253

🕌🕋🕌🕋 *బిస్మిల్లాహ్ హిర్రహ్మా నిర్రహీమ్* 🕋🕌🕋🕌

🇸🇦🤚🏻✋🏻🇸🇦 *అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను* 🇸🇦🤚🏻✋🏻🇸🇦

❂✸••••✸•••✸•••✸•••✸☆✸•••✸•••✸•••✸••••✸❂

☪🕋🛐🕌  *ఇస్లాం చరిత్ర - 253*   🕌🛐🕋☪

🇸🇦🇸🇦  *ముహమ్మద్ (సల్లం) జీవితచరిత్ర - 168*  🇸🇦🇸🇦

❂✸••••✸•••✸•••✸•••✸☆✸•••✸•••✸•••✸••••✸❂

*5. గజ్వయె బనూ నజీర్ : - 1*

యూదులకు ఇస్లాం అన్నా, ముస్లిములు అన్నా గిట్టేది కాదన్న విషయం, వారు రణధీరులు కాకపోవడం వలన కుట్రలు, కుతంత్రాల మాధ్యమంగానే తమ పబ్బం గడుపుకుంటూ, ఇస్లాంకు వ్యతిరేకంగా రంగం సిద్ధం చేసి దాన్ని సర్వనాశనం చేసే ప్రయత్నాలు చేస్తున్నారనే విషయం మనం ఇదివరకు చెప్పుకున్నదే.

ముస్లిములతో చేసుకున్న ఒప్పందాన్ని తుంగలో తొక్కి, వారిని సకల విధాల బాధలకు గురిచేయడం వారి అలవాటుగా మారిపోయింది. అయితే 'బనీ ఖైనుఖా' దేశ బహిష్కరణ మరియు 'కఅబ్ బిన్ అష్రఫ్' హత్యతో వారి ధైర్యం కాస్తా సన్నగిల్లిపోయింది. వారు భయభీతులై మిన్నకుండిపోవలసివచ్చింది. కాని ఉహద్ యుద్ధం తరువాత వారికి ధైర్యం తిరిగి వచ్చినట్లయింది. వారు బాహాటంగా ముస్లిములతో చేసుకున్న ఒప్పందాన్ని ఉల్లంఘించారు. వారు మదీనాలోని వంచకులతోనూ, మక్కాలోని ముష్రిక్కులతోనూ తిరిగి రహస్య సంబంధాలు ఏర్పర్చుకున్నారు. ముస్లింలకు వ్యతిరేకంగా ముష్రిక్కులకు చేయూతనివ్వసాగారు.

దైవప్రవక్త (సల్లం)కు ఇదంతా తెలిసినప్పటికీ సహనం వహించేవారు. కాని 'రజీ' మరియు 'మఊనా' దుర్ఘటనల తరువాత వారి ధైర్యం, తెగింపు హద్దులు మీరాయి. వారు మహాప్రవక్త (సల్లం)ను అంతమొందించే పథకాన్ని సిద్ధం చేశారు. ఆ పథకం వివరాలు ఇలా ఉన్నాయి....; ↓

దైవప్రవక్త (సల్లం), అమ్రూ బిన్ ఉమయ్యా (రజి)తోపాటు, మరికొందరు అనుచరుల్ని వెంటబెట్టుకొని 'బనీ నజీర్' యూదుల దగ్గరకు వెళ్ళారు.

బనీ నజీర్ యూదులు, కోట ముఖద్వారం తెరిచి దైవప్రవక్త (సల్లం)కు స్వాగతం చెప్పారు. ఆయన (సల్లం)ను ఎంతో గౌరవమర్యాదలతో తమ ఇళ్ళకు తీసుకువెళ్ళారు. దైవప్రవక్త (సల్లం), వారి మిద్దె గోడకు ఆనుకొని కూర్చున్నారు. అనుచరులు ఆయన (సల్లం) చుట్టూ కూర్చున్నారు.

