125

🕌🕌🕌       *బిస్మిల్లాహ్ హిర్రహ్మా నిర్రహీమ్*        🕌🕌🕌

🛐🛐   *అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు*   🛐🛐
🤚🏻✋🏻     *అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను*      🤚🏻✋🏻

 *~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~* 

🕋🕋🕋             *ఇస్లాం చరిత్ర* *- 125*             🕋🕋🕋

☪🇸🇦☪ *ముహమ్మద్ (సల్లం) జీవితచరిత్ర - 40* ☪🇸🇦☪

 *■×=×=×=×=×=×=×=×=×=×=×=×=×=×=×=×=×=×=×■*

 _(మునుపటి భాగము కొనసాగింపు)_ 

 *హజ్ యాత్రికులకు, ముహమ్మద్ (సల్లం) దైవసందేశాన్ని చేరనీయకుండా, ఖురైషీయులు దైవప్రవక్త (సల్లం) పై దుష్ప్రచారం చేసే సందర్భం : -* 

ఈ విషయంలో అబూ లహబ్ అందరికంటే చురుకుగా పాల్గొన్నాడు. అతను హజ్ కాలంలో యాత్రికుల విడుదులు మరియు ఉకాజ్, మజిన్నా, జుల్'మజాజ్ సంతల్లో దైవప్రవక్త (సల్లం)ను వెన్నంటి ఉండేవాడు. ఆయన (సల్లం) దైవధర్మ ప్రచారం చేస్తుంటే దాన్నందుకుని అబూ లహబ్, ఈయన (సల్లం) మాట వినకండి, ఇతను అసత్యవంతుడు, మార్గభ్రష్టుడైనవాడు అని ప్రవక్త (సల్లం) ప్రచారాన్ని ఖండించేవాడు.

ఇలా ప్రజలు హజ్ యాత్ర పూర్తి చేసుకుని ఇళ్ళకు మళ్ళేనాటికి, ముహమ్మద్ (సల్లం) అనే వ్యక్తి తాను దైవసందేశహరునిగా చెప్పుకుంటున్నాడన్న సత్యం వారికి తెలిసిపోయింది. హజ్ యాత్రికుల ద్వారా ఈ వార్త పూర్తి అరేబియాలో వ్యాపించిపోయింది.

 _(↑ ఈ ఉల్లేఖనంలోని మరింత వివరణ ↓)_ 

అది హజ్ సమయం కావున, అరేబియా నలుమూల నుంచి వచ్చిన యాత్రికులతో కాబా ప్రాంగణం అంతా కిక్కిరిసిపోతోంది. ఆ యాత్రికుల మధ్య మహాప్రవక్త ముహమ్మద్ (సల్లం), తనపై అవతరించిన దైవసందేశాన్ని ప్రజలకు ఇలా చేరవేశారు.

"ప్రజలారా! సమస్త మానవాళిని హెచ్చరించమని, సృష్టికర్త నుంచి నాకు ఆజ్ఞ జారిచేయబడింది. వాటిలో ముఖ్యమైనది ఒకే ఒక్క "అల్లాహ్" ను మాత్రమే ఆరాధించడం. "అల్లాహ్" తప్ప వేరే ఆరాధ్య దైవం లేడు. ఈ ఆరాధన, మిగిలిన ఆరాధనల కన్నా శ్రేష్ఠమైనది, శ్రేయస్కరమైనదీను. అలా కాకుండా మీరు విగ్రహాలనే పూజించదలిస్తే, మీ పరలోక జీవితం చాలా భయానకంగా ఉంటుంది. కాబట్టి "అల్లాహ్" ను మాత్రమే ఆరాధించే మార్గంలో నాతో చేతులు కలపండి. దీని వల్లే మీకు మోక్షం లభిస్తుంది." అంటూ బిగ్గరగా చాటుతున్నారు.

