126

🕌🕌🕌       *బిస్మిల్లాహ్ హిర్రహ్మా నిర్రహీమ్*        🕌🕌🕌

🛐🛐   *అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు*   🛐🛐
🤚🏻✋🏻     *అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను*      🤚🏻✋🏻

 *~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~* 

🕋🕋🕋             *ఇస్లాం చరిత్ర* *- 126*             🕋🕋🕋

☪🇸🇦☪ *ముహమ్మద్ (సల్లం) జీవితచరిత్ర - 41* ☪🇸🇦☪

 *■×=×=×=×=×=×=×=×=×=×=×=×=×=×=×=×=×=×=×■*

 *"దివ్యఖుర్ఆన్" అనేక సందర్భాల్లో బహుదైవారాధకుల ఈ ఆక్షేపణల్ని వ్రేలెత్తిచూపుతూ మరికొన్ని సందర్భాల్లో పరోక్షంగానూ ఖండించింది. ↓* 

 *మూడవ రకం ఎత్తుగడ : -* 

ఈ ఎత్తుగడ ప్రకారం పూర్వీకుల పౌరాణిక గాధల్ని "దివ్య ఖుర్ఆన్"కు పోటీగా పెట్టి వాటితోనే సతమతమయ్యేటట్లు ప్రజల్ని మభ్యపెట్టడం. "నజ్ర్ బిన్ హారిస్" ఓ సారి ఖురైషులతో ఈ విషయమై ప్రస్తావిస్తూ, “ఖురైష్ ప్రజలారా! దైవసాక్షిగా మీపై ఓ పెద్ద ఆపద వచ్చిపడింది. దానికి మీ వద్ద ఎలాంటి విరుగుడు లేదు. ముహమ్మద్ (సల్లం) యువకుడుగా మీ నడుమ ఉన్నప్పుడు మీకందరికీ ఇష్టమైన, నమ్మకమైన వ్యక్తిగా ఉంటూ ఉండేవాడు. అందరికంటే సత్యసంధుడు, గొప్ప అమానతుదారుడుగా మీరు ఆయన (సల్లం)ను కొనియాడేవారు. ఇప్పుడు ఆయన (సల్లం) వెంట్రుకలు తెల్లబడిపోతూ (అంటే ప్రౌఢ వయస్సుకు చేరుకుంటున్నపుడు) కొన్ని హితోక్తులు మీ ముందు వల్లిస్తూ ఉంటే మీరు ఆయన (సల్లం)ను ఇంద్రజాలికుడు అంటున్నారు. కాదు! దైవసాక్షిగా చెబుతున్నాను, ఆయన (సల్లం) ఇంద్రజాలికుడు కానేకాడు. ఇంద్రజాలికులను మనం చాలా మందిని చూసాం. వారు చేసే మంత్రతంత్రాలు, తాళ్ళను ముడివేసి వాటిపై ఊదడం కూడా మనం చూసిందే. మీరేమో ఆయన (సల్లం)ను కాహిన్ అంటున్నారు. కాదు, దైవసాక్షిగా! ఆయన (సల్లం) కాహిన్ కూడా కాదు. కాహిన్ లు చేసే తికమకలు, వారి ఉచ్చారణ కూడా మనకు తెలుసు. అలాగే మీరు ఆయన (సల్లం)ను కవి అని అంటున్నారు. కాదు దైవసాక్షి! ఆయన (సల్లం) కవి ఎంతమాత్రం కాదు. మనకు కవనం గురించి బాగా తెలుసు. పద్యానికి సంబంధించిన రకాలన్నీ మనం బాగా ఎరుగుదుము. మీరు ఆయన (సల్లం)ను ఉన్మాదికి సంబంధించిన ప్రవర్తన కూడా మనం బాగా ఎరుగుదుము, ఉన్మాధిలో ఉండవలసిన లక్షణాలుగాని, పిచ్చి పిచ్చి మాతలుగాని, చేతలుగాని ఆయన (సల్లం)లో కనపడవు. ఖురైష్ ప్రజలారా! ఆలోచించండి. దైవసాక్షి! మీపై పెద్ద ఆపదే వచ్చిపడింది సుమా!”

ఆ తరువాత నజ్ర్ బిన్ హారిస్ “హీరా” నగరానికి వెళ్ళాడు. అక్కడ రాజుల కథలు, రుస్తుం, ఇస్ఫందార్ల వీరోచిత గాధలు చెప్పడం నేర్చుకున్నాడు. తిరిగివచ్చి, దైవప్రవక్త (సల్లం) ఎక్కడైనా కూర్చుని "అల్లాహ్" ఔన్నత్యం గురించి భోదిస్తూ, ఆయన పట్టుకు భయపడవలసిందని హితోపదేశం చేస్తూ కనపడితే, నజ్ర్ బిన్ హారిస్ కూడా అక్కడికి చేరి, “ దైవసాక్షి! ముహమ్మద్ (సల్లం) మాటలు వినకండి. ఆయన (సల్లం) చెప్పేవి నేను చెప్పేదానికంటే గొప్పవి ఏమీకావు” అంటూ పర్షియా రాజులు, రుస్తుమ్, ఇస్ఫందార్ల గాధలను వినిపించడం మొదలుపెట్టేవాడు. ఆ తరువాత, “ముహమ్మద్ (సల్లం) చెప్పింది నేను చెప్పినదానికంటే మేలైనదని ఎలా అనుకుంటున్నారు?” అని ప్రశ్నించేవాడు.

