34

🤚🏻✋🏻🤚🏻✋🏻 *బిస్మిల్లాహ్ హిర్రహ్మా నిర్రహీమ్* 🤚🏻✋🏻🤚🏻✋🏻

🛐🕋🛐🕋 *అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను* ☪🕋☪🕋

°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°

       🕌🕋🕌🕋 *ఇస్లాం చరిత్ర* 🕋🕌🕋🕌

                               *భాగము - 34* 

____________________________________________

*ఇస్రాయీల్ సంతతి పై అల్లాహ్ అనుగ్రహాలు.* 

మూసా (అలైహి) ఇస్రాయీల్ జాతిలో సత్యానికి అనుగుణంగా ప్రజలకు మార్గం చూపిస్తూ, సత్యం ప్రాతిపాదిక పైననే న్యాయం, నిర్ణయాలు చేసే వర్గం కూడా ఒకటి ఉంది.

అల్లాహ్ బనీఇస్రాయీల్ వారిని పన్నెండు తెగలుగా విభజించి, శాశ్వత వర్గాలుగా రూపొందించారు. ఇస్రాయీల్ సంతతివారు పవిత్ర భూమి ఫలిస్తీనా వైపునకు సాగిపోయారు.

బనీఇస్రాయీల్ ప్రజలు మూసా (అలైహి) తో : - మూసా! ఈ ఎడారి ప్రయాణంలో మనకు నీరు దొరకని పరిస్థితి. ఎలాగైనా మాకు నీరు కావాలి.

ఇలాంటి పరిస్థితుల్లో మూసా (అలైహి) కు అల్లాహ్ దివ్యవిష్కృతి ద్వారా "నీ చేతికర్రతో ఒక చుట్టబండ పై కొట్టు" అని ఆదేశించారు.

అపుడు అల్లాహ్ ఆదేశం ప్రకారం మూసా (అలైహి) తన చేతికర్రతో ఒక చుట్టబండ పై కొట్టగానే ఆ చుట్టబండ చీలి అందులో నుంచి పన్నెండు ఊటల నీళ్లు ఉబికాయి. అల్లాహ్ విభజించిన పన్నెండు తెగలకు, ఈ పన్నెండు నీటి ఊటలను కేటాయించడం జరిగింది. ఈ విధంగా అల్లాహ్ నీటి కరువు విషయంలో వారి మధ్య ఎలాంటి విభేదాలు తలెత్తకుండా చూశారు.

ఇంకా వారి ప్రయాణం కొనసాగుతూ....

బనీఇస్రాయీల్ ప్రజలు మూసా (అలైహి) తో : - మూసా! ముందుకు సాగుతున్న మన ఈ ఎడారి ప్రయాణంలో సూర్యుడి తీక్షణమైన వేడి నుంచి కాపాడు. అలాగే మా ఈ ఆకలి బాధని కూడా దూరం చేయి.

అపుడు మూసా (అలైహి) అల్లాహ్ ను ప్రార్థించగా....; అల్లాహ్, బనీఇస్రాయీల్ ప్రజలను ఎండ నుంచి కాపాడటానికి మేఘచ్చాయ మబ్బులను పంపి నీడను కలగజేశారు. అలాగే తినడానికి మంచి ఆహార పదార్థాలను కలగజేశారు. ఆహారంగా "మన్న" మరియు 'సల్వా" లను అవతరింపజేశారు. "అల్లాహ్ మీకు పంపిన ఈ పరిశుద్ధ పదార్థాలు తినండి" అని మూసా (అలైహి), ఇస్రాయీల్ ప్రజలతో అన్నారు.

