77

🛐 🕋 ☪ *బిస్మిల్లాహ్ హిర్రహ్మా నిర్రహీమ్* ☪ 🕋 🛐

🕋🤚🏻✋🏻🕌 *అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను* 🕌🤚🏻✋🏻🕋

◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆

       🕌☪🕋🛐 *ఇస్లాం చరిత్ర* 🛐🕋☪🕌

                                *భాగము - 77* 

◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆

*వీర విశ్వాసి గురించి హజ్రత్‌ అబూసయీద్‌ ఖుద్రీ (రజి) గారి కథనం : -* 

●హజ్రత్‌ అబూసయీద్‌ ఖుద్రీ (రజి) కథనం ప్రకారం దైవప్రవక్త (స) ఇలా ప్రవచించారు : “దజ్జాల్ వెడలినపుడు విశ్వాసుల్లో ఒకతను అతని దగ్గరికి వెళ్తాడు. అక్కడ అతనికి ఆయుధాలు ధరించివున్న దజ్జాల్‌ భటులు తారసపడతారు. (దజ్జాల్ భటులు, ఆ విశ్వాసితో....,)

దజ్జాల్ భటులు : - ఎక్కడికి?

విశ్వాసి : - (కొత్తగా) వచ్చిన అతని దగ్గరికి.

దజ్జాల్ భటులు : - నీవు మా ప్రభువుని నమ్మవా?

విశ్వాసి : - వేరొకర్ని ప్రభువుగా నమ్మటానికి నమ్మకపోవడానికి మా ప్రభువు విషయంలో దాపరికాలు ఉంటే కదా!

ఆ సమాధానం విని వారు (ఆగ్రహంతో) అతడిని చంపండి అంటారు. తర్వాత తమలో తామే మాట్లాడుకుంటూ, “నా అనుమతి లేకుండా ఎవరినీ చంపవద్దని మన ప్రభువు మనల్ని ఆదేశించలేదా?” అని అనుకొని, ఆ విశ్వాసిని దజ్జాల్‌ దగ్గరికి తీసుకువెళ్తారు. విశ్వాసి దజ్జాల్ ని చూడగానే....,

విశ్వాసి : - ప్రజలారా! దైవప్రవక్త (సల్లం) చెప్పింది ఈ దజ్జాల్‌ గురించే. (అని ఎలుగెత్తి చెబుతాడు.)

దజ్జాల్ అతడిని బోర్లా పడేయమని ఆదేశిస్తాడు. తర్వాత అతడిని పట్టుకొని తలను మొహాన్ని బాదమని చెబుతాడు. అతని ఆజ్ఞమేరకు ఆ విశ్వాసిని పొట్ట, వీపు సాగిపాయేలా చితకబాదటం జరుగుతుంది.

తర్వాత దజ్జాల్ (ఆ విశ్వాసితో....,)

దజ్జాల్ : - నువ్వు నన్ను నమ్ముతావా?

విశ్వాసి : - నువ్వు అబద్ధాగ్రేసరుడివయిన మసీహ్ వి.

ఆ తర్వాత అతని తలను రంపముతో కోసి రెండు కాళ్ళు వేరయ్యేలా అతడ్ని రెండు ఖండాలుగా నరికేయమని ఆజ్ఞాపిస్తాడు. దజ్జాల్ ఆ రెండు ఖండాలు (వేరయిన శరీరము) మధ్య తిరుగుతాడు. తర్వాత వాటిని ఉద్దేశించి, “లే ... లేచి నిలబడు” అని అంటాడు. వెంటనే ఆ విశ్వాసి లేచి నిలబడతాడు. దజ్జాల్ మళ్ళీ అతడిని (విశ్వాసితో....,)

దజ్జాల్ : - నన్ను నమ్ముతావా లేదా?

విశ్వాసి : - నీ గురించి నా నమ్మకం ఇప్పుడు మరింత బలపడింది. ప్రజలారా! వీడు నా తర్వాత ఎవరి పట్లనూ ఇలా ప్రవర్తించలేడు.

అప్పుడు దజ్జాల్ అతడిని పట్టుకుని కోసేయాలని అనుకుంటాడు. కాని అల్లాహ్, అతని మెడను రక్త నాళం మధ్య భాగాన్ని ఇత్తడిగా మారుస్తాడు. తర్వాత దజ్జాల్ కు అతన్ని చంపటానికి మార్గమేదీ కనిపించదు. దాంతో దజ్జాల్ అతని కాళ్ళు చేతులు పట్టుకొని విసిరేస్తాడు. చూసిన జనం వాడు అతడ్ని అగ్నిలో విసిరేసాడు అని అనుకుంటారు. కాని వాస్తవానికి అతడిని స్వర్గంలో విసరివేయటం జరిగి వుంటుంది."

