20

🤚🏻✋🏻🤚🏻✋🏻 *బిస్మిల్లాహ్ హిర్రహ్మా నిర్రహీమ్* 🤚🏻✋🏻🤚🏻✋🏻

🛐🕋🛐🕋 *అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను* ☪🕋☪🕋

°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°

       🕌🕋🕌🕋 *ఇస్లాం చరిత్ర* 🕋🕌🕋🕌

    *భాగము - 20          Date : 30/11/2017* 

____________________________________________

*హుద్ అలైహిస్సలామ్ : - - : ఆద్ జాతి*

యమన్, ఒమన్ ల మధ్య ఉన్న ప్రదేశంలో కొండచరియల వద్ద ఆద్ జాతి ప్రజలు చాలా కాలం నివసించారు. వారు శారీరకంగా చాలా దృఢకాయులు. భవన నిర్మాణ కౌశలానికి వారు పెట్టింది పేరు. ఎత్తైన అనేక భవనాలను నిర్మించిన ఘనత వారిది. వారి బల సామర్థ్యాల వల్ల, వారి సంపదల వల్ల మిగిలిన జాతుల కన్నా వారికి విశిష్ట స్థానం లభించింది. కానీ భౌతికంగా వారు సాధించిన ప్రగతి వికాసాలు, వారి శారీరక బలాధిక్యత వారిని అహంకారానికి, గర్వాతిశయానికి గురి చేశాయి. దౌర్జన్యాలు, అన్యాయానికి మారు పేరయిన పాలకుల చేతుల్లో రాజ్యాధికారం ఉండేది. వారికి వ్యతిరేకంగా గొంతు విప్పే సాహసం ఎవరూ చేసే వారు కాదు.

అల్లాహ్ గురించి ఏమీ తెలియని జాతి కాదు వారిది. అలాగే వారు అల్లాహ్ ఆరాధనను పూర్తిగా నిరాకరించనూ లేదు. కానీ వారు కేవలం అల్లాహ్ ను మాత్రమే, అంటే ఒక్క అల్లాహ్ ను మాత్రమే ఆరాధించడాన్ని నిరాకరించారు.అల్లాహ్ తో పాటు వారు అనేక దేవిదేవతలను ఆరాధించేవారు. ఇది మహాపరాధం, అల్లాహ్ ఎంత మాత్రం సహించని అపరాధం ఇది.

అల్లాహ్ ఈ ప్రజలకు మార్గదర్శకత్వం అందించాలని, వారికి హితబోధ చేయాలని నిర్ణయించి, వారిలో ఒకరిని దైవ ప్రవక్త గా ఎన్నుకున్నారు. ఆయనే హుద్ అలైహిస్సలామ్.

హుద్ (అలైహి) తనకు అప్పగించిన పనిని నిబద్ధతో, దృఢసంకల్పం తో, సహనం తో నిర్వర్తించారు. ఆయన విగ్రహారాధనను ఖండించారు. ప్రజలకు బోధిస్తూ "ప్రజలారా! ఈ రాళ్ళ వల్ల ఏం లాభం ఉంది? మీ స్వంత చేతులతో మీరు చెక్కే వీటి వల్ల ప్రయోజనం ఏముంది? నిజానికి ఇలా చేయడం మీ వివేకవివేచనలను పరాభవించుకోవడమే అవుతుంది. అల్లాహ్ కేవలం ఒకే ఒక్కడు. ఆయనే ఆరాధనాలకు అర్హుడు. ఆయనే అల్లాహ్. అల్లాహ్ ను ఆరాధించడమే మీ బాధ్యత. అల్లాహ్ నే మిమ్మల్ని సృష్టించాడు. అల్లాహ్ నే మిమ్మల్ని పోషణనిస్తున్నాడు. అల్లాహ్ నే మీకు జీవన మరణాలను ఇస్తున్నాడు. అల్లాహ్ మీకు అద్భుతమైన శారీరక శక్తి ని ప్రసాదించాడు. అనేక విధాలుగా మిమ్మల్ని అనుగ్రహించాడు. కాబట్టి మీరు అల్లాహ్ ని విశ్వసించండి. అల్లాహ్ మీకు ప్రసాదించిన అనుగ్రహాల విషయంలో నిర్లక్ష్యం చేయవద్దు. లేకపోతే నూహ్ జాతి ప్రజలకు పట్టిన దుర్గతి మీకు పట్టవచ్చు" అని హెచ్చరించారు.

