకు వ్యాధి నయమయ్యేలా చేశారు. మరణించిన వారు ప్రాణం పోసుకునేలా చేసి చూపించారు. ఇవన్నీ ఆయన అల్లాహ్ అభీష్టంతో మాత్రమే చేసి చూపించగలిగారు. ఇన్ని మహత్యాలు చేసి చూపించినప్పటికీ చాలా మంది ఆయనను విశ్వసించే బదులు ఆయనను మంత్రగానిగా ఆరోపించారు.

మిగిలినది Insha Allah రేపటి భాగము - 71 లో తెలుసుకుందాము.

☆☆ ®@£€€q  +97433572282 ☆☆

Note : - ఈ msg లను ముందుకు పంపిస్తూ, మన ఇస్లాం చరిత్ర గురించి మన ముస్లిం సోదరులకు, సోదరీమణులకు తెలియజేస్తారని ఆశిస్తున్నాము.

No comments:

Post a Comment