🤚🏻✋🏻 🕌 *బిస్మిల్లాహ్ హిర్రహ్మా నిర్రహీమ్* 🕌 🤚🏻✋🏻
🛐🕋🛐🕋 *అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను* ☪🕋☪🕋
°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°
🕌🕋🕌🕋 *ఇస్లాం చరిత్ర* 🕋🕌🕋🕌
*భాగము - 39*
____________________________________________
*యుద్దానికి కసరత్తులు*
జాలూత్ సైన్యం తో యుద్దానికి తాలూత్ తన సైనికులను సిద్ధం చేయడం ప్రారంభించారు. (జాలూత్ ఎవరంటే, శత్రుసైన్యుల నాయకుడు) తాలూత్ తన సైన్యాలను వ్యవస్థీకరించడం ప్రారంభించారు. అల్లాహ్ పై బలమైన విశ్వాసంతో, వివేకంతో సైన్యాన్ని తీర్చిదిద్దడం మొదలుపెట్టారు. ఎలాంటి బాధ్యతలు లేని పురుషులు సైన్యంలో చేరాలని ఆదేశించాడు. ఇంటి నిర్మాణం పనుల్లో ఉన్నవారు, పెళ్లి చేసుకోబోతున్నవారు, వ్యాపార కార్యకలాపాల్లో ఉన్నవారు సైన్యంలో చేరాల్సిన అవసరం లేదన్నారు.
ఆ విధంగా ఒక షుశిక్షితమైన సైన్యాన్ని రూపొందించారు. ఆ సైన్యాన్ని ఇక పరీక్షకు నిలబెట్టాలని భావించారు. ఆ తర్వాత తాలూత్ తన సైన్యాన్ని తీసుకోని జాలూత్ తో యుద్దానికి బయలుదేరాడు. అపుడు తాలూత్ తన సైన్యాన్ని ఉద్దేశిస్తూ....,
తాలూత్ : - సైనికులారా! దారిలో ఒక నది ద్వారా అల్లాహ్ మిమ్మల్ని పరీక్షించబోతున్నాడు. మనం ఆ నదిని దాటవలసి ఉంది. గుర్తుంచుకోండి, ఆ నదిలో నీరు తాగేవాడు నా వాడు కాదు, నీరు తాగని వాడే నావాడు. అయితే ప్రాణం కాపాడుకోవడానికి దాహం తీర్చుకునేందుకు తగినంత నీరు మాత్రమే తాగితే ఫర్వాలేదు, కానీ అంతకన్నా ఎక్కువ నీరు తాగరాదు.
కానీ, ఆ సైనికులలోని కొందరు తప్ప మిగిలినవారు దాహం తీర్చుకోవడానికి అవసరమైన నీటి కంటే చాలా ఎక్కువగా తాగారు. ఈ విషయం తాలూత్ కు తెలిసింది. ఆ తాగిన వారి అవిధేయత కారణంగా, తాలూత్ వారిని సైన్యం నుంచి తొలగించారు. తన ఆదేశాలను పాటించిన కొంతమందిని మాత్రమే సైనికులుగా నియమించుకున్నారు. ఎందుకంటే వారు తమ నిజాయితీని నిరూపించుకున్నారు.
కానీ ఈ చర్య వల్ల సైన్యంలో చీలిక వచ్చింది. అయిన కూడా తాలూత్ లక్ష్యపెట్టలేదు. ఆదేశాలను పాటించని సైన్యం పెద్ద సంఖ్యలో ఉండడం, ఆదేశాలను తూ.చ తప్పకుండా పాటించే కొద్ది మంది సైనికులు ఉండడమే మేలని తాలూత్ భావించారు. అవిశ్వాసుల పెద్ద సైన్యం కన్నా, గుప్పెడు మంది విశ్వాసులపై ఆధారపడడమే ఉత్తమమని తాలూత్ తలచారు.
*ప్రారంభమైన యుద్ధం : -*
ఆ తర్వాత తాలూత్, విశ్వాసులైన అతని అనుచరులు నది దాటారు. నది దాటి ముందుకు సాగుతున్నపుడు ఆవలి వైపు శత్రుసైనికులను తాలూత్ సైనికులు చూశారు. శత్రువులు శారీరకంగా చాలా బలంగా ఉన్నారు. ఆ శత్రువుల వద్ద ఆయుధబలం కూడా చాలా ఎక్కువగా ఉంది. మహాపరాక్రమశాలి జాలూత్ వారికి నాయకత్వం వహిస్తున్నాడు. ఈ బలమైన శత్రుసైన్యాన్ని చూడగానే తాలూత్ సైన్యం కకావికలయ్యింది.
తాలూత్ సైన్యంలో కొంత మంది శత్రు సైన్యంను చూసి ఇలా అన్నారు : - ఈ రోజు జాలూత్ ని గాని, అతని సైన్యాన్ని గాని ఎదుర్కునే శక్తి మాలో లేదు.
అయితే తాలూత్ వెంట మిగిలిన కొద్దిమంది సైనికులు మరియు తప్పకుండా ఒకరోజు అల్లాహ్ కు ముఖం చూపించవలసి ఉంటుంది అని నమ్ముతున్నవారు మాత్రం అన్నింటికీ తెగించి యుద్ధంలో పోరాడటానికి సిద్ధం అయ్యారు. అల్లాహ్ అనుగ్రహం వల్ల, గతంలో చిన్న సైన్యాల చేతిలో పెద్ద పెద్ద సైన్యాలు ఓడిపోయిన సంఘటనల గురించి తాలూత్ సైన్యంలోని సైనికులు విని ఉన్నారు.
