106

☪☪☪       *బిస్మిల్లాహ్ హిర్రహ్మా నిర్రహీమ్*        ☪☪☪

🕋🕋   *అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు*   🕋🕋
🕋🕋     *అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను*      🕋🕋

●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●

🛐🛐🛐             *ఇస్లాం చరిత్ర* *- 106*             🛐🛐🛐

🇸🇦🇸🇦🇸🇦 *ముహమ్మద్ (సల్లం) జీవితచరిత్ర - 20* 🇸🇦🇸🇦🇸🇦 
◆◇◆◇◆◇◆◇◆◇◆◇◆◇◆◇◆◇◆◇◆◇◆◇◆◇◆◇◆◇◆◇◆◇◆

        *ముహమ్మద్ (సల్లం), ఖదీజా (రజి) ల వివాహం* 

"అబూహాలా" చనిపోయాక ఖదీజా, పునర్వివాహ ప్రసక్తినే అసహ్యించుకునేవారు. ఆమె, తన దృష్టినంతటినీ వ్యాపారంపై, ప్రజాసేవపై మాత్రమే కేంద్రీకరించి ప్రశాంత జీవితం గడపసాగారు. అంచేత ఆమె భావావేశాలపై, గాంభీర్యతా మంచుపొర దట్టంగా పేరుకున్నది.

కాని ఇప్పుడు తన వ్యాపారంలో ముహమ్మద్ (సల్లం) ప్రవేశించడంతో, ఈ మంచుపొర క్రమంగా కరిగిపోతూ, దానికింద పడి వాడిపోయిన ప్రేమ కుసుమాలు మెల్లగా వికసించసాగాయి. ఖదీజా హృదయంలో, ముహమ్మద్ (సల్లం) నిలువుచిత్రం రూపుదిద్దుకోసాగింది.

అందువల్ల ఆమె ఇప్పుడు అహర్నిశలూ ఆయన్ని గురించే ఆలోచిస్తూ ఉండసాగారు. ఎవరితో కలిసి ఏది మాట్లాడినా చివరికి ఆమె ముహమ్మద్ (సల్లం) ప్రస్తావనే తెచ్చి, ఆయన గుణగణాల్ని ఎంతో కొనియాడేవారు. ఎలాగైనాసరే ఆ యువకుడ్ని తన జీవిత భాగస్వామిగా చేసుకోవాలని ఖదీజా నిర్ణయానికి వచ్చారు.

ఒకప్పుడు ఖురైష్ వంశంలోని గొప్ప గొప్ప సర్దారులు, ధనవంతులు వివాహమాడాలని కోరితే, ఖదీజా నిర్లక్ష్యంగా సమాధానమిచ్చి నిరాకరించారు. మరి ఈ యువకుని (ముహమ్మద్ (సల్లం)) లో ఉన్న ఆకర్షణ ఏమిటో గాని, ఆమె హృదయం అదుపు తప్పింది.

ఖదీజా, తనలో తలెత్తిన భావాలను రహస్యంగా ఉంచలేకపోయారు. ఓ రోజు ఆమె, తన సన్నిహిత స్త్రీల ముందు ఈ విషయం ప్రస్తావించారు. వారిలో (ఖదీజా స్నేహితురాలు) "నఫీసా బింతే మంబా" అనే మహిళ ఖదీజా కోరిక తెలుసుకొని ఇలా అన్నది....,

నఫీసా : - ఖదీజా! సత్యసంధుడు (అమీన్) గా పేరుపొందిన ఆ యువకుడ్ని వివాహమాడటంలో ఇక అభ్యంతరం ఏమిటి?

ఖదీజా : - అభ్యంతరం ఏమీ లేదనుకో. కాని అందుకు మార్గం కావాలి కదా!

నఫీసా : - ఆ సంగతి నేను చూసుకుంటాగా, నువ్వు నిశ్చింతగా ఉండు. 

అని చెప్పి (ఖదీజాతో వివాహ విషయం మాట్లాడేందుకు) నఫీసా అక్కడి నుంచి బయలుదేరి ముహమ్మద్ (సల్లం) దగ్గరకి వెళ్ళింది.

 *ముహమ్మద్ (సల్లం) వద్దకు చేరుకున్న ఖదీజా పరిచారిక నఫీసా : -* 

నఫీసా : - అమీన్! పెళ్లి చేసుకోకుండా ఇలా ఎంత కాలం ఉంటావు?

ముహమ్మద్ (సల్లం) : - చేసుకోవడానికి మీ దృష్టిలో ఎవరైనా ఉన్నారేమిటి?

నఫీసా (ఖదీజాని పెళ్లి చేసుకోమనే) విషయం చెప్పింది. ఖదీజా పేరు వినగానే, అంత గొప్ప ధనికురాలితో తన వివాహం సాధ్యమా అన్నట్లు ముహమ్మద్ (సల్లం) ఒకింత ఆశ్చర్యపోయారు.

