31

🤚🏻✋🏻🤚🏻✋🏻 *బిస్మిల్లాహ్ హిర్రహ్మా నిర్రహీమ్* 🤚🏻✋🏻🤚🏻✋🏻

🛐🕋🛐🕋 *అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను* ☪🕋☪🕋

°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°

       🕌🕋🕌🕋 *ఇస్లాం చరిత్ర* 🕋🕌🕋🕌

                               *భాగము - 31* 

____________________________________________

ఫిరౌన్ మరియు అతని అనుచరులు, అల్లాహ్ విధించిన భయంకర శిక్షకు గురి అయి సముద్రపు నీటిలో మునిగి చావబడ్డారు. మూసా (అలైహి) మరియు అతని అనుచరులను ఈ విపత్తు బారి నుండి అల్లాహ్ కాపాడారు.

ఆ తర్వాత అల్లాహ్ ఫిరౌనీయులు స్థానంలో, అణచివేతలకు గురైన బలహీనవర్గ ప్రజలైన బనీఇస్రాయీల్ ప్రజలను తెచ్చి పెట్టారు. తూర్పు నుంచి పడమర వరకు ఎన్నో శుభాలు కలిగించిన భూభాగానికి అల్లాహ్ ఇస్రాయీల్ సంతతిని వారసులుగా చేశారు. ఈ విధంగా బనీఇస్రాయీల్ ప్రజల విషయంలో అల్లాహ్ చేసిన వాగ్దానం నెరవేరింది. దానికి కారణం బనీఇస్రాయీల్ ప్రజలు సహనం వహించడమే.

ఇస్రాయీల్ సంతతివారు మూసా (అలైహి) చూపిన మహిమలను కళ్లారా చూశారు. ఆ మహిమలలో చివరిది సముద్రపు నీటి ప్రవాహంలో తాము కొట్టుకపోకుండా కాపాడబడటం మరియు అదే ప్రవాహంలో తమ శత్రువులైన ఫిరౌనీయులు మరియు క్రూర పాలకుడైన ఫిరౌన్ తమ కళ్ళ ముందే నీటిలో ముంచబడటం. బనీఇస్రాయీల్ ప్రజల మనసులో నుంచి విగ్రహారాధనను పూర్తిగా రూపుమాపడానికి ఈ మహిమలు చాలు. కానీ కొంతకాలం తర్వాత వారు మళ్ళీ విగ్రహారాధన వైపునకు మరలినారు. బనీఇస్రాయీల్ ప్రజల మనసులో నుంచి పూర్తిగా విగ్రహారాధనను రూపుమాపి, అల్లాహ్ ను మాత్రమే ఆరాధించేలా చేయడానికి మూసా (అలైహి) కు చాలా కష్టపడవలసి వచ్చింది. ఉదా.....

అల్లాహ్ బనీఇస్రాయీల్ ప్రజలను సముద్రపు నీటి ప్రవాహం దాటించి ఆవలకు చేర్చారు. అక్కడి నుంచి వారు మరొక చోటుకి ప్రయాణం సాగించారు. అలా ప్రయాణం సాగిస్తూ దారిలో వారికి విగ్రహాలు పట్టుకొని కూర్చున్న, విగ్రహారాధనలో మునిగి ఉన్న కొంత మంది ప్రజలను చూశారు. అపుడు బనీఇస్రాయీల్ ప్రజలు మూసా (అలైహి) తో.....

బనీఇస్రాయీల్ ప్రజలు : - ఓ మూసా! చూశావా ఆ ప్రజలను, వారు తమ దేవుని ఆరాధనలో ఎలా లీనమైపోయారో? మూసా! వారిలా ఆరాధించడానికి, వారు పూజిస్తున్న విగ్రహంలాంటిది మాకు కూడా ఒక ఏదైనా విగ్రహాన్ని చేసి ఇవ్వు.

మూసా (అలైహి) : - మీరు మరి మూర్ఖజనులు లాగా మాట్లాడుతున్నారు. నిశ్చయంగా వీరు ఏ పనిలో నిమగ్నమై ఉన్నారో ఆ ఆరాధన నాశనం  చేయబడుతుంది. వారు చేస్తున్నది అత్యంత పనికిమాలిన పని.

మూసా (అలైహి) (ఇంకా కోపంతో) : - అల్లాహ్ మీకు సమస్త మానవాళిపై ప్రాధాన్యతను ఇచ్చి ఉన్నాడు. అలాంటి అల్లాహ్ ని వదిలి నేను మీకోసం వేరే దైవాన్ని వెతికిపెట్టాలా?