*అజ్ఞానుల వాదన* 

హేతుబద్ధమైన వాదన తో హుద్ (అలైహి) ప్రజల్లో దైవవిశ్వాసాన్ని పాదుకొల్పడానికి ప్రయత్నించారు. కానీ ఆద్ జాతి వారు హుద్ (అలైహి) సందేశాన్ని స్వీకరించడానికి నిరాకరించారు. పైగా హుద్ (అలైహి) తో వాదనకు దిగారు.

ఆద్ జాతి వారు : - హుద్! నీవు చెబుతున్నది ఏమిటి? ఈ దేవిదేవతలు అల్లాహ్ తో మా తరుపున సిఫారసు చేస్తాయి. (అని దబాయించారు)

హుద్ (అలైహి) : - ప్రజలారా! అల్లాహ్ ఒక్కడే, ఆయనకు భాగస్వామ్యులుగా ఎవరు లేరు. ఆయన మీ బృహద్ధమనికన్నా మీకు దగ్గరగా ఉన్నాడు. ఈ విగ్రహాలు మీకోసం సిఫారసు చేయలేవు. వీటిని ఆరాధించడం వల్ల మీరు అల్లాహ్ కు మరింత దూరం అవుతారు. మేము చాలా తెలివైనవాళ్ళం అని మీరు బావిస్తున్నారేమో! కానీ మీ విశ్వాసాలు మీ అజ్ఞానాన్ని చాటి చెబుతున్నాయి.

కానీ వారు హుద్ (అలైహి) మాటలను తిరస్కరించారు. ఆయనను ఎగతాలి చేశారు.

ఆద్ జాతి వారు : - హుద్! నీవు కూడా మాలాగే మాములు మనిషివే. అలాంటపుడు అల్లాహ్ నీకు మాత్రమే ప్రవక్త పదవిని అనుగ్రహించాడా? అలా ఎన్నటికీ జరగదు. నువ్వు అబద్ధాలాతున్నావ్.

హుద్ (అలైహి) : - నేను నా జీవితమంతా మీ మధ్యనే గడిపాను. నా వివేకవివేచనలను మీలో ఎవరు ప్రశ్నించలేదు. అల్లాహ్ నన్ను హెచ్చరించేవానిగా, మార్గం చూపేవానిగా ఎన్నుకున్నారు. అల్లాహ్ ఒక్కడే. ఆయన ఏకత్వం అన్నది విశ్వం లోని ప్రతి వస్తువు లోను కనపడుతుంది. ప్రతి వస్తువు లోను ఒక సూచన ఉంది. కాబట్టి అల్లాహ్ ను విశ్వసించండి. అల్లాహ్ ను క్షమాభిక్ష కొరకై అర్థించండి. అల్లాహ్ కారుణ్యానికి దూరం కావద్దు.  పరలోకం కొరకు ఏర్పాట్లు చేసుకోండి. మీకు వైభవోపేతమైన ఎత్తైన భవనాలు ఉన్నాయి. ఈ భవనాలు మీ శక్తిని, మీ సంపదను చాటి చెబుతున్నాయి. కానీ వీటి వల్ల మీకు ఎలాంటి ప్రయోజనం ఉండదు. ఇవి కేవలం మీ వైభవానికి చిహ్నాలైన అవశేషాలుగా మిగిలిపోతాయి. మీరు సంపదను, మీ నైపుణ్యాలను ఎలాంటి జీవిత లక్ష్యం లేకుండా వెచ్చిస్తున్నారు. మీరు శాశ్వతంగా ఇక్కడే ఉంటారన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. మీరు కేవలం సుఖవిలాసాల కోసం ప్రాకులాడుతున్నారు. (అని హెచ్చరించారు).

