118

🕌🕌🕌       *బిస్మిల్లాహ్ హిర్రహ్మా నిర్రహీమ్*        🕌🕌🕌

🛐🛐   *అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు*   🛐🛐
🤚🏻✋🏻     *అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను*      🤚🏻✋🏻

 *~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~* 

🕋🕋🕋             *ఇస్లాం చరిత్ర* *- 118*             🕋🕋🕋

☪🇸🇦☪ *ముహమ్మద్ (సల్లం) జీవితచరిత్ర - 33* ☪🇸🇦☪

 *■×=×=×=×=×=×=×=×=×=×=×=×=×=×=×=×=×=×=×■*

                  *ప్రథమ దశ* 

        *దైవసందేశ ప్రచార యత్నం* 

 *రహస్య సందేశ ప్రచారానికి సంబంధించిన మూడు సంవత్సరాలు : -* 

మక్కా, అరబ్బుల ధార్మిక కేంద్రం అన్న విషయం మనకు తెలిసిందే. ఇది, కాబా సంరక్షకులకుతోడు, ఎంతో గౌరవభావంతో చూడబడే విగ్రహాల పరిరక్షకులు కూడా నివసించే నగరం. అందుకని సుదూర ప్రాంతాలకంటే మక్కాలో సంస్కరణలు చేపట్టడం కొంత కష్టంతో కూడుకున్న పని. కష్టాలను, కడగండ్లను ఎదుర్కొనే దృఢచిత్తులే ఈ కార్యాన్ని చేపట్టగలరు. ఈ పరిస్థితి దృష్ట్యా, మక్కాలో హఠాత్తుగా సంచలనం చెలరేగకుండా ఉండాలంటే దైవ సందేశ ప్రచార కార్యక్రమాన్ని రహస్యంగా ప్రారంభించాలన్నది దేవాభీష్టం.

 *ప్రప్రథమ ఇస్లాం ధర్మానుయాయులు : -* 

మహాప్రవక్త ముహమ్మద్ (సల్లం) ముందస్తుగా, తనతో లోతైన సంబంధ బాంధవ్యాలు గల దగ్గరి వ్యక్తులకు ఇస్లాం ధర్మాన్ని బోధించాలి అనేది ఎంతో సహజమైన విషయం. అంటే, తన కుటుంబ సభ్యులకు, మిత్రులకు ఇస్లాం ధర్మాన్ని బోధించడమన్నమాట. కనుక ఆయన (సల్లం) మొట్టమొదటిగా వారినే ఎంచుకొని ఇస్లాం ధర్మం వైపునకు పిలవడం జరిగింది. ఇలా ప్రారంభంలో ప్రవక్త శ్రీ (సల్లం), సత్కార్యాల విషయంలో తనకు తోడునీడగా ఉంటూ, సత్యం, సదాచరణ వైపునకు మొగ్గుచూపుతూ, తన సత్యసంధతను శంకించకుండా సతతం తనకు తోడునీడగా ఉండే వారినే ఇస్లాం ధర్మం వైపునకు ఆహ్వానించారు. ఇదేకాదు, ఎవరినైతే ఇస్లాం ధర్మం వైపునకు ఆహ్వానించారో వారిలోనూ, మహాప్రవక్త (సల్లం) సత్యసంధత, ఔన్నత్యం, హృదయ నైర్మల్యం విషయంలో ఏమాత్రం అనుమానంలేని కొందరు, వెంటనే ఆయన (సల్లం) ఆహ్వానాన్ని అంగీకరించి ఇస్లాం ధర్మాన్ని స్వీకరించడం జరిగింది. వీరు ఇస్లామీయ చరిత్రలో "సాబికూనల్ అవ్వలీన్" (ప్రప్రథమంగా అడుగు ముందుకు వేసిన ఘనులు)గా కీర్తించబడుతున్నారు.