మీకు అల్లాహ్ చేసిన ఉపకారాలు జ్ఞాపకం తెచ్చుకోండి. మిమ్మల్ని తీవ్ర నరకయాతలు పెడుతున్న, చిత్రహింసలకు గురి చేస్తున్న ఫిరౌనీయుల బారి నుండి అల్లాహ్ మిమ్మల్ని కాపాడారు. ఫిరౌనీయులు మీ కొడుకుల్ని చంపుతూ మీ కూతుళ్ళని మాత్రమే సజీవంగా ఉండనిచ్చేవారు. అది మీకు మీ ప్రభువు వైపున కఠిన పరిక్షకాలం. మరొక విషయం జ్ఞాపకం తెచ్చుకోండి. "కృతజ్ఞులై ఉంటే మీకు మరిన్ని వరాలు అనుగ్రహిస్తానని, కృతఘ్నులైపోతే తన శిక్ష చాలా కఠినంగా ఉంటుంది" అని మీ ప్రభువు మిమ్మల్ని హెచ్చరించాడు.

*ఇస్లాం లో మొట్టమొదటి గ్రంథం తౌరాత్ అవతరణ*

మూసా (అలైహి) తో పాటు బనీఇస్రాయీల్ ప్రజలు సినాయ్ ఎడారిలో స్థిరపడ్డారు.  తన ప్రజలు ఎక్కడ స్థిరపడాలన్న విషయమై మూసా (అలైహి) అల్లాహ్ మార్గదర్శనాన్ని కోరారు. ఇస్రాయీల్ సంతతి కొరకు ధర్మ దేశాలు మరియు నిషేధ ఆజ్ఞలతో కూడిన ఒక దివ్యగ్రంథం తౌరాత్ ను పంపుతానని అల్లాహ్ మూసా (అలైహి) కు వాగ్దానం చేశారు. ఫిరౌన్ నీట మునిగిన తర్వాత మూసా (అలైహి) తన ప్రభువైన అల్లాహ్ ను కోరారు.

అల్లాహ్ మూసా (అలైహి) తో : - మూసా! మీరు కోరిన విధంగానే మీ జీవన సరళి కోసం దివ్యగ్రంథం తౌరాత్ ను అవతరింపజేస్తాను. దానికి నువ్వు ముప్పై రోజులు ఉపవాసాలు పాటించి పరిశుద్ధునివి కావాలి. ఆ తర్వాత సినాయ్ లోని తూర్ కొండ వద్దకు వెళ్ళాలి. ఆ తర్వాత అక్కడ మీకు అవసరమైన చట్టాలను ప్రసాదించడం జరుగుతుంది.

అల్లాహ్ ఆదేశాన్ని మూసా (అలైహి) సమ్మతించి, తన ప్రజల వద్దకు వెళ్లారు. మూసా (అలైహి) తన జాతి ప్రజలలో డెబ్భై మందిని ఎన్నుకున్నారు. అల్లాహ్ చెప్పిన ప్రాంతానికి, అల్లాహ్ ఇచ్చే చట్టాలను స్వీకరించడానికి తనతో పాటు, తను ఎన్నుకున్న డెబ్బై మందిని రమ్మని కోరారు. మూసా (అలైహి) బయలుదేరే ముందు తన జాతి ప్రజలకు నాయకునిగా తన సోదరుడు హారూన్ ని నియమించారు.

మూసా (అలైహి) : - సోదరా హారూన్! నేను వెళ్లిన తర్వాత నీవు నా తరుపున మన జాతి ప్రజలకు నాయకత్వం వహించి సరైన రీతిలో పని చేస్తుండాలి. విచ్చిన్నకారుల త్రోవ నడవకు.

మూసా (అలైహి) ఆ డెబ్బై మంది కోసం చాలా కాలం ఎదురుచూశారు. కానీ వారెంతకి రాలేదు. మూసా (అలైహి) ఇంక ఓపిక పట్టలేక తానే ఒంటరిగా తూర్ శిఖరానికి చేరుకోవడానికి బయలుదేరారు. అక్కడికి చేరుకోవడానికి మూసా (అలైహి) ముప్పై రోజులు ప్రయాణించారు. ఆ తర్వాత మూసా (అలైహి) అల్లాహ్ నిర్ణయించిన నిర్ణీత సమయానికి తూర్ కొండ దగ్గరకు చేరుకున్నపుడు అల్లాహ్ మూసా (అలైహి) తో ప్రత్యక్ష సంభాషణ జరిపాడు. అల్లాహ్ మూసా (అలైహి) ని ఉద్దేశిస్తూ....

అల్లాహ్ : - మూసా! నీ ప్రజలు వచ్చే వరకు ఎందుకు వేచి ఉండలేదు.

