32

🤚🏻✋🏻🤚🏻✋🏻 *బిస్మిల్లాహ్ హిర్రహ్మా నిర్రహీమ్* 🤚🏻✋🏻🤚🏻✋🏻

🛐🕋🛐🕋 *అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను* ☪🕋☪🕋

°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°

       🕌🕋🕌🕋 *ఇస్లాం చరిత్ర* 🕋🕌🕋🕌

                               *భాగము - 32* 

____________________________________________

*మూసా (అలైహి) తో సంభాషిస్తున్న అల్లాహ్* 

అల్లాహ్, తను ఇచ్చిన వాగ్దానం ప్రకారం బనీఇస్రాయీల్ ప్రజల జీవన సరళి కి సంబంధించిన హితవులు, ప్రతి విషయానికి సంబంధించిన మార్గదర్శక సూత్రాలు రాతి ఫలకలపై రాసి, తౌరాత్ గ్రంథ రూపంలో మూసా (అలైహి) కు ఇచ్చారు. ఆ గ్రంథంలో అన్ని విషయాలు వివరించబడ్డాయి.

అల్లాహ్ : - మూసా! నీ వెనుక నీవు ఇక్కడికి వచ్చిన తర్వాత మేము నీ జాతి ప్రజలను పరీక్షకు గురి చేశాము. సామిరీ అనేవాడు బనీఇస్రాయీల్ ప్రజలను పెడదారి పట్టించాడు.

ఈ మాటలు విన్న మూసా (అలైహి) కు తల తీసేసినట్టైంది. ఎంతో ఆగ్రహంతో, విచారం తో కూడిన భావోద్రేకాలతో తన జాతి దగ్గరకు తిరిగి వచ్చాడు.

తన జాతి ప్రజల వద్దకు తిరిగి వచ్చిన మూసా (అలైహి), వారందరూ కలిసి ఒక ఆవుదూడ విగ్రహం ముందు పాటలు పాడుతూ నృత్యాలు చేయడం చూశారు. ఈ అజ్ఞానపు ఆచారాన్ని చూసిన మూసా (అలైహి) కోపం పట్టలేక వారి కోసం తీసుకువచ్చిన చట్టాలున్న రాతి ఫలకలను క్రింద పడేశారు.

తన జాతి ప్రజలతో మూసా (అలైహి) : - నా జాతి ప్రజలారా! మీ ప్రభువు మీకు మంచి వాగ్దానాలు చేయలేదా? అది మీకు ఆలస్యం అయినట్లు అనిపించిందా? లేక నాకు మీరు చేసిన వాగ్దాన భంగానికి మీరే మీ ప్రభువు ఆగ్రహాన్ని ఆహ్వానదలిచారా?

బనీఇస్రాయీల్ ప్రజలు : - లేదు మూసా! మా అంతట మేము వాగ్దాన భంగం చేయలేదు. కానీ ఆ బంగారు ఆభరణాల భారం చాలా ఎక్కువైంది. అందుకే సామిరీ చెప్పినట్లు ఆభరణాలను మంటల్లో పడవేశాము. వాడు ఈ ఆవుదూడ విగ్రహాన్ని చేసి మమ్మల్ని తప్పుదారి పట్టించాడు.

*అసలేం జరిగిందంటే....* 

అల్లాహ్ ఆజ్ఞ ప్రకారం మూసా (అలైహి) తౌరాత్ గ్రంథం కు సంబంధించిన ఫలకాల కోసం అల్లాహ్ ఆదేశించిన తూర్ కొండ వద్దకు వెళ్లారు. బనీఇస్రాయీల్ ప్రజలను వదిలి మూసా (అలైహి) సినాయ్ లోని తూర్ కొండ వద్దకు వెళ్లి ముప్పై రోజులు గడిచిపోయాయి. ఇస్రాయీల్ ప్రజలు అసహనానికి, అలజడికి గురయ్యారు. అల్లాహ్ మూసా (అలైహి) కు  మరో పది రోజులు గడువు పెంచి, అధిక కాలం అక్కడ ఉంచాడన్న విషయం వారికి తెలుసు.

బనీఇస్రాయీల్ ప్రజల్లో ఒక వ్యక్తి సామిరీ. ఇతను బంగారపు పని చేసే వ్యక్తి. దుర్మార్గపు ఆలోచనలు కలిగిన సామిరి తమ జాతి ప్రజలకి మరో మార్గదర్శిని వెతుక్కోవాలని ప్రచారం చేశాడు. అన్నమాట ప్రకారం మూసా (అలైహి) రాలేదు కాబట్టి, నిజమైన మార్గదర్శనం పొందటానికి తమకు ఒక దేవుని అవసరం ఉంది కాబట్టి, ఇస్రాయీల్ ప్రజలకి ఒక కొత్త దేవుణ్ణి తాను వెతికి పెడతానన్నాడు.