ఆ తర్వాత ప్రవక్త (సల్లం), వారి నుండి 'బనూ కిలాబ్'కు చెందిన ఆ ఇద్దరు హతుల 'దీత్ (రక్త పరిహారం)' సహాయం కోసం మాట్లాడారు (వీరిద్దరిని 'అమ్రూ బిన్ ఉమయ్యా (రజి)' పొరపాటున హత్య చేసిన విషయం మనకు తెలుసు).

*"మీరు మాతో స్నేహ ఒప్పందం చేసుకొని ఉన్నారు గనక, ఒక విషయంలో మేము మీతో సంప్రదించి మీ సహాయం తీసుకోవాలని వచ్చాము."* అన్నారు దైవప్రవక్త (సల్లం).

*"ఆ.... తప్పకుండా సంప్రదించండి. ఆ విషయం ఏమిటో సెలవియ్యండి."* అన్నారు బనీ నజీర్ యూదులు.

*"ఒక ముస్లిం పొరపాటున 'బనూ కిలాబ్' తెగకు చెందిన ఇద్దరు మనుషుల్ని శత్రుపక్షం వారనుకొని చంపేశాడు. అందువల్ల మేము ఇప్పుడు హతుల వారసులకు రక్తపరిహారం చెల్లించవలసి ఉంది."* అన్నారు దైవప్రవక్త (సల్లం).

*"ఓ అబుల్ ఖాసిం! ఈ విషయంలో మీరు మా సహాయం కోరుతున్నారా! అయితే తప్పకుండా సహాయం చేస్తాం. బనూ కిలాబ్ తెగ మాకు మిత్రపక్షం తెగే కదా! మేము చెబితే వాళ్ళు సంతోషంగా ఒప్పుకుంటారు. మీరు నిశ్చింతగా ఉండండి."* అన్నారు యూదులు.

తర్వాత ఆ యూదులందరూ పక్కకు వెళ్ళారు. యూదులు తమ వాగ్దానాన్ని పూర్తి చేస్తారనే ఆశతో ఎదురుచూస్తున్నారు ప్రవక్త (సల్లం). ఆయన (సల్లం) వెంట 'హజ్రత్ అబూ బక్ర్ (రజి)', 'హజ్రత్ ఉమర్ (రజి)', 'హజ్రత్ అలీ (రజి)', ఇంకొందరు సహాబా (రజి)లు ఉన్నారు.

అక్కడ నుండి బయలుదేరి వెళ్ళిన యూదుల బుద్ధీవివేకాలను షైతాను ప్రక్కదారికి మళ్ళించాడు. ఏ దురదృష్టం అయితే వారి పాలిట శాపంగా మారనుందో, షైతాను దాన్ని ఎంతో మనోహరమైనదిగా వారికి చూపుతున్నాడు.

అంటే, అలా వెళ్ళిన ఆ యూదులు పరస్పరం దైవప్రవక్త (సల్లం)ను హత్యచేసే కుట్ర పన్నడంలో మునిగిపోయారు. వారు ఓ తిరుగలి (విసుర్రాయి) బండను చూపిస్తూ, *"దీన్ని ఎత్తుకొని పైకి వెళ్ళి అక్కడ నుంచి ముహమ్మద్ (సల్లం) తలపై పడవేయడానికి ఎవరు సిద్ధంగా ఉన్నారు?"* అని అడిగారు.

ఇందుకు, వారిలో ఓ దురదృష్టవంతుడైన యూదుడు 'అమ్రూ బిన్ హజష్' నిలబడి, *"నేను దానికి సిద్ధం"* అని అన్నాడు.

ఆ బృందంలోని ఓ వ్యక్తి 'సలామ్ బిన్ ముష్కం' ఇది గమనించి, *"అలా చేయకండి! దైవసాక్షి! వారికి మీరు పన్నే పన్నాగం తెలుపబడుతుంది. ఆ తరువాత మీకూ వారికి మధ్యగల ఒప్పందాన్ని ఉల్లంఘించినట్లవుతుంది, జాగ్రత్త!"* అని హెచ్చరించాడు.

అయినా వారు అతని మాటలను ఖాతరు చేయలేదు. తమ ఈ పథకాన్ని అమలు చేయడానికి దృఢంగా నిశ్చయించుకున్న తరువాతనే అక్కడ్నుంచి లేచారు.

