15

🕋🕋🕋🕋 బిస్మిల్లాహ్ హిర్రహ్మా నిర్రహీమ్ 🕋🕋🕋🕋

🛐🛐🛐🛐 అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన *అల్లాహ్* పేరుతో ప్రారంభిస్తున్నాను 🛐🛐🛐🛐

------------------------------------------------

       ☪☪☪☪ *ఇస్లాం చరిత్ర* ☪☪☪☪

    భాగము - 15          Date : 25/11/2017

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

జులేఖా ప్రవర్తన సిగ్గుమాలినదిగా గొప్పింటి స్త్రీ లు మాట్లాడుకోసాగారు. "ఒక గవర్నరుకు భార్య గా ఉండి ఒక బానిస తో ప్రేమ వ్యవహారాన్ని నడుపాలనుకోవడం సిగ్గుచేటు, మొహావేశం జులేఖా ను అదుపు తప్పేలా చేసింది, కానీ మన దృష్టి లో మాత్రం జులేఖా పెద్ద తప్పు చేసింది" అని వ్యాఖ్యానించసాగారు. (ఖురాన్ 12:27-30).

ఈ వ్యాఖ్యలు ఆ నోటా ఈ నోటా పాకి జులేఖా చెవిన పడ్డాయి. దానికి జులేఖా చాలా బాధ పడింది. యూసుఫ్ వంటి సాటిలేని అ౦ద౦ కలిగిన వ్యక్తి ని చూసిన ఏ స్త్రీ అయినా తనలాగే వ్యవహరిస్తుందని ఆమె భావించింది. తన అభిప్రాయాన్ని నిరూపించడానికి, తాను ఎలాంటి ఆకర్షణకు గురయిందో అలాంటి ఆకర్షణకే మిగిలిన స్త్రీ లు అందరూ గురయ్యే పథకాన్ని వేసింది.

ఆ గొప్పింటి స్త్రీ లను అందరిని ఒక పెద్ద విందుకు ఆహ్వానించింది. గవర్నరు గారి భార్య ఇచ్చిన విందుకు రాకుండా ఎలా ఉంటారు, అందరూ వచ్చారు. ఈ సందర్బంగా ఆ బానిస కుర్రాడిని కూడా చూడాలని వచ్చారు. జులేఖాతో చనువు ఉన్న కొందరు స్త్రీ లు యూసుఫ్(అలైహి) ను పరిచయం చేయటానికి అంగీకరిస్తేనే తాము విందుకు వస్తామని హాస్యమాడారు.

వి౦దు ప్రారంభమైంది. రకరకాల ఫలాలు వారి ముందు ఉన్నాయి. వాటిని కొయడానికి పదునైన కత్తిని ప్రతి ఒక్కరి ముందు ఉంచడం జరిగింది. ఆ ఫలాలను తినడానికి వారు కత్తితో సరిగ్గా పళ్ళను కోస్తున్నపుడు జులేఖా అదే సమయం లోనే అక్కడికి యూసుఫ్ (అలైహి) ను పిలిచింది. ఆయన అక్కడికి హుందాగా వచ్చారు. జులేఖా యూసుఫ్ (అలైహి) ను పేరు పెట్టి పిలువగానే ఆ గొప్పింటి స్త్రీ లు అందరూ తల పైకి ఎత్తి యూసుఫ్ (అలైహి) ని చూశారు. అలాంటి అందమైన యువకుడిని వారు ఎన్నడూ చూడలేదు. యూసుఫ్ (అలైహి) అ౦ద౦ ఆ గొప్పింటి స్త్రీ లను మంత్రముగ్దుల్ని చేసింది. ఆ స్త్రీ లు తమ చూపును ఆయన పై నుంచి తప్పించలేకపోయారు. యూసుఫ్ (అలైహి) ను అలా చూస్తూ ఉండిపోయారు. ఆ గొప్పింటి స్త్రీ లు ఫలాలను కోస్తున్నపుడు యూసుఫ్ (అలైహి) అక్కడికి వచ్చారు కాబట్టి ఆ స్త్రీ లు యూసుఫ్ (అలైహి) ను చూస్తూ తమ చేతుల్లో ఉన్న ఫలాన్ని కోసే బదులు వారి వేళ్ళు కోసుకున్నారు. ''హాషాలిల్లాహ్‌ ! (దైవమహిమ!), ఏమి ఈ సౌందర్యం, ఇతను మానవమాత్రుడుకాడు. నిశ్చయంగా ఇతను దివి నుంచి భువికి దిగివచ్చిన గొప్ప దైవదూతే !'' అన్న మాటలు వారినోట అప్రయత్నంగా వెలువడ్డాయి. ఇది చూసిన జులేఖా ముఖం లో సంతృప్తి కదలాడింది. తన పథకం ఫలించిందని ఆమె భావించింది. (ఖురాన్ 12:31).

