☪☪☪ *బిస్మిల్లాహ్ హిర్రహ్మా నిర్రహీమ్* ☪☪☪
🕋🕋 *అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు* 🕋🕋
🕋🕋 *అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను* 🕋🕋
●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●
🛐🛐🛐 *ఇస్లాం చరిత్ర* *- 99* 🛐🛐🛐
🇸🇦🇸🇦🇸🇦 *ముహమ్మద్ (సల్లం) జీవితచరిత్ర - 14* 🇸🇦🇸🇦🇸🇦
◆◇◆◇◆◇◆◇◆◇◆◇◆◇◆◇◆◇◆◇◆◇◆◇◆◇◆◇◆◇◆◇◆◇◆
*హజ్రత్ అబ్దుల్ ముత్తలిబ్ గారి మరణం*
బాల ముహమ్మద్ (సల్లం), (తన తల్లి ఆమినా చనిపోయిన) విషాదం నుంచి కోలుకొని దైనందిన జీవితం గడపసాగారు. అప్పుడప్పుడు తన లేత హృదయంలో అమ్మ జ్ఞాపకం వచ్చి మనస్సు బరువెక్కిపోయేది. అయితే తాతయ్య (అబ్దుల్ ముత్తలిబ్) అందిస్తున్న ప్రేమానురాగాలు, ముద్దుముచ్చట్ల వల్ల గతం నుంచి వెంటనే వర్తమానంలోకి వచ్చి సంతోషంగా గడిపేవారు. అబ్దుల్ ముత్తలిబ్ అనుక్షణం మనుమడ్ని కనిపెట్టుకొని ఉంటూ ఎలాంటి లోటు రానిచ్చేవారు కాదు. ఆయన పరిరక్షణలో ఇట్టే ముహమ్మద్ (సల్లం) జీవితం ఆటపాటల్లో, సుఖసంతోషాలతో సాఫీగా సాగిపోతోంది.
అయితే విధి ఒక మనిషిని గొప్పవాడిగా చేయదలచుకున్నప్పుడు అతడ్ని అనేక కఠిన పరీక్షలకు గురిచేస్తుంది. స్వర్ణకారుడు కల్తీ బంగారం నుంచి మేలిమి బంగారం తీయడానికి దాన్ని కొలిమిలో కాల్చినట్లు విధి అతనిపై చిన్నతనం నుంచే కడగండ్ల వడగళ్ళను కురిపిస్తుంది. సుఖభోగాలకు దూరంగా ఉంచుతుంది. ముహమ్మద్ (సల్లం) విషయంలో కూడా ఇలాగే జరుగుతోంది. పుట్టక ముందే తండ్రి చనిపోయాడు. కాస్త స్పృహ వస్తుండగా ఏడేళ్ళ వయస్సులో తల్లి కూడా ఇహలోకం వీడిపోయింది.
ఈ విధంగా పసితనంలోనే మహనీయ ముహమ్మద్ (సల్లం) అమ్మా, నాన్నల ప్రేమను కోల్పోయి అనాధగా మారారు. ఆ లోటును ఎలాగో కొంతవరకు తాతయ్య తీర్చగలుగుతున్నాడని అనుకుంటుంటే విధి ఈ అనాధ బాలుడ్ని మరో అగ్నిపరీక్షకు గురిచేసింది. అబ్దుల్ ముత్తలిబ్ మనవడ్ని తన సంరక్షణలోకి తీసుకొని ఒక సంవత్సరం గడిచిందో లేదో వ్యాధిగ్రస్తులయ్యారు. దాంతో మనుమడిపై మరో విపత్తు వచ్చిపడింది.
సాధారణంగా వృద్ధాప్యంలో వచ్చిన వ్యాధి ఓ పట్టాన వదిలిపెట్టదు. ఒక్కోసారి అది ముదిరిపోవడం కూడా జరుగుతుంది. అబ్దుల్ ముత్తలిబ్ మంచానపడి కోలుకోలేక పోయారు. అయన ఆరోగ్యం క్రమంగా క్షీణిస్తూపోయింది. దానికి తోడు మనుమడి సంరక్షణ విషయం ఆయన్ని పీడించసాగింది.