ఈ కొత్త నినాదం వినగానే అనేకమంది ప్రజలు ఆయన (సల్లం) చుట్టూ గుమిగూడారు. ఆ గుంపులో నుంచి "అబూ లహబ్" ముందుకు దూసుకొచ్చి, “అబద్ధాలకోరు, అబద్ధాలకోరు. ప్రజలారా! ఇతని మాటలు వినకండి. ఇతను అబద్దాలరాయుడు. అనాదిగా వస్తున్న తాతముత్తాతల మతం వదలేసి భ్రష్టుడైపోయాడు.” అన్నాడు.

దైవప్రవక్త (సల్లం) అక్కడి నుంచి మరొకచోటికి వెళ్ళి...., “ప్రజలారా! నేను మీకు సన్మార్గం చూపడానికి "అల్లాహ్" తరపున నియమించబడిన ప్రవక్తను. కనుక మీరు ఒక్క "అల్లాహ్"ని మాత్రమే ఆరాధించండి. ఆయన దైవత్వంలో మరెవరికి సాటి కల్పించకండి. ధర్మస్థాపన కృషిలో నాకు చేయూత ఇవ్వండి.” అన్నారు బిగ్గరగా.

“సోదరులారా! ఇతని మాటలు నమ్మకండి. లాత్, ఉజ్జా దేవతల్ని వదిలేసి మనల్ని అపమార్గంలో పడవేయజూస్తున్నాడు.” అని అన్నాడు "అబూ లహబ్", దైవప్రవక్త (సల్లం) వెంటబడుతూ.

ఈ విధంగా సాగింది మహానీయ ముహమ్మద్ (సల్లం) పై ఖురైషీయుల దుష్ప్రచారం.

 *వ్యతిరేకతకు అవలంభించిన వివిధ ఎత్తుగడలు : - - : (ముహమ్మద్ (సల్లం)కు వ్యతిరేకంగా ఖురైషీయులు అవలంభించిన ఎత్తుగడలు)* 

ముహమ్మద్ (సల్లం) ను దైవసందేశ ప్రచారం నుండి అడ్డుకోవడానికి ఈ విధానం పనిచేయడంలేదన్నది తెలిసిపోగానే, ఖురైషీయులు తిరిగి ఆలోచనలో పడిపోయారు. దైవసందేశాన్ని వ్యాపించకుండా చేయడానికి అనేక విధానాల్ని అవలంభించనారంభించారు, వాటి వివరాలు ఇలా ఉన్నాయి.

 *మొదటి రకం ఎత్తుగడ : -* 

❤ఎగతాళి, అవమానం, అపహాస్యం, నిరాకరణల ద్వారా భాదిస్తూ ముస్లింలను నిరుత్సాహపరచి వారి ధైర్యాన్ని నీరు కార్చడం. అందుకని బహుదైవారాధకులు దైవప్రవక్త (సల్లం)పై అపవాదులు వేస్తూ అసహ్యమైన పదజాలంతో ఆయన (సల్లం)ను దూషించేవారు. ఆయన (సల్లం)ను ఉన్మాదిగా చిత్రించేవారు. "ఖుర్ఆన్" ఇలా అంటోంది.

 *“ఓ జిక్ర్ (ఖుర్ఆన్) అవతరించిన మనిషీ! ఖచ్చితంగా నువ్వు పిచ్చివాడివే.” (ఖుర్ఆన్ 15:6)* ❤

💜ఒక్కోసారి ఇంద్రజాలికునిగా, అసత్యం పలికే మనిషిగా నిందించేవారు.

 *"తమ వద్దకు హెచ్చరించేవాడొకడు స్వయంగా తమలో నుంచి వచ్చాడే! అని వారు ఆశ్చర్యపోయారు. "ఇతడొక మాంత్రికుడు, అబద్ధాలకోరు" అని అవిశ్వాసులు అన్నారు." (ఖుర్ఆన్ 38:4)* 

 _(అంటే, తమలాంటి ఒక సాధారణ మనిషి దైవప్రవక్త ఎలా అయ్యాడన్న విషయం వారిని ఆశ్చర్యంలో పడవేసింది.)_ 💜

🧡ఈ దైవతిరస్కారులు ఆయన (సల్లం) వెనుక పగతీర్చుకోవాలనే ఉద్దేశ్యంతో క్రోధావేశులై ఉద్రేకభావంతో నడిచేవారు. దీన్ని "దివ్యఖుర్ఆన్" ఇలా చిత్రీకరిస్తోంది.

