270

🕌🕋🕌🕋 *బిస్మిల్లాహ్ హిర్రహ్మా నిర్రహీమ్* 🕋🕌🕋🕌


🇸🇦🤚🏻✋🏻🇸🇦 *అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను* 🇸🇦🤚🏻✋🏻🇸🇦


❂✸••••✸•••✸•••✸•••✸☆✸•••✸•••✸•••✸••••✸❂


☪🕋🛐🕌      *ఇస్లాం చరిత్ర - 270*       🕌🛐🕋☪


🇸🇦🇸🇦      *ముహమ్మద్ (సల్లం) జీవితచరిత్ర - 185*      🇸🇦🇸🇦


❂✸••••✸•••✸•••✸•••✸☆✸•••✸•••✸•••✸••••✸❂


              *గజ్వయె బనూ ఖురైజా*


అహ్జాబ్ యుద్ధం నుండి తిరిగివచ్చిన రోజునే దైవప్రవక్త (సల్లం), ఉమ్మె సల్మా (రజి)గారి ఇంట్లో స్నానం చేస్తూ ఉండగా హజ్రత్ జిబ్రీల్ (అలైహి) ప్రత్యక్షమయ్యారు.


*"ఏమిటీ! మీరు అప్పుడే ఆయుధాలను పడవేశారా? ఇంకా దైవదూతలు తమ ఆయుధాలను పడవేయలేదే? నేను కూడా ఆ జాతిని వెంటాడి ఇప్పుడే మీ దగ్గరకు వచ్చాను. లేవండి! తమ సహచరులందరినీ తీసుకొని బనూ ఖురైజా వైపునకు బయలుదేరండి. నేను ముందు అక్కడికి వెళ్ళి వారి కోటల్ని కంపనానికి గురిచేస్తాను. వారి హృదయాల్లో భయాందోళనలను రేకెత్తిస్తాను."* అని చెప్పి దైవదూతల్ని వెంటబెట్టుకొని జిబ్రీల్ (అలైహి) అక్కడికి వెళ్ళిపోయారు.


ఇటు మహాప్రవక్త (సల్లం) ఓ సహాబీ (రజి)తో, *"ఎవరైతే విధేయతపై నిలకడగా ఉన్నారో వారంతా అస్ర్ నమాజును బనూ ఖురైజా ఉంటున్న చోటుకు వెళ్ళి చేయాలి."* అని ప్రకటన చేయించారు.


ఆ తరువాత ఆయన (సల్లం) మదీనాను కాపాడే బాధ్యతలను ఉమ్మె మక్తూమ్ (రజి)గారికి అప్పగించారు. హజ్రత్ అలీ (రజి)గారి చేతికి యుద్ధ పతాకాన్ని ఇచ్చి వెంట సైన్యం ఇచ్చి బయలుదేరదీశారు. హజ్రత్ అలీ (రజి) తన సహచరులతో బనూ ఖురైజా కోటల దగ్గరకి వెళ్ళగానే ఆ యూదులు దైవప్రవక్త (సల్లం)ను తిట్టటం మొదలెట్టారు.


ఇంతలోనే మహాప్రవక్త (సల్లం) కూడా ముహాజిర్లు మరియు అన్సారుల సంరక్షణలో బయలుదేరడం జరిగింది. బనూ ఖురైజా ఉంటున్న ప్రదేశానికి దగ్గరలో ఉన్న 'అనా' అనే ఓ బావి వద్ద విడిది చేశారు. సాధారణ ముస్లిములు కూడా ఆ ప్రకటన వినడంతోనే బనీ ఖురైజా ఉండే చోటుకు తరలివెళ్ళనారంభించారు. మార్గం మధ్యలో అస్ర్ నమాజు వేళ అయిపోయింది. కొందరు, *"మనకు ఏ ఆదేశం అయితే ఇవ్వబడిందో దాని ప్రకారం బనూ ఖురైజా వద్దకు వెళ్ళే అస్ర్ నమాజ్ చేద్దాం"* అని అన్నారు.


ఇలా వారు అస్ర్ నమాజును అక్కడికి చేరిన తరువాత ఇషా నమాజు అయిన తరువాత చేసుకున్నారు. మరికొందరు సహాబా (రజి)లు, *"అలా కాదు! దైవప్రవక్త (సల్లం) గారి ఉద్దేశ్యం కేవలం, మనం వెంటనే బయలుదేరి వెళ్ళాలి అన్నదే"* అని మార్గం మధ్యలోనే అస్ర్ నమాజు చేసుకున్నారు. అయితే ఈ విషయం దైవప్రవక్త (సల్లం)కు తెలిసినప్పుడు ఆయన ఎవ్వరినీ మందలించలేదు.


ఎలాగైతేనేమి, వివిధ వర్గాలుగా ఇస్లామీయ సేన బనూ ఖురైజా నివసిస్తున్న ప్రదేశానికి వచ్చి చేరుకొని మహాప్రవక్త (సల్లం)ను కలుసుకోవడం జరిగింది. వీరంతా కలసి బనూ ఖురైజా కోటలను చుట్టుముట్టారు. ఈ సైన్యం సంఖ్య మొత్తం మూడు వేలు. ఇందులో ముప్పై గుర్రాలు కూడా ఉన్నాయి.