ఆ తర్వాత దైవప్రవక్త (స) ఇలా అన్నారు: “ఆ వ్యక్తి అల్లాహ్ దృష్టిలో అందరికంటే గొప్ప వీరమరణం పొందిన వాడుగా పరిగణించబడుతాడు.” (ముస్లిం, బుఖారి)●

_(దజ్జాల్ ఇలాంటి అరాచకాలు చేస్తున్నప్పుడు, అల్లాహ్ హజ్రత్ ఈసా అలైహిస్సలామ్ ను భూమి పైకి పంపిస్తారు.)_ 

*హజ్రత్ ఈసా అలైహిస్సలామ్ గారి రెండవ రాకడ* 

●దజ్జాల్‌ తన సైన్యాలతో ఉహద్ కొండ ప్రాంతం నుండి బయలుదేరి సిరియా చేరుకుంటాడు. దజ్జాల్ రాక సంగతి తెలుసుకున్న ముస్లింలు అతడ్ని ఎదుర్కోవడానికి డెమాస్కస్ లో సమాయత్తమవుతారు. సైనిక పునర్ వ్యవస్థీకరణ జరుగుతుంది....

.... *అది ఫజర్‌ నమాజువేళ. అందరూ మసీదులో బారులుతీరి నమాజు కోసం నిలబడతారు. అంతలో ఆకాశంలో ఒక వింత కనిపిస్తుంది. కనీవినీ ఎరగని వింత అది! ఆకాశం నుంచి ఈసా ఇబ్నె మర్యం (అలైహి) అవతరిస్తారు (హజ్రత్ ఈసా అలైహిస్సలామ్). రెండు పచ్చ వస్త్రాలు ధరించి, ఇద్దరు దైవదూతల రెక్కల మీద చేతులు ఉంచి మసీదులోని తెల్ల మీనారు వద్ద దిగుతారు. తల క్రిందికి వాల్చినప్పుడు తల నుంచి నీటి చుక్కలు రాలుతున్నట్లు, తల పైకి ఎత్తినప్పుడు ముత్యాలు లాగా (జల) బిందువులు జాలువారుతున్నట్లు కనిపిస్తుంది.* (ముస్లిం)●

●మసీదులో ఇమామ్‌ నమాజు చేయించడానికి సిద్ధమవుతాడు. ఇఖామత్‌ చెప్పడం కూడా అయిపోతుంది. అంతలో హజ్రత్‌ ఈసా (అలైహి) క్రిందికి దిగుతారు. ఇమామ్, ఆయన (ఈసా) ను చూడగానే కాస్త వెనక్కి తగ్గి....,

ఇమామ్ : - రండి నమాజు చేయించండి.

హజ్రత్ ఈసా (అలైహి) : - ఈ (ముహమ్మద్) అనుచర సముదాయం ప్రజలే ఒకరిపై ఒకరు ఇమాములు (నాయకులు). (కనుక మీరే నమాజు చేయించండి.)”

అప్పుడు ఆ ఇమామ్‌ గారు ముందుకు వచ్చి నమాజ్ చేయిస్తారు. (ముస్లిం)●

●నమాజు ముగిశాక హజ్రత్ ఈసా (అలైహి) ఆయుధాలు తీసుకొని దజ్జాల్ ని చంపడానికి బయలుదేరుతారు. ఆయన (నగర ప్రధాన) ద్వారం తెరవమని ఆదేశిస్తారు. ద్వారం తెరవబడుతుంది. బయట దజ్జాల్ డెబ్బై వేలమంది సాయుధులయిన యూదులతో విడిదిచేసి ఉంటారు. వాడు (దజ్జాల్), హజ్రత్ ఈసా (అలైహి) ను చూడగానే నీళ్ళలో వేసిన ఉప్పుగల్లులా కరిగిపోతూ భీతావహుడయి పలాయనం చిత్తగిస్తాడు. (పరుగు లకించుకుంటాడు)

హజ్రత్‌ ఈసా (అలైహి) దజ్జాల్ ని వెంబడిస్తారు. చివరికి ఈసా (అలైహి), "లుద్దా" లో తూర్పు ముఖద్వారం దగ్గర ఆ దుర్మార్గుడు దజ్జాల్ ను హతమారుస్తారు. (ప్రస్తుత ఇస్రాయీల్ రాజధాని టెల్అవివ్ కు కొన్ని మైళ్ళ దూరంలో ఉండే "లుద్దా")

