14


🕋🕋🕋🕋 బిస్మిల్లాహ్ హిర్రహ్మా నిర్రహీమ్ 🕋🕋🕋🕋

🛐🛐🛐🛐 అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన *అల్లాహ్* పేరుతో ప్రారంభిస్తున్నాను 🛐🛐🛐🛐

------------------------------------------------

       ☪☪☪☪ *ఇస్లాం చరిత్ర* ☪☪☪☪

    భాగము - 14          Date : 24/11/2017

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

*యూసుఫ్ అలైహిస్సలామ్ ను ప్రలోభానికి గురిచేసిన జులేఖా* 

గవర్నరు గారి భార్యకు వ్యక్తిగత సేవకునిగా యూసుఫ్ అలైహిస్సలామ్ నియమించబడ్డారు. ఆయన చాలా విధేయంగా పని చేసేవారు. నమ్రత, సహనం, మృదు వైఖరి కలబోసిన ఆయన , అ౦దరి హృదయాలు చూరగొన్నాడు. గవర్నరు అజీజ్ కూడా యూసుఫ్ (అలైహి) ను చాలా అభిమానించసాగాడు.

కాల౦ గడచిన కొద్ది ఆయన ఒక తెలివైన, జ్ఞాన సంపన్నుడైన యువకునిగా ఎదిగారు. ఆయనలోని సుగుణాల కారణంగా అల్లాహ్ ఆయనకు వివేకాన్ని, విజ్ఞతను, వివేచనను ప్రసాదించాడు. ఆయన చాలా అందమైనవారు. ఆయన సౌందర్యం పట్టణం లో చర్చ నీయాంశమైంది. కవులు యూసుఫ్ (అలైహి) ను తాము చూసిన అత్యంత అందమైవ వ్యక్తిగా కీర్తిస్తూ కవితలు అల్లాసాగారు. దూర ప్రాంతాల నుంచి ప్రజలు ఆయన ను చూడడానికి రాసాగారు. అనేక మంది కన్యలు, కులీన కుటుంబాలకు చెందిన స్త్రీ లు యూసుఫ్ (అలైహి) ను స్వ౦త౦ చేసుకోవాలని కలలు కనసాగారు. కాని యూసుఫ్ (అలైహి) ఎన్నడూ ఎలాంటి అనుచితమైన చేష్ణలకు పాల్పడటం లేదు. ఎల్లప్పుడూ మర్యాదగా, నమ్రతగా వ్యవహరించేవారు. 

త్వరలోనే ఆయనకు జీవితం లో మరో పరీక్ష ఎదురైంది. అందమైన యూసుఫ్ (అలైహి) సౌందర్యం గవర్నరు భార్య జులేఖాను నిలువనీయలేదు. యూసుఫ్ (అలైహి) పట్ల వెర్రి వ్యామోహం వల్ల ఆమె నిద్రలేని రాత్రులు చాలా గడిపింది. యూసుఫ్ (అలైహి) పట్ల ప్రేమలో మునిగిపోయింది. తాను అమితంగా ప్రేమించే వ్యక్తి అంత దగ్గరగా ఉన్నప్పటికీ కనీసం తాకడానికి కూడా అవకాశం లేని పరిస్థితి ఆమెకు భరించారానిది అయింది. అయితే ఆమె బరితెగించిన స్త్రీ కాదు. ఆమెకు ఉన్న హొదా అంతస్తుల ద్వారా ఆమె తాను కోరిన పురుషుడిని పొందగలదు. ఆమె చాలా తెలివి కలిగిన అందమైన స్త్రీ. అందుకే గవర్నరు కావాలని ఆమెను వివాహం చేసుకున్నాడు. ఆమె వల్ల సంతానం కలగకపోయినా ఆయన మరో పెళ్ళి చేసుకోలేదు. ఆమెను అంతగా ప్రేమించేవాడు. 

యూసుఫ్ (అలైహి) పట్ల ఆకర్షణను తట్టుకోలేని జులేఖా ఒక రోజు అ౦ద౦గా ముస్తాబు చేసుకుని యూసుఫ్ (అలైహి) ను తన గదిలోకి రమ్మని పిలిపిచింది. యూసుఫ్ (అలైహి) గదిలోకి రాగానే లోపలి నుంచి తలుపులు మూసి వేసి, నేను నీ కోసమే ఉన్నానని తన కోరికను వెళ్లగక్కింది. యూసుఫ్ (అలైహి) నిర్ఘాంతపోయారు. ఈ ప్రలోభం చాలా బలమైనది. దీన్ని తిరస్కరించడం సాధారణమైన విషయం కాదు. పూర్తి యవ్వనం లో ఉన్న యూసుఫ్‌ (అలైహి) మనసులో నైతికమైన ఆలోచనలే కదలాడాయి. " నన్ను కన్న కొడుకులా చూసుకుంటున్న గవర్నరు గారి గౌరవ మర్యాదలను ఎలా భంగపరచగలను, అల్లాహ్ క్షమించుగాక ! మీ భర్త నాకు యజమాని. ఆయన నన్ను చాలా బాగా చూసుకుంటున్నారు. చెడుగా వ్యవహరించిన వారికి ఎలాంటి మంచి జరగదు " అని జవాబిచ్చారు. (ఖురాన్-12:23).

