108

☪☪☪       *బిస్మిల్లాహ్ హిర్రహ్మా నిర్రహీమ్*        ☪☪☪

🕋🕋   *అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు*   🕋🕋
🕋🕋     *అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను*      🕋🕋

●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●

🛐🛐🛐             *ఇస్లాం చరిత్ర* *- 108*             🛐🛐🛐

🇸🇦🇸🇦🇸🇦 *ముహమ్మద్ (సల్లం) జీవితచరిత్ర - 23* 🇸🇦🇸🇦🇸🇦 
◆◇◆◇◆◇◆◇◆◇◆◇◆◇◆◇◆◇◆◇◆◇◆◇◆◇◆◇◆◇◆◇◆◇◆

         🕋🕋 *కాబా పునర్నిర్మాణం* 🕋🕋

ఖురైష్ తెగవారు, కాబా గృహ పునర్నిర్మాణాన్ని ప్రారంభించిన రోజులవి. అప్పుడు మహాప్రవక్త ముహమ్మద్ (సల్లం) కు ముప్ఫై అయిదు సంవత్సరాల వయస్సు.

కాబా పునర్నిర్మాణానికి కారణం ఇది. అప్పటికి కాబా గృహం కేవలం కొంచెం ఎత్తుగల నాలుగు గోడలతో నలుచదరంగా ఉండేది. హజ్రత్ ఇస్మాయిల్ (అలైహి) కాలం నుండే కాబా ఎత్తు తొమ్మిది మూరలు. దాని పైకప్పు లేదు. ఈ పరిస్థితిని ఆసరాగా చేసుకుని కొందరు దొంగలు అందులో దాచి పెట్టిన ధనాన్ని దోచుకోవడం జరిగింది.

ఈ కారణమే కాకుండా కాబా నిర్మాణం జరిగి చాలా కాలం అయ్యింది. కట్టడం బలహీనంగా కూడా అయ్యింది. గోడల్లో పగుళ్లు కనిపిస్తున్నాయి. ఆ సంవత్సరమే పెద్ద వరదలు వచ్చాయి. వరదల ప్రభావం కాబా గృహం వైపే ఉండడం వల్ల అది ఏ క్షణాన్నయినా కూలిపోయే ప్రమాదం ఏర్పడింది. అందుకుని ఖురైష్ తెగవారు, కాబా హోదాను, పవిత్రతను కాపాడాలనే ఉద్దేశ్యంతో కాబాను తిరిగి నిర్మించడానికి పూనుకున్నారు.

 *కాబా పునర్నిర్మాణానికి గల కారణాలలోని మరింత వివరణ : -* 

ఓ రోజు నిర్మలంగా ఉన్న ఆకాశం క్రమంగా మేఘావృతమయింది. ఉన్నట్లుండి రివ్వున గాలి వీచింది. ఆ వెనువెంటనే పెళపెళమంటూ పిడుగు పడినంత భీకర గర్జన.

ఆ తర్వాత కాస్సేపటికే చల్లటి గాలులతో చిటపట చినుకులు మొదలయ్యాయి. చూస్తుండగానే అది కాస్త ఉధృతమై భారీ వర్షం కురవసాగింది. చెవులు చిల్లులు పడే ఉరుములు! కళ్ళు మిరుమిట్లు గొలిపే మెరుపులు!! సూదుల్లా గుచ్చుకునే వర్షపు ధారలు!!! ఏకధాటిగా వర్షం కురుస్తుంది! ఎడాపెడా జల్లులతో ఎడతెరపి లేకుండా కురుస్తోంది!!! వీధులు కాలువలై ప్రవహిస్తున్నాయి. వర్షం! వర్షం! వర్షం ఇంకా కురుస్తూనే ఉంది. ఆకాశం ఎక్కడికక్కడ చిల్లులు పడినట్లు కుండపోతగా కురుస్తూనే ఉంది.

ఘడియలు, గంటలు దొర్లిపోతున్నాయి. పూటలు, రోజులు కూడా గడచిపోతున్నాయి. కాని వర్షం వెలిసే సూచనలు కానరావడం లేదు. మక్కా ప్రజలు ఎవరి ఇళ్ళలో వారు నిర్భంధంగా ఉండిపోయి నింగికేసి వింతగా చూడసాగారు. ఈ ముసురులో సూర్యుడు ఎప్పుడు ఉదయిస్తున్నాడో, ఎప్పుడు అస్తమిస్తున్నాడో తెలియడం లేదు. వర్షం! వర్షం!! ఒకటే వర్షం!!! కష్టజీవులకు కష్టపడకుండానే కష్టం అనుభవించే పరిస్థితి ఏర్పడింది.