“అయ్యయ్యో! నా మనవడిపై మళ్ళీ ఆపద వచ్చిపడిందే!! నా తదనంతరం నా ముహమ్మద్ (సల్లం) ని ఎవరు ఆదరిస్తారు?” అంటూ అబ్దుల్ ముత్తలిబ్ ఆందోళన పడసాగారు. ఈ దిగులుతో ఆయన ఆరోగ్యం మరికాస్త క్షీణించింది. చికిత్స కోసం చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. చివరికి ఊపిరి పీల్చుకోవడం కూడా కష్టమయిపోయింది. బంధువులు, ఇరుగుపొరుగు వాళ్ళు గుమిగూడారు. కొడుకులు, కోడళ్ళు ఆయన చుట్టూ మూగారు. బాల ముహమ్మద్ (సల్లం) కూడా వచ్చి అదురుతున్న గుండెలతో ఆందోళనపడుతూ అమాయకంగా చూడసాగారు. ఆ తరువాత కాస్సేపటికి అబ్దుల్ ముత్తలిబ్ ప్రాణాలు అనంత వాయువుల్లో కలసిపోయాయి.
“తాతయ్యా.....! తాతయ్యా....!! చివరికి నువ్వు కూడా నన్నొదిలి పోయావా?” బాల ముహమ్మద్ (సల్లం) మరొకసారి భోరున విలపించారు. రెక్కలువిరిగిన పక్షిలా విలవిలలాడి పోయారు. ఖురైష్ తెగ అగ్రనాయకుడు, కాబా ధర్మకర్త అబుల్ ముత్తలిబ్ ఇక లేరు. విధి నిర్దేశించిన విధిని నిర్వహించి ఆయన ఇహలోకం నుంచి శాశ్వతంగా కనుమరుగైపోయారు. మక్కా పట్టణంపై మరోసారి విషాదచాయలు అలుముకున్నాయి.
“ఏమండీ! అబ్దుల్ ముత్తలిబ్ గారు చనిపోయారటగా?”
“ఔనండీ! నేనక్కడి నుంచే వస్తున్నా. ప్రాణం పోయి కాసేపయింది. ముహమ్మద్ (సల్లం) పరిస్థితి చూస్తుంటే నా గుండెలు తరుక్కుపోతున్నాయి."
“అయ్యో! ఇక ఆ పిల్లోడి బాగోగులు ఎవరు చూస్తారు?”
“పాపం నాన్న లేదు, అమ్మా లేదు, అల్లారు ముద్దుగా పెంచే తాతయ్య కూడా పోయాడు. ఇక ఈ అనాధ పిల్లోడికి దిక్కెవరూ?”
ఇలా చెప్పుకుంటూ జనం బాల ముహమ్మద్ (సల్లం) పై ఎంతో సానుభూతి వెలిబుచ్చుతున్నారు. కొందరు "దిక్కులేనివారికి దేవుడే దిక్కు" అని సమాధానం చెప్పుకున్నారు.
నిజమే, దేవుడు అబ్దుల్ ముత్తలిబ్ మరణం తరువాత కూడా బాల ముహమ్మద్ (సల్లం) కు సంరక్షణ ఏర్పాటు చేశాడు. పెదనాన్న అబూతాలిబ్ వెంటనే ముహమ్మద్ (సల్లం) ని తన సంరక్షణలోకి తీసుకున్నారు.
ఎంత దగ్గరి బంధువులయిన అనాధ పిల్లలను లోకుల మెప్పు కోసమే ప్రేమిస్తారు. నిజానికి సహజసిద్దమైన ప్రేమ, సానుభూతులు వారి హృదయాల్లో ఎక్కడ్నుంచి వస్తాయి?” అని చెప్పుకోసాగారు మరికొందరు ప్రజలు.
కాని అబూతాలిబ్ వారి అనుమానాలు తప్పు అని త్వరలోనే నిరూపించారు. ఆయన ముహమ్మద్ (సల్లం) ని అమితమైన ప్రేమాభిమానాలతో ఆదరించారు. కన్న కొడుకుల కన్నా మిన్నగా చూసుకోసాగారు. పెద్దమ్మ ఫాతిమా కూడా బాబుకు మాతృ మమకారం అందిస్తూ ఏలోటూ రాకుండా చూసుకోసాగింది.