ఖదీజా సౌశీల్యం, సంస్కారం గురించి ఆయన ఇదివరకే విని ఉన్నారు. విన్నది విన్నట్లు ఆమెలో ఆ లక్షణాలన్నీ ప్రత్యక్షంగా తను చూడటం కూడా జరిగింది. కాని ఆమెతో తన వివాహం కలలో కూడా తలచలేదే! గొప్ప గొప్ప వాళ్ళే ఆమె కోసం ఎంతగానో ప్రయత్నించి విఫలమయ్యారు.

అపుడు ముహమ్మద్ (సల్లం), నఫీసాతో....,

ముహమ్మద్ (సల్లం) : - కాని ఖదీజాతో నా పెళ్ళి ఎలా సాధ్యం అవుతుంది?

నఫీసా : - ఆ సంగతి నేను చూసుకుంటాగా, ఆ బాధ్యత నాకు వదిలెయ్యి. 

అని చెప్పి నఫీసా అక్కడి నుంచి వెళ్లిపోయింది.

ఆ తరువాత యువ ముహమ్మద్ (సల్లం) తన పెదనాన్న అబూ తాలిబ్ దగ్గరకు పోయి జరిగిన వృత్తాంతం తెలిపారు. అబూ తాలిబ్ ఈ సంగతి విని ఆశ్చర్యపోయారు. ముహమ్మద్ (సల్లం) ఇంతవరకు అబద్దమాడినట్లు గాని, పరిహాసంగా మాట్లాడినట్లు గాని అబూ తాలిబ్ వినలేదు. అంచేత ఆయన ఈ సంబంధం కాదనలేక వివాహానికి అంగీకరించారు.

తరువాత అబూ తాలిబ్, ఖదీజా పిన తండ్రి "అమ్ర్ బిన్ అసద్", ఆమె అన్న "అమ్ర్ బిన్ ఖువైలిద్" దగ్గరకు పోయి పెళ్ళి విషయం మాట్లాడారు. వాళ్ళిద్దరూ సంతోషంగా ఒప్పుకున్నారు. ముహూర్తం కూడా నిశ్చయమైపోయింది.

పెళ్ళిరోజు బంధువులతో ఖదీజా ఇళ్ళు నిండిపోయింది. ఖురైష్ వంశంలోని గొప్ప వాళ్ళంతా వచ్చారు. అబూ తాలిబ్ దైవస్థుతితో పెళ్ళి ప్రసంగం ఇలా ప్రారంభించారు....;

“ఈ యువకుడు నా తమ్ముడు అబ్దుల్లా కుమారుడు. ఇతని సత్యసంధత, నిజాయితీలు అందరికి తెలిసినవే. ఈ విషయంలో ఇతనికి సరితూగేవాళ్ళు యావత్తు ఖురైష్ వంశంలో లేరంటే అతిశయోక్తి లేదు. వధుకట్నంగా (మహ్ర్) మేము ఇరవై ఒంటెలు ఇస్తున్నాం. వీరిద్దరి భావిజీవితం కలకాలం సుఖంగా గడుస్తుంది అని ఆశిస్తున్నాను."

ఈ విధంగా ఖదీజాతో ముహమ్మద్ (సల్లం) వివాహం వైభవంగా జరిగింది. అప్పటికి ముహమ్మద్ (సల్లం) వయస్సు 25 సంవత్సరాలైతే, ఖదీజా గారి వయస్సు 40 సంవత్సరాలు.

నికాహ్ కు "బనీ హాషిం" తెగవారు, ముజర్ ధనవంతులందరూ హాజరయ్యారు.

 *●ఇబ్నె హష్షామ్ ఉల్లేఖనం ప్రకారం : - ↓* 

ఇది (నికాహ్) సిరియా దేశం నుండి తిరిగొచ్చిన రెండు నెలల తర్వాత జరిగిన విషయం. దైవప్రవక్త (సల్లం) "మహ్ర్"గా ఇరవై ఒంటెల్ని ఇచ్చారు. అప్పుడు ఖదీజా గారి వయస్సు నలభై సంవత్సరాలు. ఆమె వంశం, సంపద, వివేకం, రీత్యా తన జాతిలోనే అతి గౌరవనీయురాలైన ఉత్తమ మహిళా. దైవప్రవక్త (సల్లం) వివాహమాడిన మొదటి మహిళా ఈమే. ఆమె జీవించినంత వరకు ఆయన (సల్లం) మరో మహిళను వివాహమాడలేదు.●

ఖదీజా అందం, సిరి సంపదలు గల స్త్రీయే కాదు; ఏంతో విజ్ఞత, వివేచనా, దూర దృష్టి, తెలివితేటలు గల మహిళా కూడా. అందుకే ఆమె అందర్నీ కాదని సత్యసంధత, సఛ్ఛీలం గల ముహమ్మద్ (సల్లం) ని తన జీవిత భాగస్వామిగా ఎన్నుకున్నారు.