ఎడతెరపి లేకుండా భోరున వర్షం కురుస్తూనే ఉంది. ఒంటెలు, మేకలు అల్లాడిపోతున్నాయి. వర్షపు నీటికి గుంటలు, గోతులు నిండి పొర్లుతున్నాయి. వీధుల్లో వరద నీళ్ళు పరవళ్ళు తొక్కుతున్నాయి. నానిన గోడలు నేలబారుగా పడిపోతున్నాయి. కారుతున్న ఇండ్ల కప్పులు కుప్పకూలిపోతున్నాయి.

ప్రజలు భయాందోళనలతో తమ ఇష్ట దేవతలను వేడుకుంటున్నారు. అయినా వర్షం తగ్గలేదు. సరికదా, ప్రకృతి మరింత ప్రకోపించింది. గుండెలు పగిలిపోయే ఉరుములతో వర్షం వీరప్రతాపం ప్రదర్శిస్తోంది.

అలా ఎలా ఎన్ని రోజులు గడిచాయో కాని వర్షం వెలిసేటప్పటికి (నిలిచిపోయేటప్పటికి) మక్కా పట్టణం, ఓ పెద్ద చెరువులో తేలుతున్నట్లు కనిపించింది. రెండు మూడు రోజుల తరువాత వరద నీరు క్రమంగా తగ్గిపోయింది. ప్రజలు బయటకి వచ్చి చూస్తే పడిపోయిన ఇళ్ళతో, గోతులు పడ్డ వీధులతో పట్టణం భీభత్సంగా తయారయి ఉంది.

ఈ వరద తాకిడికి కాబా మందిరం కూడా గురయింది. దాని గోడలు బీటలు వారాయి. కొన్ని గోడలు పూర్తిగా పడిపోయాయి. “హజ్రే అస్వద్ (నల్లరాయి)” కూడా గోడలో నుంచి జారి కింద పడిపోయింది. కాబా దుస్థితి చూసి మక్కా వాసులు తల్లడిల్లిపోయారు. కాబా వారి సర్వస్వం. వారికి ముఖ్యమైన ఆరాధనాలయం. కాబా దర్శనం కోసం సుదూర ప్రాంతాల నుంచి కూడా ప్రజలు వస్తుంటారు. దానివల్ల మక్కావాసులకు వ్యాపారాభివృద్ది కలుగుతుంది. అదీకాక కాబా వల్ల, యావత్తు అరేబియాలో వారికి అమితమయిన గౌరవ ప్రతిష్ఠలు కూడా లభిస్తుంటాయి. అందుకే వారు కాబా మందిరం వరద తాకిడికి శిథిలమైపోవటం చూసి ఎంతో ఆందోళన చెందారు.

ఓ రోజు పట్టణ ప్రముఖులంతా సమావేశమయి పరిస్థితి సమీక్షించారు. చివరికి దైవ గృహాన్ని పునర్నిర్మించాలి అందరూ ఏకగ్రీవంగా తీర్మానించారు.

ఈ దశలో ఖురైష్ తెగవారు, కాబా గృహ నిర్మాణంలో కేవలం ధర్మ సమ్మతమైన డబ్బునే వాడాలని, దీనికి వ్యభిచారం నుండి వసూలైన సొమ్ము గాని, వడ్డీ ద్వారా లభించిన డబ్బు గాని, ఒకరి హక్కును కొల్లగొట్టి సంపాదించిన ధనాన్ని గాని వాడరాదని ఏకగ్రీవంగా తీర్మానించుకున్నారు.

అయితే పునర్నిర్మాణానికి ముందు పాత కట్టడాన్ని పడగొట్టాలి, అమ్మో! దైవ గృహాన్ని పడగొట్టడమే!! అంతా కంపించిపోయారు. గునపం తగిలితే ఏ పాపం చుట్టుకుంటుందోనని అందరూ భయపడిపోయారు. పైగా గతంలో ఓ సారి "అబ్రహా" రాజు కాబాను నేలమట్టం చేయటానికి వస్తే దైవశిక్ష విరుచుకుపడి సర్వనాశనమయ్యాడు. అంచేత దైవగృహాన్ని కూలగొడితే ఏ ఆపద వచ్చి పడుతుందోనని అందరూ భయపడసాగారు.