ఇలా బాల ముహమ్మద్ (సల్లం) తాతయ్య పోయిన కొన్ని రోజుల్లోనే దుఃఖం నుండి తేరుకొని, పెదనాన్న, పెద్దమ్మల సంరక్షణలో ఎలాంటి చీకూ చింతా లేకుండా ప్రశాంత జీవనం గడపనారంభించారు.
*అబ్దుల్ ముత్తలిబ్ భార్యలు, మొత్తం సంతానం*
అబ్దుల్ ముత్తలిబ్ కు మొత్తం ఆరుగురు భార్యలు, ఆరుగురు కుమార్తెలు, కుమారుల వివరాలు క్రింద తెలియపర్చడం జరిగింది.
*అబ్దుల్ ముత్తలిబ్ భార్యలు : -*
(1) సఫియా
(2) ఫాతిమా
(3) లుబనీ
(4) హాల
(5) నతీల
(6) మనఅమ్త
*అబ్దుల్ ముత్తలిబ్ కుమార్తెలు : -*
(1) ఉమ్ముల్ హకీమ్ (బైజా)
(2) బర్రా
(3) ఆతికా
(4) సఫియా
(5) అర్ వా
(6) మైమూనా
*అబ్దుల్ ముత్తలిబ్ కుమారులు : -*
❤【 (1) హారిస్. తల్లి : - *సఫియా* 】❤
💛【 (2) జుబేర్
(3) అబూ తాలిబ్
(4) అబ్దుల్ కాబా
(5) అబ్దుల్లాహ్
వీరి తల్లి : - *ఫాతిమా* 】💛
💚【 (6) అబూ లహబ్. తల్లి : - *లుబనీ* 】💚
💜【 (7) మఖూమ్
(8) హజల్
(9) ముగైరా
(10) హంజ
వీరి తల్లి : - *హాల* 】💜
💙【 (11) జరార్
(12) ఖసమ్
(13) అబ్బాస్
వీరి తల్లి : - *నతీల* 】💙
💜【 గైదాఖ్. తల్లి : - *మనఅమ్త* 】💜
_{అర్థవంతం కోసమే ఈ గుర్తులను ఉపయోగించడం జరిగింది.}_
*తల్గీహుల్ ఫహుం - పుట 8,9; రహ్మాతుల్ లిల్ ఆలమీన్ - 2/56,66 ల ప్రకారం : - ↓*
అబ్దుల్ ముత్తలిబ్ కు మొత్తం పది మంది కుమారులు. వారి పేర్లు ఇలా ఉన్నాయి. హారిస్, జుబైర్, అబూ తాలిబ్, అబ్దుల్లాహ్, హమ్ జా (ర), అబూ లహబ్, గైదాక్, మకూమ్, సఫార్ మరియు అబ్బాస్ (ర). కొందరు పదకొండు మంది కుమారులని, అతడి పేరు ఖసమ్ అని అంటారు. మరికొందరు పదముగ్గురని, వారిలో ఒకరి పేరు అబ్దుల్ కాబా, మరొకరి పేరు హజల్ అని కూడా వాదిస్తారు. అయితే పది మంది అని చెప్పేవారు, మకూమ్ కు మారు పేరే అబ్దుల్ కాబా అని, గైదాక్ నే హజల్ అంటారని చెబుతారు. ఖసమ్ అనే పేరు అబ్దుల్ ముత్తలిబ్ సంతానంలోనే లేదు. (ఈ ఉల్లేఖనాలలోనే అబ్దుల్ ముత్తలిబ్ కుమార్తెల పేర్లు కూడా సంబోధించడం జరిగింది. మనం, అబ్దుల్ ముత్తలిబ్ కుమార్తెల పేర్లను పైన తెలుసుకున్నాము.)
_మిగిలినది Insha Allah రేపటి భాగములో తెలుసుకుందాము._
🖊🖊 ®@£€€q +97433572282 🖊🖊
(rafeeq)
🖊🖊 Salman +919700067779 🖊🖊
*Note : - ఈ msg లను ముందుకు పంపిస్తూ, మన ఇస్లాం చరిత్ర గురించి మన ముస్లిం సోదరులకు, సోదరీమణులకు తెలియజేస్తారని ఆశిస్తున్నాము.*
No comments:
Post a Comment