తర్వాత జులేఖా అందరినీ ఉద్ధేశించి మాట్లాడుతూ ''ఎవరి విషయంలో మీరంతా నన్ను నిందిస్తున్నారో ఆ వ్యక్తి ఇతనే. నేను ఇతడ్ని వలలో వేసుకోవాలని ప్రయత్నించాను, కాని ఇతను తప్పించుకున్నాడు.యూసుఫ్ (అలైహి) నాకే స్వ౦త౦, నేను ఆజ్ఞాపించిన పనిని ఇతను చేయకపోతే చెరసాలపాలై, నా మాటకు ఒప్పుకోకపోతే ఇతడ్ని జైల్లో నేరన్తులతొ పాటు మగ్గెలా చేస్తాను." అని అందరి ముందు ధైర్యంగా ప్రకటించింది. (ఖురాన్ 12:32).

అప్పుడు యూసుఫ్‌ (అలైహి) "ప్రభూ ! ఈ స్త్రీ లు దేని కోసం నన్ను పిలుస్తున్నారో దాని కన్నా కారాగారమే నాకు మెలేయినది. నీవు కనుక వీళ్ల జిత్తుల ను నా నుండి దూరం చేయకపోతే నేను వీళ్ల వలలో పడిపోయి అవివేకులలో చేరిపోతాను!'' అని మొర పెట్టుకున్నాడు. అతని ప్రభువు అతని ప్రార్థనను ఆమోదించాడు. ఆ మగువల మాయోపాయాలను అతడి నుంచి తొలగించాడు. నిశ్చయంగా ఆయన అంతావినేవాడు, అన్నీ తెలిసినవాడు. (ఖురాన్ 12:33,34).

ఆమె ఎన్ని విధాలుగా ప్రయత్నించిన యూసుఫ్ (అలైహి) ను లోబరచుకొలేకపోయింది. జులేఖా దెబ్బతిన్న తాచులా బుసలు కొట్టింది. తను అతనికి లొంగకుండా ఉండాలంటే, తన గౌరవ,మర్యాద లు నిలబడాలంటే యూసుఫ్ (అలైహి) జైలుకు పోవాలని తన భర్త అజీజ్ కు నచ్చజెప్పింది, లేకపోతే తాను అతడి గౌరవ, మర్యాదలను కాపాడలేనని స్పష్టంగా చెప్పేసింది.

యూసుఫ్ (అలైహి) నిర్దోషి అన్న విషయం అజీజ్‌ కు బాగా తెలుసు. యూసుఫ్ (అలైహి) మంచి యువకుడని, విశ్వాసపాత్రుడైన సేవకుడని ఆయనకు బాగా తెలుసు. అందువల్లనే ఆయన యూసుఫ్ (అలైహి) ను అభిమానిన్తున్నాడు. ఒక అమాయకుడిని జైలులో పెట్టించడం ఆయనకు ఇష్టం లేదు. కాని ఆయనకు మరో దారి కూడా కనబడలేదు. యూసుఫ్(అలైహి) ను జులేఖా కు దూరంగా ఉ౦చడ౦ వల్లనే యూసుఫ్ (అలైహి) గౌరవ,మర్యాద లు కూడా భద్రంగా ఉంటాయని ఆయన భావించాడు. ఆ రాత్రి అజీజ్ బరువైన మనసుతో యూసుఫ్‌(అలైహి) ను జైలుకు పంపాడు.