_[మన్న అంటే ఒక రకమైన ఖాద్య వస్తువు. ఇది ఆకాశం నుండి కురిసి నేల పై పేరుకుంటుంది. సల్వా అంటే ఒక రకమైన పక్షులు. ఇవి గాలిలో ఎగురుతూ సులభంగా దొరికేవి. ఇవి రెండూ యూదులకు నలభై సంవత్సరాల పాటు ప్రసాదించబడ్డాయి.]_ 

ఆ తర్వాత కొన్నాళ్లకే, బనీఇస్రాయీల్ ప్రజలు కష్టపడకుండా లభిస్తున్న ఎంతో శ్రేష్ఠమైన ఈ ఆహారం పట్ల అసంతృప్తి చెంది ఇలా అన్నారు : -"మూసా! మేము ఇక ఒకే రకమైన ఈ ఆహారం తింటూ ఉండలేము. మా కోసం నేల నుండి ఉత్పత్తి అయ్యే కూరగాయలు, దోస కాయలు, వెల్లుల్లి, ఉల్లిపాయలు, గోధుమలు, పప్పు ధాన్యాలు మొదలైన ఆహార పదర్థాలు పండింపజేయమని నీ ప్రభువును ప్రార్థించు."

మూసా (అలైహి) : - ఎంతో శ్రేష్ఠమైన ఆహార పదార్థాలు ఉండగా వాటిని వదిలి హీనమైన పదర్థాలు కోరుతున్నారా!

*ఇస్రాయీల్ ప్రజల తలబిరుసుతనం* 

"సామిరీ చేసిన ఆవుదూడ విగ్రహం మమ్మల్ని పెడదారి పట్టించింది" అని బనీఇస్రాయీల్ ప్రజలు పశ్చాత్తాపపడి, మమ్మల్ని క్షమించండి అని అల్లాహ్ తో వేడుకున్న తర్వాత అల్లాహ్ వారిని క్షమించాడు.

తర్వాత, వారిలోనే మూసా (అలైహి) డెబ్బై మంది పురుషులను ఎన్నుకున్నారు. అల్లాహ్ ను ఆరాధించేందుకుగాను మరియు తమ పశ్చాత్తాపాన్ని వ్యక్తం చేసేందుకుగాను వారిని వెంట తీసుకొని సినాయ్ కొండ దగ్గరకు చేరుకున్నారు. అపుడు మూసా (అలైహి) తో అల్లాహ్ స్వయంగా సంభాషించారు. అయితే ఆ డెబ్బై మందిలోని కొందరు మూసా (అలైహి) తో మాట్లాడింది అల్లాహ్ నని సత్యాన్ని విశ్వసించక, మూసా (అలైహి) కు అవిధేయత చూపుతూ, "మేము మా కళ్లతో అల్లాహ్ ని ప్రత్యక్షంగా చూడనంతవరకు నీ మాటలు నమ్మము." అని అన్నారు. ఆ వెంటనే అందరూ చూస్తుండగానే వారిపై ఒక భయంకరమైన పిడుగు పడింది. దాంతో వారంతా మృత్యువాత పడ్డారు. అయితే అల్లాహ్ చేసిన మేలుకు అల్లాహ్ పట్ల కృతజ్ఞులయి ఉంటారని అల్లాహ్ మళ్ళీ వారిని బ్రతికించారు.

మూసా (అలైహి) : - అల్లాహ్! నీవు కోరివుంటే వీరిని, నన్ను ఎపుడో చంపేవాడివి. కానీ ఇపుడు మాలో కొందరు బుద్ధిహీనులు చేసిన ఈ పనికి మమ్మల్నందరినీ చంపుతావా? ఖచ్చితంగా ఇది నీవు పెట్టిన పరిక్షే. దీని ద్వారా నీవు తలచిన విధంగా కొందరిని దారి తప్పిస్తావు. మరికొందరికి సన్మార్గబుద్ధిని ప్రసాదిస్తావు. నీవే మా రక్షకుడివి. మమ్మల్ని క్షమించు, కనికరించు. నీవే అందరికంటే గొప్ప క్షమాశీలివి. మాకు ఇహలోకంలోను, పరలోకంలోను మేలు రాసిపెట్టు. మేము నీ వైపు మరలము. ఇక నీవే మాకు దిక్కు. (అని వేడుకున్నారు)

అల్లాహ్ : - శిక్ష విషయంలో నేను తలుచుకున్న వారిని శిక్షిస్తాను. కానీ నా కారుణ్యం యావత్ సృష్టి ని ఆవహించి ఉంది. అలాగే దుష్కార్యాలు మానేసి నా సూక్తులు విశ్వసించి, పేదల ఆర్థిక హక్కు అయిన జకాత్ విధి నెరవేర్చేవానికి మాత్రమే నేనే మేలు రాసిపెడతాను.