కాని కాబా గోడలు పూర్తిగా బీటలు వారాయి. ఏ క్షణంలోనైనా అది సమూలంగా కూలిపోవచ్చు. అందుకని ఎలాగైనా దాన్ని పడగొట్టి పునర్నిర్మించాలనే నిర్ణయానికి వచ్చారు. కొత్త పునాదులతో సరికొత్త కట్టడం నిర్మించాలి. మరి అనుభవశాలురైన మేస్త్రీలు, నిర్మాణ నిపుణులు కావద్దూ? కప్పు వేయాలంటే సామగ్రి కూడా కావాలాయె. ఎలా? 

విధివశాత్తు ఆ రోజుల్లోనే నిర్మాణ సామాగ్రి మోసుకెళ్తున్న ఓడ ఒకటి ఈజిప్టు నుండి అబిసీనియాకు బయలుదేరింది. అది "జిద్దా" వద్ద రేవుకు ఢీకొని బాగా దెబ్బతిన్నది. ఓడలోని వ్యాపార సామానంతా రేవుకు చేర్చి, మరో ఓడ వస్తే తిరిగి ప్రయాణమవుదామని భావించి ఎదురు చూస్తున్నాడు యజమాని.

మక్కా వారికి ఈ సమాచారం అందింది. వెంటనే వారు "జిద్దా" పోయి కాబా నిర్మాణం గురించి అతనికి తెలిపారు. అదృష్టవశాత్తు ఓడ యజమాని భవన నిర్మాణ నైపుణ్యం కూడా కలిగివున్నవాడు. కాబా నిర్మాణం అనగానే అతను సంతోషంతో సామాగ్రిని అమ్మడమే గాక, స్వయంగా తానూ నిర్మాణకార్యంలో సహకరించడానికి కూడా సమ్మతించాడు.

ఇక కాబా గోడలు పడగొట్టే సమయం వచ్చింది. ఈ ఆలోచనతో అందరు మరోసారి భయపడ్డారు. తీవ్రసందిగ్ధంలో పడిపోయారు. తమ సంకల్పం, కట్టడాన్ని పునర్నిర్మించాలన్నదే గాని, నాశనం చేయాలన్నది కాదు. ఈ ఆలోచన వారికి కొంత ధైర్యాన్ని ఇచ్చింది. అందువల్ల పాత కట్టడం పడగొట్టడానికి ముందుగా వారు పూజలు చేశారు. కానుకలు సమర్పించుకున్నారు. జంతుబలులు చేశారు. ఆ తరువాత "వలీద్" అనే ఒకతను ముందుకు వచ్చాడు. వణుకుతున్న చేతులతో గడ్డపార తీసుకున్నాడు. గుండె దిటవు చేసుకుని, నరాలు బిగబట్టి గడ్డపారతో ఒక స్తంభాన్ని పడగొట్టాడు.

ఇక చూడండి, అతనిపై ఏ ఆపద విరుచుకుపడుతుందోనని జనం భయపడుతూ ఊపిరి బిగపట్టి ఎదురుచూడసాగారు. అంతా నిశ్శబ్దం. కొన్ని క్షణాలు గడచిపోయాయి. ఉహూ, ఏమీ కాలేదు.

ఆ రాత్రి గడచింది. ఉదయభానుడు యథాప్రకారం మక్కా గగనతలంపైకి వచ్చాడు. కాని వలీద్ నిక్షేపంగానే ఉన్నాడు, దాంతో ప్రజల మనస్సులు కుదుటపడ్డాయి. ఇక అందరూ కలసి కాబా గోడలు పడగొట్టటం ప్రారంభించారు.

పాత గోడలు పడగొట్టటం పూర్తయ్యాక పునాదుల త్రవ్వకం మొదలయింది. పని చకచకా సాగిపోతోంది. పునర్నిర్మాణ పనిలో ముహమ్మద్ (సల్లం), అబూ తాలిబ్ లు కూడా పాల్గొన్నారు. ప్రజలు దగ్గరలో ఉన్న గుట్టల నుండి రాళ్ళు మోసుకొచ్చారు. చూస్తూ ఉండగానే కాబా గోడలు నిటారుగా లేచి నిల్చున్నాయి.

