51

🛐 🕋 ☪ *బిస్మిల్లాహ్ హిర్రహ్మా నిర్రహీమ్* ☪ 🕋 🛐

🕋🤚🏻✋🏻🕌 *అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను* 🕌🤚🏻✋🏻🕋

◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆

       🕌☪🕋🛐 *ఇస్లాం చరిత్ర* 🛐🕋☪🕌

                                *భాగము - 51* 

◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆

*ప్రవక్త హజ్రత్ ఇల్యాస్ అలైహిస్సలామ్* 

హజ్రత్ ఇల్యాస్ (అలైహి) యూదులకు సన్మార్గం చూపడానికి ప్రభవించిన దైవప్రవక్త. దివ్యఖురాన్ లో రెండు చోట్ల మాత్రమే ఈయన ప్రస్తావన వచ్చింది. కానీ వివరాలు లేవు. చరిత్రకారుల పరిశోధన ప్రకారం ఇల్యాస్ (అలైహి) క్రీ.పూ. 875-850 ల మధ్యకాలంలో జీవించి ఉన్నట్లు తెలుస్తోంది. బైబిల్ లో ఈయన పేరు ఏలియా అని ఉంది.

"బాల్ బక్" పట్టణంలో బనీఇస్రాయీల్ కు చెందిన ఒక వర్గం ప్రజలు నివసించేవారు. ఈ పట్టణం లెబనాన్ లో ఉంది. కానీ ఈ ప్రజలు ప్రవక్తల బోధనలను పెడచెవిన పెట్టి విగ్రహారాధన ప్రారంభించారు. ఆ ప్రజలు ఒక పెద్ద విగ్రహాన్ని తయారుచేసి దానికి "బాల్" అని పేరు పెట్టారు. (సూర్యునికి గౌరవసూచకంగా తయారు చేసిన విగ్రహం అది)

ఆ ప్రజలు ఈ విగ్రహాన్ని తమ ప్రధాన దైవంగా భావించేవారు. అందువల్లనే ఆ పట్టణానికి "బాల్ బక్" అన్న పేరు వచ్చింది. "బాల్ బక్" అంటే "బాల్" నగరం అని అర్థం.

అపుడు ఆ ప్రజల వద్దకు అల్లాహ్ తన ప్రవక్త ఇల్యాస్ (అలైహి) ను పంపించారు. ఇల్యాస్ (అలైహి) ఆ ప్రజల వద్దకు వెళ్లి హితబోధ చేశారు. ఇల్యాస్ (అలైహి) ఆ ప్రజలతో....,

ఇల్యాస్ (అలైహి) : - ప్రజలారా! మీరు అల్లాహ్ కి భయపడరా? ఎంతో మంచి సృష్టి కర్తను వదిలి బాల్ విగ్రహాన్ని ప్రార్థిస్తున్నారు. మీరు చేస్తున్న ఈ విగ్రహారాధన చాలా ఘోరమైన పాపం. మీకు, మీ తాత ముత్తాతలకు అల్లాహ్ నే ప్రభువు. సర్వలోకాల సృష్టికర్త, విశ్వప్రభువు, మన ఆరాధనలకు అర్హుడు అల్లాహ్ మాత్రమే. అల్లాహ్ తప్ప మరో ఆరాధ్యుడు లేడు. మనం అల్లాహ్ ని మాత్రమే ఆరాధించాలి. "బాల్" విగ్రహాన్ని ఆరాధించరాదు.

కానీ ఆ ప్రజలు ఇల్యాస్ (అలైహి) మాటలను తిరస్కరించారు. ఫలితంగా ఆ ప్రజలు ఇహలోకంలోను, పరలోకంలోను అల్లాహ్ ఆగ్రహానికి గురయ్యారు.

ఇల్యాస్ (అలైహి) చూపిన నిజాయితీ, కఠిన ప్రయత్నాల కారణంగా అల్లాహ్ ఆయన గురించి చాలా గొప్పగా దివ్య ఖురాన్ లో ప్రస్తావించారు:

"ఇల్యాస్ ఒక ప్రవక్త. ఆయన తన జాతి ప్రజలతో, 'మీరు మీ విధిని నిర్వర్తించరా? మీరు బాల్ కు మొరపెట్టుకుని ఉత్తమ సృష్టికర్తను విస్మరిస్తారా? అల్లాహ్ మీకు ప్రభువు, మీ పూర్వీకులకు అందరికీ ప్రభువు' అని చెప్పారు. కాని వారు ఆయన్ను తిరస్కరించారు. వారిని తప్పక లాక్కురావడం జరుగుతుంది (శిక్షించడానికి). నిజాయితీ, నిబద్ధత కలిగిన దైవభక్తులను తప్ప. మేము ఆయన పేరును తర్వాతి తరాల్లో ప్రస్తావించబడేలా చేశాము. ఇల్యాస్ పై శాంతి కురియుగాక! సానుభూతితో వ్యవహరించిన వారిని మేము ఈ విధంగా బహుకరిస్తాము. ఆయన మా పై విశ్వాసం కలిగిన దాసుల్లో ఒకడు." (ఖురాన్ 37:123-132)

