121

🕌🕌🕌       *బిస్మిల్లాహ్ హిర్రహ్మా నిర్రహీమ్*        🕌🕌🕌

🛐🛐   *అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు*   🛐🛐
🤚🏻✋🏻     *అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను*      🤚🏻✋🏻

 *~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~* 

🕋🕋🕋             *ఇస్లాం చరిత్ర* *- 121*             🕋🕋🕋

☪🇸🇦☪ *ముహమ్మద్ (సల్లం) జీవితచరిత్ర - 36* ☪🇸🇦☪

 *■×=×=×=×=×=×=×=×=×=×=×=×=×=×=×=×=×=×=×■*

                   *రెండవ దశ* 

        *బహిరంగ దైవసందేశ ప్రచారం* 

మూడు సంవత్సరాల పాటు దైవసందేశ ప్రచారం రహస్యంగా, వ్యక్తిగతంగా సాగింది. ఆ తరువాత అవతరించిన దైవవాణిలో దైవప్రవక్త (సల్లం)ను, బాహాటంగా తన జాతికి సత్యధర్మాన్ని బోధించమని, వారిని దైవమార్గం వైపునకు పిలువమని, అసత్యంతో ఢీ కొనమని, విగ్రహాల యదార్థతను బట్టబయలు చేయమని ఆదేశించడం జరిగింది.

 _↑ దైవవాణి ఇలా అవతరించింది ↓ : -_ 

 *నీ సమీప బంధువులను (దైవ శిక్ష గురించి) హెచ్చరించు. విశ్వసించి, నిన్ను అనుసరించే వారి పట్ల మృదువుగా మసులుకో. ఒకవేళ వారు గనుక నీకు అవిధేయత చూపితే, "మీ పోకడలతో నాకు ఎటువంటి సంబంధం లేదు" అని చెప్పు. సర్వాధిక్యుడు, కరుణామయుడు అయిన అల్లాహ్ నే నమ్ముకో. నువ్వు (ఒంటరి ఆరాధనలో) నిలబడి ఉన్నప్పుడు ఆయన నిన్ను చూస్తూ ఉంటాడు. సాష్టాంగపడేవారి మధ్య (కూడా) నీ కదలికలను (కనిపెట్టుకుని ఉంటాడు). నిశ్చయంగా ఆయన అన్నీ వినేవాడు, అంతా తెలిసినవాడు. (ఖుర్ఆన్ 26:214-220)* 

దైవప్రవక్త సందేశం కేవలం సమీప బంధువులకే పరిమితం అయి ఉండదు. అది యావత్తు జాతినుద్దేశించినదై ఉంటుంది. ఇక అంతిమ దైవప్రవక్త ముహమ్మద్ (సల్లం)గారైతే సమస్త మానవాళి కోసం మార్గదర్శకునిగా, కారుణ్యమూర్తిగా చేసి పంపబడ్డారు. అయితే దగ్గరి బంధువులను హెచ్చరించమని చెప్పడం విశ్వజనీన, సార్వజనీన భావాలకు విరుధ్ధాంశం కూడా కాదు. పైగా సార్వజనీన సందేశ కార్యంలో ఇదొక భాగం మాత్రమే. ఇతరులను సన్మార్గంవైపు పిలిచే ముందు, దగ్గరి బంధువులను ఆ మార్గంలోకి తేవాలన్న భావం అందులో అంతర్లీనమై ఉంది. దైవప్రవక్త హజ్రత్ ఇబ్రాహీం (అలైహి) కూడా, ప్రజాసామాన్యాన్ని ఏకదైవారాధన వైపు పిలిచే ముందు, తన తండ్రి "తారెహ్"ని దేవుని ఏకదైవత్వం వైపు ఆహ్వానించారు.

 *దైవసందేశ ప్రకటనకు ప్రథమ ఆదేశం : -* 

ఈ విషయంలో ప్రప్రథమంగా *"వ అన్జిర్ అషీరతకల్ అఖ్'రబీన్" (ఓ ప్రవక్తా! నీ దగ్గరి బంధువుల్ని (దైవ శిక్ష గురించి) హెచ్చరించు.* అనే దైవవాణి అవతరించింది. ఇది *"దివ్య ఖుర్ఆన్"* లోని *"షుఅరా"* అధ్యాయంలోని ఆయత్. ఈ అధ్యాయంలో మొదటగా హజ్రత్ *మూసా (అలైహి)* కు ఎదురైన పరిస్థితులను గురించి చెప్పడం జరిగింది. అంటే మూసా (అలైహి)కు దైవదౌత్య పదవి లభించిన ప్రారంభదశ వివరాలు, చివరన ఆయన (మూసా -  అలైహి) బనీఇస్రాయీల్ తో సహా హిజ్రత్ చేసి ఫిర్ ఔన్, ఫిర్ ఔన్ జాతి నుండి విముక్తులైన తీరు, ఫిర్ ఔన్ మరియు ఫిర్ ఔన్ సహచరులు నీట ముంచబడిన వైనం వివరించి చెప్పడం జరిగింది. మరో విధంగా చెప్పాలంటే, మూసా (అలైహి) ఫిర్ ఔన్ ను మరియు ఫిర్ ఔన్ జాతిని అల్లాహ్ ధర్మం వైపునకు పిలవడానికి ఏయే పరిస్థితులను ఎదుర్కోవలసి వచ్చిందో వివరించడం జరిగిందన్న మాట.