 *●మరొక ఉల్లేఖనం ప్రకారం : - ↓* 

(కాబా) పాత కట్టడాన్ని కూల్చడానికి ఎవరికీ ధైర్యం చాలడం లేదు. చివరికి "వలీద్ బిన్ ముగీరా మగ్జూమీ" అనే వ్యక్తి ఆ పనిని ప్రారంభించాడు. అతను ఎలాంటి దైవశిక్షకు గురి కాలేదని గ్రహించినవారు కూల్చడంలో అతనికి తోడ్పడ్డారు. అలా ఇబ్రాహీం (అలైహి) నిర్మించిన పునాదుల వరకు కూలుస్తూ వెళ్ళిన తరువాత అక్కడి నుండి కాబా గృహంను తిరిగి నిర్మించనారంభించారు. ఈ నిర్మాణ కార్యక్రమంలో ప్రతి తెగకు వారి పని అప్పగించబడింది. ప్రతి తెగ తమ వంతు రాళ్లను ప్రోగు చేసుకున్నారు. నిర్మాణం ప్రారంభం అయ్యింది. "బాకూమ్" అనే పేరుగల రోమన్ నిర్మాణ నిపుణుడు ఒకడు ఆ నిర్మాణాన్ని పర్యవేక్షిస్తున్నాడు.

కట్టడం గోడలు "హజ్రె అస్వద్ (నల్ల రాయి)" స్థానం వరకు లేవగానే, హజ్రె అస్వద్ ను స్థానంలో ప్రతిష్టించే గౌరవం, ఔన్నత్యం ఎవరికి దక్కాలనే వివాదం తలెత్తింది. ఈ వివాదం నాలుగయిదు రోజుల వరకు కొనసాగింది. క్రమంగా అది తీవ్ర రూపాన్ని దాల్చి హరమ్ (మక్కా) లాంటి పవిత్రస్థలంలో రక్తపాతం జరిగేటంత వరకూ వెళ్ళింది.●

ఆ తర్వాత కాబా గోడల్లో తూర్పు వైపున “నల్లరాయి” ని అమర్చే సమయం వచ్చింది. ఈ రాయికి అరబ్బులు ఎంతో ప్రాముఖ్యం ఇస్తారు. హజ్ ఆచారాల సందర్భంలో దీన్ని వారు ముద్దాడుతారు. కాబా ప్రదక్షిణం ఈ రాయి దగ్గర నుంచే ప్రారంభమవుతుంది. అందువల్ల ఈ రాయిని ఎవరు గోడలో అమర్చాలి, ఈ ఘనత ఎవరికి దక్కాలి అనే సమస్య వచ్చిపడింది. ప్రతి ఒక్కరు తనకే దాని పుణ్యం లభించాలని ఆశిస్తున్నారు. ప్రతి తెగా ఈ పుణ్యకార్యం చేసే హక్కు తనకే ఉందని భావిస్తుంది.

దీనిపై పెద్ద వివాదం చెలరేగింది. అది చిలికి చిలికి గాలి వానలా తయారయింది. ఎట్టి పరిస్థితులలోను ఆ అదృష్టాన్ని తానే దక్కించుకోవాలని ప్రతి వర్గం పట్టుబట్టింది. వాగ్విదాలు జరిగాయి. అదిలింపులు, బెదిరింపులు అయ్యాయి. పరిస్థితి అంతకంతకూ విషమిస్తూ పోయింది. ఏ ఒక్కరూ వెనక్కి తగ్గే సూచనలు కన్పించడం లేదు. అయిదు రోజులు గడచిపోయినా సమస్య ఓ కొలిక్కి రాలేదు. దానిపై పెద్ద రభస జరిగింది. చివరికి కొందరూ చెయ్యడమో, చావడమో తేల్చుకోవడానికి సిద్దమయ్యారు.

ప్రత్యర్థులు కూడా అందుకు నడుం బిగించారు. పరస్పరం సవాళ్ళు విసురుకున్నారు. పళ్ళు నూరారు. పిడికిళ్ళు బిగించారు, బుసలు కొట్టారు. కత్తులు దూశారు. అంతలో....,

“నాయనలారా! ఆగండి. గౌరవమర్యాదలు, నాయకత్వాల్లో మీరందరూ సమానులే. అనవసరంగా ఆవేశపడి కొట్లాడుకోకండి. కాస్త నా మాట వినండి.” అన్నాడు అబూ ఉమయ్య అనే వృద్దుడు.

