115

🕌🕌🕌       *బిస్మిల్లాహ్ హిర్రహ్మా నిర్రహీమ్*        🕌🕌🕌

🛐🛐   *అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు*   🛐🛐
🤚🏻✋🏻     *అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను*      🤚🏻✋🏻

 *~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~* 

🕋🕋🕋             *ఇస్లాం చరిత్ర* *- 115*             🕋🕋🕋

☪🇸🇦☪ *ముహమ్మద్ (సల్లం) జీవితచరిత్ర - 30* ☪🇸🇦☪

 *■×=×=×=×=×=×=×=×=×=×=×=×=×=×=×=×=×=×=×■*

 *జిబ్రీల్ (అలైహి), ముహమ్మద్ (సల్లం) పై వహీ ని అవతరింపజేసిన తర్వాత, ముహమ్మద్ (సల్లం) భయం భయంతో ఇంటికి చేరుకున్న సందర్భం : -* 

భీతావహులైన ముహమ్మద్ (సల్లం), ఇంటికి చేరుకున్నారు. ఆ సమయంలో, ఆయన (సల్లం) గారి ధర్మపత్ని హజ్రత్ ఖదీజా (రజి) బిన్తె ఖౌలీద్ ఇంట్లోనే ఉన్నారు. దైవప్రవక్త (సల్లం), కంగారుగా రావడాన్ని ఆమె గమనించారు.

ఆ వెంటనే దైవప్రవక్త (సల్లం) పడక పైకి చేరుకొని, గజగజ వణికిపోతూ తన భార్యతో...., "నా పై దుప్పటి కప్పు, నా పై దుప్పటి కప్పు" అని చెప్పారు.

దైవప్రవక్త (సల్లం) పరిస్థితి చూసి, ఖదీజా (రజి) చాలా కంగారు పడ్డారు. ఆ వెంటనే దుప్పటిని తెచ్చి దైవప్రవక్త (సల్లం) పై కప్పారు.

ఆ సమయంలో దైవప్రవక్త (సల్లం) గారి పరిస్థితికి గల కారణాలను అడగటానికి ఖదీజా (రజి) సాహసించలేకపోయారు.

కొంత సేపు తర్వాత దైవప్రవక్త (సల్లం) పరిస్థితి కుదుటపడింది. భయం దూరమయ్యింది. ముహమ్మద్ (సల్లం) దుప్పటి తొలగించి లేచి కూర్చున్నారు.

అప్పడు హజ్రత్ ఖదీజా (రజి)కు కొంచెం ధైర్యం వచ్చింది. ఆమె, దైవప్రవక్త (సల్లం) తో....,

ఖదీజా (రజి) : - ఏం జరిగింది? ఎందుకంత కంగారు పడుతున్నారు? ఇప్పటిదాకా ఎక్కడున్నారు మీరు?? ఒంట్లో నలతగా ఉందా?? (అని ప్రశ్నించసాగారు.)

ముహమ్మద్ (సల్లం) : - ఖదీజా! హిరా గుహలో ఎప్పుడూ జరుగని ఓ వింత సంఘటన జరిగింది. నేను హిరా గుహలో కూర్చొని ఉండగా, ఆకస్మికంగా తెల్లని వస్త్రాలు ధరించిన ఒక దైవదూత ప్రత్యక్షమయ్యాడు. ఆ దైవదూత వచ్చిరాగానే "చదువు" అని నన్ను ఆజ్ఞాపించాడు. దానికి బదులుగా నేను "నాకు చదువు రాదు" అని అన్నాను. ఇలా మూడు సార్లు జరిగింది. చివరికి నేను అతను చెప్పినట్లు ఎలాగో చదివాను. ఆ తరువాత అతను వెళ్ళిపోయాడు. నాకు భయమేసి గుహ నుండి గబగబా నడచి ఇంటికొచ్చాను.

 _(మరో ఉల్లేఖనంలో, "జిబ్రీల్ (అలైహి) తనకు నేర్పించిన అద్భుత వాక్యాలను ముహమ్మద్ (సల్లం), ఈ సమయంలోనే తన భార్య ఖదీజా (రజి) ముందు ఉచ్చరించారు." అని కూడా ఉంది)_ 

ముహమ్మద్ (సల్లం) : - (ఖదీజా!) నాకేమైంది? నాకు నా ప్రాణం పోతుందన్న భయం పట్టుకుంది.