అయినప్పటికీ ఆమె తీవ్రమైన కోరికతో యూసుఫ్ (అలైహి) వైపు రాసాగింది. యూసుఫ్ తన ప్రభువు చూపిన హేతువు చూడకపోతే అతను తీవ్రమైన కోరిక తో ఆమె వైపు కదిలేవాడు. అల్లాహ్ యూసుఫ్ (అలైహి) ని చెడుకు, అశ్లీలత కు దూరంగా ఉండదలిచాడు. అందువల్ల యూసుఫ్ (అలైహి) ఆ చేష్ట కు వడిగట్టలేదు. అతను అల్లాహ్ ప్రత్యేకంగా ఎంచుకున్న దాసుడు. (ఖురాన్-12:24).

స్త్రీ ల దుర్మార్గపు ఆలోచనల నుంచి తనను కాపాడమని ఆయన అల్లాహ్ శరణు కోరారు. యూసుఫ్ (అలైహి) తిరస్కారం ఆమె కామ వాంఛను మరింత పెంచింది. చివరకు యూసుఫ్ (అలైహి), అతని వెనుక జులేఖా ఇద్దరూ పరిగెడుతూ తలుపు దగ్గరకు చేరుకున్నారు. యూసుఫ్ చొక్కా ను వెనుక నుంచి జులేఖా లాగి చింపివేసింది. అపుడే యూసుఫ్ (అలైహి) తలుపు తెరిచారు. ఎదురుగా జులేఖా భర్త, గవర్నరు అజీజ్ నిలబడి ఉన్నాడు. తెలివైన జులేఖా వెంటనే తన స్వరాన్ని మార్చి " దుష్టసంకల్పం తో నీ భార్య పట్ల చెడుగా వ్యవహరించిన వ్యక్తికి శిక్ష ఏమిటి? అలాంటి వాడిని జైల్లో పెట్టడమో లేక కఠిన యాతలు గురి చేయడమో తప్ప మరే శిక్ష కాగల్గుతుంది?" అని ప్రశ్నించింది. యూసుఫ్ తన పట్ల అసభ్యంగా ప్రవర్తించాడని చెబుతూ, అందుకు రుజువుగా చిరిగిన యూసుఫ్ చొక్కా ముక్క ను చూపించింది. (తాను ఏ పాపం ఎరుగనట్టు). (ఖురాన్-12:25).

జులేఖా తాను అమాయకురాలినని, యూసుఫ్ (అలైహి) తనను లొంగదీయడానికి ప్రవర్తించాడని ఆరొపించింది. యూసుఫ్‌(అలైహి) మొదట దిగ్భ్రాంతికి గురయ్యారు.

దానికి యూసుఫ్ (అలైహి), "ఈమే నన్ను వలలో వేసుకోవడానికి ప్రయత్నించింది" అన్నారు. తర్వాత జరిగినది అజీజ్ కు వివరించే ప్రయత్నం చేశారు. అయితే మూసి ఉన్న తలుపుల వెనుక ఏం జరిగిందో యూసుఫ్‌(అలైహి) కు, జులేఖా కు తప్ప మరెవ్వరికీ తెలియదు.

అపుడు జులేఖా కుటుంబసభ్యులలో ఒకరు, వరుసకు జులేఖా కు సోదరుడు అయ్యే వ్యక్తి మధ్యవర్తి గా ముందుకు వచ్చారు. అజీజ్ వెంటనే జులేఖా సోదరుని తో మాట్లాడారు. జులేఖా సోదరుడు అపార నిజాయితి, తెలివితేటలు కలిగిన వ్యక్తి. ఆయన జులేఖా కథనాన్ని, యూసుఫ్ (అలైహి) చెప్పిన మాటలను విన్నాడు. ఇక ఆ వ్యక్తి తన అభిప్రాయాన్ని చెబుతూ, 2 విషయాలు చెప్పదలచాడు.
మొదటి విషయం ఏంటంటే “యూసుఫ్ చొక్కా ముందు భాగ౦ చిరిగిపోయి ఉంటే జులేఖా చెబుతున్నది నిజ౦. యూసుఫ్, జులేఖా పట్ల అసభ్యంగా వ్యవహరించాడని చెప్పాలి."
ఇక రెండవ విషయం ఏంటంటే "అలా కాక యూసుఫ్ చొక్కా వెనుక భాగ౦ చిరిగి ఉంటే జులేఖా అబధ్ధమాడుతోంది, యూసుఫ్ చెబుతున్నది నిజం" అని తీర్పు ఇచ్చాడు. (ఖురాన్ 12:26).

