38

🤚🏻✋🏻🤚🏻✋🏻 *బిస్మిల్లాహ్ హిర్రహ్మా నిర్రహీమ్* 🤚🏻✋🏻🤚🏻✋🏻

🛐🕋🛐🕋 *అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను* ☪🕋☪🕋

°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°

       🕌🕋🕌🕋 *ఇస్లాం చరిత్ర* 🕋🕌🕋🕌

                               *భాగము - 38* 

____________________________________________

*మహారాజు తాలూత్ : - - : క్రీ.పూ. 1030-1010* 

_*మూసా అలైహిస్సలామ్ చనిపోయిన తర్వాత ఇస్రాయీల్ సంతతి ప్రజలకు అనేక క్లిష్ట పరిస్థితులు ఎదురయ్యాయి.*_ 

ఇస్రాయీల్ ప్రజలు తమ వద్ద ఉన్న *పవిత్ర పెట్టె* (మూస (అలైహి) కాలానికి చెందిన కొన్ని పవిత్రమైన వస్తువులు కలిగి ఉన్న బంగారు తాపడం ఉన్న పెట్టె- టాబర్నికల్) చాలా పవిత్రమైనదని, తమ చరిత్రకు సంబంధించి చాలా ముఖ్యమైన చిహ్నమని భావించేవారు. చివరకు యుద్ధాల్లోనూ ఆ పెట్టెను తీసుకొని వెళ్ళేవారు. ఆ పెట్టే వల్లనే అల్లాహ్ తమను కాపాడుతున్నారని నమ్మేవారు ఇస్రాయీల్ ప్రజలు. ఈ నమ్మకం వల్ల వారికి మానసిక శాంతి, అపార ధైర్యసాహసాలు లభించేవి. ఈ పెట్టే వల్ల వారి శత్రువులు కూడా భయ భీతులయ్యేవారు. ఆ పెట్టె కు అల్లాహ్ ప్రత్యేకమైన శక్తులు ప్రసాదించాడని వారి శత్రువులు భావించేవారు.

క్రమేణా ఇస్రాయీల్ ప్రజలు అల్లాహ్ ఆదేశాలను, చట్టాలను విస్మరించడం ప్రారంభించారు. చెడులు, దుర్నడత వారి జీవితాల్లో భాగాలుగా మారిపోయాయి. అల్లాహ్ ఇస్రాయీల్ ప్రజలపై వారి శత్రువులు అయినా ఫలస్తీనులను యుద్దానికి పంపించారు. ఆ యుద్ధంలో ఇస్రాయీల్ ప్రజలను ఫలస్తీనులు ఓడించారు. ఇస్రాయీల్ ప్రజల పవిత్ర పెట్టెను ఫలస్తీనులు స్వాధీనం చేసుకున్నారు. ఇస్రాయీల్ ప్రజలను వారి ప్రాంతాల నుంచి వెళ్లగొట్టారు. ఇస్రాయీల్ ప్రజల సంతానాన్ని నిర్భందించి బానిసలుగా మార్చారు. అధికారం, ప్రాబల్యం అంతా అంతరించింది. వారు ఒకరికి ఒకరు కాకుండా పోయారు. నిరాశ నిస్పృహలకు గురయ్యారు.

అలాంటి సమయంలో ప్రవక్త సముయేల్ అలైహిస్సలామ్ వారి వద్దకు వచ్చారు. ఆయన రాకతో ఇస్రాయీల్ ప్రజలకు కాస్త ఉపశమనం లభించింది. కానీ ఆయన అప్పటికే చాలా వృద్ధుడైపోయారు. అపుడు ఇస్రాయీల్ ప్రజలు ప్రవక్త సముయేల్ (అలైహి)తో....,

ఇస్రాయీల్ ప్రజలు : - ప్రవక్తా! మీకు ఇప్పటికే వయసైపోయింది. మాకు ఒక బలమైన నాయకుడు అవసరం ఉంది. అందుకు మీరు మాకు సహకరించాలని కోరుతున్నాము. మీరు మాకోసం ఒక రాజును నియమిస్తే, అల్లాహ్ మార్గంలో ఆ బలమైన నాయకుని పర్యవేక్షణలో మేము శత్రువులతో యుద్ధం చేసి పోరాడవలసి ఉంది.

