35

🤚🏻✋🏻🤚🏻✋🏻 *బిస్మిల్లాహ్ హిర్రహ్మా నిర్రహీమ్* 🤚🏻✋🏻🤚🏻✋🏻

🛐🕋🛐🕋 *అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను* ☪🕋☪🕋

°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°

       🕌🕋🕌🕋 *ఇస్లాం చరిత్ర* 🕋🕌🕋🕌

                               *భాగము - 35* 

____________________________________________

*నేడు మనం మహా సంపన్నుడైన ఖారూన్ గురించి తెలుసుకుందాము.* 

పూర్వకాలంలో కథకులు, గొప్ప సంపద అని చెప్పడానికి ఖారూన్ సంపద అని పోల్చి చెప్పేవారు. అంటే సాటిలేని మహా సంపద అన్న భావంతో వాడేవారు.

ఫిరౌన్ కాలంలోనే ఖారూన్ ఉండేవాడు. ఖారూన్, మూసా (అలైహి) జాతికి చెందిన వ్యక్తి. అయితే ఖారూన్ తన జాతికే వ్యతిరేకంగా వ్యవహరిస్తూ విద్రోహిగా మారాడు. అల్లాహ్ అతనికి అపార సిరిసంపదలు, నిక్షేపాలు ప్రసాదించారు. ఖారూన్ చాలా సంపన్నుడు. ఒక మహా ప్రాసాదంలో భోగభాగ్యాలతో జీవించేవాడు. అత్యంత ఖరీదైన దుస్తులు ధరించేవాడు. అసంఖ్యాక బానిసలు ఎల్లప్పుడూ అతని సేవకు సిద్ధంగా ఉండేవారు. అన్ని రకాల సుఖవిలాసాలతో ఆడబరంగా జీవితం గడిపేవాడు. అపారమైన ధన సంపత్తులు అతనిలో గర్వాన్ని పెంచాయి. అహంకారంతో విర్రవీగేవాడు.

ఖారూన్ సంపద ఎంత అంటే; అతని బంగారు ఆభరణాలు, నిధి నిక్షేపాలు సమస్త సంపద అంతా గదులలో భద్రపరచి, వాటికి సంబంధించిన తాళపు చెవుల్ని బలవంతులైన వ్యక్తుల సమూహం అతి కష్టం మీద పైకి ఎత్త గలిగేది.

ఖారూన్ బీదలను చూసి అసహ్యించుకునేవాడు. తెలివితేటలు లేకపోవడం వల్లనే వారు బీదరికంలో మగ్గుతున్నారని ఈసడించుకునేవాడు. తన తెలివితేటలు, వ్యాపార నైపుణ్యం వల్లనే తనకు అపార సంపద లభించిందని మిడిసిపడేవాడు.

ఒక సారి ఖారూన్ జాతి ప్రజలు, ఖారూన్ తో ఇలా అన్నారు : - మిడిసిపడకు ఖారూన్! మిడిసిపడేవారికి అల్లాహ్ ప్రేమించడు. అల్లాహ్ నీకు ప్రసాదించిన ఐశ్వర్యంతో పరలోకగృహం నిర్మించుకోవడానికి ప్రయత్నించు. అల్లాహ్ నీకు మేలు చేసినట్లు నీవు కూడా ప్రజలకు మేలు చెయ్యి. ధరణిలో కలహాలు సృష్టించకు. అల్లాహ్ కలహాదారుల్ని ప్రేమించడు. ప్రపంచం నుండి నీ మంచితనం, పుణ్యం కూడా పరలోకానికి తీసుకెళ్లడం మరచిపోకు.

ఖారూన్ (మరింత నిలుగుతూ) : - ఈ ఆస్తి, ఈ సంపద అంత నాకు నా జ్ఞానం వల్ల లభించింది. నా ఐశ్వర్యాన్ని చూస్తే మీకు ఈర్ష్య, అసూయ. మీకు తెలివితేటలు లేవు. అందుకే బీదరికంలో మగ్గుతున్నారు.

అలాంటి కాలంలో జకాత్ (ధనవంతుల నుంచి బీదలకు రావలసిన ఆర్థిక హక్కు) అనేది తప్పనిసరి అని మూసా (అలైహి) కు అల్లాహ్ దివ్యవిష్కృతి ద్వారా తెలియజేశారు.

ఒక రోజు ఖారూన్ పూర్తి ఠీవి దర్పాలతో తన జాతి ప్రజల ముందుకు వచ్చాడు. అపుడు ఐహిక వ్యామోహపరులు కొందరు ఖారూన్ ను చూసి, "ఖారూన్ కు లభించిన సిరి సంపదలు, ఆస్తి, ఐశ్వర్యం మనకు లభించి ఉంటే బావుండు. ఖారూన్ చాలా అదృష్టవంతుడు." అని అన్నారు.

అయితే దైవిక జ్ఞానం కలవారు కొందరు, వారి ఆలోచన ధోరణిని విమర్శిస్తూ, "మీ వైఖరి చాలా విచారకరం. అల్లాహ్ ను విశ్వసించి సత్కార్యాలు చేసేవానికి అల్లాహ్ దగ్గర ఉన్న ప్రతిఫలం ఏంతో శ్రేష్ఠమైనది. సహనం వహించే వారికి ఈ మహాభాగ్యం లభిస్తుంది." అని అన్నారు.

