76

🛐 🕋 ☪ *బిస్మిల్లాహ్ హిర్రహ్మా నిర్రహీమ్* ☪ 🕋 🛐

🕋🤚🏻✋🏻🕌 *అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను* 🕌🤚🏻✋🏻🕋

◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆

       🕌☪🕋🛐 *ఇస్లాం చరిత్ర* 🛐🕋☪🕌

                                *భాగము - 76* 

◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆

           *ఈసా అలైహిస్సలామ్ (ఏసు క్రీస్తు) గారి పునరాగమనం.* 

*ఈసా (అలైహి) పునరాగమనం అనేది ప్రళయ సూచనల్లో ఒక సూచన. అనగా ప్రళయానికి ముందు జరిగేవాటిని మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం.* 

జెరూసలేం (బైతుల్ మఖ్ద్దిస్) లోని "మస్జిదుల్ అక్సా" ను ప్రవక్త సులైమాన్ (అలైహి) నిర్మించారు. సులైమాన్ (అలైహి) మరణించిన తరువాత యూదుల వైభవం క్రమేణా పతనమవుతూ చివరికి బాబిల్, అసీరియా రాజుల చేతుల్లో ఘోర పరాజయం పాలయి చెట్టుకొకరు పుట్టకొకరు అయిపోయారు. అపుడు ఆ జాతిలో ప్రభవించిన దైవప్రవక్తలు యూదులను ఓదార్చుతూ....,“ఈ అవమానం నుంచి మిమ్మల్ని కాపాడటానికి అల్లాహ్ తరఫున ఒక మసీహ్ రానున్నాడు” అని శుభవార్త వినిపిస్తుండేవారు. ఆయనే అల్లాహ్ వాగ్దానం చేసిన మసీహ్‌ మౌవూద్.

ఈ భవిష్యత్ ప్రకటనల ఆధారంగా యూదులు, తమను కాపాడటానికి వచ్చే మసీహ్...., 'ఆయన చక్రవర్తి అయిఉంటాడని, యుద్ధం చేసి తమ కోసం ప్రత్యేక రాజ్యం సాధిస్తాడని, దేశ దేశాల నుంచి ఇస్రాయీలీలందరినీ తెచ్చి పాలస్తీనాలో పునరావాసం కల్పిస్తాడని, అలా తమ కోసం ఓ గొప్ప సామ్రాజ్యం స్థాపిస్తాడని' గంపెడు ఆశలు పెట్టుకున్నారు. ఆ ఆశలతోనే యూదులు, మసీహ్‌ మౌవూద్ కోసం ఎదురుచూస్తున్నారు.

అలాంటి సమయంలో, యూదులు ఎదురుచూసే మసీహ్ గా హజ్రత్ ఈసా అలైహిస్సలామ్ ను అల్లాహ్ వారి దగ్గరకు పంపించారు. అయితే యూదుల ఆశలకు భిన్నంగా హజ్రత్ ఈసా (అలైహి), అల్లాహ్ తరఫున మసీహ్ గా ఎలాంటి మందీమార్బలం, రాచరికపు అట్టహాసాలు, సైనిక బలగాలు లేకుండా అతి నిరాడంబరంగా వచ్చేటప్పటికి, యూదులు ఈసా (అలైహి) ని మసీహ్ గా గుర్తించడానికి నిరాకరించారు. ఆయనను మసీహ్ గా అంగీకరించలేదు. పైగా ఈసా (అలైహి) ను హతమార్చడానికి పాల్పడ్డారు. అపుడు అల్లాహ్, ఆ యూదుల కుట్రల నుంచి కాపాడి ఈసా మసీహ్ (అలైహి) ని సశరీరంగా, సజీవంగా పైకి ఎత్తుకున్నారు. ఈ వాస్తవం గ్రహించని యూదులు, ఈసా (అలైహి) ని తాము శిలువపై ఎక్కించి చంపామని భావించారు. ఈ విధంగా యూదులు, తమను కాపాడే "మసీహ్ మౌవూద్‌" ఈసా (అలైహి) కాదని, తమను కాపాడే  “మసీహ్ మౌవూద్‌” వస్తాడని ఇప్పటికీ ఎదురుచూస్తున్నారు. ఆ విధంగా యూదులు ఎదురుచూస్తున్న మసీహ్ మౌవూదే మసీహ్ దజ్జాల్. అతనే ఒంటికన్ను దజ్జాల్‌.