_[ప్రవక్త సముయేల్ (అలైహి) కు వారి బలహీనతలు బాగా తెలుసు.]_ 

సముయేల్ (అలైహి) : - సరే! అలాగే నియమిస్తా. కానీ, తీరా మిమ్మల్ని యుద్ధం చేయమని ఆదేశిస్తే మీరు నిరాకరిస్తారేమో? పోరాడవలసిన సమయం వచ్చినప్పుడు మీరు వెనక్కి తగ్గుతారేమో?

ఇస్రాయీల్ ప్రజలు : - ప్రవక్తా! మేము చాలా పరాభవాలు సహించాము. మమ్మల్ని మా ఇండ్ల నుంచి వెల్లగొట్టారు. మా పిల్లలను వారి బానిసలుగా చేసుకొని మాకు దక్కకుండా చేశారు. అలాంటపుడు మేము అల్లాహ్ మార్గంలో యుద్ధం ఎందుకు చేయము? ఇప్పుడు అల్లాహ్ మార్గంలో పోరాటానికి సిద్ధంగా ఉన్నాము. ఆ మార్గంలో మా ప్రాణాలు పోయిన ఫర్వాలేదు.

అపుడు ప్రవక్త సముయేల్ (అలైహి) ఇస్తిఖారా (తగిన దారి చూపించాలని అల్లాహ్ ను ప్రార్ధించడం) చేశారు. అల్లాహ్ సముయేల్ (అలైహి) ప్రార్థనకు మార్గం చూపిస్తూ....,

అల్లాహ్ : - సముయేల్! ఇస్రాయీల్ ప్రజలకు నాయకునిగా, రాజు గా తాలూత్ అనే వ్యక్తిని ఎంపిక చేయి.

సముయేల్ (అలైహి) : - ప్రభు! అయితే కాబోయే రాజు ని ఎలా గుర్తించాలి.

అల్లాహ్ : - మీరు తనని గుర్తించాల్సిన పని లేదు. తాలూత్ తానే మీ వద్దకు స్వయంగా వస్తాడు. తాలూత్ వచ్చిన తర్వాత అధికారాన్ని తాలూత్ కు కట్టబెట్టండి. శత్రువులతో జిహాద్ కు తాలూత్ నాయకత్వం వహిస్తారు.

*తాలూత్ గురించి : -* 

తాలూత్ పొడవైన బలిష్టమైన వ్యక్తి. చాలా తెలివికలిగినవారు, మంచివారు. తన తండ్రితో పాటు పొలం లో పనిచేస్తూ జీవించేవారు. ఒక రోజు వారి పశువులు మంద నుంచి అనేక పశువులు తప్పిపోయాయి. ఆ పశువులను వెతుక్కుంటూ తన సేవకునితో కలసి బయలుదేరారు తాలూత్. అలా చాలా రోజులు ప్రయాణించి, పశువుల కోసం వెతికి వెతికి బాగా అలిసిపోయారు.

తాలూత్, తన సేవకునితో : - ఇక వెనక్కి పోదాం. నాన్నగారు కూడా చాలా కంగారు పడుతూ ఉంటారు. మిగిలిన పశువులను కూడా చూసుకోవలసి ఉంది కదా!

సేవకుడు : - మనం ఎలాగూ ప్రవక్త సముయేల్ (అలైహి) వారి ప్రాంతానికి వచ్చేశాం కదా, ఆయన వద్దకు వెళ్లి తప్పిపోయిన పశువుల గురించి అడిగి చూద్దాం.

తాలూత్ అందుకు అంగీకరించారు. ఇద్దరూ కలిసి అక్కడికి బయలుదేరారు. అలా వెళ్తూ వెళ్తూ దారిలో వారు కొంతమంది బాటసారులను చూసి వారిని దారి అడిగారు.

తాలూత్ : - బాటసారులారా! మేము ప్రవక్త సముయేల్ (అలైహి) గారిని కలవడానికి వెళ్తున్నాము. వారి వద్దకు ఎలా వెళ్ళాలో కాస్త దారి చెపుతారా?