అటు అల్లాహ్ తరఫున 'హజ్రత్ జిబ్రీల్ (అలైహి)' మహాప్రవక్త (సల్లం) వద్దకు వచ్చారు. ఆయన (అలైహి) యూదులు పన్నుతున్న కుట్ర గురించి ఆయన (సల్లం)కు తెలియజేశారు. దైవప్రవక్త (సల్లం) వెంటనే ఆ ప్రదేశం నుండి లేచి మదీనా వైపునకు బయలుదేరారు. ఆ తరువాత తక్కిన సహాబా (రజి)లు కూడా ఆయన (సల్లం) వెనుకగా వచ్చి ఆయన (సల్లం)ను కలిశారు. *"దైవప్రవక్తా! తమరు అకస్మాత్తుగా అక్కడి నుండి ఎందుకు లేచి వచ్చేసినట్లు?"* అని అడిగారు.

దానికి సమాధానంగా మహాప్రవక్త (సల్లం), యూదుల పన్నాగం గురించి వారికి ఎరుకపరిచారు. *"యూదుల ఉద్దేశ్యాలు బాగా లేవు. నాకు వ్యతిరేకంగా కుట్ర పన్నారు. వారి ధోరణి చూసి నాకు ముందే అనుమానం కలిగింది. అది నిజమే అన్నట్లు దైవసందేశం కూడా వచ్చింది. నేను వెంటనే అక్కడి నుంచి లేచి వచ్చాను."* అన్నారు.

ఈసారి అనుచరులు మరింత ఆశ్చర్యపోయారు.

దైవప్రవక్త (సల్లం) గోడ పక్కన యూదులతో మాట్లాడుతూ కూర్చున్నారు. యూదులు, అదే మంచి అవకాశమని తలచి, వెనుక నుంచి ఇంటిపైకెక్కి దైవప్రవక్త (సల్లం) మీద పెద్ద బండరాయి పడవేసి హతమార్చడానికి పథకం వేసుకున్నారు. ఆ పని కోసమే వారిలో ఒకడు ఆ ఇంట్లోకి ప్రవేశించాడు. కాని వారి పథకం కాస్త బెడిసికొట్టింది.

*"ఎంత ఘోరానికి ఒడికట్టారు ఈ దుర్మార్గులు! వారి ధోరణి పట్ల మాకు కాస్త కూడా అనుమానం రాలేదు. దైవప్రవక్తా! మీరు అక్కడి నుంచి వచ్చేసి చాలా మంచిపని చేశారు."* అన్నారు అనుచరులు.

మదీనాకు తిరిగివచ్చిన వెంటనే మహాప్రవక్త (సల్లం) బనూ నజీర్ యూదులకు ఒక హెచ్చరిక పంపించారు.

ప్రవక్త (సల్లం), 'ముహమ్మద్ బిన్ ముస్లిమా'ను 'బనూ నజీర్' తెగ వద్దకు పంపించి, *"మీరందరూ మదీనా నుండి బయటకు వెళ్ళిపోండి. ఇక్కడ నాతో ఉండడానికి అర్హులు లేరు, మీకు పది రోజుల గడువు ఇవ్వబడుతోంది. ఆ తరువాత మీలో ఎవరైనా ఇక్కడ కనిపిస్తే అతని మెడ నరకడం జరుగుతుంది."* అని చెప్పించారు.

ఈ హెచ్చరిక విని యూదులు నిలువునా కంపించిపోయారు. ఇక ఈ ప్రాంతంలో ఉండటం తమ ధనప్రాణాలకు క్షేమకరం కాదని గ్రహించారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో యూదులకు దేశబహిష్కరణ తప్ప వేరే మార్గం కానరాలేదు. వారు కొన్ని రోజుల వరకు ప్రయాణ సన్నాహాలు చేసుకోనారంభించారు.