ఆ తర్వాత బంగారు ఆభరణాలు బరువు ఎక్కువగా ఉండటం వల్ల మోయడానికి బాధపడుతున్న ఇస్రాయీల్ ప్రజల నుంచి బంగారు ఆభరణాలను అన్నింటినీ సేకరించాడు. ఒక గొయ్యి తవ్వి ఆ బంగారు ఆభరణాలను అందులో వేశాడు. పెద్ద మంట పెట్టి వాటిని కరగబెట్టాడు. దాన్ని పోతపోస్తూ, మంత్రగాళ్ళు అమాయకులను మభ్యపుచ్చడానికి చేసే చేష్టలన్నీ చేశాడు. అలా కరిగిన ఆ బంగారాన్ని ఒక ఆవుదూడ విగ్రహంగా తయారుజేశాడు. ఆ ఆవుదూడ విగ్రహం లోపల బోలుగా ఖాళీస్థలం ఉంది. అందులోనుంచి గాలి వీస్తే ఒక విధమైన దూడ అరుపులాంటి శబ్దం వచ్చేది. వారందరూ ఆ చోద్యం చూసి "ఇదే మన దైవం. మూసా (అలైహి) దైవం కూడా ఇదే. కాకపోతే మూసా (అలైహి) దీనిని మరచిపోయాడు." అని అరిచారు. బనీఇస్రాయీల్ ప్రజల గతకాలం అంతా మూఢనమ్మకాలతోనే గడిచిపోయింది. కాబట్టి వారు ఆ విచిత్రమైన శబ్దం మానవాతీత శక్తి అన్న నిర్ణయానికి వచ్చేసారు. ఆ విగ్రహాన్ని ఒక సజీవమైన దైవంగా భావించారు.

ఇక అంతకు ముందు విషయానికి వస్తే, మూసా (అలైహి) తౌరాత్ గ్రంథాన్ని స్వీకరించడానికి తూర్ కొండకు వెళ్లే ముందు తన జాతి ప్రజలకు నాయకునిగా తన సోదరుడు హారూన్ ని నియమించి వెళ్లారు.

బనీఇస్రాయీల్ ప్రజలు ఆవుదూడ విగ్రహాన్ని మానవాతీత శక్తిగా భావించి, దైవంగా చేసుకొని ఆరాధించడం మొదలుపెట్టారు. ఆ ప్రజలకి తాత్కాలిక నాయకునిగా నియమింపబడిన హారూన్ ఈ పరిణామాన్ని చూసి తీవ్రంగా రోదించారు. చాలా దుఃఖానికి గురయ్యారు. తన జాతి ప్రజలకు హారూన్ నచ్చజెబుతూ....

హారూన్ : - సోదరులారా! మీరు మోసానికి గురవుతున్నారు. ఈ ఆవుదూడ ద్వారా మీరు సంకటస్థితిలో పడ్డారు. మన ప్రభువు మిమ్మల్ని పరీక్షకు గురి చేశారు. మన ప్రభువు కరుణామయుడు, అపార కృపాశీలుడు. నా మాటలు వినండి, నేను చెప్పినట్లు చేయండి. నన్ను అనుసరించండి. (అని ఎంత ప్రాధేయపడినా వాళ్ళు వినలేదు. వారు హారూన్ మాటలను పెడచెవిన పెట్టారు)

బనీఇస్రాయీల్ ప్రజలు : - మూసా (అలైహి) వస్తేగాని ఈ దైవానికి పూజలు ఆపేది లేదు. మూసా (అలైహి) రానంతవరకు మేము ఈ ఆవుదూడ విగ్రహాన్ని పూజిస్తుంటాము.

అయితే ఒకే దేవుని విశ్వాసంలో స్థిరంగా ఉన్నవాళ్లు ఈ అజ్ఞానులకు వేరయ్యారు. భేదాభిప్రాయాలు ఉన్నప్పటికీ శాంతి భద్రతలు కొనసాగాయి.

బనీఇస్రాయీల్ ప్రజలు ఆవుదూడ విగ్రహాన్ని దైవంగా చేసుకుని ఆరాధిస్తున్న సమయంలో సరిగ్గా మూసా (అలైహి) అల్లాహ్ తో సంభాషణలో ఉన్నారు. తౌరాత్ గ్రంథ ఫలకలను మూసా (అలైహి) కు అందజేసిన తర్వాత అల్లాహ్, మూసా (అలైహి) తో...., "మూసా! నీవు లేనప్పుడు మేము నీ ప్రజలను పరీక్షించాము. సామిరీ వాళ్ళను తప్పుదోవ పట్టించాడు." అని తెలిపారు.