అపుడు అజీజ్ ఆ చిరిగిన చొక్కాను పరిశీలిస్తే వెనుక భాగమే చిరిగింది కాబట్టి జులేఖా చెప్పేది అబద్ధమని స్పష్టంగా తేలింది. నిరాశ నిస్పృహలకు గురైన అజీజ్ ఆమెతో “సిగ్గు సిగ్గు మీ స్త్రీ ల మాయోపాయాలు, ఇవన్నీ మీ ఆడవాళ్ళ పన్నాగాలు, నిజంగా మీ పన్నాగాలు చాలా భయంకరంగా ఉంటాయి” అన్నాడు. న్యాయ ప్రియుడైన అజీజ్ వెంటనే తన భార్య ప్రవర్తనకు యూసుఫ్ (అలైహి)కు క్షమాపణలు చెప్పాడు. యూసుఫ్ (అలైహి) పై అసత్యపు  ఆరోపణలు చేసినందుకు క్షమాపణలు వేడుకోవాలని తన భార్య ను కూడా ఆదేశించాడు.

ఆ తర్వాత, సేవకులతో నిండిన అలాంటి భవనం లో జరిగిన ఈ సంఘటన ఒక రహస్యంగా ఉంచడం సాధ్యం కాదు. ఈ కథ ఆ నోట ఈ నోట అందరికి తెలిసిపోయింది. జులేఖా ప్రవర్తన సిగ్గుమాలినదిగా గొప్పింటి స్త్రీ లు మాట్లాడుకోసాగారు. "ఒక గవర్నరుకు భార్య గా ఉండి ఒక బానిస తో ప్రేమ వ్యవహారాన్ని నడుపాలనుకోవడం సిగ్గుచేటు, మొహావేశం జులేఖా ను అదుపు తప్పేలా చేసింది, కానీ మన దృష్టి లో మాత్రం జులేఖా పెద్ద తప్పు చేసింది" అని వ్యాఖ్యానించసాగారు. (ఖురాన్ 12:27-30).

 ఈ వ్యాఖ్యలు ఆ నోటా ఈ నోటా పాకి జులేఖా చెవిన పడ్డాయి. దానికి జులేఖా చాలా బాధ పడింది. యూసుఫ్ వంటి సాటిలేని అ౦ద౦ కలిగిన వ్యక్తి ని చూసిన ఏ స్త్రీ అయినా తనలాగే వ్యవహరిస్తుందని ఆమె భావించింది. తన అభిప్రాయాన్ని నిరూపించడానికి, తాను ఎలాంటి ఆకర్షణకు గురయిందో అలాంటి ఆకర్షణకే మిగిలిన స్త్రీ లు అందరూ గురయ్యే పథకాన్ని వేసింది. ఆ గొప్పింటి స్త్రీ లను అందరిని ఒక పెద్ద విందుకు ఆహ్వానించింది.

     ఆ విందులో యూసుఫ్ అలైహిస్సలామ్ ను చూసిన ఆ గొప్పింటి స్త్రీ లు వారి చేతులను కోసుకున్నారు.

ఈ విషయం లోని వివరణను Insha Allah రేపటి భాగము - 15 లో తెలుసుకుందాము.

ముస్లిం సోదరులకు ఒక చిన్న విజ్ఞప్తి  :-

ప్రియమైన ముస్లిం సోదరులారా!  ఇప్పటికి కూడా మనలో చాలా మంది ముస్లిం సోదరులకు అసలు ఇస్లాం అంటే ఏంటి ? , దీన్ అంటే ఏంటి ? , మన నబీ ఎవరు ? , అసలు మనం ఎందుకోసం పుట్టాము ?  ------ ఇలాంటి అనేకమైన విషయాలు తెలియదు .మనకు ఈ జీవితాన్ని ఇచ్చినది అల్లాహ్ , అలాంటి అల్లాహ్ కోసం 24 గంటల్లో ఒక్క 5 నిమిషాల సమయం కేటాయించి ఈ msg ను చదవలేమా , కేవలం 5 నిమిషాలు కేటాయించి ఇస్లాం చరిత్ర తెలుసుకుంటారని ఆశిస్తున్నాము. నాకు ఈ msg లు ఒక ముస్లిం సోదరుడు పంపించాడు , నేను మీకు పంపిస్తున్నాను ; అలాగే మీరు కూడా ఈ msg లను ముందుకు పంపించండి , ఇదేదో 10 మందికి send చేస్తే మంచి జరుగుతుంది , send చేయకపోతే చేడు జరుగుతుంది అనుకునే msg లు కావు . కాబట్టి మన ముస్లిం లలో దీన్ ను నింపవల్సిన బాధ్యత అల్లాహ్ మన పై ఉంచాడు అని తెలుసుకుంటూ , ఇస్లాం ఉనికి ని చాటి చెప్తారని ఆశిస్తున్నాము .

No comments:

Post a Comment