      *బైబిల్ కథనం ప్రకారం* 

               

_బైబిల్ కథనం ప్రకారం సులైమాన్ ప్రవక్త (అలైహి) చనిపోయిన తరువాత ఆయన కొడుకు రహుబామ్ అయోగ్యత వల్ల యూదుల సామ్రాజ్యాల రెండు ముక్కలయింది. జెరూసలేం తో పాటు దక్రిణపాలస్తినా భూభాగం ఒక రాజ్యాంగ ఏర్పడితే, ఉత్తర పాలస్తీనా భూభాగం ఇస్రాయీల్ పేరుతో మరో రాజ్యాంగ ఏర్పడింది. ఈ రె౦డు రాజ్యాలు నైతికంగా, ధార్మికంగా క్రమేణా దిగజారిపోయాయి. ముఖ్యంగా ఇస్రాయీల్ రాజు బహుదైవారాధకులైన సైదా (లెబనాన్ రాజు కుమార్తె) ను వివాహమాడిన తర్వాత అతని రాజ్యం మరింత దిగజారిపొయింది. విగ్రహారాధన ఎక్కువైపోయింది. ప్రజలు ‘బాల్’ విగ్రహాన్ని ఆరాధించడం, దాని పేరుతో జంతుబలులు ఇవ్వడం ప్రారంభించారు._ 

_ఆ కాలంలోనే హజ్రత్ ఇల్యాస్ (అలైహి) దైవప్రవక్తగా ప్రభవించి విగ్రహారాధనకు, ఇతర చెడులకు వ్యతిరేకంగా ప్రచారం ప్రారంభించారు. ఇస్రాయీల్ రాజును తీవ్రంగా హెచ్చరిస్తూ...., “నీ పాపాల మూలంగా ఇప్పుడు ఇస్రాయీల్ దేశంలో వర్షం కురవదు. కనీసం మ౦చు కూడా కురవదు” అని శపించారు ఇల్యాస్ (అలైహి). ఈ శాపం ఫలితంగా మూడున్నర సంవత్సరాల దాకా వర్ష౦ కురవలేదు. అప్పుడు ఇస్రాయీల్ రాజు దిగివచ్చి ఈ దుస్థితి ను౦డి కాపాడమని ఇల్యాస్ (అలైహి) వద్ద ప్రాధేయపడ్డాడు._ 

_అయితే హజ్రత్ ఇల్యాస్ (అలైహి) బాల్ దేవత, విశ్వప్రభువైన యోహోవా (అల్లాహ్) లలో ఎవరు నిజ దేవుడు నిరూపించడానికి బహిరంగ జన సముహాన్ని ఏర్పాటు చేయించారు. ఈ ప్రదర్శనలో 850 మంది బాల్ దేవత పూజారులు పాల్గొన్నారు. అపుడు ఇల్యాస్ (అలైహి) అక్కడ ఉన్న జన సమూహాన్ని ఉద్దేశించి....,_ 

_ఇల్యాస్ (అలైహి) : - ప్రజలారా! బాల్ దేవత మరియు సర్వలోకాల సృష్టికర్త, విశ్వప్రభువైన యోహోవా లలో నిజమైన దేవుడు ఎవరో నిరూపించడానికి ఈ బహిరంగసభ ఏర్పాటు చేయడం జరిగింది._ 
       _........బాల్ దేవత పేరు తో దాని పూజారులు, విశ్వప్రభువు పేరుతో నేను జంతుబలి ఇవ్వాలి. ఈ రెండు బలులలో ఆకాశం నుండి దైవాగ్ని వచ్చి ఎవరి బలిదానాన్ని భస్మీపటిలం చేసి స్వీకరిస్తుందో వారు గెలిచినట్లు._

_చివరికి ఈ పోటీలో బాల్ విగ్రహాన్ని ఆరాధించే పూజారులు ఓడిపోయారు. ఆకాశం ను౦డి వచ్చిన దైవాగ్ని ఇల్యాస్ (అలైహి) సమర్పించిన పశువునే కాల్చివేసింది. ఇలా విశ్వప్రభువైన యోహోవాయే నిజ దేవుడని, ఆరాధ్యనీయుడని ఇస్రాయీల్ ప్రజలందరి ముందు ఋజువయ్యింది. నిర్ణీత షరతుల్లో ఓడినవారిని హతమార్చాలని కూడా ఉంది. దాని ప్రకారం బాల్ దేవత పూజరులందరినీ హతమార్చడం జరిగింది._ 

