55

🛐 🕋 ☪ *బిస్మిల్లాహ్ హిర్రహ్మా నిర్రహీమ్* ☪ 🕋 🛐

🕋🤚🏻✋🏻🕌 *అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను* 🕌🤚🏻✋🏻🕋

◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆

       🕌☪🕋🛐 *ఇస్లాం చరిత్ర* 🛐🕋☪🕌

                                *భాగము - 55* 

◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆

*వంద గడ్డిపోచలు కలిపి ఒక కట్టగా చేయ్. నీ భార్య శరీరానికి ఆ కట్టను కొట్టేలా తాకించు. ఆ విధంగా నీవు చేసిన ప్రమాణం పూర్తవుతుంది. నీ కష్టకాలంలో నీ వెంట ఉన్న నిజాయితీ కలిగిన నీ భార్య పట్ల సానుభూతి, దయలను ప్రదర్శించినట్లవుతుంది.* 

*(గడ్డిపోచల కట్ట) "ఈనెల కట్ట తీసుకొని కొట్టు, ప్రమాణాన్ని భంగపరచకు." మేమతడ్ని సహణశీలిగా, మంచి దాసునిగా, తన ప్రభువు వైపుకు మాటిమాటికి మరలే వానిగా గుర్తించాము. (ఖురాన్ 38:44)* 

◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆

అయ్యూబ్ (అలైహి) పై మూడు కుట్రలు ప్రయోగించిన కూడా ఫలితం లేదని, అయ్యూబ్ (అలైహి) అల్లాహ్ పై ఉన్న విశ్వాసం విషయంలో స్థిరంగా ఉన్నారని తెలుసుకున్న ఇబ్లీస్, తరువాత ఏం చేయాలన్న విషయమై దిక్కు తోచక తన సహాయదారుల్ని సలహా అడిగాడు.

ఇబ్లీస్ : - నా సహచరులారా! అయ్యూబ్ (అలైహి) పై మనం చేసిన ఈ కుట్రలు అన్ని విఫలయత్నమయ్యాయి. ఆయన సంపదను నాశనం చేశాము. ఆయన సంతానాన్ని దూరం చేశాము. చివరకు ఆయన శరీరాన్ని అనేక వ్యాధులకు గురిచేసి, బంధుమిత్రులను దూరం చేసి, చిత్రవధ అనుభవించేలా చేశాము. అయినా కూడా అయ్యూబ్ (అలైహి) కు అల్లాహ్ పై ఉన్న విశ్వాసాన్ని తగ్గించలేకపోయాము. ఇపుడు నేను మీ అందరిని సలహాలు కోరుతున్నాను. అయ్యూబ్ (అలైహి) విషయంలో తర్వాత ఏం చేయాలో మీరే చెప్పండి?

ఇబ్లీస్ సలహాదారులు ఎవరూ కూడా ఇబ్లీస్ కు సలహా ఇవ్వలేదు. అపుడు ఇబ్లీస్ సలహాదారులు ఇబ్లీస్ నే నిలదీశారు.

ఇబ్లీస్ సలహాదారులు : - ఇబ్లీస్! నీ జిత్తులమారితనం అయ్యూబ్ (అలైహి) ముందు విఫలమయ్యిందేంటి? మానవులకు పితామహుడైన ఆదమ్ (అలైహి) మరియు అతని ధర్మపత్ని హవ్వా (అలైహి) ను ప్రలోభపెట్టడంలో, ఆది దంపతులైన వారిద్దరినీ స్వర్గం నుంచి బయటకు గెంటివేసేలా చేయడంలో నువ్వు సఫలమయ్యావు కదా! మరి అయ్యూబ్ (అలైహి) ని ప్రలోభపెట్టే విషయంలో విఫలమయ్యావేంటి? (అని నిలదీశారు)

ఇక ఆ తర్వాత ఇబ్లీస్ తన సలహాదారుల్ని వదిలేసి, అయ్యూబ్ (అలైహి) పై తన నాలుగవ కుట్రను అమలుపరచేందుకు సిద్ధమయ్యాడు. ఇబ్లీస్ ఈ కుట్రలో భాగంగా అయ్యూబ్ (అలైహి) భార్య రహీమా (అలైహి) ను ప్రలోభపెట్టాలనుకున్నాడు.

*నాలుగవ కుట్ర : -* 

తర్వాత ఇబ్లీస్ అయ్యూబ్ (అలైహి) భార్య రహీమా (అలైహి) వద్దకు వెళ్ళాడు. ఒక మనిషి రూపంలో ఆమె వద్దకు వెళ్లి....,

ఇబ్లీస్ : - (రహీమా!) మీ భర్త ఎక్కడ ఉన్నారు?

