81

🛐 🕋 ☪ *బిస్మిల్లాహ్ హిర్రహ్మా నిర్రహీమ్* ☪ 🕋 🛐

🕋🤚🏻✋🏻🕌 *అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను* 🕌🤚🏻✋🏻🕋

◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆

       🕌☪🕋🛐 *ఇస్లాం చరిత్ర* 🛐🕋☪🕌

                                *భాగము - 81* 

◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆

        *జమ్ జమ్ నీరు*

  అపార జలనిధి జమ్ జమ్ ఎలా బయల్పడిందో హజ్రత్ ఇబ్రహీం అలైహిస్సలామ్ గారి కథలో మనం తెలుసుకున్నాము. జమ్ జమ్ బావి ఎలా పూడ్చివేతకు గురైందో ఇప్పుడు తెలుసుకుందాం.

*జమ్ జమ్ బావి పూడ్చివేత* 

మక్కాలో హజ్రత్ ఇస్మాయీల్ (అలైహి) కాలం నుండే ప్రజలు వచ్చి స్థిరపడిన విషయం మనకు తెలిసినదే. ఇస్మాయీల్ (అలైహి) 137 సంవత్సరాలు వరకు జీవించారు. ఆయన బ్రతికి ఉన్నంత వరకు బైతుల్లా (కాబా గృహం) సంరక్షకులుగా ఉన్నారు. ఇస్మాయీల్ (అలైహి) తరువాత ఆయన కుమారులు “నాబిత్", ఆ తరువాత "ఖైదార్", తదుపరి "నాబిత్", ఒకరి తరువాత మరొకరు మక్కాకు పాలకులుగా ఉంటూ వచ్చారు. వారి తరువాత “నానాముజాజ్ బిన్ అమ్రూ జుర్హమీ” పాలనా పగ్గాలను తన చేతిలోనికి తీసుకున్నాడు. ఇలా మక్కా పాలన "బనూ జుర్హుమ్" చేతిలోనికి వచ్చింది. చాలా కాలం వరకు అధికారం వారి చేతుల్లోనే ఉండి పోయింది. హజ్రత్ ఇస్మాయీల్ (అలైహి) (తన తండ్రి గారైన ఇబ్రాహీం (అలైహి) తో కలిసి) బైతుల్లాహ్ ను నిర్మించారు. కాబట్టి ఆయన సంతానానికి గౌరవ స్థానం దక్కుతూ వచ్చింది. అయితే అధికారంలో మాత్రం వారికి ఎలాంటి ప్రమేయం లేకపోయింది.

అలా కాలం గడచినకొద్దీ హజ్రత్ ఇస్మాయీల్ (అలైహి) సంతానం మరుగున పడుతూ వచ్చింది. చివరికి “బుక్త్ నస్సర్” పైకి వచ్చిన కొంతకాలానికి పూర్వమే "బనూ జుర్హుమ్" శక్తి క్షీణించి, మక్కా దిజ్మండలం పై "అద్ నాన్" రాజకీయ నక్షత్రం ప్రకాశించసాగింది. దీనికి ఆధారం ఏమిటంటే "బుక్త్ నస్సర్", జాతె ఇరాఖ్ లో అరబ్బులతో చేసిన యుద్ధంలో అరబ్బుల సైన్యాధ్యక్షుడు "జుర్హుమ్" తెగకు సంబంధించినవాడు కాకపోవడం.

తరువాత "బుక్త్ నస్సర్" క్రీ.పూ. 587లో మరో దాడి చేసినప్పుడు "బనూ అద్ నాన్" వంశం వారు పారిపోయి యమన్ చేరారు. ఆ కాలంలో బనీఇస్రాయీల్ కు హజ్రత్ "యర్మియాహ్" ప్రవక్తగా ఉండేవారు. ఆయన "అద్ నాన్" కుమారుడు "మఅద్" ను తోడ్కొని సిరియా దేశానికి వెళ్ళారు. "బుక్త్ నస్సర్" శక్తి క్షీణించిన తరువాత ఆయన "మఅద్" తో కలిసి మక్కా వచ్చారు. అప్పుడు మక్కాలో "జుర్హుమ్" కు చెందిన "జర్ షుమ్ బిన్ జుల్ హమా" అనే ఓ వ్యక్తి కలిశాడు. "మఅద్" అతని కుమార్తె "ముఆనా" ను పెళ్ళాడాడు. ఆమె గర్భాన "నజార్" జన్మించాడు.