బాటసారులు : - అదిగో ఆ కనపడే కొండవైపు వెళ్ళండి. మీకు కావలసిన వ్యక్తి అక్కడే ఉంటారు.

తాలూత్ మరియు అతని సేవకుడు అక్కడికి చేరుకున్నారు. అక్కడ ప్రవక్త సముయేల్ (అలైహి) కోసం చాలా మంది ఎదురు చూస్తున్నారు. కొద్దిసేపటి సముయేల్ (అలైహి) అక్కడికి వచ్చారు. ప్రవక్త సముయేల్ (అలైహి) ను చూడగానే తనలో కలిగిన పవిత్ర భావం వల్ల ఆయనే ప్రవక్తగా తాలుత్ పోల్చుకున్నారు.

ప్రవక్త సముయేల్ (అలైహి) తాలూత్ ను చూడగానే అల్లా పంపిన రాజు ఈయనే అని గుర్తించారు. తాలూత్ మర్యాదపూర్వకంగా ప్రవక్త సముయేల్ (అలైహి) కు అభివాదం చేశారు.

తాలూత్ : - ఓ ప్రవక్తా! నా పేరు తాలూత్. నేను వ్యవసాయం చేస్తాను. నా దగ్గర కొన్ని పశువులు ఉన్నాయి. వాటిలో కొన్ని పశువులు తప్పి పోయాయి. వాటిని వెతుక్కుంటూ నేను, నా సేవకుడు ఇక్కడి వరకు వచ్చాము. మా పశువులు ఏమైనా మీ ప్రాంతంలోకి వచ్చాయా?

సముయేల్ (అలైహి) : - ఏం ఫర్వాలేదు. తప్పిపోయిన మీ పశువులు తిరిగి మీ పొలం వైపు వెళుతున్నాయి, వాటి గురించి కంగారు పడవలసిన అవసరం లేదు.

తాలూత్ : - ధన్యవాదములు.

ఆ పిదప సముయేల్ (అలైహి), ఇస్రాయీల్ ప్రజల పవిత్ర పెట్టె మహత్యం గురించి, యుద్ధంలో ఇస్రాయీల్ ప్రజల పై ఫలస్తీనులు గెలిచి ఆ పెట్టెను స్వాధీనం చేసుకున్నారని తాలూత్ కు తెలియజేశారు.

సముయేల్ (అలైహి) : - తాలూత్! మా ఈ సమస్యల గురించి తగిన పరిష్కారం కోసం నేను అల్లాహ్ తో వేడుకున్న తర్వాత, "ఒక వ్యక్తి స్వయంగా మీ వద్దకు వస్తారని, ఆ వ్యక్తి ని రాజు గా చేయాలని, శత్రువులతో యుద్ధంలో ఆ వ్యక్తి ని నాయకునిగా చేయాలని" అల్లాహ్ నాకు వహీ ద్వారా తెలియజేశారు. ఆ వ్యక్తి ఎవరో కాదు మీరే!

తాలూత్ : - ఏంటి నేనా?

సముయేల్ (అలైహి) : - అవును మీరే! ఇస్రాయీల్ ప్రజలకు రాజు గా అల్లాహ్ మిమ్మల్ని ఎన్నుకున్నారు. కాబట్టి తాలూత్! మీరు ఇస్రాయీల్ ప్రజల వ్యవహారాలను చూసుకోవాలి, ఇస్రాయీల్ ప్రజలను ఒక వేదిక పై సమైక్యపరచాలి, ఇస్రాయీల్ ప్రజల శత్రువులైన ఫలస్తీనులు నుంచి వారిని కాపాడాలి. అల్లాహ్ ఆదేశాలను పాటిస్తే తప్పక విజయం లభిస్తుంది.