రహీమా (అలైహి) : - అక్కడ ఉన్నారు చూడండి. చావుకు, బ్రతుకుకు మధ్య ఉన్నారు. (అని చెప్తూ తన వేలితో మంచం పై నిర్జీవ కళేబరం మాదిరిగా పడి ఉన్న తన భర్త అయ్యూబ్ (అలైహి) ని చూపించింది.)

అపుడు ఇబ్లీస్ ఆమె పట్ల సానుభూతి చూపుతున్నట్లు నటిస్తూ....,

ఇబ్లీస్ : - (రహీమా!) నువ్వు నీ భర్త అయ్యూబ్ (అలైహి) తో గడిపిన మంచి రోజులు గుర్తు చేసుకో! మీ వద్ద పుష్కలంగా ఉన్న సంపదను నీ భర్త దానధర్మాల పేరుతో విచ్చలవిడిగా పంచిపెట్టాడు. సంపద అంతా నీరుగారిపోయినపుడు, నీ సంతానాన్ని కూలిపోవడానికి సిద్ధంగా ఉన్న ఒక ఇంటిలో ఉంచాడు. ఆ ఇల్లు కూలిపోయి నీ సంతానం కూడా నీకు దూరమయ్యింది. ఇపుడు చూస్తే నీ భర్తకు ఈ భయంకరమైన వ్యాధి, ఇలాంటి కష్ట సమయాల్లో మిమ్మల్ని ఆదుకునేవాళ్ళు ఎవరు లేరు. చివరకు మీ బంధువులు కూడా మీకు దూరమయ్యారు.
       ...... నీ భర్త అయ్యూబ్ (అలైహి) ఆరోగ్యంగా ఉన్నప్పుడు, మీ వద్ద పుష్కలంగా సంపద, సంతానం ఉన్నప్పటి రోజులను గుర్తు చేసుకో!

ఇబ్లీస్ ప్రలోభ మాటలు విన్న వెంటనే రహీమా (అలైహి) కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. ప్రస్తుతం అనుభవిస్తున్న కష్టాలను తలచుకొని రోదించింది. ఆ దుఃఖంతో అయ్యూబ్ (అలైహి) వద్దకు వెళ్లి....,

రహీమా (అలైహి) : - (అయ్యూబ్!) మన ప్రభువు విధిస్తున్న ఈ కష్టాలను ఇంకా ఎంత కాలం భరిస్తారు? మనం ఇలాగే మన సంపదని, మన సంతానాన్ని, మన బంధుమిత్రులని దూరం చేసుకోవలసిందేనా? ఎవరూ లేకుండా గడపవలసిందేనా? ఈ కష్టాలను తొలగించాలని మీరు అల్లాహ్ ను ఎందుకు వేడుకోవడం లేదు? (అని గద్గ స్వరంతో నిలదీసింది)

ఇబ్లీస్, తన భార్యని ప్రలోభానికి గురిచేశాడని అయ్యూబ్ (అలైహి) గ్రహించారు. ఆ వెంటనే తన భార్యతో...., (నిట్టూర్చుతూ... బలహీన స్వరంతో జవాబిచ్చారు.)

అయ్యూబ్ (అలైహి) : - రహీమా! ఈ మాటలు నీవి కావు. ఇబ్లీస్ నీలో ఇలాంటి భావాలు రేకెత్తించి ఉంటాడు. అందువల్లనే నీవు అసంతృప్తికి గురయ్యావు. ఇపుడు నన్ను నిలదీస్తున్నావు. సరే! అదంతా వదిలేయ్, ఒక విషయం అడుగుతాను చెప్పు...., నేను నా ఆరోగ్యాన్ని మరియు సంపదలను ఎంతకాలం అనుభవించాను?

రహీమా (అలైహి) : - సుమారు ఎనభై సంవత్సరాలు!

అయ్యూబ్ (అలైహి) : - మనం ఎంతకాలంగా ఈ కష్టాలను అనుభవిస్తున్నాం?

రహీమా (అలైహి) : - ఏడు సంవత్సరాలుగా!

అయ్యూబ్ (అలైహి) : - ఆరోగ్యాన్ని, సంపదని, సుఖసంతోషాలని ఎనభై సంవత్సరాలు అనుభవిస్తే, కష్టాలను ఏడు సంవత్సరాలుగా అనుభవిస్తున్నాము. అయితే ఈ కష్టాలను తొలగించాలని అప్పుడే నా ప్రభువును కోరడం ఎంత వరకు సమంజసం. ఇది నాకు సిగ్గుచేటు. ఎందుకంటే నేను ఆరోగ్యం, ఐశ్వర్యం అనుభవించినంత కాలం కష్టాలను అనుభవించలేదు. నీ విశ్వాసం బలహీనమైనట్లుంది. నువ్వు అల్లాహ్ సంకల్పం పట్ల అసంతృప్తికి గురయ్యావు. నాకు మళ్ళీ ఆరోగ్యం చేకూరితే నిన్ను వంద దెబ్బలతో శిక్షిస్తానని ప్రమాణం చేస్తున్నాను. ఈ రోజు నుంచి నీ చేతి నుంచి ఆహారం కాని, పానీయం కాని తీసుకోనని కూడా ప్రమాణం చేస్తున్నాను. నన్ను నా మనాన వదిలేయ్. నా ప్రభువు అభీష్టం ఎలా ఉంటే అలా జరుగుతుంది.