 _(ఈ మాటలు విని అమాయక ప్రజలు సందిగ్ధావస్థలో పడిపోతారు. ఇద్దరిలో ఎవరు సత్యవంతులో, ఎవరు అసత్యవాదులో, ఎవరు తమ శ్రేయోభిలాషో ఎవరు మోసకారో తేల్చుకోలేక పెద్ద ఇరకాటంలో పడిపోతారు.)_ 

ఇబ్నె అబ్బాస్ (రజి) గారి ఉల్లేఖనం ద్వారా తెలిసిన విషయం ఏమిటంటే, నజ్ర్ బిన్ హారిస్ కొందరు పాటకత్తెలైన బానిసరాండ్రను కొని తన దగ్గర ఉంచుకున్నాడు. దైవప్రవక్త (సల్లం) వైపునకు మొగ్గు చూపుతున్నట్లు కనపడినవారి వద్దకు ఒక్కో పాటకత్తెను పంపించేవాడు. ఆమె ఆ వ్యక్తికి బాగా తినిపించి, త్రాగించి పాటలు వినిపించేది. చివరికి ఆ వ్యక్తిని ప్రవక్త (సల్లం) వైపునకు మొగ్గకుండా చూసేది. ఈ సందర్భంగానే దివ్య గ్రంథంలోని ఈ ఆయత్ అవతరించింది.

 *జ్ఞానంతో నిమిత్తం లేకుండానే ప్రజలను "అల్లాహ్" మార్గం నుంచి తప్పించడానికి దాన్ని వేళాకోళం చేయడానికి మనసును వశీకరించే విషయాలను కొనుగోలు చేసేవాడు కూడా మనుషుల్లో ఉన్నాడు. పరాభవం పాల్జేస్తే శిక్ష ఉన్నది ఇలాంటి వారి కోసమే. (ఖుర్ఆన్ 31:6)* 

 _(సన్మార్గాన్ని అన్వేషించేవారు, సత్యం కోసం తహతహలాడేవారు దివ్యవాణిని విన్నప్పుడు తప్పకుండా సన్మార్గాన్ని పొందుతారు. అలాంటి సన్మార్గగాముల ప్రస్తావన తర్వాత మరో పాత్ర కూడా ఇక్కడ ప్రస్తావించబడింది. వాడి పరిస్థితి ఎలాంటిదంటే, వాడెలాగూ "ఖుర్ఆన్" వాక్యాలను వినడు. దానికితోడు "ఖుర్ఆన్"ను వినేవారిని ఎలాగైనాసరే అడ్డుకోవాలన్న ఉద్దేశ్యంతో మనసును వశీకరించి, ఆధ్యాత్మికతను హరించే ఆటవస్తువులను, సంగీత వాయిద్యాలను, గాయకులను, నృత్యప్రదర్శకులను కొనుక్కొని తెస్తాడు._ _వాటిని తన ఇంట్లో పెట్టుకొని ఓలలాడటమే గాక ఊరివారి కోసం, పేటవారి కోసం కూడా ప్రదర్శిస్తాడు._ 
 _దీని వెనుక ఉన్న వారి ప్రధాన ఉద్దేశ్యం ఒక్కటే, ప్రజలు ఆటపాటల్లో, వ్యర్థవిషయాలలో మునిగి తేలుతూ ఉండాలి._ _సత్యవాణి గురించి ఆలోచించే తీరిక వారికి దొరకకూడదు._ _"ఖుర్ఆన్"లోని సత్యవాక్కుకు వారు ఆకర్షితులు కాకూడదు!)_ 

 *నాలుగవ రకం ఎత్తుగడ : -* 

నచ్చజేప్పే మార్గం (సామోపాయం). బహుదైవారాధకులు, ఇస్లాం మరియు అజ్ఞానం రెండూ, మధ్యలో ఎక్కడో ఒకచోట పరస్పరం కలుసుకునేటట్లు పన్నాగం పన్నడం అన్నమాట. అంటే ఇచ్చిపుచ్చుకునే మార్గం అవలంభించడం వలన బహుదైవారాధకులు వారి నమ్మకాలను కొన్నింటిని వదలివేయడం; దైవప్రవక్త (సల్లం) బహుదైవారాధకుల కొన్ని ఆచారాలను అవలంబించడం అన్నమాట. దివ్యగ్రంథం దీని గురించే ఇలా సెలవిస్తుంది.