 *"ఈ అవిశ్వాసులు "ఖుర్ఆన్"ను విన్నప్పుడల్లా తమ వాడి చూపులతో నిన్ను జాడించి పడవేసినట్లే ఉంటారు. "ఖచ్చితంగా ఇతను పిచ్చివాడే" అని అంటారు." (ఖుర్ఆన్ 68:51)* 

 _(అర్థరహితమైన ఈ ప్రేలాపనలకు కారణం : 1.అసూయ, 2. ప్రజలు "దివ్యఖుర్ఆన్"కు ప్రభావితులు అవుతారేమోనన్న భయం. అందుకే ఈ అవిశ్వాసులు తమ తీక్షణ వీక్షణాలతో దైవప్రవక్త (సల్లం)కు హాని కలుగజేయటానికి ప్రయత్నించటమే గాక, తమ కారు కూతల ద్వారా కూడా ఆయన (సల్లం) మనసు నొప్పించేవారు.)_ 🧡

💙ఏ చోటనైనా ప్రవక్త (సల్లం) కూర్చుని ఉంటే, ఆయన (సల్లం) చుట్టూ పీడితులు, బలహీనులు అయిన సహాబా (రజి) కూర్చుని ఉండేవారు. వారిని చూసి ఈ బహుదైవారాధకులు అపహాస్యం చేస్తూ ఇలా అనేవారు :

 *"మా అందరిలోకి "అల్లాహ్" అనుగ్రహించినది వీళ్ళనేనా!" అని వారు పలికేందుకుగాను.... (ఖుర్ఆన్ 6:53)* 

 _(తొలికాలంలో నిరుపేదలు, బానిసలు, దళితులే ఎక్కువగా ఇస్లాం స్వీకరించారు. ఈ విషయం సమాజంలోని శ్రీమంతులకు, అయ్యవార్లకు మింగుడు పడలేదు. తమ ఆధీనంలో ఉన్న ఇలాంటి పేదముస్లింలను చూసి వారు వేళాకోళం చేసేవారు. పగలబడి నవ్వేవారు. వారిని వేధించి వికటాట్టహాసం చేసేవారు. "ఏమిటీ, దైవకటాక్షానికి అర్హులుగా కనిపించింది ఈ చిల్లర మనుషులేనా?" అని ఎగతాళి చేసేవారు. ఈమాన్ (విశ్వాసం) మరియు దీన్ (ఇస్లాం ధర్మం) నిజంగా దేవుని మహోపకారమై ఉంటే అది అందరికన్నా ముందు తమపై అవతరించాల్సింది అన్నది ఈ అయ్యవార్ల అభిమతం. "దివ్యఖుర్ఆన్" లో మరోచోట కూడా వారు ఈ విధంగా పలికినట్లు చెప్పబడింది : *"నిజంగా ఇది మంచి విషయమే అయితే దీన్ని విశ్వసించే విషయంలో వీళ్ళు మా కంటే ముందుకు పోగలిగేవారు కాదు." (అల్ అహ్'ఖాఫ్ 11).* అంటే ఈ బడుగు జనుల కంటే ముందు తామే ముస్లింలయ్యేవారమన్నది వారి ఉద్దేశ్యం.)_ 

 *సమాధానంగా "అల్లాహ్" అంటాడు : ↓* 

 *"మేము వారిలో కొందరిని మరికొందరి ద్వారా పరీక్షించాము. కృతజ్ఞతా భావంతో మెలిగే వారిని "అల్లాహ్" ఎరుగడా ఏమిటీ?!" (ఖుర్ఆన్ 6:53)* 