మూసా (అలైహి) : - వారు వెనుక వస్తున్నారు. నేను మీ ప్రసన్నత పొందటానికి త్వరత్వరగా వచ్చేశాను ప్రభు.

అపుడు అల్లాహ్ మూసా (అలైహి) తో "మరో పది రోజులు ఉపవాసాలు పాటించి పరిశుద్ధత పొందాలి" అని ఆదేశించారు. ఆ పది రోజుల గడువు తర్వాత మళ్ళీ సినాయ్ లోని తూర్ కొండ వద్దకు వచ్చారు. విశ్వప్రభువైన అల్లాహ్ తో సంభాషించారు. ఈ సంభాషణల వల్ల మూసా (అలైహి) కు అల్లాహ్ తో సాన్నిహిత్యం పెరిగింది. మూసా (అలైహి) హృదయం ఆధ్యాత్మిక భావనలతో నిండిపోయింది. తన భావావేశాలను వ్యక్తపరుస్తూ, వేడుకుంటూ....

మూసా (అలైహి) : - ఓ ప్రభు! నా కళ్ళకు శక్తి ని ప్రసాదించి నీ దర్శన భాగ్యం ప్రసాదించు. నేను నా కళ్లారా నిన్ను చూడాలనుకుంటున్నాను. (అని ప్రాధేయపడ్డారు)

అల్లాహ్ : - మూసా! నీవు నన్ను ఇహలోకంలో చూడలేవు. సరే! ఆ కొండ పై నువ్వు దృష్టి సారించు. ఆ కొండ తన స్థానంలో యధాతథంగా ఉంటే నీవు నన్ను చూడగలవు.

మూసా (అలైహి) (సంతోషంతో) : - అలాగే ప్రభు.

మూసా (అలైహి) వెంటనే ఆ కొండ పై దృష్టి సారించారు. ఆ తర్వాత అల్లాహ్ తన దివ్య తేజస్సు ను ఆ కొండ పై ప్రసరింపజేయగానే ఆ కొండ మరుక్షణం ఫెళఫెళరావాలతో తునాతునకలైపోయింది. ఆ ప్రభావానికి మూసా (అలైహి) నేలపై విసిరివేయబడ్డారు. ఆ వెంటనే స్పృహతప్పి పడిపోయారు. కానీ అల్లాహ్ ప్రసన్నత పొందిన వారికి అల్లాహ్ కారుణ్యం ఎల్లప్పుడూ లభిస్తుంది. మూసా (అలైహి) స్పృహలోకి వచ్చిన తర్వాత....

మూసా (అలైహి) : - ప్రభు! సర్వ స్తోత్రాలు నీకే. నీవు ఎంతో పరిశుద్ధుడువు. జరిగిన పొరపాటుకు పశ్చాత్తాపపడుతూ నిన్ను క్షమాపణ వేడుకుంటున్నాను. నేను పశ్చాత్తాపం తో నీ వైపుకే మరులుతున్నాను. నన్ను క్షమించు. అందరికంటే ముందు నేనే నిన్ను విశ్వసిస్తున్నాను. నిజమైన విశ్వాసుల్లో అగ్రభాగాన ఉండాలి భావిస్తున్నాను.

అల్లాహ్ : - మూసా! నేను నీకు ప్రవక్త పదవిని ఇచ్చాను. నీతో ప్రత్యక్ష సంభాషణ జరిపాను. ఈ విధంగా నీకు యావత్ మానవాళి పై ప్రాధాన్యతను ఇచ్చాను. కనుక నేను ప్రసాదించే దానిని స్వీకరించి నాకు కృతజ్ఞుడవై ఉండు.

ఆ తర్వాత అల్లాహ్, జీవిత సమస్త రంగాలకు సంబంధించిన హితవులు, ప్రతి విషయానికి సంబంధించిన మార్గదర్శక సూత్రాలు రాతి ఫలకలపై రాసి మూసా (అలైహి) కు ఇచ్చారు.

అల్లాహ్ పట్ల తన కృతజ్ఞతను వ్యక్త పరుస్తూ మూసా (అలైహి)....

మూసా (అలైహి) : - ప్రభు! నీవు నాకు గొప్ప గౌరవాన్ని ప్రసాదించావు. ఇంతకు ముందు ఎవరూ ఇలాంటి గౌరవాన్ని పొందలేదు.