*జైలులో యూసుఫ్ (అలైహి)* 

ఈ జైలు శిక్ష యూసుఫ్ (అలైహి) కు మూడవ పరీక్ష. ఈ సమయం లో అల్లాహ్ యూసుఫ్ (అలైహి) కు ఒక అసాధారణమైన వరాన్ని ప్రసాదించాడు. కలల అర్థాన్ని గ్రహించే శక్తి ని అల్లాహ్ ప్రసాదించాడు.

*కారాగారంలో ధర్మప్రచారం* 

ఈ సమయం లో ఇద్దరు వ్యక్తు లు ఏదో అపరాధం వల్ల అదే జైలుకు వచ్చారు. అందులో ఒకడు ఆ దేశ రాజుగారి వ్యక్తిగత సేవకుడు. రెండవ వాడు రాజుగారి వంటవాడు. యూసుఫ్ (అలైహి) ను చూసి వారు ఆయన నేరస్తుడు కాదని గ్రహించారు. ఆయన ముఖం లో ధర్మపరాయణతకు స౦బ౦ధి౦చిన తేజస్సు దేదీప్యమానంగా ప్రకాశించేది. వారిద్దరికి విచిత్రమైన కలలు వచ్చాయి. ఆ కలల అర్ధం తెలుసుకోవాలని వారు ఆతృత కనబర్చారు. వారు యూసుఫ్‌ (అలైహి)ను తమ కలలకు అర్థం చెప్పవలసిందిగా కోరారు.

మొదట రాజుగారి వ్యక్తిగత సేవకుడు తన కల గురించి చెబుతూ "నా కలలో నేను ఒక ద్రాక్ష తోటలో ఉన్నాను. ద్రాక్ష పళ్ళ రసాన్ని తీసి రాజుగారి కోసం పాత్రలో పోస్తున్నాను” అన్నాడు.

తరువాత రాజుగారి వంట వాడు తన కల గురించి చెబుతూ "నేను నా కలలో ఒక రొట్టెలు ఉన్న బుట్టను నెత్తిన పెట్టుకుని వెడుతున్నాను. పక్షులు ఆ రొట్టెలను తినేన్తున్నాయి” అన్నాడు. (ఖురాన్ 12:35,36).

వారి కలలకు అర్ధం చెబుతానని యూసుఫ్ (అలైహి) హామీ ఇచ్చారు. "కలల అర్థాన్ని గ్రహించే శక్తి తనకు అల్లాహ్ ప్రసాదించాడని వారికి చెప్పారు. అల్లాహ్ ను తిరస్కరించేవారు, మరణాంతర జీవితాన్ని తిరస్కరించేవారి మార్గాన్ని తాను తిరస్కరిస్తున్నానని, తాను తన తాతముత్తాతలైన ఇబ్రహీం (అలైహి), ఇస్ హాఖ్ (అలైహి), యాఖూబ్ (అలైహి) ప్రవక్తల ధర్మానికి కట్టుబడుతున్నానని, తాను అల్లాహ్ కు భాగస్వాములను చేర్చేవాడిని కాదని, ఇది నిజంగా మన పై, యావత్తు మానవాళి పై అల్లాహ్ అనుగ్రహామే. కానీ చాలా మంది అల్లాహ్ కు కృతజ్ఞత చూపడం లేదు." అని యూసుఫ్ (అలైహి) చెప్పారు. (ఖురాన్ 12:37,38).