బనూ నజీర్ యూదులు వేరే ప్రాంతానికి వెళ్ళిపోవడానికి తీసుకున్న నిర్ణయం కపట విశ్వాసి, వంచకుల నాయకుడు 'అబ్దుల్లా బిన్ ఉబై'కి తెలిసింది. అతను వారికి ధైర్యం చెబుతూ ఇలా వార్త పంపాడు....; ↓

*"మీరంతా వెళ్ళడానికి వీల్లేదు. మీ స్థలంలోనే స్థిరంగా ఉండిపోండి. ఇక్కడ మీ తోటలు, పొలాలు ఉన్నాయి. అందమైన మేడలు, కోటలు ఉన్నాయి. వీటన్నింటిని వదిలిపెట్టి ఎక్కడికి వెళ్తారు? ఇళ్ళూ వాకిళ్ళూ వదలడానికి వీల్లేదు. నా దగ్గర రెండు వేల మంది యోధులు ఉన్నారు. వారు మీ కోటలలో ఉంటూ మిమ్మల్ని రక్షించడం కోసం వారు తమ ప్రాణాలనైనా పణంగా పెట్టగలరు. ముస్లింలే గనక మిమ్మల్ని వెళ్ళగొడితే మీ వెంట దేశబహిష్కరణకు మేమూ గురి అవుతాము. మీ గురించి ఎవరు ఒత్తిడి తెచ్చినా వినేవారం కాము. మీతోనే యుద్ధం జరిగితే మేము మీ సహాయం కోసం సిద్ధంగా ఉన్నాం. 'బనూ ఖురైజా' మరియు 'బనూ గత్ఫాన్' తెగలు కూడా మీకు మిత్రపక్షాలే. వారూ మీకు సహాయపడగలరు. మీరు మీ కోటలలో ప్రవేశించి తలుపులు బిగించుకోండి. ఆ తరువాత విషయాలు మేము చూసుకుంటాం. మీకు ఎలాంటి ప్రమాదం లేదు."* అని చెప్పి పంపించాడు.

కపట ముస్లిం నాయకుడు 'అబ్దుల్లా బిన్ ఉబై' అందించిన ఈ సందేశం వల్ల యూదులకు ప్రాణం లేచి వచ్చినట్లయింది. దేశబహిష్కరణకు గురికావడానికి బదులు ముస్లింలను ఎదుర్కునేందుకు వారు సిద్ధపడ్డారు.

ఈ హామీ మాటలు విని ఆ తెగ నాయకుడు 'హుయ్ బిన్ అఖ్తబ్' సంతోషంతో ఎగిరి గంతేశాడు. తన తెగకు కొండంత అండ దొరికిందని భావించి విర్రవీగాడు. ఆ గర్వంతో దైవప్రవక్త (సల్లం) పంపించిన హెచ్చరికను ఖాతరు చెయ్యలేదు. అతను దైవప్రవక్త (సల్లం) వద్దకు సమాధానంగా, *"మేము ఈ ప్రాంతం ఖాళీ చేసి వెళ్ళిపోయే ప్రసక్తే లేదు. మీ ఇష్టమొచ్చినట్లు చేసుకోండి."* అని తెగేసి చెప్పాడు ఆ విశ్వాసఘాతకుడు.

దైవప్రవక్త (సల్లం)కు హుయ్ బిన్ అఖ్తబ్ సందేశం అందగానే, ఆయన (సల్లం) తమ సహాబాలనందరినీ ఓ చోట సమావేశపరచి యుద్ధం చేయడానికే నిర్ణయం తీసుకున్నారు. అల్లాహ్ అక్బర్ అనే నినాదం చేస్తూ అందరూ లేచి నిలబడ్డారు.

*తరువాత జరిగినది In Sha Allah రేపటి భాగంలో....; →*

✏✏ *®@£€€q  +97433572282* ✏✏ 
             *(rafeeq)*

✏✏  *Salman    +919700067779* ✏✏

*Note : - ఈ msg లను ముందుకు పంపిస్తూ, మన ఇస్లాం చరిత్ర గురించి మన ముస్లిం సోదరులకు, సోదరీమణులకు తెలియజేస్తారని ఆశిస్తున్నాము.*

No comments:

Post a Comment