మూసా (అలైహి) తౌరాత్ గ్రంథపు ఫలకలతో ఇస్రాయీల్ ప్రజల వద్దకు మరలి వచ్చినపుడు, వారు దానిని స్వీకరించమని చెబుతూ తిరస్కరించారు. అక్కడితో ఆగక తౌరాత్ లోని హితవులపైన, ధర్మాదేశాల పైన ఆరోపణలు చేశారు. అపుడు మూసా (అలైహి) అల్లాహ్ శిక్షల గురించి వారిని భయపెట్టగా వారు దానిని స్వీకరించారు.

*యుద్ధ నిరాకరణ* 

బనీఇస్రాయీల్ ప్రజలను తీసుకొని వాగ్దానం చేయబడిన పవిత్ర భూమికి వెళ్లాలని మూసా (అలైహి) ను అల్లాహ్ ఆదేశించారు. ఆ పవిత్ర భూమి సిరియాలో ఉంది. వాస్తవానికి ఈ పవిత్ర భూమి ఇబ్రాహీమ్ (అలైహి) కు వాగ్దానం చేయబడింది. ఇబ్రాహీమ్ (అలైహి) సంతతిలో సన్మార్గులు, దైవభీతి కలిగిన వారు, అల్లాహ్ చట్టాలను పరీక్షించేవారు నివసించడానికి ఈ భూమిని అల్లాహ్ ప్రసాదించాడు.

మూసా (అలైహి) తన జాతి ప్రజలకు హితబోధ చేస్తూ : - నా జాతి ప్రజలారా! మీకు అల్లాహ్ చేసిన మేళ్ళు గుర్తుకుతెచ్చుకోండి. ఆయన మీలో ఒకరిని ప్రవక్తగా ప్రభవింపజేశాడు. మిమ్మల్ని రాజ్యాధినేతలుగా చేశాడు. అల్లాహ్ మీకు ప్రపంచంలో ఏ జాతికి ప్రసాదించని వైభోవోన్నతుల్ని ప్రసాదించాడు. కనుక సోదరులారా! అల్లాహ్ మీకు ప్రసాదించిన ఈ పవిత్ర భూభాగం ఫలిస్తీనా లోకి ప్రవేశించండి. అల్లాహ్ మీపై అనేక అనుగ్రహాలు కురిపించాడు. ఇతర ప్రజలపై కంటే మీ పై ఎక్కువ అనుగ్రహాలు కురిపించాడు. మిమ్మల్ని ఫిరౌన్ బారి నుండి కాపాడాడు. తినటానికి మంచి ఆహారాన్ని ప్రసాదించాడు. అయితే అల్లాహ్ మీపై కురిపించిన అనుగ్రహాలు బదులుగా అవిధేయులు కాకండి. వెనక్కి మరలకండి. అలా చేస్తే మీరు ఘోరంగా నష్టపోతారు.

_[బనీఇస్రాయీల్ ప్రజలు కృతజ్ఞతలేని వారు. అల్లాహ్ వారిని అపారంగా అనుగ్రహించినప్పటికి వారు చెడులకు దూరంగా ఉండలేదు. అల్లాహ్ చట్టాల పట్ల తమ నిర్లక్ష్యాన్ని కొనసాగించారు. కన్ఆన్, హిటైట్ ప్రజల పట్టణాలను ఆక్రమించుకోవాలని మూసా (అలైహి) వారిని ఆదేశించారు. ఈ రెండు జాతు బనీఇస్రాయీల్ కు శత్రు జాతులు, బనీఇస్రాయీల్ ప్రజలను వెంటాడి వేధిస్తున్న జాతులు. కానీ, మూసా (అలైహి) ఆదేశం విన్న బనీఇస్రాయీల్ ప్రజలు పిరికితనాన్ని చూపారు. సాకులు చెప్పసాగారు.]_ 

బనీఇస్రాయీల్ ప్రజలు : - మూసా! అక్కడ భయంకరమైన మనుషులు ఉన్నారు. ఆ పట్టణాల్లో బలాఢ్యులైన ప్రజలు కూడా ఉన్నారు. వారు అక్కడి నుంచి వెల్లనంత కాలం ఆ పట్టణాల్లోకి మేము ప్రవేశించము. వారు అక్కడి నుంచి వెళ్ళిపోతే మేము అక్కడికి వెళ్ళడానికి సిద్ధమే.