 _("అల్లాహ్" బాహ్యంలోని తళుకుబేళుకులను, ఆర్భాటం అట్టహాసాన్ని, ఠీవీ దర్పాన్ని చూడడు. మనిషిలోని కృతజ్ఞతా భావాన్ని, అణుకువను మాత్రమే చూస్తాడు. గుండెల్లో గుడుకట్టుకుని ఉన్న భావాలను ఆయన బాగా ఎరిగినవాడు. ఎవరి మనసులో నిష్కల్మషమైన కృతజ్ఞతా భావం ఉందో, మరెవరు కపట నాటకమాడుతున్నారో ఆయనకు పూర్తిగా తెలుసు. అందుకే ఆయన కృతజ్ఞతాభావం నిండిన త్యాగధనులకు విశ్వాస భాగ్యాన్ని ప్రసాదించాడు. హాదీసులో పేర్కొనబడినట్లు : *"అల్లాహ్ మీ రంగును, రూపురేఖలను చూడడు. ఆయనైతే మీ మనసులను, మీ కర్మలను చూస్తాడు.* (సహీహ్ ముస్లిం : కితాబుల్ బిర్ర్))_ 💙

💚సాధారణంగా బహుదైవారాధకులు పరిస్థితి అంతా ఈ క్రింద చెప్పబడిన దివ్యగ్రంథంలోని ఆయత్ లలో చెప్పినట్లుగానే ఉండేది.

 *"అపరాధులు విశ్వాసులు స్థితిపై (చులకనగా) నవ్వేవారు. వారి దగ్గరనుండి వెళుతున్నప్పుడు, పరస్పరం కన్నుగీటి మరీ సైగలు చేసేవారు. తమ వారి వద్దకు తిరిగి వెళ్ళినప్పుడు కూడా (విశ్వాసులను గురించి) వేళాకోళం చేస్తూనే వెళ్ళేవారు. వారిని (విశ్వాసులను) చూసినప్పుడల్లా, "నిశ్చయంగా వీళ్ళు పెడదారి పట్టార"ని అనేవారు. ఇంతకీ వాళ్ళు (అవిశ్వాసులు) వారిపై (విశ్వాసులపై) కావలివాళ్ళుగా చేసి పంపబడలేదు కదా!" (ఖుర్ఆన్ 83:29-33)* 

 _(అంటే, వారిని మరీ అల్పుల క్రింద జమకట్టి ఎగతాళి చేసేవారు. ఒండొకరికి కళ్ళతోనే సైగలు చేసి ముస్లిముల పరిస్థితిని పరిహసించేవారు. తమ పరివారం ముందు విశ్వాసులను గురించి ప్రస్తావించి, వాళ్ళను ఆటపట్టించినందుకు తెగ సంబరపడిపోయేవారు. ఈ ఆయత్ కు మరో భావం ఇది : వారు తమ ఇండ్లకు వెళ్ళినపుడు వారి కలిమి వారికి స్వాగతం పలికేది. వారు కోరినదల్లా వారికి లభించేది. దీనిపై వారు దైవానికి కృతజ్ఞతలు తెలుపుకోవలిసింది పోయి విశ్వాసులను పరిహసించటంతోనే పొద్దుపుచ్చేవారు. (ఇబ్నె కసీర్.) బహుదైవారాధకుల దృష్టికి ఏకదైవారాధకులు మార్గభ్రష్టులుగా కనిపించేవారు. అవిశ్వాసుల దృష్టికి విశ్వాసులు దుర్మార్గులగా కనిపించేవారు. విచిత్రం కదూ! ఈ పరిస్థితి ఇప్పటికీ నెలకొని ఉంది. మార్గభ్రష్టతకు గురైన ఎన్నో వర్గాలవారు నేడు సన్మార్గాన ఉన్న వారిని దారి తప్పారని వెక్కిరిస్తున్నారు. ఇంతకీ వాళ్లకు ముస్లింలంటే అంత ఆసక్తి ఎందుకట? పొద్దస్తమానం ముస్లింల ఆచరణల గురించే వారు ఎందుకు చర్చించుకుంటున్నట్లు? దేవుడు వాళ్ళను ముస్లింలపై పర్యవేక్షకులుగా చేసి పంపలేదు కదా!)_ 💚