ఆ తర్వాత పేదల ఆర్థిక హక్కు అయిన జకాత్ చెల్లించవలసిందిగా ప్రవక్త మూసా (అలైహి) ఖారూన్ కు చెప్పారు. జకాత్ అన్నది బీదలను ఒక హక్కుగా సంపన్నులు చెల్లించవలసిన నిర్దారీత వాటా అని తెలియజేశారు. విశ్వాసులందరు తప్పనిసరిగా జకాత్ చెల్లించాలని అల్లాహ్ ఆదేశించాడు. కానీ ఈ సలహా విన్న ఖారూన్ కోపంతో మండిపడ్డాడు. తన పై అల్లాహ్ అనుగ్రహం వర్షిస్తుందని, తన ధన సంపదలే అందుకు నిదర్శనమని మూసా (అలైహి) తో చెప్పాడు. తన జీవిత విధానాన్ని ఆమోదించినందువల్లనే అల్లాహ్ తన సంపదను అనునిత్యం పెంచుతున్నాడని వాదించాడు. ప్రవక్త మూసా (అలైహి) ఖారూన్ కు ఎంతో నచ్చజెప్పారు. దుర్మార్గపు ఆలోచనల పరిణామాలు నష్టదాయకంగా ఉంటాయని హెచ్చరించారు.

చివరకు ఖారూన్ తన సంపదపై జకాత్ లెక్కించాడు. జకాత్ ను లెక్కిస్తే తాను చెల్లించవలసిన మొత్తం అతడికి చాలా ఎక్కువగా కనపడింది. అంత మొత్తం చెల్లించాలంటే ఖారూన్ కు ప్రాణం పోయినట్లు అనిపించింది. జకాత్ ఇవ్వనని తిరస్కరించాడు. తిరస్కరించడమే కాదు, మూసా (అలైహి) తన స్వార్థప్రయోజనాల కోసం జకాత్ చట్టం తీసుకొచ్చారని ప్రచారం మొదలుపెట్టాడు. ప్రవక్త మూసా (అలైహి) కు వ్యతిరేకంగా ప్రజల అభిప్రాయాన్ని కూడగట్టడానికి కొంతమందికి లంచాలు కూడా ఇచ్చాడు. మూసా (అలైహి) గురించి నానావిధాల పుకార్లు వ్యాపించేలా చేశాడు.

ఖారూన్ కుట్రల గురించి అల్లాహ్, ప్రవక్త మూసా (అలైహి) ను హెచ్చరించారు. ఖారూన్ పిసినారితనానికి, అల్లాహ్ చట్టాల పట్ల అతని తిరస్కారానికి గాను అతడికి శిక్ష విధించాలని మూసా (అలైహి) అల్లాహ్ ని వేడుకున్నారు.

అల్లాహ్ ఆగ్రహం ఖారూన్ పై విరుచుకుపడింది. భూమి ఒక్కసారిగా పగులు ఏర్పడి, హఠాత్తుగా ఖారూన్ తో సహా అతడి భవనాన్ని, యావత్తు సంపదన భూమి లోకి దిగిపోయింది. అపుడు అల్లాహ్ ఆజ్ఞ కు వ్యతిరేకంగా వ్యవహరించిన ఖారూన్ కు ఆదుకునేవారెవ్వరు లేకపోయారు. ఖారూన్ కూడా తనను తాను కాపాడుకోలేకపోయాడు. నా ఆస్తి, నా సంపద, నా ఐశ్వర్యం అని విర్రవీగిన ఖారూన్ కు తన ఆసిపాస్తులు ఏవి తనను కాపాడలేకపోయాయి. ఖారూన్ అనేవాడు ఒకప్పుడు ఉండేవాడన్న చిహ్నాలు కూడా లేకుండా అతడు తుడుచుకపెట్టుక పోయాడు. ఖారూన్ సంఘటన మూసా (అలైహి) జాతి ప్రజలకు ఒక గుణపాఠంగా మిగిలిపోయింది.

నిన్నటి రోజు ఖారూన్ హొదా అంతస్తులు చూసి అలాంటివి తమకూ కావాలని కోరుకున్నవారు, ఇపుడు ఖారూన్ పరిస్థితి చూసి విచారం వెలిబుచ్చుతూ ఇలా అన్నారు. "మనం ఒక విషయం మరచిపోయాం. అల్లాహ్ ఎవరికి పుష్కలంగా ఉపాధి ఇవ్వదలుచుకుంటాడో వారికే పుష్కలంగా ఉపాధి లభిస్తుంది. అల్లాహ్ మరెవరికి ఉపాధి పరిమితంగా ఇవ్వాలని భావిస్తాడో వారికి పరిమితంగానే లభిస్తుంది. అల్లాహ్ మనల్ని అనుగ్రహించి ఉండకపోతే ఆయన మనల్ని కూడా భూమిలోకి అనగద్రొక్కేవాడు. అయ్యో! అవిశ్వాసులు కొంచెం కూడా సాఫల్యం చెందరన్న సంగతి మనకు కుంచెం కూడా గుర్తుకు రాలేదే." అని అనుకున్నారు.

Insha Allah రేపటి భాగము - 36 లో మార్గదర్శి ఖిజర్ గురించి తెలుసుకుందాము.

Note : - ఈ msg లను ముందుకు పంపిస్తూ, మన ఇస్లాం చరిత్ర గురించి మన ముస్లిం సోదరులకు తెలియజేస్తారని ఆశిస్తున్నాము.

☆☆ ®@£€€q +97433572282 ☆☆

No comments:

Post a Comment