109

☪☪☪       *బిస్మిల్లాహ్ హిర్రహ్మా నిర్రహీమ్*        ☪☪☪

🕋🕋   *అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు*   🕋🕋
🕋🕋     *అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను*      🕋🕋

●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●

🛐🛐🛐             *ఇస్లాం చరిత్ర* *- 109*             🛐🛐🛐

🇸🇦🇸🇦🇸🇦 *ముహమ్మద్ (సల్లం) జీవితచరిత్ర - 24* 🇸🇦🇸🇦🇸🇦 
◆◇◆◇◆◇◆◇◆◇◆◇◆◇◆◇◆◇◆◇◆◇◆◇◆◇◆◇◆◇◆◇◆◇◆

          *హజ్రె అస్వద్ వివాద పరిష్కారం* 

 *"హజ్రె అస్వద్" ప్రతిష్టించే గౌరవం, ఔన్నత్యం తమకే దక్కాలని, తెగల మధ్య వివాదం జరుగుతున్న సందర్భం : -* 

"అబూ ఉమయ్యా మగ్జూమీ" అనే వృద్ధుడు ఈ వివాదానికి పరిష్కార మార్గాన్ని చూపెట్టాడు. దాని ప్రకారం "మస్జిదే హరామ్" ద్వారం నుండి ఏ వ్యక్తి అయితే మొదట ప్రవేశిస్తాడో అతణ్ణి తమ వివాదానికి పరిష్కర్తగా చేసుకోవాలని సలహా ఇచ్చాడు. అందరూ ఈ సలహాను శిరసావహించారు. దైవలీల ఏమిటోగాని, ఆ సలహా తరువాత మొట్టమొదటగా దైవప్రవక్త ముహమ్మద్ (సల్లం) గారే ఆ ద్వారం గుండా లోనికి ప్రవేశించారు. ప్రజలు ఆయన (సల్లం) ను చూడగానే...., "ఓహో! ఈయన ముహమ్మద్ (సల్లం). ఈయన అమానతుదారుడు అమీన్. మేము ఆయన చెప్పినట్లుగానే నడుచుకుంటాము." అని ముక్తకంఠంతో అరిచారు.

సత్యసంథుడైన ముహమ్మద్ (సల్లం) పట్ల జనానికి ఎంత నమ్మకం! ఆయన (సల్లం) లోపలి వచ్చి, విషయం ఏమిటో తెలియక ప్రజల వైపు ప్రశ్నార్థకంగా చూడసాగారు.

ఖురైష్ నాయకులు, "హజ్రె అస్వద్" ను ప్రతిష్టచడంలో తలెత్తిన వివాదం వివరాలు వివరించి తీర్పు చెప్పమని ముహమ్మద్ (సల్లం) ను అడిగారు.

ముహమ్మద్ (సల్లం) ఓ దుప్పటిని తెప్పించి, ఆ దుప్పటిని నెల మీద పరచి మధ్యలో "హజ్రె అస్వద్" ను ఉంచారు. వాదులాడుతున్న సర్దారులందరినీ పిలిచి, "మీరంతా దుప్పటి అంచుల్ని పట్టి పైకి ఎత్తండి" అని ముహమ్మద్ (సల్లం), వారిని కోరారు. అందరూ ఆయన (సల్లం) చెప్పినట్లుగానే దుప్పటిని పైకి ఎత్తారు. దుప్పటి, హజ్రె అస్వద్ (ను ప్రతిష్టించాల్సిన) స్థానం వరకు లేవగానే, దైవప్రవక్త (సల్లం) తన చేతుల మీదుగా "హజ్రె అస్వద్" ను దాని స్థానంలో ఉంచేశారు. ఈ తీర్పు ఎంతో సమంజసమైన తీర్పు. జాతి అంతా దాన్ని స్వీకరించింది, గౌరవించింది.

ఈ న్యాయనిర్ణయం, సమయస్ఫూర్తి చూసి అందరూ ఎంతో అబ్బురపడ్డారు. ఆయన (సల్లం) ను ఎంతగానో ప్రశంసించారు. గంట క్రితం ఘోర రక్తపాతానికి దారి తీస్తుంది అనుకున్న సమస్య ఇలా ప్రశాంతంగా పరిష్కారమయింది. అమీన్ చూపిన ఉపాయం వల్ల అంతః కలహం ఆరంభములోనే అంతరించినందుకు అందరూ ఎంతో ఆనందించారు.