 *రెండవ రకం ఎత్తుగడ : -* 

💛దైవప్రవక్త (సల్లం) గారి బోధనలను వక్రీకరించడం, అనుమానాలను రేకెత్తించడం, అసత్యపు ప్రచారం. బోధనలకుతోడు వ్యక్తిత్వాన్ని కూడా అర్థపర్థంలేని ఆక్షేపనలకు గురి చేయడం. ఈ ఎత్తుగడలన్నింటిని, ప్రజలు ప్రవక్త (సల్లం) బోధనల గురించి ఆలోచించకుండా ఆయన (సల్లం) పిలుపును పెడచెవినబెట్టేటట్లు చేయడానికి పన్నిన ఎత్తులు. కాబట్టి "దివ్యఖుర్ఆన్" బహుదైవారాధకుల ఈ ఎత్తుగడలను ఇలా తేటతెల్లం చేస్తోంది. దైవప్రవక్త (సల్లం) మాటను విశ్వసించడానికి నిరాకరించిన వారు ఇలా అంటారు.

 *""ఇది, ఇతను స్వయంగా కల్పించుకున్న అబద్ధం తప్ప మరేమీ కాదు. ఈ విషయంలో ఇతరులు కూడా ఇతనికి సాయపడ్డారు." అని అవిశ్వాసులు చెప్పుకోసాగారు. నిజానికి వారు చాలా అన్యాయానికి, ఆసాంతం అబద్ధానికి ఒడిగట్టారు." (ఖుర్ఆన్ 25:4)* 

 _(ఈ గ్రంథాన్ని కల్పించటంలో యూదులు, వారి బానిసలు (అబూ ఫకీహా యసార్, అద్దాస్, జబర్) తదితరులు ముహమ్మద్ (సల్లం)కు తోడ్పడి ఉంటారని ముష్రిక్కులు చెప్పేవారు. అన్ నహ్ల్ సురా 103వ ఆయతులో దీనికి సంబంధించిన కొన్ని వివరాలు వచ్చాయి. ఈ ఆరోపణను "ఖుర్అన్" ఒక అన్యాయంగా, ఆసాంతం అబద్ధంగా అభివర్ణించింది. ఒక నిరక్షరాసి (ముహమ్మద్‌ - సల్లం) ఇతరుల సహాయ సహకారాలతో ఇంతటి స్వచ్ఛమైన, అపురూపమైన అరబీ భాషలో ఉద్గ్రంథాన్ని సమర్పించగలడా? ఒకవేళ సమర్పించినా సత్యాలను ఇంత ప్రస్ఫుటంగా విశదీకరించే, చారిత్రక గాథలను వివరించే, మానవ జీవితంతో ముడిపడిన మార్గదర్శక సూత్రాలన్నింటినీ తెలిపే సాటిలేని జీవన సంవిధానాన్ని నిరక్షరాసి అయిన ఓ వ్యక్తి పరిచయం చేయగలడా?? వీళ్ళకేమై పోయిందీ? ఇలాంటి పసలేని ఆరోపణలను వారు ఎందుకు చేస్తున్నారు.?)_ 💛

🖤ఇంకా ఇలా అంటారు,

 *""ఇవి పూర్వీకుల గాథలు. వాటిని ఇతను వ్రాయించాడు. అవి ఉదయం సాయంత్రం అతని ముందు పఠించబడుతున్నాయి." అని కూడా ఈ అవిశ్వాసులు అన్నారు." (ఖుర్ఆన్ 25:5)* 🖤

❤బహుదైవారాధకులు ఇలా అంటూ ఉండేవారు కూడా.