 *నువ్వు కాస్త మెత్తబడితే, తాము కూడా మెతకవైఖరి అవలంబించవచ్చునని వారు కోర్తున్నారు (ఖుర్ఆన్ 68:9)* 

 _(అంటే ఓ ముహమ్మద్ (సల్లం)! నువ్వు వారి ఆరాధ్యదైవాల పట్ల కాస్త మెతకవైఖరిని అవలంబిస్తే వారు కూడా నీ పట్ల మెతకవైఖరిని అవలంబిస్తామన్నది వారి ఉద్దేశ్యం. కాని సత్యం విషయంలో రాజీ ధోరణి మంచిది కాదు. అసత్యవాదులకు ఏ ఎండకా గొడుగు పట్టడం అలవాటే. కాని సత్యాన్ని ప్రాణప్రదంగా ప్రేమించే ప్రవక్తలకు అవకాశవాద ధోరణి ఎంత మాత్రం శోభించదు. పైగా ఈ ధోరణి హానికరంగా పరిణమిస్తుంది.)_ 

ఇబ్నె జరీర్ మరియు తిబ్రానీల ఓ ఉల్లేఖనం ప్రకారం, బహుదైవారాధకులు దైవప్రవక్త ముహమ్మద్ (సల్లం) ఎదుట, ఓ సంవత్సరం ఆయన (సల్లం) వారి ఆరాధ్యదైవాలను పూజించాలని, మరో సంవత్సరం బహుదైవారాధకులు ప్రవక్త (సల్లం) గారి దైవం "అల్లాహ్"ను పూజిస్తారని ప్రతిపాదనను ఉంచారు, అబ్ద్ బిన్ హుమైద్ ఉల్లేఖనం ఒకటి ఇలా ఉంది; “బహుదైవారాధకులు (దైవప్రవక్త (సల్లం)తో), మీరు మా ఆరాధ్య దైవాలను స్వీకరిస్తే మేము కూడా మీ దైవాన్ని ఆరాధిస్తాము” అని పలికేవారు.

ఇబ్నె ఇస్'హాక్ కథనం ప్రకారం, దైవప్రవక్త (సల్లం) కాబా గృహ ప్రదక్షిణ చేస్తున్నారు. ఆ సమయములో అస్వద్ బిన్ ముత్తలిబ్ బిన్ అసద్ బిన్ అబ్దుల్ ఉజ్జా, వలీద్ బిన్ ముగీరా, ఉమయ్యా బిన్ ఖల్ఫ్ మరియు ఆస్ బిన్ వాయిల్ సహ్మీలు కలసి దైవప్రవక్త (సల్లం) కి ఎదురుగా వచ్చారు. వీరంతా వారి జాతికి పెద్ద మనుషులు దైవప్రవక్త (సల్లం) తో, “ఓ ముహమ్మద్ (సల్లం)! రండి, మీరు ఆరాధించే దైవాన్ని మేమూ ఆరాధిస్తాము. మేము ఆరాధించే దైవాలను మీరు కూడా పూజించాలి. ఇలా ఈ కార్యంలో మీరు మేము ఏకం అవుదాం. ఇప్పుడు మీ ఆరాధ్యుడు మా ఆరాధ్యదైవాలకంటే మెరుగైన వాడు అయితే ఆయన్నుండి మేము మా వాటాను పొందుతాం. ఒకవేళ మా దైవాలు మీ దైవం కంటే మెరుగైతే మీరు కూడా మీ వాటాను పొందవచ్చు.” అని అధిక ప్రేలాపనలు చేశారు. దీనికి "అల్లాహ్" పూర్తి అధ్యాయం “ఖుల్ యా అయ్యుహల్ కాఫిరూన్”ను అవతరింపజేశాడు. ఇందులో, మీరు పూజించే వాటిని నేనెన్నటికీ పూజించలేను అని ప్రకటించడం జరిగింది. ఈ నిర్ణయాత్మకమైన సమాధానంతో వారి ఈ ఎత్తుగడ పూర్తిగా భగ్నం అయిపోయింది. 

ఉల్లేఖనాల్లో గల భేదానికిగల కారణం, ఈ ప్రయత్నం మాటిమాటికి జరిగి ఉండడం వల్లనే.

↑ ఈ ఉల్లేఖనంలోని మరింత వివరణ Insha Allah రేపటి భాగములో →

✍🏻✍🏻     *®@£€€q* *+97433572282*      ✍🏻✍🏻
                    *(rafeeq)* 

✍🏻✍🏻      *Salman*       *+919700067779* ✍🏻✍🏻

*Note : - ఈ msg లను ముందుకు పంపిస్తూ, మన ఇస్లాం చరిత్ర గురించి మన ముస్లిం సోదరులకు, సోదరీమణులకు తెలియజేస్తారని ఆశిస్తున్నాము.*

No comments:

Post a Comment