అల్ భయపడిన వారిలోనే, దైవనుగ్రహం పొంది నిజమైన విశ్వాసులు ఇద్దరు ఉన్నారు. వారే మూసా (అలైహి), అతని సోదరుడు హారూన్.

మూసా మరియు హారూన్ బనీఇస్రాయీల్ ప్రజలతో ఇలా అన్నారు : - ఆ భయంకరుల్ని ఎదుర్కోవడానికి పట్టణాల్లోకి సింహద్వారం గుండా ప్రవేశించండి. మీకు విజయం లభిస్తుంది. మీరు లోపలికి ప్రవేశిస్తే చాలు, విజయం మిమ్మల్ని వరించినట్లే. మీరు విశ్వాసులైతే అల్లాహ్ పట్ల పూర్తి విశ్వాసాన్ని కలిగి ఉండండి. అల్లాహ్ పై భారం వేసి ముందుకు సాగండి. అల్లాహ్ ఎపుడూ మీతోనే ఉంటాడు.

బనీఇస్రాయీల్ ప్రజలు : - మూసా! ఆ ప్రజలు అక్కడ ఉన్నంత కాలం మేము ఆ పట్టణంలోకి ఎన్నటికీ ప్రవేశించము. కావాలంటే నీవు, నీ ప్రభువు ఇద్దరూ వెళ్లి వారితో తలపడండి. మేము మాత్రం ఇక్కడే వేచి ఉంటాము.

మూసా (అలైహి), హారూన్ లు ఈ పిరికివాళ్లను మార్చలేకపోయారు. నిరాశతో మూసా (అలైహి) అల్లాహ్ తో వేడుకున్నారు.

మూసా (అలైహి) : - ప్రభు! నా చేతిలో ఏమీ లేదు.  నాపై, నా సోదరునిపై మాత్రమే నాకు అధికారం ఉంది. అందువల్ల మమ్మల్ని ఈ దుర్మార్గుల నుంచి వేరు చెయ్యి. అవిధేయులైన వారికి మాకు మధ్య విచక్షణ చెయ్యి.

అల్లాహ్ : - సరే! వారికి దేశాన్ని నలభై సంవత్సరాల పాటు నిషేధించాను. ఇక వారు ప్రపంచంలో ఏ ఒక్కచోట నిలువనీడ దొరక్క కొట్టుకుంటూ తిరుగుతారు. ఈ దుర్మార్గుల దుస్థితి పట్ల నీవు ఏ మాత్రం విచారించకు.

దిక్కుతోచని స్థితిలో వారు మరో నలభై సంవత్సరాలు గమ్యరహితంగా తిరుగుతూ ఉండేలా అల్లాహ్ వారిని శపించారు. మూసా (అలైహి), హారూన్ లు బనీఇస్రాయీల్ ప్రజలను వదిలి దూరంగా వెళ్లిపోయారు. ఈ తరం ప్రజలు గమ్యరహితంగా తిరుగాడుతూ చివరకు అంతరించారు. తర్వాతి తరాలు మాత్రమే పవిత్ర భూమి ఫలిస్తీనా కు చేరుకోగలిగాయి.

అంతటితో బనీఇస్రాయీల్ ప్రజల కథ ముగిసినది.

మిగతాది Insha Allah రేపటి భాగము - 35 లో....

Note : - ఈ msg లను ముందుకు పంపిస్తూ, మన ఇస్లాం చరిత్ర గురించి మన ముస్లిం సోదరులకు తెలియజేస్తారని ఆశిస్తున్నాము.

☆☆ ®@£€€q +97433572282 ☆☆

No comments:

Post a Comment