*హజ్రత్ అనస్‌ (రజి) కథనం ప్రకారం దైవప్రవక్త (స) ఇలా చెప్పారు : “ప్రతి దైవప్రవక్త తన అనుచరసమాజాన్ని ఒంటికన్నువాడు, అబద్ధాలరాయుడు గురించి హెచ్చరించారు. జాగ్రత్త! ఆ దజ్జాల్ ఒంటికన్నువాడై ఉంటాడు. మీ ప్రభువు ఒంటికన్నువాడు కాదు. దజ్జాల్‌ కళ్ళ మధ్య కాఫిర్‌ (సత్యతిరస్కారి) అని రాసి ఉంటుంది.” (బుఖారి, ముస్లిం)* 

*హజ్రత్‌ అబూహురైరా (రజి) కథనం ప్రకారం దైవప్రవక్త (స) ప్రవచనం : “దజ్జాల్ గురించి ఏ దైవప్రవక్తా తన అనుచర సమాజాలకు చెప్పని ఒక విషయం నేను మీకు చెప్పనా? వాడు ఒంటికన్నువాడు. తన వెంట స్వర్గం, నరకం లాంటి రెండు వస్తువులు తీసుకొని వస్తాడు. వాడు స్వర్గం అని చెప్పేది నరకమై ఉంటుంది. (బుఖారి, ముస్లిం)* 

*హజ్రత్ అనస్‌ (రజి) కథనం ప్రకారం దైవప్రవక్త (స) ప్రవచనం : “దజ్జాల్‌ మక్కా, మదీనాలు తప్ప ఇతర నగరాలన్నిటినీ తొక్కుతాడు. అ౦టే వాటిలోకి ప్రవేశిస్తాడు. మక్కా, మదీనాలకు వెళ్ళే కొండదారులన్నిటి మీద అల్లాహ్ తన దూతల్ని నియమిస్తాడు, వారు ఒకరి రెక్క మరొకరు పట్టుకొని వాటికి రక్షణ కల్పిస్తుంటారు. దజ్జాల్ (మదీనా దగ్గర్లోని) ఉప్పునేల మీద దిగగానే మదీనా మూడుసార్లు కంపిస్తుంది. అల్లాహ్ మదీనాలో ఉండే అవిశ్వాసులు, కపట ముస్లింలందరినీ బయటికి తీస్తాడు.” (ముస్లిం)* 

*ఒంటికన్ను దజ్జాల్  : -* 

దజ్జాల్‌ ఒంటికన్ను యువకుడై ఉంటాడు. దృష్టిలోపించిన అతని కుడికన్ను ద్రాక్షపండులా ఉబికొచ్చి తెల్లగా వికృతంగా ఉంటుంది. అతని శిరోజాలు రాగి రంగుతో ఉంగరాలు తిరిగుంటాయి. పైగా అతను భారీకాయంతో ఎర్రగా, పొట్టిగా, దొడ్డికాళ్లతో ఉంటాడు. అతని రెండుకళ్ళ మధ్య “కాఫిర్” (అవిశ్వాసి) అనే పదాలు ఉంటాయి. అక్షరాస్యులు, నిరక్షారాస్యులైన ముస్లిములందరూ దాన్ని చదవగల్గుతారు.

దజ్జాల్‌ అసాధారణ శక్తిసామర్థ్యాలు కలవాడై ఉంటాడు. అతను, తనను నమ్మే వారికోసం మరియు నమ్మని వారికోసం, స్వర్గనరకాలు తయారుచేస్తాడు. అతని దగ్గర నీరు, అగ్ని ఉంటాయి. నీరు అని భావించేది నిజంగా నీరు కాదు, అది అగ్ని. అగ్ని అని భావించేది అగ్ని కాదు, అది నీరు. అతని దగ్గర మాంసం, రొట్టెల కొండలు, మంచి నీటి సెలయేరులు ఉంటాయి. యూదులు, దజ్జాల్ శక్తిసామర్థ్యాలు చూసి అతడ్ని నాయకుడిగా చేసుకుంటారు.

*ముగీరా బిన్ షోబా (రజి) కథనం : దజ్జాల్ గురించి దైవప్రవక్త (స)ను నేను అడిగినన్ని ప్రశ్నలు మరెవరూ అడిగిఉండరు. ఆయన నాతో “వాడు నిన్నేమి చేయలేడులే” అన్నారు. అందుకు నేను, “ప్రజలు చెబుతుంటే విన్నాను. వాడి దగ్గర పర్వతమంత ఎత్తు రొట్టెలు, ఒక నీటిసెలయేరు ఉంటుందట” అన్నాను. అందుకాయన “విశ్వాసుల్ని కాపాడుకోవటం అల్లాహ్ కి అంతకంటే చాలా తేలిక” అని చెప్పారు. (బుఖారి, ముస్లిం)* 

దజ్జాల్ ఒక పెద్ద సైన్యంతో సిరియా, ఇరాఖ్ ల మధ్య ఉండే ఒక మార్గం గుండా దండయాత్రల కోసం బయలుదేరుతాడు. సర్వత్రా అల్లకల్లోలం సృష్టిస్తాడు. అనేక జాతులు దజ్జాల్ కి లొంగిపోయి విధేయత ప్రకటిస్తాయి. అస్ఫిహాన్ కు చెందిన డెబ్బై వేలమంది యూదులు అతడ్ని విశ్వసించి అనుచరులైపోతారు. దజ్జాల్, ఊళ్ళకు ఊళ్ళను సర్వనాశనం చేస్తూ అప్రతిహతంగా ముందుకు సాగుతాడు .