ఈ మాటలు విన్న రహీమా (అలైహి), బరువైన హృదయంతో, వెక్కిళ్ళతో వెక్కి వెక్కి ఏడుస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఇక రహీమా (అలైహి) కు అక్కడి నుంచి వెళ్లక తప్పలేదు. వేరెక్కడయినా ఆశ్రయం వెతుక్కోవడమూ తప్పలేదు.

ఈ విధంగా ఇబ్లీస్ మాటల ప్రలోభానికి గురయిన రహీమా (అలైహి), తన అయ్యూబ్ (అలైహి) నుంచి దూరం అయ్యింది. అయ్యూబ్ (అలైహి) ఆ భయాంకర వ్యాధిని మొత్తం 18 సంవత్సరాలు అనుభవించారు.

*తొలగిన కష్టాలు* 

తన భార్య రహీమా (అలైహి) కూడా దూరమయ్యాక కొన్ని రోజుల వరకు ఒంటరి జీవితం గడిపారు. ఇలాంటి నిస్సహాయ స్థితిలో అయ్యూబ్ (అలైహి) అల్లాహ్ ప్రార్థనల్లో ఎక్కువగా గడిపారు. ఆ వ్యాధి పెట్టె నరకయాతనను తట్టుకోలేక అయ్యూబ్ (అలైహి) అల్లాహ్ కారుణ్యం కోసం వేడుకున్నారు. (దుఆ చేశారు.)

అయ్యూబ్ (అలైహి) : - ప్రభు! నేను జబ్బు పడ్డాను. ఈ వ్యాధితో చాలా కాలంగా బాధపడుతున్నాను. షైతాన్ నన్ను తీవ్ర బాధకు, యాతనలకు గురి చేశాడు. నీవు అందరికంటే గొప్ప దయామయుడవు పరమ కరుణామయుడవు. (అని ప్రార్థిస్తూ గడిపారు.)

అల్లాహ్ అయ్యూబ్ (అలైహి) ప్రార్థనలకు ప్రతిస్పందించారు. అపుడు అల్లాహ్ వహీ ద్వారా అయ్యూబ్ (అలైహి) కు జవాబిస్తూ....,

అల్లాహ్ : - (అయ్యూబ్!) నీ కాళ్లను నేల మీద తట్టు, అక్కడి నుంచి నీటి ఊట ఉబికివస్తుంది. ఆ చల్లని నీటితో స్నానం చేయడానికి మరియు త్రాగడానికి నీకిస్తున్నాను.

ఈ విధంగా చేయడం వల్ల, భయంకరమైన ఆ వ్యాధి నుంచి అయ్యూబ్ (అలైహి) కు విముక్తి కలుగుతుందని అల్లాహ్ వహీ ద్వారా తెలియజేశారు.

తరువాత జరిగినది Insha Allah రేపటి భాగము - 56 లో తెలుసుకుందాము.

*అయ్యూబ్ (అలైహి) ఈ వేడుకోలుని దివ్యఖురాన్ ఇలా వర్ణించింది.* 

*మరి అయ్యూబ్ (స్థితిని కూడా ఓసారి మననం చేసుకోండి.). అతను "నాకు ఈ వ్యాధి సోకింది. నువ్వు కరుణించే వారందరిలోకి అపారంగా కరుణించేవాడవు" అని తన ప్రభువును మొరపెట్టుకున్నప్పుడు, మేము అతని ప్రార్థనను ఆలకించి, ఆమోదించాము. అతని బాధను దూరం చేశాము. అతనికి అతని ఇంటివారలను ప్రసాదించాము. పైగా వారితోపాటు వారిని పోలిన మరి అంతే మందిని మా ప్రత్యేక కటాక్షంతో అతనికి వొసగాము - నికార్సయిన దాసుల కొరకు ఇదొక గుణపాఠం కావాలని! (ఖురాన్ 21:83,84)* 

☆☆ ®@£€€q  +97433572282 ☆☆

Note : - ఈ msg లను ముందుకు పంపిస్తూ, మన ఇస్లాం చరిత్ర గురించి మన ముస్లిం సోదరులకు, సోదరీమణులకు తెలియజేస్తారని ఆశిస్తున్నాము.

No comments:

Post a Comment