ఈ విధంగా ముహమ్మద్ (సల్లం) ఇంటికి చేరి జరిగినదంతా తన భార్యకు పూసగుచ్చినట్టు చెప్పారు.

ఖదీజా (రజి) చాలా తెలివైన మహిళ. ఈ సంఘటన విని ఆమె భయపడలేదు. అపుడు....,

ఖదీజా (రజి) : - లేదండి, అలా జరిగే అవకాశమే లేదు. అల్లాహ్ మిమ్మల్ని అగౌరవం పాలు చేయడు. చాలా కాలం నుంచి మీరు నాకు తెలుసు. మీరెప్పుడు పొగడ్తల కొరకు ఏమీ చేయలేదు. మీరంటే ఎంతో మందికి నమ్మకం. ప్రతి ఒక్కరికి మీ స్వచ్ఛమైన వ్యక్తిత్వం తెలుసు. మీరు సత్యసంథులు, దయార్ద్రహృదయులు, నిజాయితీపరులు. నిరుపేదలకు సహాయం చేస్తారు. మీరు బంధువుల ఎడల సత్ప్రవర్తన కలిగి ఉంటారు. కష్టాల్లో చిక్కుకున్న వారిని ఆదుకుంటారు. అతిథులను సత్కరిస్తారు. మంచి పనులలో ప్రజలతో సహకరిస్తారు. సత్యమార్గంలో ఎదురయ్యే కష్టాలను తొలగిస్తారు. అటువంటి వారైన మీకు అల్లాహ్ ఎన్నటికి ప్రాణాపాయం కలిగించడు. ఏ దుష్ట ఆత్మా, మరే షైతానూ మిమ్మల్ని ప్రభావితం చేయడం అసాధ్యం. (అని ధైర్యం చెప్పారు)

ఖదీజా (రజి) మాటలతో ముహమ్మద్ (సల్లం) కు కొంచెం ధైర్యం వచ్చింది. కలవరపాటు చాలా వరకు తగ్గిపోయింది.

ఆ తర్వాత ఖదీజా (రజి), దైవప్రవక్త (సల్లం) తో...., "నా సోదరుడు "వరఖా", నాతో ఎప్పుడూ "అల్లాహ్ ఒక్కడే" అనే ధర్మం గురించి చెబుతుండేవాడు. అందుకని, మనం అతన్ని కలిసి జరిగిన విషయమంతా అతనికి తెలియజేస్తే, ఏదైనా పరిష్కారమార్గం చూపించవచ్చు." అని అన్నది.

తదుపరి, ఖదీజా (రజి) ఆయన (సల్లం)ను తీసుకుని "వరఖా బిన్ నౌఫల్" దగ్గరకు వెళ్ళారు.

 *"వరఖా బిన్ నౌఫల్" గురించి : -* 

"వరఖా బిన్ నౌఫాల్" హజ్రత్ ఖదీజా (రజి) పెదనాన్న కుమారుడు. వరుసకు అన్నవుతాడు. వయస్సు బాగా పైబడిన పండుముసలి. అయితే అతను గొప్ప తత్వవేత్త. వివిధ మతాలను కాచి వడబోసిన ప్రముఖ మతపండితుడు. ప్రతి విషయాన్ని సునిశితంగా పరిశీలించి తగిన నిర్ణయం తీసుకునే మనస్తత్వం కలవాడు.

ఈయన మొదట యూదమతం వైపు మొగ్గాడు. ఆ తరువాత (అజ్ఞాన కాలంలో) క్రైస్తవ మతం స్వీకరించాడు. "బైబిల్" ని సంవత్సరాల తరబడి అధ్యయనం చేసి, అందులోని లోటుపాటులు తెలుసుకున్న ప్రముఖ పరిశోధకుడు. అరబీ భాషలో "బైబిల్" ని అనువదించే పని కూడా ప్రారంభించాడు. (హిబ్రూ భాషలో రచనలు చేసేవాడు. కాబట్టి చేతనయినంత వరకు హిబ్రూ (ఇబ్రానీ) భాషలో బైబిల్ రాసేవాడు.)