అల్లాహ్ : - మూసా! ఇతరుల కన్నా నీకు ప్రాముఖ్యం ఇచ్చి నా సందేశాన్ని అందజేయడానికి, నా ఆదేశాలు అందుకోవడానికి నిన్ను ఎన్నుకున్నాను. కాబట్టి నేను ప్రసాదించిన ఈ హితోక్తులను (రాతి ఫలకలను) ధృడంగా పట్టుకోని ఉండాలి. ఇందులోని విషయాలు మార్చకుండా సక్రమరీతిలో అనుసరించమని నీ జాతి ప్రజలను ఆదేశించు.

ఆ తర్వాత అల్లాహ్ తన సంభాషణను కొనసాగిస్తూ....

అల్లాహ్ : - మూసా! నీ వెనుక నీవు ఇక్కడికి వచ్చిన తర్వాత మేము నీ జాతి ప్రజలను పరీక్షకు గురి చేశాము. సామిరి అనేవాడు బనీఇస్రాయీల్ ప్రజలను పెడదారి పట్టించాడు.

ఈ మాటలు విన్న మూసా (అలైహి) కు తల తీసేసినట్టైంది. ఎంతో ఆగ్రహంతో, విచారం తో కూడిన భావోద్రేకాలతో తన జాతి దగ్గరకు తిరిగి వచ్చాడు.

తన జాతి ప్రజల వద్దకు తిరిగి వచ్చిన మూసా (అలైహి), వారందరూ కలిసి ఒక ఆవుదూడ విగ్రహం ముందు పాటలు పాడుతూ నృత్యాలు చేయడం చూశారు. ఈ అజ్ఞానపు ఆచారాన్ని చూసిన మూసా (అలైహి) కోపం పట్టలేక వారి కోసం తీసుకువచ్చిన చట్టాలున్న రాతి ఫలకలను క్రింద పడేశారు. తన సోదరుడు హారూన్ తల వెంట్రుకలని, గెడ్డాన్ని పట్టుకొని గుంజుతూ, "మన జాతి ప్రజలు మార్గభ్రష్టులై పోతుంటే చూసి వారిని వారించకుండా ఏ విషయం నిన్ను అడ్డుకుంది. తప్పు దారి పట్టకుండా ఎందుకు ఆపలేదు. ఈ దూరాచారాన్ని ఎందుకు నిలువరించలేదు. నీవు నా ఆదేశాన్ని ఎందుకు ఉల్లంఘించావు." అని నిలదీశారు.

హారూన్ : - నా తల్లి కుమారుడా! నా తల వెంట్రుకలు, గెడ్డం పట్టుకుని లాగకు, ముందు వాటిని వదులు. ఈ ప్రజలు నన్ను బలహీనుడిగా చేశారు, నా నోరు నొక్కేశారు. వాళ్ళు దాదాపు నన్ను చంపినంత పని చేశారు. నా శత్రువులు ఆనందించేలా వ్యవహరించకు. నన్ను దుర్మార్గుల్లో చేర్చకు. ఇస్రాయీల్ సంతతి ప్రజల్లో వర్గాలు సృష్టించానని, నువ్వు నిందిస్తావని కూడా నేను భయపడ్డాను. అల్లాహ్ దయ వల్ల అలా అనలేదు.

ఈ మాటలు విన్న మూసా (అలైహి) ఆగ్రహం నెమ్మదిగా చల్లారింది. హారూన్ నిస్సహాయ స్థితిని ఆయన అర్థం చేసుకున్నారు. పరిస్థితిని సంయమనం తో చక్కదిద్దాలని అనుకున్నారు. "ప్రభు! నన్ను నా సోదరున్ని క్షమించు. మమ్మల్నిద్దరిని నీ కారుణ్యఆశ్రయంలో చోటివ్వు. నీవు అందరికంటే గొప్ప కరుణామయుడివి." అని అల్లాహ్ తో వేడుకున్నారు.

అసలు బనీఇస్రాయీల్ ప్రజలను అల్లాహ్ పరీక్షించిన పరీక్ష ఏమిటి?
ఈ సామిరి ఎవరు?
అతను ఇస్రాయీల్ సంతతిని పెడదారి పట్టించిన విషయాలు ఏమిటి?
మూసా (అలైహి) తన సోదరుడు హారూన్ మీద దాడి చేయవలసిన అవసరం ఏమిటి?

అసలు ఏం జరిగిందన్న పై విషయాలలోని వివరణలను Insha Allah రేపటి భాగము - 32 లో తెలుసుకుందాము.

Note : - ఈ msg లను ముందుకు పంపిస్తూ, మన ఇస్లాం చరిత్ర గురించి మన ముస్లిం సోదరులకు తెలియజేస్తారని ఆశిస్తున్నాము.

☆☆ ®@£€€q +97433572272  ☆☆

No comments:

Post a Comment