దైవప్రవక్త (సల్లం)కు, తన జాతిలో బాహాటంగా ప్రచార కార్యక్రమం చేపట్టాలని ఆదేశం ఇవ్వబడ్డప్పుడు, మూసా (అలైహి)కు ఎదురైన పరిస్థితుల్ని ఏకరువుపెట్టడానికి గల కారణం, బాహాటంగా దైవమార్గం వైపునకు పిలవడం వలన సత్యనిరాకరణ, దౌర్జన్యాలు తప్పకుండా ఎదుర్కోవలసి వస్తుందని, మీరు (సల్లం), మీ అనుయూయులు దానికి సిద్ధమై ఉండాలని హెచ్చరిక చేయబడిందన్నది నా అభిప్రాయం.

మరో వంక, ఈ అధ్యాయంలో దైవప్రవక్తల్ని తిరస్కరించిన జాతులు, ఉదాహరణకు ఫిర్ ఔన్ మరియు ఫిర్ ఔన్ జాతే కాకుండా నూహ్ (అలైహి) జాతి, ఆద్, సమూద్ జాతులు; ఇబ్రాహీం (అలైహి), లూత్ (అలైహి) జాతులు, అయికా ప్రజలు అనుభవించిన దుష్పరిణామాలేమిటో వివరించబడ్డాయి. దీని ఉద్దేశ్యం బహుశా, మహాప్రవక్త (సల్లం)గారి దైవదౌత్యాన్ని తిరస్కరించే వారికి, ఈ తిరస్కార వైఖరి నవలంభించడం వలన ఎలాంటి దుష్పరిణామాలను చవిచూడవలసి ఉంటుందో అని హెచ్చరిక, దైవధిక్కార నేరం క్రింద వారిని ఎలా శిక్షించటం జరుగుతుందో అన్న సత్యాన్ని విడమర్చి చెప్పడమే కాకుండా ప్రవక్త (సల్లం)ను విశ్వసించడం వల్ల ఎలాంటి బహుమానం లభిస్తుందో వివరించడమైనా అయి ఉండవచ్చు.

 *దగ్గరి బంధువుల్లో సందేశ ప్రచారం : -* 

ఈ ఆయత్ యొక్క సూచన ప్రకారం, తన కుటుంబంలోని మరియు తన ఖురైష్ తెగలోని ముఖ్యమైన వ్యక్తులకు ముహమ్మద్ (సల్లం) తన సందేశం చెప్పాల్సిన సమయం వచ్చేసింది.

"కానీ, నేను చెప్పే దానికి వాళ్ళంతా ఎలా సమ్మతిస్తారు? వాళ్ళు ఇష్టపూర్వకంగా పూజించుకుంటున్న తమ దేవీదేవతలను ఎలా వదులుకుంటారు? *“అల్లాహ్ (నిజమైన ఆరాధ్యుడు) ఒకే ఒక్కడు”* అని వారు ఎలా విశ్వసిస్తారు?" ఈ విధంగా మహానీయ ముహమ్మద్ (సల్లం) ఆలోచించసాగారు.

ఖచ్చితంగా ఈ వ్యవహారమంతా ఏదో ఒక ఇబ్బందికి దారి తీస్తుందని ముహమ్మద్ (సల్లం)కు తెలుసు. అయినా సరే, ఆయన (సల్లం) ఈ పని చేయక తప్పదు. ఇది అల్లాహ్ ఆజ్ఞ. అల్లాహ్ మీద భారం వేసి కర్తవ్యాన్ని నిర్వర్తించటం తప్పించి ఆయనకు ఇంకో మార్గం లేదు.

తనకు ఆదేశించిన ఆజ్ఞ ప్రకారం దైవప్రవక్త (సల్లం) తన బంధువులందరినీ ఓ చోట సమావేశపరచి, దైవసందేశాన్ని భోధించాలని నిర్ణయించుకున్నారు. "కానీ, వారందరినీ ఒకే చోట ఎలా సమావేశపరచాలి?" అన్న విషయం గురించి ఆయన (సల్లం) తీవ్రంగా ఆలోచించసాగారు. ఆ పిదప, బంధుమిత్రులందరినీ విందుభోజనానికి పిలిచి, వారి ముందు దైవసందేశం ఉంచాలని అనుకున్నారు.

అప్పటి వరకు రహస్యంగా సాగుతున్న ఈ కొత్త ధర్మం గురించి దైవప్రవక్త (సల్లం) సన్నిహితులకు, బంధుమిత్రులందరికీ తెలిసిపోయింది. అప్పటివరకు ప్రశాంత జీవితం గడుపుతున్న మక్కా ప్రజల నడుమ, ఈ కొత్త ధర్మం గురించి గుసగుసలు ఎక్కువయ్యాయి.