 *"వరఖా బిన్ నౌఫల్" వద్దకు చేరుకున్న ముహమ్మద్ (సల్లం) దంపతులు : -* 

హజ్రత్ ఖదీజా (రజి), వరఖా ముందు ముహమ్మద్ (సల్లం) కు ఎదురైన సంఘటన గురించి ప్రస్తావిస్తూ....,

ఖదీజా (రజి) : - అన్నయ్యా! మీరు మీ సోదర కుమారుని మాటలేమిటో కొంత వినండి.

వరఖా : - ముహమ్మద్ (సల్లం)! హిరా గుహలో నీవు చూసిందేమిటో చెప్పు? (అని దైవప్రవక్త (సల్లం), వైపు చూస్తూ అడిగారు)

దైవప్రవక్త (సల్లం), హిరా కొండ గుహలో చూసినదంతా వివరించారు. ఇది విన్న వరఖా....,

వరఖా : - అయితే (ముహమ్మద్ (సల్లం)! విను) నా ప్రాణం ఎవరి ఆధీనంలో ఉందో ఆ దేవుని సాక్షిగా చెబుతున్నాను. నీవు వర్ణించిన ఆ అధ్బుత శక్తి ఎవరో కాదు. గతంలో ప్రవక్త మూసా (అలైహి) దగ్గరకు దైవసందేశం తెస్తూ ఉండిన జిబ్రీల్ (అలైహి) దూతే ఆయన. దేవుడు నిన్ను తన ప్రవక్తగా ఎన్నుకున్నాడు. నీవిప్పుడు దైవప్రవక్తవు. తౌరాత్, ఇంజీల్ గ్రంథాల్లో నీ దౌత్యం గురించి భవిష్యత్ ప్రకటనలు ఉన్నాయి. నీ అనుచర సమాజం యావత్ ప్రపంచంలో వ్యాపిస్తుంది.

         కాని ముహమ్మద్! నీవు దైవప్రవక్త అయినట్లు ప్రకటించావంటే లోకులు నిన్ను తిరస్కరిస్తారు. స్వస్థలం నుంచి వెళ్ళగొడతారు. చివరకు నీతో యుద్ధం చేయటానికి అయినా వెనుదీయరు ఈ ప్రజలు. అప్పటిదాకా నేను బ్రతికి ఉంటే ఎంత బాగుండు!

ముహమ్మద్ (సల్లం) : - ఏమిటీ! ప్రజలు నన్ను ఇక్కడ్నుంచి వెళ్ళగొడతారా?

వరఖా : - ఔను నాయన! గతంలో దైవప్రవక్తలు వచ్చినప్పుడల్లా వారి జాతి ప్రజలు ఇలాగే ప్రవర్తించారు. నాకా రోజులు చూసే భాగ్యముంటే నా సర్వశక్తులు వొడ్డి నిన్ను ఆదుకుంటాను. (నేనే గనక ఆ కాలంలో ఉంటే నీకు గొప్ప సహాయం చేయగలను.)

(ఇక వారి మధ్య మాటలు పూర్తయిన) తరువాత మహనీయ ముహమ్మద్ (సల్లం) శ్రీమతితో పాటు అక్కడనుంచి లేచి భారంగా అడుగులేస్తూ ఇంటికి చేరుకున్నారు.

ఆ సంఘటన తర్వాత "వరఖా బిన్ నౌఫల్" త్వరగానే కాలధర్మం చెందాడు.

