271

🕌🕋🕌🕋 *బిస్మిల్లాహ్ హిర్రహ్మా నిర్రహీమ్* 🕋🕌🕋🕌

🇸🇦🤚🏻✋🏻🇸🇦 *అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను* 🇸🇦🤚🏻✋🏻🇸🇦

❂✸••••✸•••✸•••✸•••✸☆✸•••✸•••✸•••✸••••✸❂

☪🕋🛐🕌  *ఇస్లాం చరిత్ర - 271*   🕌🛐🕋☪

🇸🇦🇸🇦  *ముహమ్మద్ (సల్లం) జీవితచరిత్ర - 186*  🇸🇦🇸🇦

❂✸••••✸•••✸•••✸•••✸☆✸•••✸•••✸•••✸••••✸❂

*ముస్లిములు, బనూ ఖురైజా తెగ వారిని బందీలుగా చేసి, ఆ తర్వాత వారిని వధిస్తున్న సందర్భం : -*

హజ్రత్ అలీ (రజి) అయితే ముస్లిములను ఉద్దేశించి, *"ఓ సైనికుల్లారా! దైవసాక్షి హజ్రత్ హమ్'జా (రజి) గారు అమరగతి పొందినట్లే నేనన్నా అమరగతిని పొందుతాను, లేదా వారి ఈ కోటను జయించనైనా జయిస్తాను"* అన్నారు.

హజ్రత్ అలీ (రజి) గారి ఈ బహిరంగ ప్రకటన విన్నంతనే బనూ ఖురైజా యూదులు ఆలస్యం చేయకుండా తమను దైవప్రవక్త (స)కు లొంగిపోయి, *"ఓ ప్రవక్తా (సల్లం)! తమరు ఏ విధంగా తీర్పు ఇచ్చినా అది మాకు సమ్మతమే"* అని అన్నారు. మహాప్రవక్త (సల్లం), పురుషుల చేతులను వెనక్కి విరిచి కట్టేయమని ఆదేశం ఇవ్వగా, ముహమ్మద్ బిన్ ముస్లిమా (రజి) గారి పర్యవేక్షణలో అందరి చేతులు కట్టివేయడం జరిగింది.

స్త్రీలను, పిల్లలను వారి నుండి వేరు చేసి దూరంగా ఉన్నారు. ఈ పరిస్థితిని చూసి అవస్ తెగకు చెందిన వారు దైవప్రవక్త (సల్లం)ను, *"తమరు బనూ ఖైనుఖాతో ఏ విధంగా ప్రవర్తించారో వీరి ఎడల కూడా అదే విధంగా ప్రవర్తించండి. బనూ ఖైనూఖా తెగ మా సోదరులైన ఖజ్రజ్ తెగకు మిత్రపక్షాలు, వీరు మాకు మిత్రపక్షాలు. కాబట్టి వీరిపై కరుణ, దయ చూపండి."* అని ప్రాధేయపడ్డారు.

ఇది విన్న దైవప్రవక్త (సల్లం) అవస్ తెగ వారిని ఉద్దేశించి, *"మీ నుండే ఓ వ్యక్తి వీరి గురించి తీర్పు చెబుతాడు, దీనికి మీరు సిద్ధమేనా?"* అని అడిగారు.

*"అవును. అది మాకు సమ్మతమైన విషయమే."* అన్నారు అవస్ తెగవారు.

*"అయితే ఈ వ్యవహారాన్ని సఅద్ బిన్ ముఆజ్ (రజి) గారికి అప్పజెబుతున్నాను."* అన్నారు మహాప్రవక్త (సల్లం).

*"మేము తమ ఈ తీర్పును సంతోషంగా స్వీకరిస్తున్నాం."* అన్నారు వారు.

ఆ తరువాత మహాప్రవక్త (సల్లం) మదీనాలో ఉన్న హజ్రత్ సఅద్ (రజి)ను పిలువనంపారు. ఆయనకు గాయం అయి ఉండడం వల్ల ఈ సైన్యంతో ఇక్కడికి రాలేని స్థితిలో ఉన్నారప్పుడు. అహ్జాబ్ యుద్ధంలో ఆయన చేతి ప్రధాన నరం ఒకటి తెగిపోయి ఉంది. ఆయన్ను కంచర గాడిదపై ఎక్కించుకొని దైవప్రవక్త (సల్లం) గారి సన్నిధికి తీసుకురావడం జరిగింది. ఆయన (రజి) దగ్గరకు రాగానే, ఆయన తెగ అవస్ వారు అన్ని వైపుల నుండి ఆయన్ను చుట్టుముట్టారు.

*"సఅద్! మీ మిత్రపక్షం అయిన బనూ ఖురైజా విషయంలో మేలు తలచి వారిపై దయ చూపండి. దైవప్రవక్త (సల్లం) మిమ్మల్ని, వారి ఎడల దయజూపే ఉద్దేశ్యంతోనే మిమ్మల్ని న్యాయనిర్ణేతగా ఎన్నుకున్నారు."* అని అన్నారు.