దిగ్బంధం మరీ తీవ్రమైన తరువాత యూదుల సర్దారు 'కఅబ్' యూదుల ముందు మూడు ప్రత్యామ్నాయ మార్గాలను ఉంచాడు....; ↓


*1. ఇస్లాం స్వీకరించి ముహమ్మద్ (సల్లం) ధర్మంలో చేరిపోయి తమ భార్యాపిల్లల్ని, ధనసంపదలను రక్షించుకోవడం. కఅబ్ ఈ ప్రతిపాదన చేస్తూ "దైవసాక్షి! మీకు బాగా తెలుసు. ముహమ్మద్ (సల్లం) అల్లాహ్ ప్రవక్త అన్న విషయం. మన గ్రంథాల్లో చెప్పబడిన వ్యక్తే ఆయన" అని కూడా అనడం జరిగింది.*


*2. లేదా, మన భార్యాబిడ్డల్ని స్వయంగా మన చేతుల మీదుగా హతమార్చి కరవాలం చేతపట్టి ప్రవక్త (సల్లం) వైపునకు వెళ్ళి పూర్తి శక్తినుపయోగించి ఆయనను ఢీకొనడం. ఆ తరువాత విజయమో లేదా మనమందరం చంపబడడమో జరుగుతుంది.*


*3. లేదా, ముహమ్మద్ (సల్లం)పై శనివారం రోజున ఏమరుపాటుగా ఉన్నప్పుడు విరుచుకుపడడం. శనివారం మనం యుద్ధం చేయమని వారికి గట్టి నమ్మకం కూడా.*


     కాని యూదులు ఈ మూడు ప్రతిపాదనల్లో ఏ ఒక్కదాన్ని ఒప్పుకోలేదు. ఇది చూసిన వారి సర్దారు కఅబ్, వారిని ఉద్దేశించి, *"మీరు మీ తల్లి గర్భం నుండి జన్మించినప్పటి నుండి ఒక్క రాత్రి కూడా వివేకంతో గడిపినట్లు లేదు."* అని తిట్టాడు.


ఈ మూడు ప్రతిపాదనలను రద్దు పరచిన తరువాత బనూ ఖురైజా ముందు కేవలం ఒకే ఒక మార్గం మిగిలిపోయింది. అది, దైవప్రవక్త (సల్లం)కు లొంగిపోయి, తమ ఆయుధాలను పడవేయడం. తమ అదృష్టాన్ని ఆయన చేతిలో ఉంచి ఆయన తీర్పు కోసం ఎదురుచూడడం.


అయితే యూదులు తమ ఆయుధాలను పడవేసి లొంగిపోయే ముందు తమ మిత్రపక్షాలైన ముస్లిములతో కూడా సంప్రదించాలని అనుకున్నారు. బహుశా ఆయుధాలు పడవేసిన తరువాత వారికి పట్టబోయే గతి ఎలాంటిదో తెలుసుకునే ఉద్దేశ్యంతో. యూదులు ఇలా అనుకుని దైవప్రవక్త (సల్లం) వద్దకు ఓ దూతను పంపిస్తూ, *"అబూ లుబాబా (రజి)ను మా వద్దకు పంపించండి. ఆయన్ను మేము సలహా అడగాలనుకుంటున్నాం."* అని చెప్పి పంపారు.


అబూ లుబాబా (రజి) వారికి మిత్రపక్షం వారు. ఆయన తోటలు, వారి కుటుంబాలు కూడా ఆ ప్రదేశంలోనే ఉన్నాయి. హజ్రత్ అబూ లుబాబా (రజి) వారి దగ్గరకు వెళ్ళగానే పురుషులందరూ ఆయన వైపునకు పరుగుపరుగున వచ్చి చేరారు. స్త్రీలు, పిల్లలు ఆయన ఎదురుగా నిలబడి శోకాలు తీస్తూ ఏడుపు లంకించుకున్నారు. ఈ పరిస్థితిని చూసి అబూ లుబాబా (రజి) మనస్సు చలించింది. కళ్ళు అశ్రుపూరితాలయ్యాయి. యూదులు ఆయనతో, *"అబూ లుబాబా (రజి)! మీరు చెప్పండి, మేము ముహమ్మద్ (సల్లం) చేసిన తీర్పుపై ఆయుధాలు పడవేయల్సిందేనా?"* అని.


*"అవును. ఆయుధాలు పడవేయాల్సిందే"* అన్నారాయన. అలా అంటూనే తన చేతితో గొంతు వైపునకు సైగ కూడా చేశారు. అంటే, మీరందరూ చంపబడతారు అని చెప్పడం అన్నమాట. కాని ఆయనకు వెంటనే స్పృహ వచ్చింది. ఇది అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త (సల్లం) ఎడల ద్రోహం అన్న విషయం వెంటనే గ్రహించారు. ఆయన దైవప్రవక్త (సల్లం) దగ్గరకు రాకుండా నేరుగా మస్జిదె నబవీకి వెళ్ళి అక్కడ తాను ఓ స్తంభానికి వేసి కట్టుకున్నారు. అలా కట్టుకున్నాక ఆయన, *"నన్ను కేవలం ఒక్క దైవప్రవక్త (సల్లం) మాత్రమే విప్పాలి"* అంటూ శపథం చేశారు.