కాలం గడచిన కొద్ది "జుర్హుమ్" పరిస్థితులు విషమించనారభించాయి. దారిద్ర్యం అలుముకున్న ఫలితంగా వారు హజ్ యాత్రికులపై విరుచుకుపడి అన్యాయాలు చేయసాగారు. దైవ గృహానికి చెందిన సంపదను కూడా కాజేయడం ప్రారంభించారు. ఇటు "బనీ అద్ నాన్" వారి ఆగడాలను భరించలేక లోలోనే భాదపడుతూ ఉండేవారు. ”బనూ ఖుజాఅ”, ముర్రజ్జహ్రాన్ కు వచ్చినపుడు, బనూ అద్ నాన్, బనూ జుర్హుమ్ ఎడల కోపోద్రిక్తులైన విషయం గ్రహించాడు. వీరి కోపతాపాల ప్రయోజనం పొందుతూ అద్ నానీ తెగ (బనూ బక్ర్ బిన్ అబ్దె మునాఫ్ బిన్ కనానా) ను వెంటబెట్టుకుని "బనూ జుర్హుమ్" కు వ్యతిరేఖముగా యుద్ధం ప్రకటించాడు. "బనూ జుర్హుమ్" ను మక్కా నుండి గెంటివేసి అధికారం చేజిక్కించుకున్నాడు. ఈ సంఘటన క్రీ.శ. 200 మధ్య కాలం నాటిది.

"బనూ జుర్హుమ్" మక్కాను వదిలి వెళ్ళేటపుడు “జమ్ జమ్” బావిలో అనేక చారిత్రక ఆధారాలను పడవేసి పూడ్చి దాన్ని నామరూపాలు లేకుండా చేసారు. ముహమ్మద్ బిన్ ఇస్హాక్ కథనం ప్రకారం, "జుర్హుమ్" తెగకు చెందిన అమ్రూ బిన్ హారిస్ బిన్ మజాజ్ దైవ గృహం కాబాకు చెందిన రెండు బంగారు లేళ్ళు, కాబా మూలాన పొదిగి వున్న రాయి - హుజై అస్వద్ - ను తీసి “జమ్ జమ్” బావిలో పూడ్చేసి తన తెగతో సహా యమన్ వెళ్ళిపోయాడు. మక్కా నుండి వెళ్ళగొట్టబడడం, అక్కడి పాలన అంతమైపోవడం గురించి "బనూ జుర్హుమ్" వారు చాలా బాధపడేవారు. వారు తరచూ ఈ గీతాన్ని ఆలపించారు.

“హజూన్ నుండి సఫా వరకు తెలిసినవాడెవ్వడూ కనబడడం లేదు. ఏ కథకుడూ మా విషయంలో కథలను వల్లించేవాడుగా కానరావడం లేదు. మేము అచ్చటి పౌరులమే అయినా మా దురదృష్టం, కాలచక్రం మమ్మల్ని పూర్తిగా అక్కడి నుండి పెకిలి వేసింది."

*ఈవిధంగా జలనిధి జమ్ జమ్ పూడ్చివేతకు గురైంది.* 

Insha Allah రేపటి భాగము - 82 లో, అజ్ఞాన కాలం నాటి అరబ్బుల సామాజిక, ఆర్థిక పరిస్థితులను గురించి తెలుసుకుందాము.

☆☆ ®@£€€q  +97433572282 ☆☆ 
             (rafeeq)

☆☆  Salman    +919700067779 ☆☆

Note : - ఈ msg లను ముందుకు పంపిస్తూ, మన ఇస్లాం చరిత్ర గురించి మన ముస్లిం సోదరులకు, సోదరీమణులకు తెలియజేస్తారని ఆశిస్తున్నాము.

No comments:

Post a Comment