71

🛐 🕋 ☪     *బిస్మిల్లాహ్ హిర్రహ్మా నిర్రహీమ్*     ☪ 🕋 🛐

🕋🤚🏻✋🏻🕌 *అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను* 🕌🤚🏻✋🏻🕋

◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆

          🕌☪🕋🛐 *ఇస్లాం చరిత్ర* 🛐🕋☪🕌

                                   *భాగము - 71* 

◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆

 *ప్రవక్త ఈసా (అలైహి) ప్రదర్శించిన మహత్యాలు* 

హజ్రత్ ఈసా (అలైహి) కు అల్లాహ్, మహత్యాలు ప్రదర్శించే శక్తిని ప్రసాదించారు. ఆయన మట్టితో ఒక పక్షి తయారు చేసి దానిలోకి ఊదారు. అల్లాహ్ అభీష్టంతో ఆ మట్టిపక్షి ప్రాణం పోసుకుంది. ఆయన గ్రుడ్డివారికి చూపు వచ్చేలా చేశారు. చెవిటివారికి వినికిడి శక్తి వచ్చేలా చేశారు. కుష్ఠువ్యాధి గ్రస్తులకు వ్యాధి నయమయ్యేలా చేశారు. మరణించిన వారు ప్రాణం పోసుకునేలా చేసి చూపించారు. ఇవన్నీ ఆయన అల్లాహ్ అభీష్టంతో మాత్రమే చేసి చూపించగలిగారు. ఇన్ని మహత్యాలు చేసి చూపించినప్పటికీ చాలా మంది ఆయనను విశ్వసించే బదులు ఆయనను మంత్రగానిగా ఆరోపించారు. ఈసా (అలైహి), వారిలో అవిధేయత, అవిశ్వాసాల ధోరణి చూసి....,

ఈసా (అలైహి) : - ప్రజలారా! దైవమార్గంలో నాకు తోడుగా నిల్చేవారు ఎవరైనా ఉన్నారా మీలో?

హవారీలు : - మేము అల్లాహ్ (మార్గంలో మీకు తోడుగా నిలిచే) సహాయకులం. మేము అల్లాహ్ ని విశ్వసిస్తున్నాము. ఆయనకు విధేయులమైపోయాము. దీనికి మీరే సాక్షి.
            ప్రభు! నీవు అవతరింపజేసినదాన్ని విశ్వసిస్తున్నాం. నీ సందేశహరుడ్ని అనుసరించడానిక్కూడా మేము సిద్ధంగా ఉన్నాం. మాపేర్లు (సత్య) సాక్షుల జాబితాలో వ్రాయి.

ప్రవక్త ఈసా (అలైహి) బోధనలు కొందరిని ఆకట్టుకున్నాయి. ఒక చిన్న శిష్యుల (హవారీలు) సమూహం, ఆయన బోధనలు విని ఆయనను విశ్వసించింది.

కొంతకాలం తర్వాత హజ్రత్ ఈసా (అలైహి), తన వ్యతిరేకులను బహిరంగంగా ఎదుర్కోవాలని నిర్ణయించుకున్నారు. ఆ రోజు పండుగరోజు. యూద మతపెద్దలు అందరూ జెరుసలేంలో సమావేశమై ఉన్నారు. పెద్ద బహిరంగసభను ఉద్దేశించి వారు ప్రసంగించడానికి వచ్చారు. ఆ బహిరంగసభను ఉద్దేశించి ప్రవక్త ఈసా (అలైహి) ప్రసంగించారు. ఆయన ప్రసంగం అందరిని ఆకట్టుకుంది. ఈ పరిణామం యూద మతపెద్దలను తీవ్ర అసహనానికి గురిచేసింది. ఎలాగైనా ప్రవక్త ఈసా (అలైహి) ను వదిలించుకోవాలని భావించారు.

కానీ ఈసా (అలైహి) ను, బహిరంగంగా కీడు తలపెట్టడం ఆ యూద మతపెద్దల వల్ల కాలేదు. ఎందుకంటే ప్రజలు పెద్ద సంఖ్యలో ఈసా (అలైహి) ను అభిమానిస్తున్నారు. అందువల్ల ఈసా (అలైహి) కు వ్యతిరేకంగా కుట్ర పన్నడం ప్రారంభించారు.

 *విందులో మహత్యం* 

తన శిష్యులతో సహా ఈసా (అలైహి) ప్రతి పట్టణం సందర్శించి అల్లాహ్ సందేశాన్ని ప్రచారం చేయడం ప్రారంభించారు. ఆయన శిష్యులు, సంఖ్యలో చాలా తక్కువ మంది కానీ, ఆయన కోసం ధృడంగా నిలబడే మద్దతుదారులు. ప్రవక్త ఈసా (అలైహి), అన్యాయాలకు వ్యతిరేకంగా తన గొంతువిప్పారు.

