65

🛐 🕋 ☪ *బిస్మిల్లాహ్ హిర్రహ్మా నిర్రహీమ్* ☪ 🕋 🛐

🕋🤚🏻✋🏻🕌 *అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను* 🕌🤚🏻✋🏻🕋

◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆

       🕌☪🕋🛐 *ఇస్లాం చరిత్ర* 🛐🕋☪🕌

                                *భాగము - 65* 

◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆

*మహా సాహసవంతుడు జుల్ ఖర్ నైన్* 

జుల్ ఖర్ నైన్ వద్ద అతిపెద్ద సైన్యం, ఒక మహా సామ్రాజ్యం ఉండేవి. అల్లాహ్ అతడికి భూమిపై అధికారం ప్రసాదించారు. అతడికి కావాలసిన సమస్తమూ ఇచ్చారు. ఆ మహా సైన్యం అతడి ఆజ్ఞను జవదాటేది కాదు. అతడికి లొంగని దేశం లేదు. అతడికి అనువుకాని ప్రదేశం అంటూ ఏదీ లేదు. ఎలాంటి సాహసమైన అతడికి సాధ్యం కానిది కాదు. అతడు పాల్గొన్న ప్రతి యుద్ధంలోనూ విజేతగా నిలిచాడు.

అప్పటి ప్రపంచంలో నలుమూలలా అతడు పర్యటించాడు. తూర్పు నుంచి పడమరకు ప్రతి చోటికి వెళ్లాడు. ఒక ప్రదేశంలో ఒక పెద్ద సరస్సు వద్ద నీరు బురదతో కలిసి బుడగలుగా వస్తుండడాన్ని చూశాడు. ఈ ప్రదేశం ప్రపంచానికి చివరిదా లేక ఈ ప్రదేశం తర్వాత కూడా ప్రపంచం ఉందా అని ఆలోచించసాగాడు. ఆ ప్రదేశంలో కొందరు మనుష్యులు కనపడ్డారు. వారు దైవం గురించి తెలియని అవిశ్వాసులు. పరమ దుర్మార్గులు. ప్రజలను దోచుకోవడం, హత్యలు చేయడం వృత్తిగా బ్రతుకుతున్నవాళ్లు. జుల్ ఖర్ నైన్ అల్లాహ్ ని ప్రార్థించి మార్గ దర్శకత్వం కోసం మొరపెట్టుకున్నాడు. అల్లాహ్ అతడికి రెండు మార్గాలలో ఒకదాన్ని ఎంచుకోమన్నాడు. "జుల్ ఖర్ నైన్ వారిని శిక్షించు లేదా వారి పై దయ చూపు. జుల్ ఖర్ నైన్ తన సైనికులతో....,

జుల్ ఖర్ నైన్ : - మనం ఇక్కడ దుర్మార్గులను శిక్షిద్దాం. వాళ్ళు ప్రభువు వద్దకు వెళ్లిన తర్వాత మళ్లీ తగిన శిక్ష పొందుతారు. అయితే మనం మంచి వారిని దయతో చూద్దాం.

జుల్ ఖర్ నైన్ ఆ ప్రజలను సంస్కరిస్తూ అక్కడ కొంతకాలం గడిపాడు. అక్కడ న్యాయాన్ని స్థాపించిన తర్వాత, మంచి వారిని అక్కడ పాలకులుగా నియమించిన తర్వాత వారి నుంచి సెలవు తీసుకొని వెళ్లిపోయాడు.

*యాజూజ్, మాజూజ్* 

జుల్ ఖర్ నైన్ మహాసాహసి అయిన పాలకుడు. తూర్పు దిశగా ప్రయాణం చేశాడు. అవిశ్వాసులను సంస్కరిస్తూ, వారితో యుద్ధాలు చేస్తూ తన సైన్యంతో యాత్ర కొనసాగించాడు. ఆయన ప్రతి యుద్ధంలోనూ విజేతగా నిలిచాడు.