ఇటు దైవప్రవక్త (సల్లం), అబూ లుబాబా (రజి) ఎంత వరకూ రాకపోవడం చూసి అడిగారు. ఆయన మస్జిద్ లో ఓ స్తంభానికి వేసి కట్టుకున్నట్లు తెలిసి, *"ఆయన కోసం నేను మన్నింపు దుఆ మాత్రం చేయగలను. అంతకంటే ఏమీ చేయలేను. ఆయన అంత పని చేసినప్పుడు ఆయన్ను నా చేతుల మీదుగా విప్పివేయలేను కూడా. అల్లాహ్ ఆయన తౌబా (పశ్చాత్తాపాన్ని)ను స్వీకరిస్తే తప్ప"* అన్నారు.


ఇటు అబూ లుబాబా (రజి) చేసిన సైగను కూడా అర్థం చేసుకోకుండా బనూ ఖురైజా, దైవప్రవక్త (సల్లం)కు లొంగిపోయి ఆయుధాలు పడవేయడానికి, ఆయన తీర్పును శిరసావహించడానికి సిద్ధపడ్డారు.


కాగా, బనూ ఖురైజా వారు సుదీర్ఘ కాలం వరకు ముస్లింల దిగ్బంధాన్ని భరించే స్థితిలోనే ఉన్నారు. వారి వద్ద కావలసిన ఆహార పదార్థాలూ ఉన్నాయి. త్రాగడానికి నీటి చెలమలూ, బావులూ, ఉండడానికి దృఢమైన కోటలూ ఉన్నాయి. మరో వైపు ముస్లిములు ఎలాంటి ఆచ్ఛాదన లేకుండా ఆకాశం క్రింద రక్తాన్ని గడ్డ కట్టించే చలిని భరిస్తూ ఉన్నారు. ఆకలి బాధ కూడా వారిని వెంటాడుతూనే ఉంది. అహ్జాబ్ యుద్ధం మొదలుకాక పూర్వం నుండే సతతం యుద్ధ కార్యకలాపాల్లో నిమగ్నమై ఉన్న కారణంగా బాగా అలసిపోయి ఉన్నారు కూడా.


అయితే ఈ యుద్ధం వారి మానసిక స్థితిని కూడా బాగా దెబ్బతీసింది. అల్లాహ్ బనూ ఖురైజా మనస్సుల్లో భయాందోళనలను రేకెత్తించడం వల్ల వారి ధైర్యం పూర్తిగా దెబ్బతిన్నది. అంతే కాదు, హజ్రత్ అలీ (రజి) మరియు జుబైర్ బిన్ అవామ్ (రజి)లు కలసి ముందుకు వచ్చి వారిని గదమాయించడం మొదలెట్టారు. హజ్రత్ అలీ (రజి) అయితే ముస్లిములను ఉద్దేశించి, *"ఓ సైనికులారా! దైవసాక్షి హజ్రత్ హమ్'జా (రజి) గారు అమరగతి పొందినట్లే నేనన్నా అమరగతిని పొందుతాను, లేదా వారి ఈ కోటను జయించనైనా జయిస్తాను."* అన్నారు.


హజ్రత్ అలీ (రజి) గారి ఈ బహిరంగ ప్రకటన విన్నంతనే బనూ ఖురైజా యూదులు ఆలస్యం చేయకుండా తమను దైవప్రవక్త (సల్లం)కు లొంగిపోయి, *"ఓ ప్రవక్తా (సల్లం)! తమరు ఏ విధంగా తీర్పు ఇచ్చినా అది మాకు సమ్మతమే."* అని అన్నారు.


మహాప్రవక్త (సల్లం), పురుషుల చేతులను వెనక్కి విరిచి కట్టేయమని ఆదేశం ఇవ్వగా, ముహమ్మద్ బిన్ ముస్లిమా (రజి) గారి పర్యవేక్షణలో అందరి చేతులు కట్టివేయడం జరిగింది. స్త్రీలను, పిల్లలను వారి నుండి వేరు చేసి దూరంగా ఉంచారు.


*ముస్లిములు, వీరిని వధించిన తీరును In Sha Allah రేపటి భాగంలో తెలుసుకుందాం.*


✏✏    *®@£€€q      +97433572282*     ✏✏      
                *(rafeeq)*


✏✏      *Salman       +919700067779*   ✏✏


*Note : - ఈ msg లను ముందుకు పంపిస్తూ, మన ఇస్లాం చరిత్ర గురించి మన ముస్లిం సోదరులకు, సోదరీమణులకు తెలియజేస్తారని ఆశిస్తున్నాము.*

No comments:

Post a Comment