తాలూత్ : - ప్రవక్తా! అకస్మాత్తుగా నాకు లభించిన ఈ గౌరవం చూసి చాలా ఆశ్చర్యపోతున్నాను. పైగా ఇది చాలా పెద్ద బాధ్యత. నా గురించి చెప్పాలంటే...., నేను బెన్యామీన్ వంశస్తుడిని. యాఖూబ్ (అలైహి) సంతానంలో అతి తక్కువ పేరుప్రతిష్ఠలు కలిగిన వంశం బెన్యామీన్ వంశం. పైగా నాకు నాయకత్వం గురించి, రాజరికం గురించి ఏమి తెలియదు. నా వద్ద సంపద కూడా ఏమీ లేదు.

సముయేల్ (అలైహి) : - రాజు గా బాధ్యతలు స్వీకరించడం అల్లాహ్ అభీష్టం. మీకు లభించిన గౌరవానికి గాను అల్లాహ్ కు కృతజ్ఞతలు తెలపండి. అల్లాహ్ పట్ల దృఢమైన విశ్వాసం కలిగి ఉండండి.

ఆ తర్వాత తాలూత్ చేయి పట్టుకుని ప్రవక్త సముయేల్ (అలైహి) స్వయంగా ఇస్రాయీల్ ప్రజల వద్దకు తీసుకునివెళ్లి....,

సముయేల్ (అలైహి) : - ప్రజలారా! తాలూత్ ని మీ రాజు గా నియమిస్తున్నాను. నిస్సందేహంగా అల్లాహ్ తాలూత్ ను మీ రాజు గా నియమించాడు. కాబట్టి తాలూత్ ఆదేశాలను పాటించడం మీ బాధ్యత. తాలూత్ మిమ్మల్ని పాలిస్తాడు. మీ శత్రువుల పై ధర్మయుద్ధం లో మీకు నాయకత్వం వహిస్తాడు.

తాలూత్ ని రాజు గా నియమించడం చూసి ఇస్రాయీల్ ప్రజలు చాలా ఆశ్చర్యపోయారు.

ఇస్రాయీల్ ప్రజలు : - ఓ ప్రవక్తా! మీరు రాజు గా నియమించిన ఈ తాలూత్ బనీఇస్రాయీల్ రాజకుటుంబానికి చెందినవాడు కాదు. లెవి కుటుంబానికి చెందినవాడు కూడా కాదు. రాజరికం చేయడానికి మాకే ఎక్కువ అర్హత ఉంది. మాకే ఎక్కువ హక్కు ఉంది. కానీ, తాలూత్ ఎలా రాజు అవుతాడు? తాలూత్ వద్ద కన్నా మా వద్ద ఎక్కువ సంపద, హొదాలు ఉన్నాయి. అతను ఏమంత స్థితిపరుడు కూడా కాదే?

ఈ విధంగా ఇస్రాయీల్ ప్రజలు అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రవక వారి అభ్యంతరాలను అడ్డుకుని....,

సముయేల్ (అలైహి) : - సైనిక నాయకత్వానికి, రాజ్యపాలనకు సంపద మరియు హొదాలు అవసరం లేదు. సంపదను ఎలా ఉపయోగించుకోవాలో తెలియనప్పుడు సంపద ఉండి ప్రయోజనం ఏమిటి? తాలూత్ కు నాయకత్వ లక్షణాలు ఉన్నాయి. మీ కన్నా ఎక్కువ జ్ఞాన సంపద ఉంది. కాబట్టి అల్లాహ్ మీ బదులుగా తాలూత్ ని మీకు రాజు గా ఎంపిక చేశారు. తాలూత్ కు శారీరక బలం ఉంది, నైపుణ్యం ఉంది. అల్లాహ్ తాను తలుచుకున్నవారికి రాజ్యాధికారం ప్రసాదిస్తాడు. అల్లాహ్ అన్ని తెలిసినవాడు, విశాల దృష్టికలవాడు, అత్యంత వివేకవంతుడు.

ఇస్రాయీల్ ప్రజలు : - అలా అయితే! అల్లాహ్ వద్ద నుంచి ఏదన్నా ప్రత్యక్ష నిదర్శనం కావాలి. (అని ప్రవక్త పై ఒత్తిడి తెచ్చారు)

సముయేల్ (అలైహి) : - మీకు అల్లాహ్ వద్ద నుంచి నిదర్శనం కావాలా? అయితే పట్టణం బయటకు వెళ్లి నిదర్శనాన్ని చూడండి.