 *""అతనికి ఒక మనిషి నేర్పుతున్నాడ"ని ఈ అవిశ్వాసులు పలకటం మాకు బాగా తెలుసు. వాస్తవానికి వారు ఎవరిని దృష్టిలో పెట్టుకుని అలా అంటున్నారో అతని భాష అరబ్బేతర (అజమీ) భాష. కాగా; ఈ "ఖుర్ఆన్" స్వచ్ఛమైన, స్పష్టమైన అరబీ భాషలో ఉంది." (ఖుర్ఆన్ 16:103)* 

 _(ఎవరిని ఉద్దేశ్యించి వారు ఈ నింద మోపుతున్నారో వారికసలు స్పష్టంగా అరబీ మాట్లాడటమే రాదు. అదే సమయంలో "ఖుర్ఆన్"లోని అరబీ భాషను చూడండి. విషయ స్పష్టతలోనూ, భాషలోనూ, భావంలోనూ దాని శైలి అనుపమమైనది. అందులో ఉన్న సూరాలను పోలిన ఒక్క సూరాను కూడా ఎవరూ రచించి తేలేకపోయారాయే! మరలాంటప్పుడు వచ్చీరాని అరబీలో మాట్లాడే సామాన్యులు ఇంతటి అద్భుతమైన గ్రంథాన్ని ముహమ్మద్ (సల్లం)కు ఎలా నేర్పుతారు?)_ ❤

💜దైవప్రవక్త (సల్లం)ను వారు ఇలా ఆక్షేపణలకు గురిచేసేవారు.

 *"అవిశ్వాసులు ఇలా అనసాగారు : "ఏం ప్రవక్తయ్యా ఇతను?! (చూడబోతే అందరిలాగే) ఇతను కూడా అన్నం తింటున్నాడు. బజార్లలో తిరుగుతున్నాడు. ఇతనికి తోడుగా ఉంటూ (ప్రజలను) హెచ్చరించే నిమిత్తం ఒక దైవదూత (అయినా) ఇతని వద్దకు ఎందుకు పంపబడలేదట?"" (ఖుర్ఆన్ 25:7)* 

 _("దివ్యఖుర్ఆన్" ను ఎగతాళి చేసిన తర్వాత వారిప్పుడు దైవప్రవక్త (సల్లం)ను ఎగతాళి చేయటం మొదలెట్టారు. ఎందుకంటే వారి దృష్టిలో ఒక మానవమాత్రుడు దైవప్రవక్త పదవికి తగడు. అందుకే - భోజనం చేసేవాడు, అందరిలాగే వీధుల్లో సంచరిస్తూ మనుషులతో సహజీవనం చేసేవాడు ప్రవక్తగా ఎంపిక కావటంపై వారు ఆశ్చర్యానికి లోనయ్యారు. ఇప్పుడు ఒక మెట్టు దిగివచ్చి, ఇంకొక అభ్యంతరం లేవనెత్తారు. అదేమంటే, ఒక సాధారణ మనిషి దైవప్రవక్తగా నియుక్తుడైనప్పటికీ అతనికి సహాయకుడిగా కనీసం ఒక దైవదూత (ఫరిష్తా) అన్నా లేకపోతే ఎలా? దైవదూత అయినా తోడుగా లేని వ్యక్తిని మేము దైవప్రవక్తగా ఎలా నమ్మాలి?)_ 💜

"దివ్యఖుర్ఆన్" అనేక సందర్భాల్లో బహుదైవారాధకుల ఈ ఆక్షేపణల్ని వ్రేలెత్తిచూపుతూ మరికొన్ని సందర్భాల్లో పరోక్షంగానూ ఖండించింది. ↓

మూడవ రకం ఎత్తుగడ : - Insha Allah రేపటి భాగములో....,

✍🏻✍🏻     *®@£€€q* *+97433572282*      ✍🏻✍🏻
                    *(rafeeq)* 

✍🏻✍🏻      *Salman*       *+919700067779* ✍🏻✍🏻

*Note : - ఈ msg లను ముందుకు పంపిస్తూ, మన ఇస్లాం చరిత్ర గురించి మన ముస్లిం సోదరులకు, సోదరీమణులకు తెలియజేస్తారని ఆశిస్తున్నాము.*

No comments:

Post a Comment