107

☪☪☪       *బిస్మిల్లాహ్ హిర్రహ్మా నిర్రహీమ్*        ☪☪☪

🕋🕋   *అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు*   🕋🕋
🕋🕋     *అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను*      🕋🕋

●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●

🛐🛐🛐             *ఇస్లాం చరిత్ర* *- 107*             🛐🛐🛐

🇸🇦🇸🇦🇸🇦 *ముహమ్మద్ (సల్లం) జీవితచరిత్ర - 22* 🇸🇦🇸🇦🇸🇦 
       *నిన్నటి భాగము - 21* 
◆◇◆◇◆◇◆◇◆◇◆◇◆◇◆◇◆◇◆◇◆◇◆◇◆◇◆◇◆◇◆◇◆◇◆

 *బానిస బాలుడు "జైద్" ని కుమారునిగా చేసుకున్న ముహమ్మద్ (సల్లం) : -* 

ముప్పయి రెండేళ్ళ ముహమ్మద్ (సల్లం) ఆలోచనా సరళి క్రమక్రమంగా ఒక ప్రస్ఫుట రూపు దిద్దుకోసాగింది. సృష్టి రహస్యాలను అర్థం చేసుకోవడానికి, తన చుట్టూ ప్రబలి ఉన్న వికృత ప్రపంచాన్ని తీర్చిదిద్దటానికి నిరంతరం ఆలోచిస్తూనే ఉన్నారు.

మక్కాకు ఆరు మైళ్ళ దూరంలో ఉన్న “హీరా” కొండ గుహను తన తాత్విక చింతనకు అనువైన ప్రదేశంగా సత్యాన్వేషణలో నిమగ్నులై ఉండేవారు. పట్టణానికి తిరిగి రాగానే కాబా ప్రదక్షిణ చేసి ఆ తర్వాతే ఇంటికి పోయి భార్యా పిల్లల దగ్గర గడిపేవారు.

ఒకరోజు మహనీయ ముహమ్మద్ (సల్లం) తన చిన్నారి కూతురు "జైనబ్" తో కబుర్లు చెబుతూ కూర్చొని ఉంటే, బయటకి పోయిన తన అర్థాంగి (ఖదీజా) అందమైన ఓ బాలుడిని వెంట బెట్టుకుని వచ్చారు. ముహమ్మద్ (సల్లం) బాలుని వంక చూస్తూ....,

ముహమ్మద్ (సల్లం) : - (ఖదీజా!) ఎవరీ అబ్బాయి?

ఖదీజా : - ఇతను బానిస బాలుడు, నా మేనల్లుడు "హకీమ్" సిరియా నుంచి కొంతమంది బానిసలను తెచ్చాడు. నాకు కూడా ఒక బానిసను ఇచ్చాడు.

ముహమ్మద్ (సల్లం) : - కాని ఈ పిల్లవాడి ముఖంలో మంచితనం ఉట్టిపడుతోంది. తెలివితేటల చిహ్నాలు కూడా కనిపిస్తున్నాయి.

అని అన్నారు బాలుని వైపు ప్రేమగా చూస్తూ...., (ఆ తర్వాత ముహమ్మద్ (సల్లం), బాలునితో మాట్లాడుతూ....,)

ముహమ్మద్ (సల్లం) : - బాబు! నీ పేరేమిటి?

బానిస బాలుడు : - నా పేరు "జైద్".

ముహమ్మద్ (సల్లం) : - మీ వంశావళి సంగతి ఏమైనా తెలుసా నీకు?”

జైద్ : - మా నాన్న పేరు హారిసా. మా తాత పేరు షురహబీల్. ముత్తాత పేరు కాబ్. మా అమ్మపేరు సౌదా. ఆమె సాలబా కుమార్తె.

అప్పుడు ముహమ్మద్ (సల్లం), అర్థాంగి (ఖదీజా) వైపు తిరిగి...., “ఇప్పుడు ఈ బానిస బాలుడు నావాడు కాదా?” అని అన్నారు.

ఖదీజా : - తప్పకుండా. ఇతను మీ బానిసే. ఇతడ్ని మీకే అప్పగిస్తున్నాను.

ఖదీజా సంతోషంగా బానిస బాలుడ్ని శ్రీవారికి సమర్పించారు.

మహనీయ ముహమ్మద్ (సల్లం) అప్పటికప్పుడు బాలుడ్ని బానిసత్వం నుంచి విముక్తి కలిగించి తన కుమారునిగా చేసుకున్నారు. తరువాత "జైద్" తన వద్ద క్షేమంగా ఉన్నాడని అతని తల్లిదండ్రులకు ఒక మనిషి ద్వారా సమాచారం అందజేశారు.

