110

☪☪☪       *బిస్మిల్లాహ్ హిర్రహ్మా నిర్రహీమ్*        ☪☪☪

🕋🕋   *అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు*   🕋🕋
🕋🕋     *అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను*      🕋🕋

●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●

🛐🛐🛐             *ఇస్లాం చరిత్ర* *- 110*             🛐🛐🛐

🇸🇦🇸🇦🇸🇦 *ముహమ్మద్ (సల్లం) జీవితచరిత్ర - 25* 🇸🇦🇸🇦🇸🇦 
◆◇◆◇◆◇◆◇◆◇◆◇◆◇◆◇◆◇◆◇◆◇◆◇◆◇◆◇◆◇◆◇◆◇◆

 *పురివిప్పిన కరువు రక్కసి* 

కాలం మెల్లగా సాగిపోతుంది. మహనీయ ముహమ్మద్ (సల్లం) ముప్పయి ఏడవ ఏట అడుగుపెట్టారు. వేసవి తాపంతో జనం సతమతమవుతున్నారు. పచ్చని చెట్లు మలమల మాడిపోతున్నాయి. కుంటలు, చెరువులు ఎండిపోతున్నాయి. దైనందిన వ్యాపార లావాదేవీలు కుంటుపడి పోతున్నాయి. కరువు రక్కసి కరాళనృత్యం చేస్తుంది.

గంపెడు పిల్లలతో ముందే సంసారం ఈదలేక సతమతమవుతున్న (ముహమ్మద్ (సల్లం) పెదనాన్న) అబూ తాలిబ్ ని ఈ కరువు మరింత కృంగదీసింది. ముహమ్మద్ (సల్లం) తన పెదనాన్న పడుతున్న కష్టాలు చూసి తల్లడిల్లిపోయారు. ఆయన ఓ రోజు పిన తండ్రి అబ్బాస్ ని కలుసుకుని ఇలా అన్నారు....,

ముహమ్మద్ (సల్లం) : - బాబాయ్! అబూ తాలిబ్ పెదనాన్న సంసారం రోజు రోజుకు చితికిపోతోంది. మనం చూస్తూ ఎలా ఉండగలం? మనిద్దరం ఆయన సంతానంలో ఇద్దరు పిల్లల్ని మన సంరక్షణలోకి తీసుకుంటే బాగుంటుంది. దానివల్ల ఆయనకు కొంతైనా భారం తగ్గిపోతుంది.

అబ్బాస్ : - సరే, అలాగే తీసుకుందాం. ఇలాంటి పరిస్థితిలో మనం కాకపొతే మరెవరు ఆయన్ని ఆదుకుంటారు? తప్పకుండా తీసుకుందాం.

ఆ తర్వాత వారిద్దరూ అబూ తాలిబ్ దగ్గరకు పోయి ఈ విషయం ఆయనకు చెప్పారు. అబూ తాలిబ్ సంతోషంతో...., “మీరు కోరుకున్న వాళ్ళను తీసుకెళ్ళండి” అన్నారు.

అప్పుడు అబ్బాస్, జాఫర్ ని తన సంరక్షణలోకి తీసుకున్నాడు. ముహమ్మద్ మహనీయుని (సల్లం) సంరక్షణలోకి అయిదేళ్ళ అలి వచ్చాడు.

ఇప్పుడు ముహమ్మద్ (సల్లం) దంపతులు అలి, జైద్ లకు కూడా తల్లితండ్రులయిపోయారు. ముహమ్మద్ (సల్లం) జీవితంలో మరో రెండేళ్ళు గడచిపోయాయి. ఆ కాలంలో అబ్దుల్లా అనే ఓ బాబు పుట్టాడు. కాని కొన్నాళ్ళకే ఆ బాబు కూడా చనిపోయాడు. ఆ పిల్లవాడికి తయ్యిబ్, తాహిర్ అనే పేర్లు కూడా ఉన్నాయి.