ఇలా దజ్జాల్ దండయాత్ర చేస్తూ ఒక జాతి దగ్గరకు చేరుతాడు. ఆ జాతి ప్రజలతో తానే దేవుడిని అని చెప్పి తనను విశ్వసించమని అంటాడు. ఆ జాతి ప్రజలు దజ్జాల్ ని విశ్వసిస్తారు. దజ్జాల్ తన దైవత్వాన్ని నిరూపించుకోవడానికి ఆకాశాన్ని, వర్షం కురిపించమని ఆదేశిస్తాడు. తక్షణమే ఆకాశం నుండి వర్షం కురుస్తుంది. అతను పచ్చిక బీళ్ళు, పంట పొలాలను ఉత్పత్తి చేయమని భూమిని కూడా ఆదేశిస్తాడు. వర్షంతో తడిసిన నేల నుండి చూస్తుండగానే చెట్లు మొలకెత్తి ఎదిగిపొతాయి. పశువులు కూడా పచ్చిక మేసి బాగా బలిసిపోతాయి.

దజ్జాల్ అక్కడినుంచి మరో జాతి దగ్గరకు పోయి తనను విశ్వసించమని చెబుతాడు. ఆ జాతి ప్రజలు అతడిని విశ్వసించడానికి నిరాకరిస్తారు. అయితే దజ్జాల్‌ వారిని వారి మానాన వదిలేసి వెళ్ళిపోతాడు. అతను వెళ్ళిపోగానే ఆ జాతి ప్రజలపై కష్టాలు వచ్చి పడతాయి. వారు తీవ్రమైన కరువుకాటకాలకు గురవుతారు. వర్షాలు ఆగిపోతాయి. వారి ధనంలో చిల్లిగవ్వ కూడా మిగలదు. దారిద్య్రం తాండవిస్తుంది.

దజ్జాల్ ముందుకు సాగుతాడు. ఒక పాడుబడ్డ ప్రదేశం మీదుగా ప్రయాణం చేస్తూ, దజ్జాల్ ఆ ప్రదేశాన్ని ఉద్దేశించి...., “నీలోని నిక్షేపాలన్నిటినీ బయటికి తియ్యి” అంటాడు. అప్పుడు ఆ నేల క్రింద ఉన్న నిక్షేపాలన్నీ బయల్పడి తేనెటీగలు తమ నాయకుని వెనకాల నడిచినట్లు దజ్జాల్ వెనకాల నడవడం ప్రారంభిస్తాయి. ఆ తరువాత దజ్జాల్‌ ఒక యువకుడిని పిలుస్తాడు. ఆ యువకుడు దగ్గరకు రాగానే అతడ్ని ఖడ్గంతో రెండు ఖండాలుగా నరికి వాటిని దూర౦గా విసిరి పడవేస్తాడు. తరువాత ఆ నరికిన వ్యక్తిని పేరు పెట్టి పిలుస్తాడు. వెంటనే ఆ రెండు ఖండాలు కలిసిపోయి ఆ యువకుడు నవ్వుతూ దజ్జాల్ దగ్గరకు వస్తాడు.

ఆ తర్వాత దజ్జాల్ మదీనా సమీపానికి చేరుకుంటాడు, అప్పుడు మదీనాకు ఏడు ద్వారాలు ఉంటాయి. ప్రతి ద్వారం దగ్గర ఇద్దరు దైవదూతలు చొప్పున మొత్తం పద్నాలుగు మంది దైవదూతలు కాపలా కాస్తుంటారు. అందువల్ల దజ్జాల్ నగరంలోకి ప్రవేశించలేడు. అక్కడి నుంచి ఉహద్ కొండ దగ్గరకు వెళ్ళి, ఆ కొండ వెనుక వైపున విడిది చేస్తాడు. అదే సమయంలో మదీనాలో మూడు భూప్రకంపనాలు వస్తాయి. దాంతో నగరంలోని దుర్జనులందరూ భయాందోళనలతో బయటికి పరుగెత్తి దజ్జాల్‌ దగ్గరికి చేరుకుంటారు.

*వీర విశ్వాసి : -* 

దజ్జాల్‌ ఉహద్ కొండ దగ్గర విడిది చేసే రోజుల్లోనే ఒక ముస్లిం దజ్జాల్ దగ్గరికి పోవడానికి ప్రయత్నిస్తాడు. కాని దజ్జాల్ సైనికులు అతడిని అడ్డగిస్తారు. అపుడు దజ్జాల్ సైనికులు, ఆ విశ్వాసి తో....,

దజ్జాల్ సైనికులు : - ఎక్కడికి పోవాలనుకుంటున్నావు?.