వీరిలో ప్రముఖంగా ప్రవక్త శ్రీ (సల్లం) భార్య, ఉమ్ముల్ మోమినీన్ (ముస్లిముల మాతృమూర్తి) హజ్రత్ ఖదీజా (రజి) బిన్తే ఖౌలీద్, ఆమెచే స్వాతంత్రం పొందిన బానిస (బాలుడు) "హజ్రత్ జైద్ బిన్ సాబిత్ (రజి) బిన్ షర్జీల్ కల్బీ, ★. ప్రవక్త శ్రీ (సల్లం) పినతండ్రి కుమారుడు హజ్రత్ అలి (రజి) బిన్ అబూ తాలిబ్. ఈయన ప్రవక్త (సల్లం) సంరక్షణ, పోషణల్లో ఉండిన బాలుడు, ఆయన (సల్లం) గారి మిత్రుడు హజ్రత్ అబూబక్ర్ సిద్దీఖ్ (రజి)లు. వీరందరూ మొదటి రోజునే ఇస్లాం ను స్వీకరించి ముస్లిములైనవారు.

 *ఇస్లాం ప్రచారంలో పాల్గొన్న అబూబక్ర్ సిద్దీఖ్ (రజి) : -* 

ఆ తరువాత హజ్రత్ అబూబక్ర్ సిద్దీఖ్ (రజి) ఇస్లాం ప్రచారంలో చురుకుగా పాల్గొన్నారు. ఆయన స్వభావం హృదయాలను ఆకట్టుకునే స్వభావం. దానికితోడు ఆయన సున్నిత మనస్కుడు, సద్గుణ సంపన్నుడు, నైతికతకు మారుపేరు, విశాల హృదయుడూను. ఆయన గారి ఈ సుగుణాలు, సాత్వికత, దూరదృష్టి, వ్యాపారం, సత్సాంగత్యాన్ని చూసి ప్రజలు ఆయన వద్దకు వచ్చిపోవడం కద్దు. కాబట్టి ఆయన తన వద్దకు వచ్చిపోయే వారిలోనూ, నమ్మకం గల మిత్రులకు ఇస్లాం ధర్మాన్ని బోధించనారంభించారు. ఆయన కృషి ఫలితంగా, హజ్రత్ ఉస్మాన్ (రజి), హజ్రత్ జుబైర్ (రజి), హజ్రత్ అబ్దుర్రహ్మాన్ బిన్ ఔఫ్ (రజి), హజ్రత్ సఅద్ బిన్ అబీ వికాస్ (రజి), హజ్రత్ తల్హా బిన్ ఉబైదుల్లా (రజి)లు ఇస్లాం ధర్మాన్ని స్వీకరించారు. ఈ మహానుభావులు ఇస్లాం కు ముందట నిలిచి పరిరక్షించే దళం (vanguard)గా పని చేసినవారు.

 _(★ → హజ్రత్ జైద్ బిన్ సాబిత్ (రజి), ఓ యుద్ధంలో బందీ అయి బానిసగా అమ్ముడుపోయినవారు. తరువాత హజ్రత్ ఖదీజా (రజి), ఆయన (జైద్)కు యజమానురాలయ్యారు. ఖదీజా (రజి), జైద్ (రజి) ను ప్రవక్త (సల్లం)కు సమర్పించారు. ఆ తరువాత జైద్ (రజి) గారి తండ్రి, పినతండ్రి ఆయన్ను ఇంటికి తీసుకువెళ్ళడానికి ప్రయత్నిస్తే, జైద్ (రజి) తండ్రిని, పినతండ్రిని వదిలేసి దైవప్రవక్త (సల్లం) వద్దనే ఉండడానికి ఇష్టపడ్డారు. ఆ తరువాత అరబ్బు సంప్రదాయం ప్రకారం జైద్ (రజి)ను దత్తత తీసుకోవడం జరిగింది. అప్పటి నుండి జైద్ (రజి)ను "జైద్ బిన్ ముహమ్మద్ (సల్లం)" అంటే ముహమ్మద్ (సల్లం) గారి కుమారునిగా పిలవడం జరిగింది. చివరికి ఇస్లాం ధర్మం ఈ సంప్రదాయాన్ని పరిసమాప్తం చేసివేసింది.)_ 

మిగిలినది Insha Allah రేపటి భాగములో....,

✍🏻✍🏻     *®@£€€q* *+97433572282*      ✍🏻✍🏻
                    *(rafeeq)* 

✍🏻✍🏻      *Salman*       *+919700067779* ✍🏻✍🏻

*Note : - ఈ msg లను ముందుకు పంపిస్తూ, మన ఇస్లాం చరిత్ర గురించి మన ముస్లిం సోదరులకు, సోదరీమణులకు తెలియజేస్తారని ఆశిస్తున్నాము.*

No comments:

Post a Comment