111

☪☪☪       *బిస్మిల్లాహ్ హిర్రహ్మా నిర్రహీమ్*        ☪☪☪

🕋🕋   *అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు*   🕋🕋
🕋🕋     *అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను*      🕋🕋

●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●

🛐🛐🛐             *ఇస్లాం చరిత్ర* *- 111*             🛐🛐🛐

🇸🇦🇸🇦🇸🇦 *ముహమ్మద్ (సల్లం) జీవితచరిత్ర - 26* 🇸🇦🇸🇦🇸🇦 
◆◇◆◇◆◇◆◇◆◇◆◇◆◇◆◇◆◇◆◇◆◇◆◇◆◇◆◇◆◇◆◇◆◇◆

 *దైవదౌత్యానికి పూర్వపు సంగ్రహ జీవితం* 

దైవప్రవక్త (సల్లం) గారిలో, వివిధ వర్గాలకు చెందిన గొప్పవారి సుగుణాలన్నీ కలగలిపిపోసిన ప్రతిరూపం అనడం సమంజసం. ఆయన (సల్లం) ఆలోచనా పటుత్వం, దూరదృష్టి, సత్యసంధతకు మారు పేరు. ఆయన (సల్లం) కు చురుకైన బుద్ధికుశలత ధృడచిత్తం, లక్ష్యసాధనా ధైర్యం లాంటి సుగుణాలు అధికంగానే అబ్బాయి. తన సుదీర్ఘ మౌనం ద్వారా, ఆలోచనా లోతుల్లోనికి వెళ్ళి శాశ్వత పరిష్కారాన్ని, సత్యాన్ని అన్వేషించే ప్రయత్నం చేసేవారు.

దైవప్రవక్త (సల్లం) తన చురుకైన బుద్ధికుశలత, సహజ ధోరణి ద్వారా జీవిత పరమార్థాన్ని, ప్రజల వ్యవహారాలను, సమాజాల స్థితిగతులను అధ్యయనం చేశారు. ఏ మూఢాచారాల్లో ఈ జాతులు నిండా మునిగి ఉండేవో వాటి ఎడల వెగటును కూడా ప్రదర్శించేవారు. కాబట్టి ఆయన (సల్లం) వీటన్నిటికి దూరంగా ఉంటూ పూర్తి స్పూర్తితో ప్రజల నడుమ జీవితం గడిపారు. అంటే, ప్రజలు ఆచరించే సత్కార్యాలలో పాలుపంచుకుంటూ, ఇతర అర్థంలేని పనులకు దూరంగా ఉండి తన ఏకాంతం వైపునకు మరలేవారు. కాబట్టి ఆయన (సల్లం) మద్యాన్ని ముట్టలేదు, దైవేతరులు సంతుష్టి కోసం బలి చేసిన పశువుల మాంసాన్ని తినలేదు. విగ్రహాల కోసం చేసే జాతరలలో, పండుగలలో ఎన్నడూ పాల్గొనలేదు.

ఆయన (సల్లం) కు మొదటి నుండే ఈ అసత్య దేవతల ఎడల కలిగిన అసహ్యం, వెగటు మరే విషయంలోనూ కలుగలేదు. చివరికి లాత్, ఉజ్జాల పేరున వేసుకునే ఒట్టు, ప్రమాణం గురించి పలికిన పలుకులు వినడం కూడా ఆయన (సల్లం) కు గిట్టేది కాదు.

విధాత సంరక్షణ ఆయన (సల్లం) ను ఎల్లవేళలా కాపాడుతూ వచ్చిందనడంలో సందేహం ఏ మాత్రం లేదు. ప్రాపంచిక వ్యసనాలలో చిక్కుకోవడానికి మనస్సు ఆయన ప్రోత్సహించినప్పుడల్లా, లేదా కొన్ని దూరాచారాల వైపునకు ఆయన మనస్సు లాగినప్పుడల్లా దైవకటాక్షం అడ్డొచ్చి ఆయన్ను అటు వైపునకు మరలకుండా చేసేది.