(ఇటు ఖురేషీయులకు ధర్మసమ్మతమైన డబ్బు సరిపోలేదు. అందుకని వారు ఉత్తరాన కాబా నిడివిలో దాదాపు ఆరు మూరల పొడవును తగ్గించాల్సి వచ్చింది. కాబా గృహపు మిగిలిపోయిన ఈ స్థల భాగం "హిజ్ర్" మరియు "హతీమ్" గా పిలువబడుతోంది.

కాబాలో ప్రతివాడు ప్రవేశించకుండా, కేవలం అనుమతి పొందినవాడే ప్రవేశించాలనే ఉద్దేశ్యంతో, ఈ సారి నిర్మాణ సమయంలో కాబా గృహ ద్వారాన్ని భూమికి కొంత ఎత్తున కట్టారు. కాబా గృహపు గోడ ఎత్తు పదిహేను మూరలు అయిన తరువాత లోపల ఆరు స్తంభాలు నిలబెట్టి పై నుండి కప్పు వేయడం జరిగింది. కాబా గృహం పూర్తి నిర్మాణదశకు చేరినప్పుడు దాదాపు నలుచదరంగా తయారయ్యింది.

"హజ్రె అస్వద్" ఉన్న గోడ దానికి ఎదురుగా ఉన్న గోడ అంటే దక్షిణ, ఉత్తర కుడ్యాల పొడవు పదేసి మీటర్లు. "హజ్రె అస్వద్" ప్రదక్షిణ చేసే నేలకు ఒకటిన్నర మీటర్ల ఎత్తున ఉంది. ద్వారం ఉన్న గోడ, దానికి ఎదురుగా ఉన్న గోడ అంటే తూర్పు పడమరల గోడల పొడవు పన్నెండేసి మీటర్లు. ద్వారం భూమికి రెండు మీటర్ల ఎత్తున ఉంది. గోడల చుట్టూ, క్రింది భాగంలో, చుట్టూ ఉన్న పీఠం సరాసరి ఎత్తు ఇరవై ఐదు సెంటీమీటర్లు, సరాసరి వెడల్పు ముప్పై సెంటీమీటర్లు. దీన్నే "షాజె రవాన్" అంటారు. ఇది కూడా దైవగృహంలోని భాగమే. అయితే ఖురైష్ (తెగ వారు) దాన్ని కట్టకుండా వదిలేశారు.)

ఆ తరువాత కాబా పునర్నిర్మాణం కొద్ది రోజుల్లోనే ముగిసింది. అప్పటికి అమీన్ (ముహమ్మద్ (సల్లం)) జీవితంలో ముప్పయి అయిదు వసంతాలు గడచిపోయాయి.

సహీ బుఖారి గ్రంథంలో హజ్రత్ జాబిర్ బిన్ అబ్దుల్లాహ్ ఉల్లేఖనం ప్రకారం, కాబా గృహం నిర్మించేటప్పుడు, దైవప్రవక్త (సల్లం) మరియు హజ్రత్ అబ్బాస్ రాళ్ళు మోస్తున్నారు. హజ్రత్ అబ్బాస్ దైవప్రవక్త (సల్లం) తో, మీ లుంగీ తీసి భుజం మీద పెట్టుకోండి. రాళ్ళు ఒత్తుకోకుండా ఉంటాయి అన్నారు. అయితే దైవప్రవక్త (సల్లం) భూమ్మీద పడిపోయారు. చూపులు ఆకాశం వైపునకు ఉన్నాయి. స్పృహ వచ్చిన వెంటనే నా లుంగీ, నా లుంగీ అని అరవనారంభించారు. ఆయన లుంగీ వెంటనే కట్టడం జరిగింది. మరో ఉల్లేఖనంలో, ఆ తరువాత ఆయన మర్మాంగం ఎన్నడూ అగుపడలేదు అని ఉంది.

మిగిలినది Insha Allah రేపటి భాగములో తెలుసుకుందాము.

🖊🖊     ®@£€€q +97433572282      🖊🖊
                    (rafeeq)

🖊🖊      Salman       +919700067779 🖊🖊

*Note : - ఈ msg లను ముందుకు పంపిస్తూ, మన ఇస్లాం చరిత్ర గురించి మన ముస్లిం సోదరులకు, సోదరీమణులకు తెలియజేస్తారని ఆశిస్తున్నాము.*

No comments:

Post a Comment