ఓ రోజు మహనీయ ముహమ్మద్ (సల్లం) తన కుటుంబీకులతో దైవదౌత్యం గురించి చర్చిస్తున్నారు. ఆ సమయంలో వారితో, ఖురైష్ తెగ వారిని, అరబ్ జాతి ప్రజల్ని, సమస్త మానవ జాతిని ఎలా సంస్కరించాలో, ఎలా సత్యధర్మం వైపు మరలించాలో అనే విషయాల గురించి లోతుగా చర్చించారు.

ఈ సందర్భంలో ఒక విందు ఏర్పాటు చేయాలన్న తన నిర్ణయాన్ని కూడా తెలిపారు.

దైవదౌత్యం అప్పగించబడిన తొలినాళ్ళ నుండే దైవప్రవక్త (సల్లం)కు మరియు ఇస్లాం ధర్మానికి బద్ధశత్రువైపోయిన "అబూ లహబ్"ని మాత్రం ఈ విందు భోజనానికి ఆహ్వానించరాదని తన కుటుంబసభ్యులు, దైవప్రవక్త (సల్లం)కు సలహా ఇచ్చారు.

కానీ, ఈ సలహాను ఆయన (సల్లం) తిరస్కరిస్తూ, అందరితోపాటు "అబూ లహబ్" ని కూడా ఆహ్వానించారు.

 *విందు రోజు : -* 

మొత్తానికి ఈ ఆయత్ అవతరించిన వెంటనే దైవప్రవక్త (స) చేసిన మొట్టమొదటి పని, బనీ హాషిం తెగవారిని ఓ చోట సమావేశపరచడం. వారి వెంట బనీ ముత్తలిబ్ బిన్ అబ్దె మునాఫ్ కు చెందిన ఓ వర్గం కూడా ఉంది. సమావేశమైన వారు మొత్తం నలభై అయిదు మంది. 

ఈ విందుకు కారణం ఏమిటో ఎవరికీ అర్థం కాలేదు. అందరూ భోజనాలు ముగించిన తరువాత ముహమ్మద్ (సల్లం), ఈ విందుకు కారణం ఏం చెబుతారో విందామని కుతూహలంతో ఎదురుచూడసాగారు.

కొన్ని క్షణాల తరువాత దైవప్రవక్త (సల్లం) విషయం చెబుదామని లేచి నిలబడ్డారు. కాని అబూ లహబ్, దైవప్రవక్త (సల్లం) మాటలకు అడ్డుతగులుతూ, తన మాటలను వినిపించాడు.

“ముహమ్మద్ (సల్లం), చూడు! వీరంతా నీ పినతండ్రులు, పినతండ్రి కుమారులు. వీరితో మాట్లాడు. కాని మూర్ఖత్వం వదిలెయ్యి. నీ కుటుంబం అరబ్బులందరిని ఎదుర్కోలేదు సుమా! నిన్ను వారించడానికి వీరందరికంటే నాకే హక్కు అధికం. కాబట్టి నీ తండ్రి కుటుంబమే నిన్ను అడ్డుకోవడానికి చాలు. నీవే గనక నీ మాట మీదనే నిలబడతానంటే మాత్రం ఖురైష్ కు చెందిన తెగలన్నీ నీ పైకి వచ్చిపడతాయి. మిగతా అరబ్బులు కూడా వారికి సహాయపడతారు. తండ్రి కుటుంబాన్ని వినాశనానికి గురి చేయడానికి కారణభూతుడవు నీవే అవుతావు జాగ్రత్త!” అని ముగించాడు.

ప్రవక్త (స) మౌనాన్ని వహించారు. ఆ సమావేశంలో ఎలాంటి చర్చ జరుగలేదు. ఎన్నో విషయాలు చెప్పాలనుకున్న దైవప్రవక్త (సల్లం) ఏమీ చెప్పలేక నిస్సహాయంగా చూస్తూ ఉండిపోయారు. కాని ఏనాటికైనా బంధువులు తన సందేశం విని సన్మార్గం అవలంభిస్తారన్న ఆశతో ఆయన (సల్లం) సహనం వహించారు.

ఆ తరువాత ప్రవక్త (సల్లం) మరోమారు బంధుమిత్రులందరినీ సమావేశపరచి, దైవసందేశాన్ని వినిపించాలని అనుకున్నారు.

 *Insha Allah రేపటి భాగములో, రెండవ సారి ఏర్పాటు చేసిన విందులో జరిగిన మహత్యం గురించి తెలుసుకుందాము.* 

✍🏻✍🏻     *®@£€€q* *+97433572282*      ✍🏻✍🏻
                    *(rafeeq)* 

✍🏻✍🏻      *Salman*       *+919700067779* ✍🏻✍🏻

*Note : - ఈ msg లను ముందుకు పంపిస్తూ, మన ఇస్లాం చరిత్ర గురించి మన ముస్లిం సోదరులకు, సోదరీమణులకు తెలియజేస్తారని ఆశిస్తున్నాము.*

No comments:

Post a Comment