 *దైవవాణి అవతరణ గురించి, తిబ్రీ మరియు హష్షామ్ ల కథనం : - ↓* 

తిబ్రీ మరియు హష్షామ్ కథనాల ప్రకారం తెలిసిన విషయం ఏమిటంటే, దైవవాణి అవతరించగానే హిరా గుహ నుండి బయటకు వచ్చారు దైవప్రవక్త (సల్లం). ఆ తరువాత లోనికి వెళ్లి తన మిగతా గడువును పూర్తిచేసుకొని మక్కాకు వచ్చారు. తిబ్రీ ఉల్లేఖనంలో, ఆయన (సల్లం) బయటకు ఎందుకు వచ్చారు అన్నది కూడా తెలుస్తుంది. ఆ ఉల్లేఖనంలో ఇలా ఉంది : 

దైవప్రవక్త (సల్లం), దైవవాణి అవతరించిన తీరు గురించి ప్రస్తావిస్తూ...., "అల్లాహ్ సృష్టితాల్లోకెల్లా కవి మరియు ఉన్మాది తప్ప మరెవ్వరూ నా దృష్టిలో అసహ్యం కలిగించే ప్రాణుల్లేరు. (నేను, ఆ అసహ్యం పెరిగి పోవడం వల్ల) వారి వైపు చూసే ధైర్యం కూడా చేసేవాణ్ణి కాదు. (ఇప్పుడు అవతరించిన) దైవవాణి విషయంలో, ఇది పనికిమాలిన అని తలచాను. (అంటే ఖుద్దు తననే ఉన్మాది లేక కవిగా తలచుకున్నారు). నా విషయంలో ఖురైష్ (తెగ వారు) ఎప్పుడూ ఇలా అనుకోరు. నేను కొండ శిఖరం పైకి వెళ్లి అక్కడి నుండి క్రిందికి దూకేస్తాను. మరణించి శాశ్వతంగా సుఖం పొందుతాను అని అనుకున్నారు.

ఈ తలంపు రాగానే కొండ మధ్యకు వెళ్ళగా ఆకాశం నుండి ఓ వాణి వినిపించింది. "ముహమ్మద్ (సల్లం)! నీవు దైవప్రవక్తవు. నేను జిబ్రీల్ (అలైహి)ను."

నేను ఆ వాణి విని ఆకాశం వైపునకు తలెత్తి చూశాను. చూడగా జిబ్రీల్ (అలైహి) ఓ మనిషిలా దిగ్మండలంలో నిలబడి...., "ఓ ముహమ్మద్ (సల్లం) నీవు దైవప్రవక్తవు. నేను జిబ్రీల్ (అలైహి)ని." అని చెప్పడం వినబడింది. జిబ్రీల్ ను చూస్తూ అక్కడే నిలబడి పోయాను. ఇలా నేను నా ఆత్మహత్యా ప్రయత్నాన్ని మరిచేపోయాను. ఇప్పుడు నేను ముందుకు గాని, వెనక్కుగాని కదలడం లేదు. అయితే నా ముఖాన్ని మట్టుకు దిగ్మండలంలో అటూ ఇటూ త్రిప్పుతూనే ఉన్నాను. నేనెటు తలత్రిప్పినా జిబ్రీల్ (అలైహి) అలా నిలబడినట్లుగానే కనపడేవారు. నేనలాగే ఎటూ కదలకుండా ఉండిపోయాను. ఈ నడుమ ఖదీజా (రజి) నా ఆచూకీ కోసం మనుషుల్ని పంపించారు. వారు మక్కా వరకు వెళ్ళి వెనక్కు తిరిగివచ్చేశారు.

జిబ్రీల్ (అలైహి) వెళ్లిపోయిన తరువాత నా ఇంటికి తిరిగివచ్చి తొడనానుకొని కూర్చున్నాను. ఆమె (ఖదీజా (రజి)) నన్ను చూసి...., "అబుల్ ఖాసిం! మీరెక్కడున్నారు? దైవసాక్షి! నేను మీకోసం మనుషుల్ని పంపించాను. వారు మక్కా వరకూ వెళ్లి తిరిగి వచ్చేశారు!" అని అడిగారు.

(సమాధానంగా నేను) చూసినదంతా చెప్పేశాను. ఆమె నాతో...., "ఓ పినతండ్రి కుమారా! సంతోషించండి, నిలకడగా ఉండండి. ఏ దైవం చేతిలోనైతే నా ప్రాణం ఉందో ఆ దైవం సాక్షి! మీరు ఈ జాతికి ప్రవక్త కాగలరు." అని ధైర్యం చెప్పారు.