అలా ప్రయాణిస్తూ అతను ఒక ప్రదేశానికి వచ్చాడు. ఆ ప్రదేశం నాగరికతకు ఆఖరుగా భావించాడు. అక్కడ ప్రజలకు నివాసగృహాలు లేవు. ఎలాంటి ఆశ్రయం లేదు. కనీసం చెట్టు నీడ కూడా వారికి లేదు. వారంతా పరమ అజ్ఞానంలో బ్రతుకుతున్నారు. ఆయన వారి మధ్య కొంతకాలం నివసించాడు. వారికి సంస్కారాన్ని నేర్పాడు. నాగరికతను నేర్పాడు. వారికి అల్లాహ్ గురించి బోధించాడు. వారి కోసం ఒక మంచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాడు. ఆ తర్వాత అతను పశ్చిమ దిశగా ప్రయాణం ప్రారంభించాడు.

ఆ విధంగా జుల్ ఖర్ నైన్ ఒక దేశానికి చేరుకున్నాడు. ఆ దేశం రెండు కొండల నడుమ ఉంది. చాలా అభివృద్ధి చెందిన దేశం అది. అక్కడి ప్రజలు జుల్ ఖర్ నైన్ తో తమకు, తమ పొరుగు దేశానికి మధ్య ఒక గోడ కట్టాలని అభ్యర్థించారు. పొరుగు దేశం ప్రజలు తమపై దాడి చేసి తమ సంపద దోచుకొని హత్యాకాండకు పాల్పడుతున్నారని అన్నారు. పొరుగున ఉంటున్నది యాజూజ్, మాజూజ్ తెగలు.

అడ్డు గోడ కట్టినందుకు ప్రతిగా సుంకం చెల్లిస్తామని కూడా వారన్నారు. కాని జుల్ ఖర్ నైన్ వారికి జవాబిస్తూ....,

జుల్ ఖర్ నైన్ : - ప్రజలారా! నాకు అల్లాహ్ చాలినంత ధనం ప్రసాదించారు. కనుక మీ శ్రమ తప్ప మరేమీ నాకు అవసరం లేదు. మీకు- దురాక్రమణదారులకు మధ్య పటిష్టమైన అడ్డుగోడను నేను నిర్మిస్తాను. 

దానికి వారు సంతోషంగా ఒప్పుకున్నారు. ఇనుమును భారీగా ఉపయోగించి జుల్ ఖర్ నైన్ రెండు కొండల మధ్య ప్రదేశాన్ని పూరించాడు. ఒక భారీ గోడను నిర్మించి ఆ గోడపై కరిగిన లోహాన్ని పోతపోశాడు. దురాక్రమణదారులు ఆ లోహపు నునుపైన గోడ పైకి ఎక్కడం కాని, గోడను పగులగొట్టి చొరబడటం కాని సాధ్యపడని విధంగా తయారుచేసాడు. ఆ దేశ ప్రజలు సంతోషించారు. గోడ నిర్మాణం పూర్తయిన తర్వాత జుల్ ఖర్ నైన్ అల్లాహ్ కు కృతజ్ఞతగా నమాజు చేశాడు. "నా దేవుని కారుణ్యం తప్ప ఇది మరేమీ కాదు. నా దేవుని వాగ్దాన సమయం వచ్చినప్పుడు ఆయన దానిని దుమ్ములో కలిపేస్తాడు. నా ప్రభువు వాగ్ధానం సత్యమైనది.

Insha Allah రేపటి భాగము - 66 లో అగడ్త బాధితుల గురించి తెలుసుకుందాము.

☆☆ ®@£€€q  +97433572282 ☆☆

Note : - ఈ msg లను ముందుకు పంపిస్తూ, మన ఇస్లాం చరిత్ర గురించి మన ముస్లిం సోదరులకు, సోదరీమణులకు తెలియజేస్తారని ఆశిస్తున్నాము.

No comments:

Post a Comment