_ఆ తర్వాత ఇల్యాస్ (అలైహి) వర్ష౦ కోసం దైవాన్ని ప్రార్థించారు. దాంతో ఇస్రాయీల్ రాజ్యమంతటా విస్తారంగా వర్షం కురిసింది. కాని ఇంతటి గొప్ప మహత్యం చూసినప్పటికి ఇస్రాయీల్ రాజు బహుదైవారాధకురాలైన తన భార్య వల నుండి బయటపడలేకపోయాడు. పైగా అతని భార్య ఈ మహిమ చూసిన తర్వాత ఇల్యాస్ (అలైహి) కు బద్ధశత్రువైపోయింది. బాల్ విగ్రహాన్ని పూజించే పూజారులు ఎలా చంపబడ్డారో ఇల్యాస్ ని కూడా అలా చంపడం జరుగుతుందని ఆమె ప్రమాణం చేసి మరీ ప్రకటించింది. దాంతో ఇల్యాస్ (అలైహి) ఇక ఇస్రాయీల్ రాజ్యంలో ఉండడం వల్ల ప్రయోజనం లేదని భావించి, అక్కడి నుంచి వేరే చోటికి తరలిపోయారు._ 

_ఆ కాలంలోనే యూదసామ్రాజ్యం రాజు ఇస్రాయీల్ రాజు కుమార్తెను వివాహమాడాడు. ఆమె ద్వారా యూద రాజ్యంలో కూడా బహుదైవారాధన వ్యాపించింది. అంచేత ఇల్యాస్ (అలైహి) అక్కడ కూడా ధర్మ ప్రచారం చేసి ప్రజలను సత్యధర్మం వైపు మరలించడానికి కృషి చేశారు. ఇల్యాస్ (అలైహి) యూద రాజుకు కూడా హితోపదేశం చేశారు. కాని యూద రాజుకు ఇల్యాస్ (అలైహి) హితవులు చెవికెక్కలేదు. చివరికి ఇల్యాస్ (అలైహి) అతడ్ని తీవ్రంగా శపించారు. ఈ శాపం ఫలితంగా మొదట యూదరాజ్యం పై శత్రు సైన్యాలు దాడులు చేసి సర్వనాశనం చేశాయి. వారు అతని భార్యల్ని కూడా బ౦ధి౦చి తీసికెళ్ళారు. ఆ తరువాత యూదరాజు భయంకరమయిన అజీర్ణ వ్యాధితో చనిపోతాడు._ 

_ఈ సంఘటన జరిగిన కొన్నేళ్ళ తరువాత ఇల్యాస్ (అలైహి) మళ్ళీ ఇస్రాయీల్ రాజ్యానికి వెళ్ళి ధర్మప్రచారం చేస్తారు. ఆ తరువాత వచ్చిన ఇస్రాయీల్ రాజుకు కూడా హితోపదేశం చేస్తారు. కాని ఆ రాజ వంశంలో పేరుకుపోయిన చెడులు ఏమాత్రం తొలగిపోలేదు. దాంతో ఆ వంశాన్ని కూడా శపించడం, అది సర్వనాశనం అయిపోవడం జరిగాయి. ఆ తరువాత దేవుడు ఇల్యాస్ (అలైహి) తన దగ్గరికి పిలుచుకున్నాడు._ 

_యూదులు ఇల్యాస్ (అలైహి) ని ఆయన జీవించి ఉన్నప్పుడు ఎ౦తగా వేధించారో, ఆ తరువాత ఆయన్ని అంతగా అభిమానిచడం మొదలెట్టారు. వారు ఇల్యాస్ (అలైహి) ని, మూసా (అలైహి) కంటే గొప్ప ప్రవక్తగా భావించారు. అంతేకాదు, దేవుడు ఆయన్ని ఓ సుడిగాలి ద్వారా సజీవంగా, సశరీరంగా ఆకాశంలోకి ఎత్తుకున్నాడని, తరువాత ఆయన మళ్ళీ భూలోకానికి తిరిగివస్తారని కూడా వారు నమ్ముతున్నారు._ 

_బైబిల్ లో ఇల్యాస్ అలైహిస్సలామ్ గురించి ఈ విధంగా ప్రస్తావించడం జరిగింది._ 

Insha Allah రేపటి భాగము - 52 లో అయ్యూబ్ అలైహిస్సలామ్ గురించి తెలుసుకుందాము.

Note : - ఈ msg లను ముందుకు పంపిస్తూ, మన ఇస్లాం చరిత్ర గురించి మన ముస్లిం సోదరులకు తెలియజేస్తారని ఆశిస్తున్నాము.

☆☆   ®@£€€q  +97433572282 ☆☆

No comments:

Post a Comment