జైద్ తండ్రి, పిన తండ్రి ఈ సంగతి విని పిల్లవాడిని తీసుకుపోటానికి మక్కా వచ్చారు. (అపుడు వారిద్దరూ ముహమ్మద్ (సల్లం) తో ఇలా మాట్లాడారు)

“మీరెంత ధర అడిగినా ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మా పిల్లవాడిని మాత్రం వదిలిపెట్టండి” అంటూ ప్రాధేయపడ్డారు వారిద్దరూ. 

ముహమ్మద్ (సల్లం) : - మరో మార్గం చెప్పనా?

“చెప్పండి ఏమిటో అది.” (అని అన్నారు వారిద్దరూ)

ముహమ్మద్ (సల్లం) : - ఈ విషయం జైద్ ఇష్టాయిష్టాల మీద వదిలేద్దాం. ఇతను మీ వెంట రావడానికి ఇష్టపడితే నిరభ్యంతరంగా తీసుకెళ్ళండి. అందుకు మీరు నాకేమీ ఇవ్వనక్కరలేదు, ఒకవేళ ఇతను నా దగ్గరే ఉండిపోతానంటే మాత్రం నేనితడ్ని మీకు అప్పగించలేను. నన్ను వదలిపెట్టని వాడిని వదిలెయ్యడం నా పద్ధతి కాదు.

“మహాభాగ్యం. అలాగే కానివ్వండి” అన్నారు వారు సంతోషంగా. 

ముహమ్మద్ (సల్లం) అప్పుడు జైద్ ని దగ్గరకు పిలిచి....,

ముహమ్మద్ (సల్లం) : - చూడు బాబు! వీళ్ళు మన అతిథులుగా వచ్చారు. మరి వీళ్ళను నీవు గుర్తుపట్టగలవా?

జైద్ : - వీళ్ళు మా నాన్న, మా బాబాయి.

ముహమ్మద్ (సల్లం) : - అయితే వీళ్ళుప్పుడు నిన్ను తీసుకెళ్ళటానికి వచ్చారు. నీ ఇష్టం. వీళ్ళ వెంట నీవు వెళ్ళిపో దలచుకుంటే వెళ్లిపోవచ్చు. నాకెలాంటి అభ్యంతరం లేదు. లేదా నా దగ్గరే ఉండిపోవాలనుకుంటే సంతోషంగా ఉండిపోవచ్చు. అంతా నీ ఇష్టాయిష్టాల మీద ఆధారపడి ఉంది.

జైద్ వెంటనే ముహమ్మద్ (సల్లం) ని చుట్టేసుకుని...., “వద్దు వద్దు. మిమ్మల్ని వదిలి నేనెక్కడికి పోలేను. మీ దగ్గరే ఉండిపోతాను” అన్నాడు ఏడుస్తూ.

ఈ మాటలు విని తండ్రికి పట్టరాని కోపం వచ్చింది. “ఒరే జైద్! అమ్మా, నాన్న, చుట్టాలు, సొంత ఊరు అందర్నీ వదిలిపెట్టి ఇక్కడ వెట్టి చాకిరి చేస్తూ బానిస బతుకు బ్రతుకుతావట్రా!!” అంటూ గర్జించాడు.

జైద్ : - ఇక్కడ నేనేం బానిసగా బతకటం లేదు. మంచిగానే నన్ను చూసుకుంటున్నారు. ఈయన గారి మంచితనం నన్ను కట్టిపడేసింది. నేను మీ వెంట రాలేను.

ముహమ్మద్ (సల్లం) : - విన్నారు కదా! ఇక ఈ పిల్లవాడు నావాడు.

ఆ తరువాత వెంటనే ఆయన (సల్లం), జైద్ చేయి పట్టుకుని కాబా మందిరంలో ఖురైష్ పెద్దల దగ్గరకి వెళ్ళారు.

“ఖురైష్ పెద్దలారా! వినండి. ఈ రోజు నుంచి ఈ బాలుడు నా కొడుకు. ఇతను నా వారసుడు. నేనితని వారసుడ్ని, దీనికి మీరే సాక్ష్యం” అని ప్రకటించారు ఆయన (సల్లం) అందరి సమక్షంలో.

(జైద్ తండ్రి) హారిసా ఇది చూసి సంతోషంతో పొంగిపోయాడు. కొడుకుని మక్కాలోనే ముహమ్మద్ మహనీయుని (సల్లం) దగ్గర వదిలి వెళ్ళిపోయాడు.

మిగిలినది Insha Allah రేపటి భాగములో తెలుసుకుందాము.

🖊🖊     ®@£€€q +97433572282      🖊🖊
                    (rafeeq)

🖊🖊      Salman       +919700067779 🖊🖊

*Note : - ఈ msg లను ముందుకు పంపిస్తూ, మన ఇస్లాం చరిత్ర గురించి మన ముస్లిం సోదరులకు, సోదరీమణులకు తెలియజేస్తారని ఆశిస్తున్నాము.*

No comments:

Post a Comment