హజ్రత్ సఅద్ (రజి) ఏమీ మాట్లాడలేదు. ప్రజలు ఆయన్ను బలవంతం పెట్టడం చూసి, *"ఇప్పుడు సమయం వచ్చేసింది. అల్లాహ్ విషయంలో మరెవ్వరు తూలనాడినా సఅద్ మాత్రం పట్టించుకునే సమయం కాదిది."* అన్నారు.

ఇది విన్నంతనే కొందరు మదీనాకు వెళ్ళిపోయి ఖైదీలకు మరణదండన పడిందని ప్రకటించనే ప్రకటించేశారు.

హజ్రత్ సఅద్ (రజి) దైవప్రవక్త (సల్లం) సన్నిధికి రాగానే ఆయన (సల్లం) ప్రజలతో, *"లేవండి! మీ సర్దారును ఆహ్వానించడానికి లేవండి"* అని అనగా, వారంతా ఆయన్ను కంచర గాడిద మీద నుండి క్రిందికి దించారు.

*"ఓ సఅద్! వీరంతా మీ తీర్పు కోసం సంసిద్ధులై ఉన్నారు."* అన్నారు దైవప్రవక్త (సల్లం) ఆయన దగ్గరకు రాగా.

*"అయితే నేను ఇచ్చే తీర్పు అమలు చేయబడుతుందా?"* అని ప్రశ్నించారు ఆయన (రజి).

*"ఔను. మీ తీర్పే శిరోధార్యం."* అన్నారు అక్కడి వారంతా.

*"ముస్లిములు కూడా దీన్ని శిరసావహిస్తారా?"*

*"ఔను, తప్పకుండా."*

*"మరి ఇక్కడ ఉన్నవారు కూడానా?"*

ఆయన (రజి) ఉద్దేశ్యం, దైవప్రవక్త (సల్లం) కూడానా? అని చెప్పడం అన్నమాట. కాని దైవప్రవక్త (సల్లం) గారి మూర్తిమత్వాన్ని గమనించిన ఆయన తన ముఖాన్ని మరో వైపు ఉంచి అడిగిన ప్రశ్న అది.

అది గమనించిన ప్రవక్త (సల్లం), *"ఔను. నాకు కూడా మీ తీర్పు శిరోధార్యం."* అన్నారు.

*"అయితే నా తీర్పు వినండి! వారి పురుషులందరిని హతమార్చండి. స్త్రీలను, పిల్లల్ని ఖైదీలుగా చేసుకోండి. వారి ధనాన్ని పంచేయండి."* తీర్పు వినిపించారు హజ్రత్ సఅద్ (రజి).

ఈ తీర్పును విన్న దైవప్రవక్త (సల్లం), *"ఓ సఅద్! ఏడు ఆకాశాలపైన అల్లాహ్ చేసిన తీర్పే మీరు ఇచ్చిన తీర్పు"* అని పొగిడారు.

ఈ నిర్ణయం వినగానే యూదులకు మిన్ను విరిగి మీద పడినట్లయింది. కాళ్ళ కింద భూమి బద్దలయినట్లు అనిపించింది. ఏ ఒక్కరి నోటా మాట పెగల్లేదు. అందరూ నిలువు గుడ్లు వేసి చూడసాగారు.

హజ్రత్ సఅద్ (రజి) గారు ఇచ్చిన తీర్పు ఎంతో వివేకంతో, న్యాయబద్ధంగా ఇచ్చిన తీర్పు. ఎందుకంటే బనూ ఖురైజా యూదులు, ముస్లిములు చావు బ్రతుకులు అనుభవిస్తున్న తరుణంలోనే ఓ భయంకరమైన ద్రోహానికి తలపడ్డారు. అదేకాదు, వారు ముస్లిములను కడతేర్చడానికి రెండు వేల అయిదు వందల కరవాలాలు, రెండు వేల బల్లాలు, మూడు వందల కవచాలు మరియు ఐదు వందల ఢాలులను సమకూర్చుకొని ఉన్న సమయం అది. విజయం తరువాత వాటన్నిటినీ ముస్లిముల హస్తగతం చేసుకోవడం జరిగింది.

ఈ తీర్పు వెలువడిన తరువాత దైవప్రవక్త (సల్లం) గారి ఆదేశం మేరకు, బనూ ఖురైజాను మదీనాకు తెచ్చి బనూ నజ్జార్ కు చెందిన ఓ మహిళ - ఈమె హారిస్ కుమార్తె - ఇంట ఖైదు చేయడం జరిగింది. మదీనా వీధుల్లో కందకాలుత్రవ్వి వారిని ఒక్కొక్క బృందంగా తెచ్చి మెడలు నరికి ఆ కందకాల్లో పడవేయడం జరుగుతుంది.