నా సహా ఖైదీలారా ! కాస్త ఆలోచించండి, మనకు చాలా మంది చిల్లర దేవుళ్ళు ఉండటం మంచిదా లేక అందరి పై ఆధిక్యత కలిగున్న ఒక్క అల్లాహ్ ఉండటం మంచిదా ? అల్లాహ్ ను వదిలి మీరు ఏ ఏ దైవాలను ఆరాధిస్తున్నారో అవన్నీ మీరు, మీ ముత్తాతలు పెట్టుకున్న పేర్లు అభూతకల్పనలు మాత్రమే. వాటి కోసం అల్లాహ్ ఎలాంటి ప్రమాణం పంపలేదు. పాలనా అధికారం అల్లాహ్ కి తప్ప మరెవరికి లేదు. అల్లాహ్ తనను తప్ప మరెవ్వరినీ ఆరాధించరాదని శాసించాడు. ఇదే సరైన జీవనమార్గం, కానీ మనలో ఈ యదార్థం గ్రహించడం లేదు. (ఖురాన్ 12:39,40).

ఆ తర్వాత ఆయన ఆ ఇద్దరి కలల అర్ధాన్ని గురించి వివరించారు. అందులో రాజుగారి వ్యక్తిగత సేవకుడి కల మంచిని సూచిస్తుందని, రాజుగారి వంటవాడి కల చెడును సూచిస్తుందని అన్నారు. రాజుగారి వ్యక్తిగత సేవకుడు అయిన వ్యక్తి నిర్దోషిగా విడుదల అవుతాడని, కాని రాజు గారి వంటవాడు దోషిగా నిరూపించబడి శిలువ వేయబడతాడని అన్నారు. పక్షులు అతని తలను పొడిచి తింటాయని చెప్పారు.

రాజుగారి వ్యక్తిగత సేవకుడు నిజానికి అబద్ధపు ఆరోపణల వల్ల జైలు పాలయ్యాడు.

కాని రాజుగారి వంటవాడు మాత్రం రాజుకు విషం ఇచ్చి చంపే కుట్రలో పాలుపంచుకున్న నేరస్తుడు. యూసుఫ్‌ (అలైహి) చెప్పిన విధంగానే రాజుగారి వంటవాడికి శిక్ష పడింది.

రాజుగారి వ్యక్తిగత సేవకుడు నిర్ధోషిగా విడుదల అయ్యాడు. అతను మళ్ళీ రాజుగారి కొలువులో చేరిపోయాడు. యూసుఫ్ (అలైహి) తన కలకు అర్థాన్ని వివరించడం, ఆయన చెప్పినట్లే జరగడం ఆయన ముఖం లోని తేజస్సు రాజుగారి వ్యక్తిగత సేవకుడి పై గొప్ప ప్రభావాన్ని వేశాయి.

యూసుఫ్ (అలైహి) కు ఎలా తాను బదులు తీర్చుకునేదని నిర్ధోషిగా విడుదలైన రాజు గారి వ్యక్తిగత సేవకుడు ప్రశ్నించాడు. దానికి యూసుఫ్ (అలైహి) "తనకు అన్యాయంగా విధించిన జైలు శిక్ష గురించి రాజుగారికి చెప్పు" అని అతడిని కోరారు.(దానికి అతను ఖచ్చితంగా తెలియజేస్తాను అన్నాడు).

కానీ షైతాన్ యూసుఫ్ (అలైహి) గురించి రాజుగారికి తెలియజేయకుండా రాజుగారి వ్యక్తిగత సేవకుడిని మరిపించాడు, జైలు నుంచి విడుదలైన రాజుగారి వ్యక్తిగత సేవకుడు ఈ విషయాన్ని మరచిపొయాడు. అందువల్ల యూసుఫ్ (అలైహి) మరికొన్ని సంవత్సరాలు జైలులోనే ఉండవలసి వచ్చింది. (ఖురాన్ 12:41,42).

*రాజు గారి కల* 

ఒక రోజు రాజు గారికి ఒక కల వచ్చింది. ఆ కల ఆయన ను చాలా కలచి వేసింది. రాజ్యం లోని పండితులు, మేధావులందరిని ఆయన హాజరుపరచి తన కలకు అర్థాన్ని చెప్పమన్నాడు.