ఆ తరువాత ఆమె "వర్కా బిన్ నౌఫిల్ (వరఖా బిన్ నౌఫల్)" వద్దకు వెళ్లి విషయాన్ని విశదీకరించారు. ఆయన, "ఖుద్దూస్, ఖుద్దూస్" (అల్లాహ్ మహాపవిత్రుడు) అంటూ, "ఎవరి గుప్పెట్లోనైతే "వర్కా" ప్రాణాలున్నాయో, ఆయన సాక్షి! ఈయన వద్దకు వచ్చినవారూ, మూసా (అలైహి) వద్దకు వచ్చినవారూ ఆ జిబ్రీలే (అలైహి). ఈయన ఈ సమాజానికి ప్రవక్త. ఈయనతో చెప్పు నిలకడగా ఉండమని." అని అన్నారు.

ఆ తరువాత ఆమె (ఖదీజా) తిరిగి వచ్చి, ప్రవక్త (సల్లం)కు "వర్కా" చెప్పిన విషయం చెప్పారు. ఆ తరువాత దైవప్రవక్త (సల్లం) హిరా కొండలో తన విడిదిని పూర్తిచేసుకుని (మక్కాకు) తిరిగి వచ్చిన తర్వాత "వర్కా" ను కలిశారు. ప్రవక్త (సల్లం) నోట వివరాలు తెలుసుకున్న వర్కా...., "ఏ దైవం ఆధీనంలోనైతే నా ప్రాణం ఉందో, ఆ దైవం సాక్షి! మీరు ఈ ఉమ్మత్ కు (సమాజానికి) దైవప్రవక్త. మీ దగ్గరకు వచ్చిన వ్యక్తి, మూసా (అలైహి) వద్దకు వచ్చిన జిబ్రీలే (అలైహి) అని చెప్పారు.★

(★→ తిబ్రీ - 2/207; ఇబ్నె హష్షామ్ - 1/237,238. చివరి కొంత భాగాన్ని వివరించడం జరిగింది. ఈ ఉల్లేఖనం సరియైనదనడంలో మాకు కొంత సందేహం ఉంది. సహీ బుఖారి ఉల్లేఖనం సందర్భం గురించి, అనేక ఉల్లేఖనాలను సరిచూసిన పిదప మేము ఓ నిర్ణయానికి వచ్చాం. దాని ప్రకారం, మక్కా వైపునకు దైవప్రవక్త (సల్లం), దైవవాణి అవతరణ రోజే తిరిగివచ్చి "వర్కా" ను కలిశారు, మిగిలిపోయిన కాలాన్ని హిరాకు వెళ్ళి పూర్తి చేశారన్నది.)

 _Insha Allah రేపటి భాగములో దైవవాణి నిలిచిపోవడం, దైవవాణి రకాల గురించి తెలుసుకుందాము._ 

✍🏻✍🏻     *®@£€€q* *+97433572282*      ✍🏻✍🏻
                    *(rafeeq)* 

✍🏻✍🏻      *Salman*       *+919700067779* ✍🏻✍🏻


🤚🏻✋🏻 *సుబహానక అల్లాహుమ్మ వ బి హమ్దిక, అష్హదు అన్ లా ఇలాహ ఇల్లా అన్త, అస్తగ్ ఫిరుక వ అతూబు ఇలైక​​* 

💎 *వ ఆఖిరుద్దావానా 'అనిల్ హమ్దు లిల్లాహి రబ్బిల్ 'ఆలమీన్.​​* 💎

​🤚🏻✋🏻 *అల్లాహ్ సుబహానహు వత'ఆలా మనందరికీ కేవలం ఖుర్'ఆన్, సున్నత్ ప్రకారంగా నిజమైన ఇస్లాం జ్ఞానాన్ని మరియు సద్బుద్ధిని ప్రసాదించి మన ఆఖరి శ్వాస వరకూ పవిత్రమైన ఇస్లాం ధర్మంపై స్థిరంగా ఉంచాలని "అల్లాహ్" ను అర్థిస్తున్నాను.​​* 

​​ 🛡 *దయచేసి చదవండి, అర్థం చేసుకోండి, ఆచరించండి. మరియు ప్రతీ ముస్లిం సోదర, సోదరీమణులందరికీ share చేయండి.* 🛡

No comments:

Post a Comment