256

🕌🕋🕌🕋 *బిస్మిల్లాహ్ హిర్రహ్మా నిర్రహీమ్* 🕋🕌🕋🕌

🇸🇦🤚🏻✋🏻🇸🇦 *అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను* 🇸🇦🤚🏻✋🏻🇸🇦

❂✸••••✸•••✸•••✸•••✸☆✸•••✸•••✸•••✸••••✸❂

☪🕋🛐🕌      *ఇస్లాం చరిత్ర - 256*       🕌🛐🕋☪

🇸🇦🇸🇦      *ముహమ్మద్ (సల్లం) జీవితచరిత్ర - 171*      🇸🇦🇸🇦

❂✸••••✸•••✸•••✸•••✸☆✸•••✸•••✸•••✸••••✸❂

*6. గజ్వయె నజద్ : -*

బనీ నజీర్ పోరాటంలో ఎలాంటి త్యాగాలు చేయకుండానే ముస్లింలు విజయాన్ని సాధించగలిగారు. దీనివల్ల మదీనాలో నెలకొన్న ఇస్లామీయ అధికారం మరింత దృఢపడింది. వంచకులు నిరాశకు గురైపోయారు. ఇప్పుడు వారికి బహిరంగంగా ఏ పనీ చేసే ధైర్యమూ లేదు.

ఈ పోరాటం అనంతరం దైవప్రవక్త (సల్లం)కు బద్దూలను అణచివేయడానికి దృష్టిని కేంద్రీకరించే అవకాశం లభించింది. ఈ బద్దూలు ఉహద్ పోరాటం జరిగిన వెంటనే ముస్లిములను అనేక కడగండ్లకు గురిచేశారు. ఎంతో పాశవికంగా ఇస్లాం ధర్మానుయాయులపై దాడులు చేసి వారిని చంపేశారు. ప్రస్తుతం వారి ధైర్యం మరింత హెచ్చి మదీనాపై దాడి చేయడానికి సంసిద్ధులవుతున్నారు.

బనూ నజీర్ పోరాటం ముగించుకొని దైవప్రవక్త (సల్లం), ఈ బద్దూలను అణచడానికి సిద్ధమయ్యారో లేదో, 'బనీ గత్ఫాన్'కు చెందిన రెండు తెగలు 'బనూ ముహారిబ్' మరియు 'బనూ సఅలబా'లు కలిసి 'బద్దూలు' మరియు 'ఆరాబీ'లను కూడగట్టుకొని మదీనాపై దాడి చేయాలని చూస్తున్నారన్న వార్త దైవప్రవక్త (సల్లం)కు అందింది.

ఈ వార్త అందగానే మహాప్రవక్త (సల్లం), నజద్ పై దాడి చేసే నిర్ణయం గైకొన్నారు. తన నాలుగువందల మంది అనుచరుల్ని తీసుకొని నజద్ ప్రాంతానికి బయలుదేరారు. అలా, నజద్ ఎడారిలో చాలా దూరం వరకు చొచ్చుకొని వెళ్ళిపోయారు. దీని లక్ష్యం, ఆ కఠిన హృదయాలైన బద్దూలను భయభీతులుగా చేయాలని, తిరిగి వారికి ముస్లింలకు వ్యతిరేకంగా ఇదివరకటి తీవ్రమైన చర్యలు గైకొనే ధైర్యం లేకుండా చేయాలన్నదే.

ఇటు తలబిరుసు గల బద్దూలు, దోపిడీలకు, హత్యలకు సమాయత్తమవుతూ ఉండగానే, ముస్లిములు హఠాత్తుగా వారిపై విరుచుకుపడుతున్నారనే వార్త అందింది. భయకంపితులై పారిపోయి పర్వతాల శిఖరాలపై దాగి కూర్చున్నారు. ముస్లింలు ఈ దోపిడీగాళ్ళ తెగలపై తమ భయాన్ని ఆవహింపజేసి ప్రశాంతంగా మదీనాకు తిరిగి వచ్చేశారు.

సీరత్ చరిత్రకారులు, రబీ ఉల్ ఉఖ్రా లేదా జమాదిల్ ఊలా మాసాలు హిజ్రీ శకం - 4లో నజద్ ప్రాంతంలో జరిగిన ఓ గజ్వా గురించి ప్రత్యేకంగా చెబుతారు. ఆ గజ్వా, 'గజ్వయె జాతుర్రిఖాఖ్' అని వారి వాదన. ఆధారాల ప్రకారం, ఆ రోజుల్లో నజద్ ప్రాంతంలో ఓ గజ్వా చోటుచేసుకున్న విషయం యదార్థం. ఎందుకంటే, మదీనా పరిస్థితులే అప్పుడు అలా ఉన్నాయి మరి.