"అబూ ఉమయ్య" ని అన్ని తెగలవారు ఎంతో గౌరవిస్తారు. అతని మాటను సాధారణంగా ఏ ఒక్కరూ తీసిపారేయరు. అందువల్ల అందరూ “సరే వింటాం చెప్పు” అంటూ అతని దగ్గరకు వచ్చారు.

“ఈ సమస్యకు ఒక్కటే పరిష్కారం. "సఫా" ద్వారం నుంచి మొట్టమొదట ఎవరైతే లోనికి ప్రవేశిస్తారో అతడ్ని మధ్యవర్తిగా స్వీకరించాలి. అతను ఎలా చెబితే అలా నడచుకోవాలి.” అన్నాడు అబూ ఉమయ్య.

ఈ సలహా అందరికీ నచ్చింది. సరేనంటూ ఆ వ్యక్తి కోసం వారు తీవ్రంగా ఎదురుచూడసాగారు. కాబా మందిరం చుట్టూ ఉన్న నాలుగు ప్రహరీ గోడలకు నాలుగు ముఖద్వారాలు ఉన్నాయి. అందులో సఫా ద్వారం పట్నం వైపు గాకుండా దానికి అభిముఖంగా కొండల వైపు ఉంది. అందువల్ల అందరి దృష్టి సఫా ద్వారం వైపు కేంద్రీకృతమయింది. 

కొంతసేపయ్యాక ఆ ద్వారం గుండా ఓ అందమైన యువకుడు లోనికి ప్రవేశించాడు. అతడ్ని చూడగానే అందరు సంతోషంతో ఒక్కసారిగా ఎలుగెత్తి అరిచారు;

“అమీన్! అమీన్!! ముహమ్మద్ (సల్లం) అమీన్ చెప్పే తీర్పు మాకందరికీ సమ్మతమే.”

 *●వేరొక ఉల్లేఖనం ప్రకారం : - ↓* 

"అబూ ఉమయ్యా మగ్జూమీ" అనే వృద్ధుడు ఈ వివాదానికి పరిష్కార మార్గాన్ని చూపెట్టాడు. దాని ప్రకారం "మస్జిదే హరామ్" ద్వారం నుండి ఏ వ్యక్తి అయితే మొదట ప్రవేశిస్తాడో అతణ్ణి తమ వివాదానికి పరిష్కర్తగా చేసుకోవాలని సలహా ఇచ్చాడు. అందరూ ఈ సలహాను శిరసావహించారు. దైవలీల ఏమిటోగాని, ఆ సలహా తరువాత మొట్టమొదటగా దైవప్రవక్త ముహమ్మద్ (సల్లం) గారే ఆ ద్వారం గుండా లోనికి ప్రవేశించారు. ప్రజలు ఆయన (సల్లం) ను చూడగానే...., "ఓహో! ఈయన ముహమ్మద్ (సల్లం). ఈయన అమానతుదారుడు అమీన్. మేము ఆయన చెప్పినట్లుగానే నడుచుకుంటాము." అని ముక్తకంఠంతో అరిచారు.●

సత్యసంథుడైన ముహమ్మద్ (సల్లం) పట్ల జనానికి ఎంత నమ్మకం! ఆయన (సల్లం) లోపలి వచ్చి, విషయం ఏమిటో తెలియక ప్రజల వైపు ప్రశ్నార్థకంగా చూడసాగారు.

ఖురైష్ నాయకులు, "హజ్రె అస్వద్" ను ప్రతిష్టచడంలో తలెత్తిన వివాదం వివరాలు వివరించి తీర్పు చెప్పమని ముహమ్మద్ (సల్లం) ను అడిగారు. 

ఈ వివాదానికి మహానీయ ముహమ్మద్ (సల్లం) చూపిన పరిష్కారం Insha Allah రేపటి భాగములో తెలుసుకుందాము.

🖊🖊     ®@£€€q +97433572282      🖊🖊
                    (rafeeq)

🖊🖊      Salman       +919700067779 🖊🖊

*Note : - ఈ msg లను ముందుకు పంపిస్తూ, మన ఇస్లాం చరిత్ర గురించి మన ముస్లిం సోదరులకు, సోదరీమణులకు తెలియజేస్తారని ఆశిస్తున్నాము.*

No comments:

Post a Comment