అపుడు అందరూ ఆ నిదర్శనం చూడడానికి పట్టణం బయటకు వెళ్లారు. ఈ సంఘటనను దివ్యఖురాన్ ఇలా వర్ణించింది.

*"అల్లాహ్ నుంచి తాలూత్ ను రాజు గా నియమించిన నిదర్శనం ఏమంటే, అతని పాలనాకాలంలో లోగడ మీరు కోల్పోయిన మీ పవిత్ర పెట్టెను తిరిగి పొందుతారు. అందులో మీ ప్రభువు తరుపున మీకు మానసిక శాంతిని ప్రసాదించే సాధనాలు ఉన్నాయి. అందులో మూసా, హారూన్ కుటుంబీకులు వదిలివెళ్లిన పవిత్ర అవశేషాలు కూడా ఉన్నాయి. ప్రస్తుతం ఆ పేటికను దైవదూతలు కాపాడుతున్నారు. మీరు నిజమైన విశ్వాసులైతే ఇందులో మీకు గొప్ప నిదర్శనాలున్నాయి."* 

ఆ వెంటనే ప్రజలు తాలూత్ ను తమ రాజు గా అంగీకరించి ప్రతిజ్ఞ చేశారు.

*యుద్దానికి కసరత్తులు* 

ఆ తర్వాత జాలూత్ సైన్యం తో యుద్దానికి తాలూత్ తన సైనికులను సిద్ధం చేయడం ప్రారంభించారు. (జాలూత్ ఎవరంటే, శత్రుసైన్యుల నాయకుడు). తాలూత్ తన సైన్యాలను వ్యవస్థీకరించడం ప్రారంభించారు. అల్లాహ్ పై బలమైన విశ్వాసంతో, వివేకంతో సైన్యాన్ని తీర్చిదిద్దడం మొదలుపెట్టారు. ఎలాంటి బాధ్యతలు లేని పురుషులు సైన్యంలో చేరాలని ఆదేశించాడు. ఇంటి నిర్మాణం పనుల్లో ఉన్నవారు, పెళ్లి చేసుకోబోతున్నవారు, వ్యాపార కార్యకలాపాల్లో ఉన్నవారు సైన్యంలో చేరాల్సిన అవసరం లేదన్నారు.

ఆ విధంగా ఒక షుశిక్షితమైన సైన్యాన్ని రూపొందించారు. ఆ సైన్యాన్ని ఇక పరీక్షకు నిలబెట్టాలని భావించారు. ఆ తర్వాత తాలూత్ తన సైన్యాన్ని తీసుకోని జాలూత్ తో యుద్దానికి బయలుదేరాడు. అపుడు తాలూత్ తన సైన్యాన్ని ఉద్దేశిస్తూ....,

తాలూత్ : - సైనికులారా! దారిలో ఒక నది ద్వారా అల్లాహ్ మిమ్మల్ని పరీక్షించబోతున్నాడు. గుర్తుంచుకోండి, ఆ నదిలో నీరు తాగేవాడు నా వాడు కాదు, నీరు తాగని వాడే నావాడు. అయితే ప్రాణం కాపాడుకోవడానికి దాహం తీర్చుకునేందుకు తగినంత నీరు మాత్రమే తాగితే ఫర్వాలేదు, కానీ అంతకన్నా ఎక్కువ నీరు తాగరాదు.

కానీ, ఆ సైనికులలోని కొందరు తప్ప మిగిలినవారు దాహం తీర్చుకోవడానికి అవసరమైన నీటి కంటే చాలా ఎక్కువగా తాగారు. ఈ విషయం తాలూత్ కు తెలిసింది.

తరువాత జరిగిన విషయమై Insha Allah రేపటి భాగము - 39 లో తెలుసుకుందాము.

Note : - ఈ msg లను ముందుకు పంపిస్తూ, మన ఇస్లాం చరిత్ర గురించి మన ముస్లిం సోదరులకు తెలియజేస్తారని ఆశిస్తున్నాము.

☆☆ ®@£€€q +97433572282  ☆☆

No comments:

Post a Comment