 *●ఇబ్నె అసీర్ ఉల్లేఖనం ప్రకారం దైవప్రవక్త (సల్లం) గారి ప్రవచనం ఇలా ఉంది: ↓* 

అజ్ఞాన అరబ్బుల కార్యకలాపాల్లో రెండు సార్లు తప్ప నా మనస్సు అటు వాలలేదు. కాని అల్లాహ్ నన్ను, దైవదౌత్య గౌరవం లభించేటంత వరకు, ఆ రెండు సందర్బాలు తప్ప అలాంటి తలంపు కలగనీయలేదు. ఆ సంఘటనల వివారాలేమిటంటే, ఎగువ మక్కాలో నాతో కలిసి మేకలు కాసే ఓ కుర్రవానితో, నా మేకల్ని చూస్తూ ఉండు, నేను వెళ్ళి ఇతర యువకుల్లా అక్కడ రాత్రి జరిగే కథలు చెప్పే కార్యక్రమంలో పాల్గొంటాను అని చెప్పి బయలుదేరాను. కొంత దూరం వెళ్ళిన తరువాత మక్కాలోని మొదటి గృహం నుండే నాకు సంగీతం వినిపించింది. అదేమిటని కొందరిని అడగగా, ఫలానా వారి పెండ్లి జరుగుతోంది అని చెప్పారు. నేనక్కడనే సంగీతం వినడానికి కూర్చున్నాను. అల్లాహ్ నా చెవులను మూసివేశాడు. నేను నిదుర ఒడిలో ఒరిగి పోయాను. పొద్దు ఎక్కగా ఎండా వేడిమికి నాకు మెలుకువ వచ్చింది. తిరిగి నేను నా మిత్రుని వద్దకు వెళ్ళిపోయాను. అతను వివరాలు అడగగా నేను విషయాన్నంతా చెప్పేశాను. ఆ తరువాత మరో రాత్రి ఈ మాటే చెప్పి నేను మరలా మక్కా వెళ్ళాను. ఆ రాత్రి కూడా అదే సంఘటన ఎదురయింది. ఆ తరువాత నాకు ఎన్నడూ తప్పుడు మార్గం వైపునకు వెళ్ళే తలంపు కలుగలేదు.●

 _(↑ ఈ హదీసును హాకిమ్ జహబీ ప్రామాణికమైన హదీసుగా చెబుతారు. కాని ఇబ్నె కసీర్ అల్ బదాయా వన్నహాయా - 2/287 లో ఇది బలహీన హదీసు అని ఉంది.)_ 

దైవప్రవక్త (సల్లం) ఆయన జాతిలోనే ఉత్తమ నడవడి, మహోన్నత నైతిక విలువలు, దాతృత్వ గుణాల రీత్యా అందరికంటే మిన్న. కాబట్టి ఆయన (సల్లం) అందరికంటే అధికంగా మానవత్వంలోను, సభ్యతాసంస్కారాల్లోను ముందుండేవారు. మంచి పోరుగువానిగా, దూరదృష్టి గలవానిగా, అందరికంటే మిన్నయిన సత్యసంధునిగా, పరిశుద్ధ మనస్కునిగా, దాతగా అలరారినవారు. జాతిలోకెల్లా సద్వర్తనుడూ, మాటను నిలుపుకునేవాడూ, అమానతులను అప్పగించేవాడు ఆయన (సల్లం) కంటే మరెవ్వరూ లేరు. జాతి ఆయన్ను “అమీన్” (అమానతుదారు లేదా అప్పగింతల రక్షకుడు) గా పిలిచేది. హజ్రత్ ఆయిషా (రజి) గారి ఉల్లేఖనం ప్రకారం, ఆయన (సల్లం), వ్యాధిగ్రస్తులు, ఆపదల్లో చిక్కుకున్న వారికి బాసటగా నిలిచేవారు. నిరుపేదలకు సహాయం చేసేవారు. అతిథిని సత్కరించేవారు. సత్యమార్గంలో కష్టాలపాలైన వారికి సహాయమందించే వారు.

మిగిలినది Insha Allah రేపటి భాగములో తెలుసుకుందాము

🖊🖊     ®@£€€q +97433572282      🖊🖊
                    (rafeeq)

🖊🖊      Salman       +919700067779 🖊🖊

*Note : - ఈ msg లను ముందుకు పంపిస్తూ, మన ఇస్లాం చరిత్ర గురించి మన ముస్లిం సోదరులకు, సోదరీమణులకు తెలియజేస్తారని ఆశిస్తున్నాము.*

No comments:

Post a Comment