విశ్వాసి : - ఇటీవల బయలెడిన (అసత్యవాది) మనిషిని కలుసుకోవడానికి వెళ్తున్నాను.

దజ్జాల్‌ సైనికులు : - ఏమిటి! నీవు మా ప్రభువుని దేవునిగా విశ్వసించడంలేదా?

విశ్వాసి : - మాకు మా ప్రభువుని గుర్తించడంలో సందేహమే లేదు. (అలాంటప్పుడు మేము మీ అసత్య ప్రభువుని ఎందుకు నమ్ముతాము?)

ఈ మాట విని దజ్జాల్ సైనికులు మండిపత్తూ ఆ విశ్వాసిని చంపడానికి సిద్ధపడతారు. అయితే వారిలో ఒకడు చంపడానికి సిద్ధపడిన వారిని వారిస్తూ...., “మన ప్రభువు, తన అనుమతి లేకుండా ఎవ్వరినీ వధించరాదని ఆదేశించలేదా?” అని అంటాడు. అప్పుడు, వారు ఆ విశ్వాసిని దజ్జాల్ దగ్గరికి తీసుకెళ్తారు.

*దజ్జాల్ దగ్గరకు చేరుకున్న విశ్వాసి : -* 

దజ్జాల్ ని చూడగానే ఆ విశ్వాసి ఎలుగెత్తి....,

విశ్వాసి : - ప్రజలారా! (అంతిమ) దైవప్రవక్త (సల్లం) తెలిపిన దజ్జాల్ ఇతనే.

దజ్జాల్ ఈ మాట వినగానే కస్సుమంటూ....,

దజ్జాల్ : - ఇతడిని బోర్లా పడవేయండి. (అని తన మనుషులను ఆజ్ఞాపిస్తాడు.)

వారు వెంటనే ఆ విశ్వాసిని పట్టుకొని బోర్లా పడవేస్తారు.

దజ్జాల్ : - ఇతడిని చితగ్గొట్టి గాయపర్చండి. (అని ఆదేశిస్తాడు)

వారు ఆ విశ్వాసిని బాగా కొట్టి అతని నడుమును విరగ్గొడతారు. అపుడు దజ్జాల్, ఆ విశ్వాసితో....,

దజ్జాల్ : - ఇప్పటికైనా నన్ను విశ్వసిస్తావా?

విశ్వాసి : - నువ్వు అసత్యమ మసీహ్ వి.

దజ్జాల్ తన మనుషుల్ని మళ్ళీ ఆదేశిస్తూ....,

దజ్జాల్ : - రంపంతో ఇతని తల నుంచి కాళ్ళ సందుదాక కోసి రెండు ముక్కలు చేసేయండి.

దజ్జాల్ ఆజ్ఞ ప్రకారం, అతని మనుషులు ఆ విశ్వాసిని రెండు ముక్కలుగా చేస్తారు. అప్పుడు దజ్జాల్ ఆ రెండు ఖండాల మధ్యకు వచ్చి, “లే.. లేచి నిలబడు” అంటాడు. దాంతో రెండు ఖండాలు కలసిపోయి ఆ విశ్వాసి లేచి నిలబడతాడు. దజ్జాల్ మళ్ళీ విశ్వాసిని ఉద్దేశించి....,

దజ్జాల్ : - ఇప్పుడు కూడా నన్ను విశ్వసించవా?

విశ్వాసి : - నువ్వు అసత్య దజ్జాల్ కావడంలో నాకు ఇప్పుడు ఏ మాత్రం సందేహం లేదు. ప్రజలారా! వినండి, నా తరువాత ఇతను మరెవ్వరినీ వేధించలేడు.

దజ్జాల్ ఈ మాట విని విశ్వాసిని చంపడానికి ప్రయత్నిస్తాడు. కాని చ౦పలేడు. చివరికి అతను విశ్వాసి కాళ్ళుచేతులు పట్టుకొని తన నరకంలో పడవేసి, అగ్నిలో పడిపోయాడునుకుంటాడు. నిజానికి ఆ విశ్వాసి స్వర్గంలో ప్రవేశించాడు.

తరువాత జరిగినది Insha Allah రేపటి భాగము - 77 లో తెలుసుకుందాము.

☆☆ ®@£€€q  +97433572282 ☆☆

Note : - ఈ msg లను ముందుకు పంపిస్తూ, మన ఇస్లాం చరిత్ర గురించి మన ముస్లిం సోదరులకు, సోదరీమణులకు తెలియజేస్తారని ఆశిస్తున్నాము.

No comments:

Post a Comment