ఆ తర్వాత కొన్నాళ్ళకు ఓ పాప పుట్టి, తల్లితండ్రులకు అబ్దుల్లా మిగిల్చిపోయిన దుఃఖాన్ని దూరం చేసింది. ఆ పాపకు "ఫాతీమా" అని పేరు పెట్టారు. ఫాతీమా అంటే ముహమ్మద్ (సల్లం) కు ఎనలేని ప్రేమ. 

రోజులు, నెలలు గడచిపోతున్నాయి. ముహమ్మద్(సల్లం) నలభయ్యో వడిలో పడ్డారు. ఆయన ఎప్పటిలాగే అనాథలకు ఆశ్రయమిస్తూ, తోటి మనుషుల కష్టాలలో పాలుపంచుకుంటూ, లోక కల్యాణం, మానవ మోక్షాల కోసం అహో రాత్రులు ఆలోచిస్తూ పవిత్ర జీవితం గడుపుతున్నారు. సత్యాన్వేషణలో ఆయన తరచుగా హీరా కొండ గుహకెళ్ళి దైవధ్యానంలో నిమగ్నులయ్యేవారు. అప్పుడప్పుడు భార్యా పిల్లలు వచ్చి ఆయన్ను చూసి పోయేవారు, వారు ఆయన కోసం అన్నం, నీళ్ళు తెచ్చిపెట్టి వెళ్ళిపోయేవారు.

హజ్రత్ ఖదీజా ఇళ్ళు నలుగురు ఆడపిల్లలు, ఇద్దరు మగపిల్లలు అలి, జైద్ లతో పాటు బానిసలు, దాసీలతో కళకళలాడుతూ ఉంది. అప్పుడప్పుడు బంధువులు వచ్చిపోతుంటారు. ఓ రోజు ఖదీజా చెల్లెలు "హాలా" వచ్చి పిల్లలకు పెళ్ళిళ్ళు చేసే విషయమయి ప్రస్తావించింది. అరబ్ సంప్రదాయం ప్రకారం ఆడపిల్లలకు లేతవయస్సులోనే పెళ్ళిళ్ళు చేస్తారు. దాని ప్రకారం "జైనబ్" తొమ్మిదేళ్ళ పిల్లే అయినప్పటికీ ఆమెను తన కొడుక్కు ఇచ్చి పెళ్లి చేయమని "హాలా" అడిగింది.

ఖదీజా శ్రీవారిని సంప్రదించి "జైనబ్" ని "హాలా" కొడుకు "అబుల్ ఆస్ బిన్ ఉమయ్యా" కు ఇవ్వడానికి సిద్దమయ్యారు. ఈ విధంగా జైనబ్, అబుల్ ఆస్ ల వివాహం జరిగింది.

వలీమా విందులో "రుఖియా", "ఉమ్మెకుల్సూమ్" ల ప్రస్తావన కూడా వచ్చింది. ముహమ్మద్ (సల్లం) పెదనాన్న "అబూ లహాబ్" ఆ ఇద్దరు బాలికల్ని తన కొడుకులు "ఉత్బా", "ఉతైబా" లకు ఇవ్వమని అడిగాడు. 

ఇలా "జైనబ్" పెళ్ళయిన కొన్నాళ్ళకే ఎనిమిదేండ్ల "ఉమ్మెకుల్సూమ్", "రుఖియా" ల పెళ్ళిళ్ళు జరిగిపోయాయి. ఇప్పుడు ఖదీజా ఇంట్లో చిన్నారి "ఫాతీమా" మాత్రమే ఆమె సంతానంగా మిగిలి ఉంది. ఆ పాపతో పాటు పదేళ్ళ అలి, నవయువకుడైన జైద్ కూడా వున్నారు.

 *Insha Allah రేపటి భాగము నుండి, దైవదౌత్యానికి దగ్గరలో మహానీయ ముహమ్మద్ (సల్లం) జీవితం....,* 

🖊🖊     ®@£€€q +97433572282      🖊🖊
                    (rafeeq)

🖊🖊      Salman       +919700067779 🖊🖊

*Note : - ఈ msg లను ముందుకు పంపిస్తూ, మన ఇస్లాం చరిత్ర గురించి మన ముస్లిం సోదరులకు, సోదరీమణులకు తెలియజేస్తారని ఆశిస్తున్నాము.*

No comments:

Post a Comment