అబూ సుఫ్'యాన్ ఉహద్ యుద్ధం నుండి వెళ్ళిపోతూ మరుసటి సంవత్సరం బద్ర్ మైదానంలో మరో యుద్ధం కోసం సవాలు విసిరాడు. ఆ సవాలును ముస్లింలు స్వీకరించారు కూడా. ఇప్పుడు ఆ సమయం దాపురిస్తూ ఉంది. యుద్ధ వ్యూహం దృష్ట్యా, బద్దూలు మరియు ఆరాబీల పీచమణచకుండా బద్ర్ లాంటి మహా సంగ్రామంలో పాల్గొనడానికి మదీనాను ఖాళీ చేసి వెళ్ళడం సరైనది కాదు. బద్ర్ యుద్ధం లాంటి మరో యుద్ధంలో పాల్గొనే ముందు ఈ బద్దూల పీచమణచి వారిని మదీనా వైపునకు రాకుండా చేయడం కూడా ఒక వ్యూహమే అనాలి.

ఇక మిగిలింది, రబీ ఉల్ ఉఖ్రా మరియు జమాదిల్ ఊలా మాసాల్లో (హిజ్రీ శకం 4) సంభవించినది ఈ గజ్వాయే, గజ్వయె జాతుర్రిఖాఖ్ అన్నది మా పరిశోధన ప్రకారం సరైనది కాదు. ఎందుకంటే 'హజ్రత్ అబూ హురైరా (రజి)' ఖైబర్ యుద్ధానికి కొన్ని రోజులకు పూర్వమే ఇస్లాం స్వీకరించారు. అలాగే 'అబూ మూసా అష్అరీ (రజి)' కూడా ముస్లిమై యమన్ నుండి బయలుదేరి వచ్చారు. ఆయన వచ్చి దైవప్రవక్త (సల్లం)ను కలిసినది ఖైబర్ లోనే. కాబట్టి గజ్వయె జాతుర్రిఖాఖ్, గజ్వయె ఖైబర్ తరువాత సంభవించిన పోరాటం కావచ్చు.

హిజ్రీ శకం - 4 తరువాత కొంతకాలానికి గజ్వయె జాతుర్రిఖాఖ్ సంభవించినదన్న దానికి ఓ ఆధారం, దైవప్రవక్త (సల్లం) ఆ యుద్ధంలో 'సలాతుల్ ఖౌఫ్' చేయడం. ★

సలాతె ఖౌఫ్ మొట్టమొదటిగా 'గజ్వయె బనూ అస్ఫాన్'లో చేయడం జరిగింది. గజ్వయె అస్ఫాన్, గజ్వయె ఖందఖ్ తరువాత జరిగిన పోరాటం అనడంలో ఎవరికీ భేదాభిప్రాయం లేదు. గజ్వయె ఖందఖ్ కాలం హిజ్రీ శకం - 5కు సంబంధించినది. గజ్వయె అస్ఫాన్, హుదైబియా ప్రయాణానికి సంబంధించిన ఓ సంఘటన. హుదైబియా ప్రయాణం హిజ్రీ శకం - 6 చివరి కాలంలో జరిగింది. ఆ ప్రయాణం నుండి తిరిగివచ్చి మహాప్రవక్త (సల్లం) ఖైబర్ వైపునకు బయలుదేరారు. దీని ప్రకారం, గజ్వయె జాతుర్రిఖాఖ్ సంభవించిన కాలం ఖైబర్ తరువాత సంభవించిన కాలమని ఋజువు అవుతోంది.

_(★→ యుద్ధంలో చేసే నమాజును 'సలాతుల్ ఖౌఫ్' అంటారు. ఈ నమాజు చేసే విధానం ఏమిటంటే, సగం సైన్యం ఆయుధధారి అయి ఇమామ్ వెనుక నిలబడి నమాజు చేయాలి. తక్కిన సగం సైన్యం ఆయుధాలు ధరించి శత్రువును కనిపెట్టుకుని ఉండాలి. ఒక రకాత్ అయిన తరువాత ఈ సైన్యం ఇమామ్ వెనుకకు వచ్చేయాలి. మొదటి సైన్యం తిరిగి వెళ్ళి శత్రువును కనిపెట్టుకొని ఉండాలి. ఇమామ్ తన నమాజు రెండవ రకాత్ పూర్తి చేసిన తరువాత సైన్యం తమ తమ రకాత్ లను ఇదివరిలా పూర్తి చేసుకోవాలి. ఇలాంటి నమాజ్ కు సంబంధించినవి ఇలాంటివే మరికొన్ని విధానాలు ఉన్నాయి. అవి హాదీసు గ్రంథాల్లో లభిస్తాయి.)_

*7. రెండవ బద్ర్ యుద్ధం : - ↓*

*In Sha Allah రేపటి భాగంలో....; →*

✏✏    *®@£€€q      +97433572282*     ✏✏      
                *(rafeeq)*

✏✏      *Salman       +919700067779*   ✏✏

*Note : - ఈ msg లను ముందుకు పంపిస్తూ, మన ఇస్లాం చరిత్ర గురించి మన ముస్లిం సోదరులకు, సోదరీమణులకు తెలియజేస్తారని ఆశిస్తున్నాము.*

No comments:

Post a Comment