ఈ మాటలు విన్న మూసా (అలైహి) కు తల తీసేసినట్టైంది. ఎంతో ఆగ్రహంతో, విచారం తో కూడిన భావోద్రేకాలతో తన జాతి దగ్గరకు తిరిగి వచ్చాడు.

తన జాతి ప్రజల వద్దకు తిరిగి వచ్చిన మూసా (అలైహి), వారందరూ కలిసి ఒక ఆవుదూడ విగ్రహం ముందు పాటలు పాడుతూ నృత్యాలు చేయడం చూశారు. ఈ అజ్ఞానపు ఆచారాన్ని చూసిన మూసా (అలైహి) కోపం పట్టలేక వారి కోసం తీసుకువచ్చిన చట్టాలున్న రాతి ఫలకలను క్రింద పడేశారు. తన సోదరుడు హారూన్ తల వెంట్రుకలు, గెడ్డాన్ని పట్టుకుని గుంజుతూ, "మన జాతి ప్రజలు మార్గభ్రష్టులై పోతుంటే చూసి వారిని వారించకుండా ఏ విషయం నిన్ను అడ్డుకుంది. తప్పుదారి పట్టకుండా ఎందుకు ఆపలేదు. ఈ దూరాచారాన్ని ఎందుకు నిలువరించలేదు. నీవు నా ఆదేశాన్ని ఎందుకు ఉల్లంఘించావు." అని కోపంగా నిలదీశారు.

హారూన్ : - నా తల్లి కుమారుడా! నా తల వెంట్రుకలు, గెడ్డం పట్టుకుని లాగకు, ముందు వాటిని వదులు. ఈ ప్రజలు నన్ను బలహీనుడిగా చేశారు, నా నోరు నొక్కేశారు. వాళ్ళు దాదాపు నన్ను చంపినంత పని చేశారు. నా శత్రువులు ఆనందించేలా వ్యవహరించకు. నన్ను దుర్మార్గుల్లో చేర్చకు. ఇస్రాయీల్ సంతతి ప్రజల్లో చీలికలు సృష్టించానని, నువ్వు నిందిస్తావని కూడా నేను భయపడ్డాను. అల్లాహ్ దయ వల్ల అలా అనలేదు.

ఈ మాటలు విన్న మూసా (అలైహి) ఆగ్రహం నెమ్మదిగా చల్లారింది. హారూన్ నిస్సహాయ స్థితిని ఆయన అర్థం చేసుకున్నారు. పరిస్థితిని సంయమనం తో చక్కదిద్దాలని అనుకున్నారు. "ప్రభు! నన్ను నా సోదరున్ని క్షమించు. మమ్మల్నిద్దరిని నీ కారుణ్యఆశ్రయంలో చోటివ్వు. నీవు అందరికంటే గొప్ప కరుణామయుడివి." అని అల్లాహ్ తో వేడుకున్నారు.

*ఆ తర్వాత సామిరీ ని పిలిపించారు.* 

మూసా (అలైహి) : - సామిరీ, మన జాతి ప్రజల్లో చీలిక తీసుకురావడానికి కారణం ఏమిటి? వాళ్ళను తప్పుదారి ఎందుకు పట్టించావ్? దీనికి నువ్వు ఏమంటావ్?

సామిరీ (నిర్లక్ష్యంగా) : - నేను ప్రజలకు కనిపించని ఒక విచిత్ర వస్తువుని చూశాను. వాళ్ళు అర్థం చేసుకోలేనిది నేను అర్థం చేసుకున్నాను. మీ (మూసా) పాదచిహ్నాల వద్ద నుంచి కాస్త మట్టి తీసుకొని ఆవుదూడ విగ్రహం తయారు చేసి పోత పోస్తున్నప్పుడు విగ్రహంలోకి వేశాను. అలా చేయాలని నా మనసుకు అనిపించింది. నా మనసుకు తట్టిన విధంగా చేశాను.

మూసా (అలైహి) : - సరే! ఇక్కడి నుంచి వెళ్లిపో. నీలాంటి వాడు ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు. ఇక నుంచి నీవు జీవితాంతం "నన్ను తాకకండి" అని చెబుతూ తిరుగుతుంటావు. నీకోసం వాగ్దానా సమయమొకటి నిర్ణయమైంది. అది ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పిపోదు. దేనిని ముట్టుకున్న నొప్పి కలిగేలా మేము నీకు శిక్ష విధించి, శపించాము. ఇప్పుడు చూడు నీ ఇష్టదేవత గతి ఏమవుతుందో? దీనిని మేము కాల్చి, ముక్కలుముక్కలుగా చేసి సముద్రంలోకి విసిరిపారేస్తాము.

ఆ పిదప మూసా (అలైహి) కోపంతోనే తన ప్రజలను ఉద్దేశించి ఇలా ప్రసంగించారు.