ఈ ప్రయాణాల్లో ఒకసారి ఒక బంజరు భూమికి చేరుకున్నారు. ఈసా (అలైహి) మరియు ఆయన శిష్యులు అందరు అలసిపోయి ఉన్నారు. ఆకలిదప్పులతో ఉన్నారు. ఈసా (అలైహి) వారి ధైర్యస్థయిర్యాలను పెంచడానికి తన దైవిక ఉద్యమం గురించి వారికి సక్రమంగా వివరించడం ప్రారంభించారు. ఆ విధంగా వారు ఆకలిదప్పులను మరచిపోయేలా చేయాలనుకున్నారు. కానీ కేవలం ఆ నోటి మాటల ద్వారా శిష్యుల ఆకలిదప్పుల బాధలు తీరడం లేదు. అపుడు ఆ శిష్యులు ఈసా (అలైహి) తో....,

శిష్యులు : - మర్యం కుమారునివైన ఈసా! మా ముందు నీ ప్రభువు, ఆహారపదార్థాలు వడ్డించిన విస్తరిని ఒకదాన్ని దించగలడా?

ఈసా (అలైహి) : - మీరు విశ్వసించిన వారైతే అల్లాహ్ కు భయపడండి.

శిష్యులు : - మేము విస్తరిలోనివి తిని అవి మా హృదయాలకు తృప్తి కలిగించాలని మాత్రమే కోరుతున్నాము. ఈ విధంగా నీవు చెప్పినదంతా యదార్థమని తెలుసుకొని అందుకు సాక్షులుగా ఉంటాము.

 _ఈసా (అలైహి) శిష్యులు, ఈ కోరిక కోరడం వెనుక ఎలాంటి మూర్ఖపు ఆలోచనలు లేవు. వారి విశ్వాసంలోను ఎలాంటి లోపం లేదన్న విషయం ఈసా (అలైహి) గ్రహించారు. వారు కేవలం అల్లాహ్ శక్తిసామర్థ్యాలను మరోసారి చూడాలనుకుంటున్నారు._ 

ప్రవక్త ఈసా (అలైహి) సృష్టికర్త అల్లాహ్ ను వేడుకుంటూ...., ఈ సందర్భం గురించి దివ్యఖురాన్ ఇలా వర్ణించింది....,

 *"అపుడు మర్యం కుమారుడు ఈసా ఇలా ప్రార్థించాడు: దేవా! మా ప్రభువా!! మా ముందు వడ్డించిన విస్తరి ఒకదాన్ని ఆకాశం నుండి దించు. ఇది మాకు, మా పూర్వీకులకు, రాబోయేతరాలకు పండగరోజవుతుంది. నీతరుపున ఓ నిదర్శనంగా ఉంటుంది. మాకు ఆహారం ప్రసాదించు. నీవే అందరికన్నా మంచి అన్నదాతవు. దాని అల్లాహ్ ఇలా అన్నాడు: 'సరే! నేను దాన్ని మీ ముందు దించుతాను. అయితే ఆ తర్వాత మీలో ఎవడైన అవిశ్వాసవైఖరి అవలంబిస్తే మాత్రం నేనతనికి ప్రపంచంలో ఎవరికీ విధించనటువంటి ఘోరమైన శిక్ష విధిస్తాను." (ఖుర్ఆన్ 5:114,115)* 

మరుక్షణం వారి ముందు ఆహార పదార్థాలు వడ్డించిన విస్తరి ఒకటి ప్రత్యక్షమయ్యింది. ఇది తనకు, తన శిష్యులకు ఒక పరీక్ష అవుతుందేమోనని ఈసా (అలైహి) భయపడ్డారు. ఈ మహత్యం తనకు, తన శిష్యులకు ఒక కారుణ్యంగా చేయాలని ఈసా (అలైహి), అల్లాహ్ కు మొరపెట్టుకున్నారు.

ఆ తర్వాత వారంతా ఆ ఆహార పదార్థాలను కడుపారా భుజించారు. ఈ విందులో చుట్టుప్రక్కల ప్రజలు చాలా మంది వచ్చి పాల్గొన్నారు. అందరూ తిన్నారు. దైవికంగా అక్కడకు వచ్చిన ఆ ఆహారపదార్థాలను, ఎంతమంది తిన్నా కూడా తరగలేదు. ఆ తర్వాత కూడా చాలా కాలం వరకు ఆ మహత్యం గురించి ప్రజలు కథలు కథలుగా చెప్పుకున్నారు. ఈ మహత్యం తర్వాత చాలా మంది ప్రవక్త ఈసా (అలైహి) సందేశాన్ని విశ్వసించారు.

 *బైబిల్ లో, అంతిమ దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి ప్రస్తావన.* 

"ఈసా (ఇస్రాయీలీలతో) 'నా తరువాత మరో ప్రవక్త రానున్నాడని మీకు శుభవార్త అందజేస్తున్నాను. అతని పేరు *'అహ్మద్'* అవుతుంది.' అని అన్నాడు." (ఖుర్ఆన్ 61:6)

ఇక్కడ ఈసా అలైహిస్సలామ్ తన తర్వాత రాబోయే ప్రవక్త పేరు *అహ్మద్* అని స్పష్టంగా తెలియజేశారు. అంతిమ దైవప్రవక్త ముహమ్మద్ (స) కు *అహ్మద్* అనే మరో పేరు కూడా ఉందన్న సంగతి జగద్విదితం.

ఇందులోని వివరణను Insha Allah రేపటి భాగము - 72 లో తెలుసుకుందాము.

☆☆ ®@£€€q  +97433572282 ☆☆

Note : - ఈ msg లను ముందుకు పంపిస్తూ, మన ఇస్లాం చరిత్ర గురించి మన ముస్లిం సోదరులకు, సోదరీమణులకు తెలియజేస్తారని ఆశిస్తున్నాము.

No comments:

Post a Comment