ఆ పని ప్రారంభం అయిన కొంత సేపటికి మిగిలిన ఖైదీలు తమ సర్దారు కఅబ్ బిన్ అసద్ తో, *"మీ అభిప్రాయం ఏమిటి? మా ఎడల వారు ప్రవర్తించే తీరు ఎలాంటిది?"* అని అడగగా అతను, *"మీకు రవ్వంత జ్ఞానమైన ఉందా? అలా అడుగుతున్నారు. చూడడం లేదా పిలిచేవాడు పిలుస్తూనే ఉన్నాడు. వెళ్ళినవారు తిరిగి రావడమూ లేదు. దైవసాక్షి! ఇది హత్య తప్ప మరేమీ కాదు."* అని అన్నాడు.

ఎలాగైతేనేమి (వారి సంఖ్య మొత్తం ఆరు మరియు ఏడు వందల లోపులో ఉంటుంది) అందరి మెడలు నరికి పూడ్చి వేయడం జరిగింది.

ఈ చర్య వల్ల కుట్రదారులైన ఈ సర్పాల తలలు చితకకొట్టబడ్డాయి. వారంతా అంతమైపోయారు. వీరు దృఢమైన ఒడంబడికను త్రుంచి దాన్ని కాలరాచిన వారు. ముస్లిములను తుదముట్టించడానికి, అతి క్లిష్టమైన పరిస్థితిలో శత్రువుకు సహాయపడి పెద్ద నేరానికి పాల్పడ్డవారు వీరు. ఇప్పుడు వారి చావుకు వారే స్వయంగా కారకులయ్యారు.

బనూ ఖురైజా వినాశనానికి గురి అయిన వెంటనే బనూ నజీర్ తెగకు చెందినా సర్దారు, ఈ యుద్ధానికి సంబంధించిన పెద్ద నేరగాడు 'హుయ్ బిన్ అఖ్తబ్' కూడా అంతం చేయబడ్డాడు. ఇతను ఉమ్ముల్ మోమినీన్ (ముస్లిముల మాతృమూర్తి) హజ్రత్ సఫియ్యా (రజి) గారి తండ్రి. ఖురైష్ మరియు గత్ఫాన్ వెనక్కు మళ్ళిపోయిన తరువాత బనూ ఖురైజా దిగ్బంధానికి గురి అయినప్పుడు వారి వెంటే అతనూ, తాను చేసిన శపథం ప్రకారం వారితోనే కోటలోనికి వెళ్ళి దాక్కున్నాడు. అహ్జాబ్ యుద్ధం జరిగే రోజుల్లో ఇతను కఅబ్ బిన్ అసద్ ను, ముహమ్మద్ (సల్లం)కు వ్యతిరేకంగా తిరగబడి ద్రోహం చేయడానికి పురికొల్పినవాడు. అతను ఇప్పుడు కఅబ్ కు ఇచ్చిన ఆ మాటను నిలబెట్టు కుంటున్నాడు.

అతన్ని పట్టి దైవప్రవక్త (సల్లం) వద్దకు తీసుకువచ్చినప్పుడు తన ఒంటెపై మేలైన వస్త్రాలను తొడిగి ఉన్నాడు. వాటిని తాను స్వయంగా చుట్టూ, ఒక్కొక్క అంగుళం మేర చించుకున్నాడు. అతని ఉద్దేశ్యం, తాను మరణించిన తరువాత తన ఈ బట్టలు యుద్ధ ధనానికి పనికిరాకుండా ఉండాలి అన్నదే.

అతని రెండు చేతులు మెడ వెనుకకు వేసి కట్టబడి ఉన్నాయి. అతను దైవప్రవక్త (సల్లం)ను సంబోధిస్తూ, *"వినండి! నేను మీ ఎడల శత్రుత్వం వహించినందుకు సిగ్గుపడడం లేదు. కాని అల్లాహ్ తో యుద్ధం చేసిన వాడు ఓడిపోక తప్పదు."* అన్నాడు.

ఆ తర్వాత అక్కడున్న వారిని సంబోధిస్తూ, *"ప్రజలారా! అల్లాహ్ ఇచ్చిన తీర్పులో తేడా ఏదీ లేదు. ఇది మా పాలిట రాయబడిన దురదృష్టం. ఇది బనీ ఇస్రాయీల్ కోసం రాసిపెట్టి ఉంచిన పెద్ద హత్యాకాండ"* అంటూ కూర్చోగా అతని తల నరికివేయబడింది.

*తరువాత జరిగినది In Sha Allah రేపటి భాగంలో....;*

✏✏ *®@£€€q  +97433572282* ✏✏ 
             *(rafeeq)*

✏✏  *Salman    +919700067779* ✏✏

*Note : - ఈ msg లను ముందుకు పంపిస్తూ, మన ఇస్లాం చరిత్ర గురించి మన ముస్లిం సోదరులకు, సోదరీమణులకు తెలియజేస్తారని ఆశిస్తున్నాము.*

No comments:

Post a Comment