మూసా (అలైహి) : - మీ ప్రభువు మీకు వాగ్దానం చేయలేదా? నిర్దారిత సమయం మీకు చాలా ఎక్కువైపోయిందా? లేక నా పట్ల విశ్వాసాన్ని మానుకొని అల్లాహ్ ఆగ్రహాన్ని కొనితెచ్చుకోవాలని భావిస్తున్నారా?

బనీఇస్రాయీల్ ప్రజలు (తలవంచుకుని) : - మీ పట్ల విశ్వాసాన్ని గాని, మా సంకల్పాన్ని గాని మేము వదులుకోలేదు. కానీ ఆ బంగారు ఆభరణాల భారం చాలా ఎక్కువైంది. అందుకే సామిరీ చెప్పినట్లు వాటిని మంటల్లో పారేశాము. వాడు ఈ బంగారు ఆవుదూడ విగ్రహం తయారు చేసి మమ్మల్ని తప్పుదారి పట్టించాడు.

ఇస్రాయీల్ ప్రజలు (ఇంకా పశ్చాత్తాపపడుతూ) : - మా ప్రభువు మా పై కరుణ చూపకపోతే, మమ్మల్ని క్షమించకపోతే మేము నిస్సందేహంగా వైఫల్యం చెందుతాము. మేము నిజంగా ప్రాధేయపడుతున్నాము, మాకోసం తగిన మార్గాన్ని చూపండి.

మూసా (అలైహి) : - పశ్చాత్తాపపడండి. పశ్చాత్తాపానికి, క్షమాభిక్షకు మార్గం చూపమని అల్లాహ్ ను వేడుకోండి. మీ ప్రాపంచిక కోరికలను అణచివేయండి. ప్రక్షాళన పొందండి. మీరు పరిశుద్ధులయ్యే వరకు మీలో ఉన్న దుర్మార్గపు ఆలోచనలను నిర్మూలించండి. మీరు ఆత్మ వికాసం పొందగలరు.

మూసా (అలైహి) చెప్పిన ప్రకారం బనీఇస్రాయీల్ ప్రజలు చాలా చాలా పశ్చాత్తాపపడ్డారు. అల్లాహ్ వారి పశ్చాత్తాపాన్ని స్వీకరించి, క్షమించాడు. అల్లాహ్ అపార కృపాశీలుడు. అమితంగా కరుణించేవాడు.

కానీ సామిరీ ఎలాంటి పశ్చాత్తాపాన్ని ప్రకటించలేదు. తాను చేసిన పనికి బాధపడనూ లేదు. సామిరీ తో ఎవరూ ఎలాంటి సంబంధం కలిగి ఉండరాదని మూసా (అలైహి) ఆదేశించారు. ఆ విధంగా సామిరీ బహిష్కరించబడ్డాడు. మూసా (అలైహి) ఆ బంగారు ఆవుదూడ విగ్రహాన్ని కరిగించి, కరిగిన లోహాన్ని సముద్రంలో పారవేయించారు. ఆ విధంగా బంగారు ఆవుదూడ కథను ముగించారు.

నా జాతి ప్రజలారా! మన ఆరాధ్యుడు అల్లాహ్ మాత్రమే. అల్లహ్ తప్ప మరో ఆరాధ్యుడు లేడు.

మూసా (అలైహి) కోపం చల్లారిన తర్వాత, అల్లాహ్ అందజేసిన తౌరాత్ గ్రంథపు ఫలకాలను ఎత్తి చేతుల్లోకి తీసుకున్నారు.వాటిపై తమ ప్రభువుకు భయపడేవారి కోసం మార్గదర్శనం, కారుణ్యం ఉన్నాయని వ్రాయబడి ఉంది.

_[సామిరీ అనేది అతని అసలు పేరు కాదు. ఇది అతని తెగ లేదా సంతతి లేదా స్వస్థలానికి సంబంధించిన పేరయి ఉంటుంది. ఇంజీల్ గ్రంథం ప్రకారం అతని అసలు పేరు హారూన్. మూసా (అలైహి) సోదరుని పేరు కూడా హారూన్ నే అయినందువల్ల యూదులు సామిరీ చేసిన నిర్వాకాన్ని పొరపాటునో లేక కావాలనో హారూన్ కు అంటగట్టారు.]_ 

మిగతాది Insha Allah రేపటి భాగము - 33 లో తెలుసుకుందాము.

Note : - ఈ msg లను ముందుకు పంపిస్తూ, మన ఇస్లాం చరిత్ర గురించి మన ముస్లిం సోదరులకు తెలియజేస్తారని ఆశిస్తున్నాము.

☆☆ ®@£€€q  +97433572282   ☆☆

No comments:

Post a Comment