(తమ నాయకుడు హతమవడం చూసి....,) దాంతో దజ్జాల్ అనుచరులు చెల్లాచెదరైపోయి దాక్కోవడానికి ప్రయత్నిస్తారు. కాని వారికి ఎక్కడా చోటు దొరకదు. ప్రతి రాయి, చెట్టు, గుట్ట సైతం ముస్లిం యోధులను కేకవేసి పిలుస్తూ...., “ఓ ముస్లిం! ఇటు వచ్చెయ్యి. ఇక్కడ నా వెనుక ఒక యూదుడు దాక్కున్నాడు. ఇతడ్ని చంపెయ్యి." అని అంటాయి. ఈ విధంగా అల్లాహ్ వారిని నాశనం చేస్తాడు. (అహ్మద్, ఇబ్నెమాజ, ముస్లిం)●

●వేరొక ఉల్లేఖనంలో ఇలా ఉంది : “(ఆ యుద్ధంలో) యూదులు రాళ్ళు లేక చెట్ల వెనుక కూడా దాక్కుంటారు. అప్పుడు ఆ రాళ్ళు, చెట్లు...., “ఓ ముస్లిం! నా వెనుక ఒక యూదుడు దాక్కునాడు, రా..... వచ్చి ఇతడ్ని చంపేయ్” అని చెబుతాయి. కాని గర్ ఖద్ చెట్టు మాత్రం చెప్పదు. ఎందుకంటే అది యూదుల చెట్టు. (బుఖారీ, ముస్లిం)●

ఆ తరువాత హజ్రత్ ఈసా ఇబ్నె మర్యం (అలైహి) అక్కడి నుంచి (డెమాస్కస్ కు) తిరిగొచ్చి ప్రజలను కలుసుకుంటారు. వారి యోగక్షేమాలు విచారిస్తారు. దజ్జాల్ ఉపద్రవాల నుండి క్షేమంగా బయటపడినవారి తలలు నిమురుతారు. వారికి లభించే స్వర్గ మహాభాగ్యాలను గురించి వారికి తెలియజేస్తారు.

ఈ విధంగా హజ్రత్ ఈసా (అలైహి) ప్రజల యోగక్షేమాలు విచారిస్తుండగా విశ్వప్రభువు (అల్లాహ్) నుండి ఆయన (ఈసా) కు, (ప్రజల పైకి వచ్చే) మరో ఉపద్రవం గురించి దివ్యావిష్కృతి (వహీ) వస్తుంది.

"నా ఈ దాసులలో వారితో పోరాడే అంతటి శక్తి లేదు. కనుక నేను వీరికి ఇక్కడి నుంచి తీసేయదలచుకున్నాను. కనుక నీవు నా ఈ దాసులను తీసుకుని తూర్ పర్వతం పైకి వెళ్ళి రక్షణ కల్పించు.”

ఈ అల్లాహ్ ఆజ్ఞ వెలువడగానే హజ్రత్ ఈసా (అలైహి) ముస్లింలందరినీ వెంటబెట్టుకుని తూర్ పర్వతానికి చేరుకుంటారు.

ఆ రెండవ ఉపద్రవమే యాజూజ్, మాజూజ్ ల ఉపద్రవం. (రష్యా, ఉత్తర చైనా ప్రాంతాల నుంచి) యాజూజ్, మాజూజ్ అనే కొన్ని ఆటవిక జాతులు కూడా బయలుదేరి ప్రపంచంలో పెద్ద ఎత్తున అల్లకల్లోలం సృష్టిస్తాయి. అవి ఎల్లడెల్లడలా వినాశనం, విధ్వంహాలు సృష్టిస్తూ స్వైరవిహారం చేస్తాయి. వాటిని ఎవరూ అడ్డుకోలేరు.

ఆ యాజూజ్, మాజూజ్ ల ఉపద్రవం గురించి Insha Allah రేపటి భాగము - 78 లో తెలుసుకుందాము.

☆☆ ®@£€€q  +97433572282 ☆☆ 
             (rafeeq)

Note : - ఈ msg లను ముందుకు పంపిస్తూ, మన ఇస్లాం చరిత్ర గురించి మన ముస్లిం సోదరులకు, సోదరీమణులకు తెలియజేస్తారని ఆశిస్తున్నాము.

No comments:

Post a Comment