ముహమ్మద్ (సల్లం) కూడా ఆస్తిని, అందచందాల్ని కాకుండా ఆమె గుణగణాలు, నీతి నడవడికల్ని చూసే వివాహమాడారు, అలాంటి దాంపత్యవనంలో ఎన్ని ఆనంద కుసుమాలు వెల్లివిరుస్తాయో, అవి ఎందరు మానవులకు ప్రయోజనం చేకూర్చుతాయో!

వివాహమైన తర్వాత ముహమ్మద్ (సల్లం) ఖదీజా ఇంట్లో ఉండసాగారు. ఆ ఇంట్లోనే ఆయన (సల్లం) మేనత్త "సఫియా" కూడా ఉంటున్నారు. కారణం, సఫియాను ఖదీజా అన్నయ్య "అవామ్" వివాహమాడి ఉండటమే. ఇలా ముహమ్మద్ (సల్లం) జీవితం సవ్యంగా సాగిపోతోంది.

పెళ్ళయిన రెండేళ్ళకు ఆయనకు పండంటి కొడుకు పుట్టాడు. పేరు "ఖాసిం" అని పెట్టారు. ఆ పేరుతోనే ముహమ్మద్ (సల్లం) అబుల్ ఖాసిం అని పిలువబడసాగారు. దినదిన ప్రవర్ధమానమవుతూ ఈ బాల చంద్రుడు ఆ ఇంట్లో ఆనంద కిరణాలు ప్రసరింపజేస్తున్నాడు. కాని ఈ ఆనందం ఎంతోకాలం నిలువలేదు. చిన్నారి ఖాసిం పుట్టిన ఆరు నెలలకే ఇహలోకం నుండి శాశ్వతంగా నిష్క్రమించి ఇంటిల్లపాదిని శోకసముద్రంలో ముంచాడు. 

ఆ తరువాత రెండున్నర సంవత్సరాలకు ఓ పాప పుట్టింది. ఆమెకు "జైనబ్" అని పేరు పట్టారు. జైనబ్ పుట్టుక ముహమ్మద్ (సల్లం) దంపతులకు కొంత కాలం ఊరట కలిగించింది. ఆ తరువాత రుఖియా, ఉమ్మెకుల్సూమ్ అనే మరో ఇద్దరు బాలికలు జన్మించి వారి ఆనందాన్ని ద్విగుణీకృతం చేశారు.

 *●ఇబ్నె హష్షామ్ ఉల్లేఖనం ప్రకారం : - ↓* 

ఒక్క "ఇబ్రాహీం" తప్ప దైవప్రవక్త (సల్లం) గారి తక్కిన సంతానమంతా ఆమె (ఖదీజా) గర్భాన జన్మించిందే. ప్రథమంగా జన్మించింది "ఖాసిం". ఆయన పేరు మీదనే ఆయన (సల్లం) కు "అబుల్ ఖాసిం" అనే పేరు వచ్చింది. ఆ తరువాత జైనబ్ (రజి), రుకయ్యా (రజి), ఉమ్మె కుల్సుమ్ (రజి), ఫాతిమా (రజి), అబ్దుల్లాహ్ లు జన్మించారు. "అబ్దుల్లాహ్" నే "తయ్యబ్" మరియు "తాహిర్" గా పిలిచేవారు. కుమారులంతా బాల్యంలోనే మరణించారు. అయితే, కుమార్తెలందరూ ఇస్లాం హయాం చూసినవాళ్ళే. ఇస్లాం స్వీకరించి "హిజ్రత్" గౌరవాన్ని పొందినవారే. కాని ఫాతిమా (రజి) తప్ప మిగిలిన కుమార్తెలందరూ ప్రవక్త (సల్లం) గారి జీవిత కాలంలోనే పరమపదించారు. హజ్రత్ ఫాతిమా (రజి) దైవప్రవక్త (సల్లం) మరణానంతరం ఆరు నెలల తర్వాత చనిపోయారు.●

మిగిలినది Insha Allah రేపటి భాగములో తెలుసుకుందాము.

🖊🖊     ®@£€€q +97433572282      🖊🖊
                    (rafeeq)

🖊🖊      Salman       +919700067779 🖊🖊

*Note : - ఈ msg లను ముందుకు పంపిస్తూ, మన ఇస్లాం చరిత్ర గురించి మన ముస్లిం సోదరులకు, సోదరీమణులకు తెలియజేస్తారని ఆశిస్తున్నాము.*

No comments:

Post a Comment