రాజు గారు తన కలలో ఏడు పుష్టికరమైన ఆవులను చూశారు. వాటిని ఏడు బక్కచిక్కిన ఆవులు తినేన్తున్నాయి. ఏడు విరగపండిన మొక్కజొన్న పొత్తులను, మరో ఏడు ఎండిన పొత్తులను చూశారు. ఈ కలకు అర్ధం చెప్పవలసిందిగా రాజు గారు కోరారు. దర్బారు లోని మేధావులు, పండితులు నిజాయితీగా తమ అశక్తతను ప్రకటించారు. ఈ కల కు అర్థం తాము చెప్పలేమన్నారు. ఈ కలలో మిశ్రమ సంకేతాలున్నాయని, ఇలాంటి కలల అర్థం చెప్పే శక్తి తమకు లేదని అన్నారు. (ఖురాన్ 12:43,44).

జైలు నుంచి విడుదలైన రాజుగారి వ్యక్తిగత సేవకుడు అప్పటికి రాజుగారి కొలువులో మళ్ళి చేరి ఉన్నాడు. రాజు గారి కల గురించి, ఆ వ్యక్తిగత సేవకుడికి కూడా తెలిసింది. అపుడు అతడికి జైలులో తన కలకు అర్థం చెప్పిన యూసుఫ్ (అలైహి) గుర్తుకువచ్చారు. ఆ తర్వాత అతను రాజు గారితో “ప్రభూ ! మీ కారాగారంలో ఒక పుణ్యాత్ముడు ఉన్నారు. ఆయన కలల అర్థాన్ని వివరించే విద్యలో ప్రావీణ్యం కలిగినవారు. నన్ను మీరు ఆయన వద్దకు పంపితే నేను వెళ్ళి మీ కలకు అర్థాన్ని తెలుసుకుని వస్తాను” అన్నాడు. అది విన్న రాజుగారు అతడిని వెంటనే వెళ్ళాలని ఆజ్ఞాపించారు.

రాజు గారి సేవకుడు యూసుఫ్ (అలైహి) దగ్గరికి వెళ్లి, కల యొక్క అర్థాన్ని తెలుసుకున్న సందర్భం Insha Allah రేపటి భాగము - 16 లో తెలుసుకుందాము.

*ముస్లిం సోదరులకు ఒక చిన్న విజ్ఞప్తి  :-* 

ప్రియమైన ముస్లిం సోదరులారా!  ఇప్పటికి కూడా మనలో చాలా మంది ముస్లిం సోదరులకు అసలు ఇస్లాం అంటే ఏంటి ? , దీన్ అంటే ఏంటి ? , మన నబీ ఎవరు ? , అసలు మనం ఎందుకోసం పుట్టాము ?  ------ ఇలాంటి అనేకమైన విషయాలు తెలియదు .మనకు ఈ జీవితాన్ని ఇచ్చినది అల్లాహ్ , అలాంటి అల్లాహ్ కోసం 24 గంటల్లో ఒక్క 5 నిమిషాల సమయం కేటాయించి ఈ msg ను చదవలేమా , కేవలం 5 నిమిషాలు కేటాయించి ఇస్లాం చరిత్ర తెలుసుకుంటారని ఆశిస్తున్నాము. నాకు ఈ msg లు ఒక ముస్లిం సోదరుడు పంపించాడు , నేను మీకు పంపిస్తున్నాను ; అలాగే మీరు కూడా ఈ msg లను ముందుకు పంపించండి , ఇదేదో 10 మందికి send చేస్తే మంచి జరుగుతుంది , send చేయకపోతే చేడు జరుగుతుంది అనుకునే msg లు కావు . కాబట్టి మన ముస్లిం లలో దీన్ ను నింపవల్సిన బాధ్యత అల్లాహ్ మన పై ఉంచాడు అని తెలుసుకుంటూ , ఇస్లాం ఉనికి ని చాటి చెప్తారని ఆశిస్తున్నాము .

No comments:

Post a Comment