_[అల్లాహ్ స్థిరంగా నిలబడి పోరాడేవారికే అండగా ఉంటాడు.]_
తాలూత్ సైన్యం అల్లాహ్ తో దుఆ చేశారు. "ప్రభు! మాకు దృఢమైన సంకల్పం, సహనం, స్థైర్యం ప్రసాదించు. మా కాళ్ళకు నిలకడ చేకూర్చి, మా అడుగులకు బలాన్ని ఇవ్వు. నీ హితవులను మరియు నీ ఆదేశాలను మరియు నీ అనుగ్రహాలను విశ్వసించని ఈ అవిశ్వాసులపై మాకు విజయం ప్రసాదించు." అని అల్లాహ్ తో వేడుకున్నారు.
ఆ తర్వాత తాలూత్ సైన్యం మరియు శత్రువులు జాలూత్ సైన్యం ఒకదానికొకటి బలంగా ఢీకొన్నాయి. నువ్వా నేనా అన్నట్లు యుద్ధం సాగుతోంది. యుద్ధం హొరాహొరిగా జరుగుతున్న ఇలాంటి సమయంలో శత్రుసైనికుల నాయకుడు జాలూత్ ద్వంద యుద్దానికి సవాలు విసిరాడు.
జాలూత్ : - తాలూత్ సైనికులారా! చూశారా మా పరాక్రమము. మా ఈ సైన్యం ముందు మీ సైన్యం ఏనుగు కింద ఎలుక లాగా కనపడుతోంది. అందుకే మీకు ఒక అవకాశం ఇస్తున్నాను. మీలో ఎవరైనా నాతో తలపడేందుకు సరిపడే సైనికుడు ఉంటే రండి. దమ్ముంటే ఎవరైనా నాతో యుద్ధం చేసేందుకు వచ్చి తలపడండి.
_[ఆ కాలం యుద్ధాల సంప్రదాయం ఇది. మహాకాయుడైన జాలూత్ తన బలాన్ని ప్రదర్శించాలనుకున్నాడు.]_
జాలూత్ ను చూసి తాలూత్ సైనికులు భీతిల్లారు. జాలూత్ విసిరిన సవాలును ఎదుర్కునే ధైర్యం ఎవరూ చేయలేకపోయారు.
ఆ తర్వాత శత్రువుల నాయకుడు జాలూత్ తో తలపడేందుకు తన సైనికులను ప్రోత్సహించడానికి విశ్వాసులు రాజు తాలూత్ ఒక ప్రకటన చేస్తూ....,
తాలూత్ : - విశ్వాస సైనికులారా! జాలూత్ కూడా మనలాగా ఒక మానవ మాతృడు మాత్రమే. అతడిని చూసి మనం భయపడవలసిన అవసరం లేదు. సర్వలోక సృష్టికర్త మరియు మన ప్రభువు అయిన అల్లాహ్ మనతోనే ఉన్నాడు. అల్లాహ్ పై భారం వేసి అడుగు ముందుకు వేయండి.
కానీ, ఈ మాటలకు తాలూత్ సైన్యం ముందుకు రాలేదు.
తాలూత్ : - నా సైనికులారా! కావాలంటే, జాలూత్ తో తలపడి పోరాడినవారికి నా అందమైన కూతుర్ని ఇచ్చి, సకల లాంఛనాలతో, అంగరంగ వైభవంగా వివాహం జరిపిస్తాను.
కానీ ఈ ప్రకటన కూడా బెంబేలెత్తిన సైన్యం లో కొత్త ఉత్సాహాన్ని నింపలేకపోయింది.
అప్పుడే ఆశ్చర్యంగా తాలూత్ సైన్యం లో నుంచి, శత్రుపక్షం రాజు అయిన జాలూత్ తో తలపడేందుకు ఒక బాలుడు ముందుకు వచ్చాడు.
బాలుడు : - అవిశ్వాసుల రాజు, శత్రుపక్ష నాయకుడు, అహంకారంతో విర్రవీగుతున్న జాలూత్ తో తలపడేందుకు నేను సిద్ధం.
ఆ బాలుడిని చూసి శత్రుసైన్యం పక పక నవ్వడం ప్రారంభించింది. చివరకు తాలూత్ సైనికులు కూడా ఆ బాలుడిని తక్కువగానే చూశారు.
శత్రు పక్ష రాజు అయిన జాలూత్ విసిరిన సవాలును స్వీకరిస్తూ, అతని తో తలపడేందుకు ముందుకు వచ్చిన ఆ నూనూగు మీసాల నవయువక బాలుడు జాలూత్ ని ఒక్క దెబ్బతో సంహరించాడు. *ఆ నవ యువకుడు మరెవరో కాదు, భావి దైవ ప్రవక్త హాజ్రత్ దావూద్ అలైహిస్సలామ్.*
అసలు శత్రుసేనల రాజు జాలూత్ ని దావూద్ (అలైహి) ఏ విధంగా సంహరించాడు, ఆ తరువాత ఏమి జరిగింది అన్న విషయాలలోని వివరణను Insha Allah రేపటి భాగము - 40 లో తెలుసుకుందాము.
Note : - ఈ msg లను ముందుకు పంపిస్తూ, మన ఇస్లాం చరిత్రను మన ముస్లిం సోదరులకు తెలియజేస్తారని ఆశిస్తున్నాము.
☆☆ ®@£€€q +97433572282☆☆
No comments:
Post a Comment