ఆద్ జాతి వారు : - మమ్మల్ని మా దేవతల ను౦డి దూర౦ చేయడానికి వచ్చావా? సరే, నీవు సత్యవంతుడవైతే, మమ్మల్ని బెదరగొడుతున్న ఆ ఉపద్రవం ఏమిటో తీసుకురా చూద్దాం.

హుద్ (అలైహి) : - ఆ సంగతి అల్లాహ్ కె తెలుసు. నేను నాకు ఇచ్చి ప౦పిన సందేశం మాత్రమే మీకు అందజేస్తున్నాను. కాని మీరు చాలా అజ్ఞానం, మూఢత్వాలతో ప్రవర్తిస్తున్నట్లు అనిపిస్తోంది నాకు.

కానీ ఆద్ జాతి ప్రజలు హుద్ (అలైహి) బోధనలను పెడచెవిన పెట్టారు.

హుద్ (అలైహి) తన ప్రచార ఉద్యమం నిష్ఫలమయ్యిందని గుర్తించారు. ఆయన వారితో "అల్లాహ్ ముందు సాక్షులుగా ఉండండి. నేను దైవసందేశాన్ని మీకు అందజేశాను. నేను నా ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉంటాను. మీ బెదిరింపులకు భయపడను. నేను కేవలం అల్లాహ్ కె భయపడతాను" అని అన్నారు.

ఇలా సాగింది హూద్ (అలైహి) ధర్మ ప్రచారం. కాని విగ్రహారాధకులైన ఆ జాతి ప్రజలు సత్యాన్ని విశ్వసించడానికి నిరాకరించారు.

ఆద్‌ జాతి నాయకులు న్యాయం, ధర్మం ఏదీ లేకుండా దేశం లో పెద్ద మొనగాళ్ళయి పోయారు. ఫైగా "మా కంటే బలవంతులెవరున్నారు?" అని  పలకసాగారు. వారిని సృష్టించిన అల్లాహ్ వారి కంటే బలవంతుడన్న సంగతి వారికి కాస్తయినా తట్టలేదు. వారు అల్లాహ్ సూక్తులు, సూచనలు తిరస్కరిస్తూనే పోయారు.

*విరుచుకపడిన విపత్తు* 

ఒక రోజు ఆ విపత్తు మేఘాల రూపంలో తమ లోయ వైపు రావడాన్ని ఆద్ జాతి వారు చూశారు. ఆ వెంటనే ఆకాశాన్ని ఒక నల్ల మబ్బు కప్పివేసింది. వర్షం వస్తుందని ఆద్ జాతి వారు భావించారు. ఈ తొలకరి వర్షానికి పొలాలను సిద్ధం చేసుకోవాలనుకున్నారు. ఈ మేఘాలు తమకెంతో ప్రయోజనం కలిగిస్తాయని వారనుకున్నారు. (స౦బరపడిపోతూ)…,

హుద్ (అలైహి) : - కాదు ఇది మీరు లోగడ తొందర పెట్టిన ఉపద్రవం ఇదొక పెనుతుఫాన్‌, ఘోరమైన ఆపద మోసుకొస్తోంది. ఇది అల్లాహ్ కరుణ వల్ల వచ్చిన మేఘం కాదు. ఇది అభిశాపం గా వస్తున్న గాలివాన. ఇది బాధాకరమైన శిక్ష ను తీసుకవస్తుంది అది తన ప్రభువు ఆజ్ఞ తో సర్వనాశనం చేస్తుంది. దీని గురించే నేను మీకు హెచ్చరికలు చేశాను.

చివరికి ఆ ఉపద్రవం విరుచుకుపడింది. అక్కడ ప్రచండమైన పెనుగాలులు వీసాగాయి, వారి నివాస స్ధలాలు తప్ప పూర్తిగా తుడిచిపెట్టింది. ఆద్‌ జాతి ప్రజలు ఒక భయంకరమైన తుఫాను దెబ్బకు నాశనమయ్యారు. అల్లాహ్ దాన్ని వరుసగా ఏడురాత్రులు, ఎనిమిదిపగళ్ళు వారిపై పడవేశాడు. ఆ ప్రాంతం యావత్తు శిథిలమయంగా మారే వరకు ఆ ప్రళయం ఆగలేదు. అక్కడి దుర్మార్గ ఆద్ జాతి ప్రజలు అందరూ వినాశనం పాలయ్యారు. ఎడారి ఇసుక వారిని ముంచెత్తింది. ఆ ప్రళయంలో ఆద్ జాతి ప్రజలు అక్కడ బోసిపోయిన ఖర్జూరపు బొద్దులవలె నేలకొరిగి పడి ఉన్నారు.

ఆ ప్రళయంలో కేవలం హుద్ (అలైహి), వారి అనుచరులు మాత్రమే బయటపడ్డారు. ఆ మిగిలిన వారు అక్కడి నుంచి "హద్రమౌత్" కు వలసపోయారు. వారు అక్కడ అల్లాహ్ ను మాత్రమే ఆరాధిస్తూ శాంతియుతంగా జీవించారు.

*_Note : -* కొంత కాలం ముందు space shattile నుంచి తీసుకున్న ఆధునిక Radar image ల వల్ల లభించిన వైజ్ఞానిక ఆధారాలతో దక్షిణ ఒమాన్ లోని ఉబార్ వద్ద ఎనిమిది ఎత్తైన శిఖరాలను కనిపెట్టడం జరిగింది. ఈ ప్రదేశాన్ని "ఖాళీ ప్రదేశం" గా పిలవడం జరుగుతుంది. ఈ సంఘటన దాదాపు 5000 సంవత్సరాలకు పూర్వం జరిగిందని భావిస్తున్నారు. ఒక్క దివ్య ఖురాన్ తప్ప మరో మత గ్రంథం (లేదా) ధార్మిక పుస్తకం ఏదీ ఈ పట్టణం పతనాన్ని ప్రస్తావించలేదు._ 

Insha Allah రేపటి భాగము - 21 లో *సాలిహ్ అలైహిస్సలామ్* గురించి తెలుసుకుందాము.

*ముస్లిం సోదరులకు ఒక చిన్న విజ్ఞప్తి  :-* 

ప్రియమైన ముస్లిం సోదరులారా!  ఇప్పటికి కూడా మనలో చాలా మంది ముస్లిం సోదరులకు అసలు ఇస్లాం అంటే ఏంటి ? , దీన్ అంటే ఏంటి ? , మన నబీ ఎవరు ? , అసలు మనం ఎందుకోసం పుట్టాము ?  ------ ఇలాంటి అనేకమైన విషయాలు తెలియదు .మనకు ఈ జీవితాన్ని ఇచ్చినది అల్లాహ్ , అలాంటి అల్లాహ్ కోసం 24 గంటల్లో ఒక్క 5 నిమిషాల సమయం కేటాయించి ఈ msg ను చదవలేమా , కేవలం 5 నిమిషాలు కేటాయించి ఇస్లాం చరిత్ర తెలుసుకుంటారని ఆశిస్తున్నాము. నాకు ఈ msg లు ఒక ముస్లిం సోదరుడు పంపించాడు , నేను మీకు పంపిస్తున్నాను ; అలాగే మీరు కూడా ఈ msg లను ముందుకు పంపించండి , ఇదేదో 10 మందికి send చేస్తే మంచి జరుగుతుంది , send చేయకపోతే చేడు జరుగుతుంది అనుకునే msg లు కావు . కాబట్టి మన ముస్లిం లలో దీన్ ను నింపవల్సిన బాధ్యత అల్లాహ్ మన పై ఉంచాడు అని తెలుసుకుంటూ , ఇస్లాం ఉనికి ని చాటి చెప్తారని ఆశిస్తున్నాము

★★★★★★★★★★★★★★★★★★ ®@£€€q +97433572282 ★★★★★★★★★★★★★★★★★★

No comments:

Post a Comment